NaReN

NaReN

Wednesday, July 19, 2023

అల్పపీడన ఆకస్మిక సెలవులు

 🌧️ *అల్పపీడన ఆకస్మిక సెలవులు..*🌧️


హడావుడి ప్రకటనలు

ఆదరా బాదరా సందేశాలు..

అవి వచ్చే వరకు ఆల్రెడీ బడులకు

చేరుకున్న పసివాళ్ళు.. 


భారీ వర్షాల కారణంగా 

రెండు రోజుల సెలవుల ప్రకటన

సంతోషమే.. కానీ

అదేదో నిన్న రాత్రో..

ఇవాళ పొద్దున్నో సెలవిస్తే

అందరూ సంతోషపడేవాళ్ళు.. 


భారీ వర్షాలని ఇవ్వాళ 

పొద్దున్నే ఏమితెలీలేదు

*రెండ్రోజుల నుండి పట్టిన ముసురులా*

*మన వాతావరణ శాఖ*

ఎడతెరిపి లేకుండా హెచ్చరిస్తూనే ఉంది..


సెలవుల గురించి తెలీక

*4 గంటలకే లేచి వంట రూములో యుద్ధం చేసి*

*టిఫిన్లు, టిఫిన్ బాక్సులు*

సిద్ధం చేసిన మాతృమూర్తులు.. 


విషయం తెలీక భారీ వర్షంలో

*రెయిన్ కోటు, బూట్లేసుకుని*

*బురద రోడ్లలో, చిత్తడి బాటల్లో*

కిందామీదా పడి చిన్నారుల్ని 

బడికి తోలుకెళ్లిన సాహస తండ్రులు..


సమాచారం తెలీక పొద్దుగాల్నే

*ముస్తాబై సద్దిమూట గట్టుకుని*

*హైరానాతో బస్సెక్కిన పది నిమిషాల్లో*

మళ్ళీ కంగారు పడి  కంగారూల్లా 

బస్సు దిగేసిన ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులు.. 


ఇది చిన్నారుల సంబంధిత విషయం

ఒకరోజు ముందో కనీసం 

రెండుమూడు గంటల ముందే 

సెలవిస్తే బావుంటుందని 

చిన్నారులు మరియు వారి తల్లిదండ్రుల విన్నపం...


☁️💧💦🫧🌧️☔☂️🌸💐🌈🌈🙏🏻🙏🏻

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE