NaReN

NaReN

Wednesday, August 3, 2022

బంధాలు తెంచేసుకుంటున్నారు

 ఆవేశం

అసహనం

అనర్థం

బంధాలు తెంచేసుకుంటున్నారు


చిన్న, చిన్న విషయాలను పెద్దవిగా చేసుకుంటున్న దంపతులుఏండ్లుగా సాగిన సంసారానికి బీటలుమానసికంగా కృంగిపోతున్న భార్యాభర్తలుఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఇంట్లో మ్యాగీ వంటకం ఆలస్యం కావడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగి.. వారు వీడిపోయేందుకు సిద్ధమయ్యారు. వారి 15 ఏండ్లపాటు సాగిన సంసారంలోని తప్పులను తవ్వుకున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నా వారి మనస్సు మారడం లేదు.జూమ్‌ మీటింగ్‌కు ఆలస్యమవుతున్నది.. కొద్దిగా కూరగాయలను తరిగిపెట్టండని అడిగితే భర్తకు కోపం వచ్చింది. నన్నే కూరగాయలు కొయ్యమంటావా…నాకన్నా జీతం ఎక్కువగా సంపాదిస్తున్నావనే అహంకారంతో నన్ను ఈ పనులను చేయమంటావా… నాకు కూడా ఆఫీసులో మీటింగ్‌ ఉందంటూ భర్త తిట్ల పురాణం అందుకున్నాడు. అంతే 10 ఏండ్లపాటు సజావుగా సాగిన సంసార జీవితంలో అలజడి రేగింది. పిల్లలున్నా ఆ దంపతులు విడిపోవాలని నిర్ణయించుకున్నారు.


సిటీబ్యూరో, జూలై 21(నమస్తే తెలంగాణ): పై విధంగా విపరీతమైన కోపతాపాలతో కొన్ని వర్గాల్లోని కుటుంబాలు సతమతమవుతున్నాయి. ఒకరిపై మరొకరు ద్వేషాన్ని పెంచుకుని ఏండ్ల తరబడిగా సజావుగా సాగుతున్న సంసార జీవితాన్ని తెంపుకొనేందుకు సిద్ధమవుతున్నారు. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటూ పోలీస్‌స్టేషన్ల మెట్లు ఎక్కుతున్నారు. చిన్న, చిన్న విషయాలను పెద్దవిగా చేసుకుని అనాలోచిత కోపాన్ని చూపుతు న్నారు. ఎవరు చెప్పినా వినడం లేదు. సర్దుకుపోవాలనే ఆలోచనే లేదు. దీంతో మానసికంగా కృంగిపోతున్నారు


నెలల తరబడి ఇంట్లోనే..

కరోనా, లాక్‌డౌన్‌ సందర్భంలో నెలల తరబడి ఇంట్లోనే ఉండటం, ఆ తర్వాత వర్క్‌ఫ్రం హోం పద్ధతి రావడంతో చాలా మంది ఉద్యోగులైన భార్యాభర్తలు 24 గంటల పాటు ఇండ్లల్లోనే ఉన్నారు. అంతకుముందు ఇరువురు ఉద్యోగాలకు వెళ్లడంతో చాలా తక్కువ సమయమే ఇద్దరూ కలిసి గడిపేవారు. ఈ క్రమం లో వారి మధ్య అన్యోన్యత బాగానే ఉండేది. కానీ.. తాజాగా అధిక సమయం పాటు ఇండ్లల్లో ఉండటం.. ఇంట్లోని పనిని షేర్‌ చేసుకోమనడం, వాట్సాప్‌ చాటింగ్‌లు, తదితర అంశాలకు సం బంధించిన వ్యవహారాలను కొత్తగా చూస్తుండటంతో విభేదాలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు కరోనా దెబ్బతో ఒకరి ఉద్యోగం పోవడం, మరొకరి వేతనంలో కోత పడటం, అప్పటివరకు అనుభవించిన విలాసాలు తగ్గడంతో చాలామంది ఉద్యోగులు, వ్యా పారులు, కూలీలు ఇంకా అనేక వర్గాల ప్రజల్లో అసహనం పెరిగిపోయి ఓపిక తగ్గిపోయింది. దీంతో ఈ కష్టాలు, సందర్భాలను అధిగమించలేక ప్రేమానురాగాలతో కొన్నేండ్లుగా సజావుగా సంసారం చేసుకున్న అనేక మంది దంపతులు కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇరువురిలో సమన్వయం కొరవడి.. దానిని అధిగమిద్దామని ఆలోచించకుండా నువ్వెంతంటే నువ్వెంత అంటూ దూరమయ్యేందుకు రెడీ అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ అసహనం వారిని మద్యానికి బానిసలుగా మారుస్తుండగా, మరికొందరు అనవసరమైన గొడవలకు దిగుతూ వారి పరిస్థితిని మరింతగా దిగజార్చుకుంటున్నారు. వాహనం నడిపే సమయంలో తెలియకుండా కోపానికి గురై ఇతర వాహనదారులతో గొడవలకు దిగుతున్నారు.


యాంగ్రీ మేనేజ్‌మెంట్‌ కౌన్సెలింగ్‌తో ఫలితం..

కరోనా తగ్గిన తర్వాత తన వద్దకు వచ్చిన 1000 కేసుల్లో భార్యాభర్తల మధ్య అసహనం పెరిగిపోయిన విషయాన్ని గమనించా. ఈ కాలంలో వారికి కలిగిన ఆర్థిక నష్టం, 24/7 కలిసి ఉండటంతో వారి ప్రవర్తనలో వచ్చిన మార్పులపై.. అనవసర అపోహలను పెంచుకుని ముఖ్యంగా ఉద్యోగులైన భార్యాభర్తల్లో కొట్లాటలు చాలా పెరిగాయి. ఆన్‌లైన్‌ క్లాసులు, చదువులంటూ పిల్లలు ఫోన్లకు అత్తుకుపోవడం వారిలో కోపాన్ని విపరీతంగా పెంచేసేంది. ఈ అసహనానికి ఆన్‌లైన్‌లో జూదం, అశ్లీలం, మద్యం తోడు కావడంతో మనస్సు కృంగిపోయి వారికి నెగెటివ్‌ ఆలోచనలను వస్తున్నాయి. దీంతో వారు మనోధైర్యాన్ని కోల్పోతున్నారు. వారికి ఐదు నుంచి ఎనిమిది రౌండ్ల వరకు కౌన్సెలింగ్‌ ఇచ్చినా మార్పు కనిపించడంలేదు. ఇక్కడ ఇచ్చిన కౌన్సెలింగ్‌తో కేవలం 25 శాతం ఫలితాలను మాత్రమే సాధించా. ఇంకా ప్రయత్నిస్తున్నా.



యాంగ్రీ మేనేజ్‌మెంట్‌ అంటే..


తన కోపమే తన శత్రువని గుర్తుపెట్టుకోవడం.ఎందుకు కోపాన్ని వ్యక్తం చేస్తున్నామో గమనించడం.అనవసర విషయాల్లో ఇంట్లో వారిని ఎందుకు దూషిస్తున్నామో ఆలోచించడంఎండ్ల తరబడిగా సంసార జీవితంలో రాని గొడవలు ఇప్పు డు ఎందుకొస్తున్నాయో గుర్తించడం.నాలో ఎందుకు అసహనం పెరుగుతున్నది.. దానికి గల కారణాలను తెలుసుకోవడం.


ఇలా అసహనం, కోపం తలెత్తినప్పుడు మీకు మీరే ప్రశ్నించుకోవాలి.. ఈ ప్రపంచంలో మిమ్మల్ని మీరే సరిగా అర్థం చేసుకుంటారు. కావున బయటి వారితో సంబంధం లేదు. మీ నిర్ణయాన్ని మీరే పాటించాలి. ఈ విధంగా కౌన్సెలింగ్‌లో భార్యాభర్తలకు వివరిస్తూ ఇతర అంశాలు .. ఉదాహరణలను వివరిస్తూ వారిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నా. వారిలో మార్పు కచ్చితంగా వస్తుంది.


No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE