NaReN

NaReN

Saturday, August 6, 2022

అల్సర్‌ ఎందుకొస్తుందో తెలుసా..?


Stomach ulcers: అల్సర్‌ ఎందుకొస్తుందో తెలుసా..?

 గాడితప్పిన ఆహారపు అలవాట్లు.. తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనలు, పొగ, మద్యం వ్యసనంతో కడుపులో అల్సర్లు ఏర్పడుతాయి. పొట్టలోని మ్యూకోజ్‌ పొరకు చిరుగులు ఏర్పడటంతో తరచూగా తీవ్రమైన మంట, కడుపునొప్పి వస్తుంటుంది. ఆహారం తీసుకున్న తర్వాత ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. పొట్టలో వేధించే అల్సర్లకు చికిత్స, దాని తీరుతెన్నులను  గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్‌ సోమశేఖర్‌రావు వివరించారు.


సమస్యలు ఇలా ఉంటాయి..


* పెద్ద పేగుల్లో అల్సర్లు ఎక్కువగా వస్తున్నాయి. దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉంటుంది. చిన్న పేగుల్లోనూ అల్సర్లు వస్తాయి.


* బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లతో అల్సర్లు ఏర్పడుతున్నాయి. కలుషిత ఆహారం, నీటితో వస్తుంది. అధికంగా పెయిన్‌ కిల్లర్‌ వాడినా రానున్నాయి. 


* అన్నం తినగానే కడుపులో నొప్పి వచ్చినపుడు అల్సర్లు వస్తాయని తెలుసుకోవాలి.  ట్యాబ్లెట్లు వేసుకుంటే తాత్కాలికంగా తగ్గినా తర్వాత ఇబ్బంది పడొచ్చు. ఎండోస్కోపీ చేస్తే వ్యాధి తీవ్రత తెలుస్తుంది.


* మందులతోనే ఎక్కువగా తగ్గిపోతాయి. మళ్లీ అల్సర్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 


* బయటి ఆహారం తీసుకోవద్దు. నీరు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కడపడితే అక్కడి నీటిని తాగొద్దు.


* గ్యాస్‌ ట్యాబ్లెట్లను దీర్ఘకాలికంగా వాడొద్దు. కారం, మసాలాలు ఎక్కువగా తినొద్దు. సాత్విక ఆహారం తీసుకుంటే మంచిది.

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE