NaReN

NaReN

Monday, August 8, 2022

ఉచిత ఆరోగ్య సలహాలు

 ఉచిత ఆరోగ్య  సలహాలు

 

35+ సం. వచ్చేసరికి మహిళల్లో ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది.


అందువలన శరీరానికి కాల్షియమ్ ను గ్రహించే శక్తి తగ్గుతుంది.


కాల్షియమ్ శరీరంలో తగ్గితే ఆస్టియోపొరోసిస్ అనే వ్యాధి వస్తుంది.


కాల్షియమ్ ఎక్కువ ఉన్నఆహారం తీసుకోవాలి. శరీరానికి 1200 మిగ్రా కాల్షియమ్ అవసరం.


కాల్షియమ్ ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆకుకూరలు బాగా తీసుకోవాలి.


శరీరం కాల్షియమ్ ను గ్రహించాలంటే విటమిన్ డి3 మరియు వ్యాయామం అవసరము.


విటమిన్ డి3 ప్రొద్దున సూర్యోదయం అప్పుడు వచ్చే సూర్య కిరణాల్లో ఉంటుంది.


కావున ప్రొద్దున పూట సూర్యరశ్మి శరీరానికి తగిలేలా వ్యాయామం చేస్తే శరీరం కాల్షియమ్ ను గ్రహించుకుంటుంది.


లేకుంటే కాల్షియమ్ ట్యాబ్లేట్లు మ్రింగవలసి ఉంటుంది.


40+ సం. దాటినవారు ఎక్కువ సమయం కూర్చుని ఉంటారు. అందువలన కండరాలు పటుత్వం కోల్పోయి ముసలితనం వస్తుంది.


ఇది అరికట్టడం కొరకు ప్రోటీన్లు ఎక్కువగావున్న ఆహారం తీసుకోవాలి.


ఉదాహరణకు పప్పు, మొలకలు, బాదం గింజలు లాంటివి .


1 కిలో శరీర బరువుకు 1.5 గ్రా.చొప్పున మాంసకృత్తులు తీసుకోవాలి. ఉ. దా 60కేజీ బరువున్నవారు 90 గ్రా ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది.


మరో ముఖ్య విటమిన్ - విటమిన్ బి 12. శరీరానికి రోజుకు 2.4 మైక్రో.గ్రా బి-12 కావాలి.


విటమిన్ బి 12, శరీర ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు,ఎర్ర రక్తకణాల వృద్ధికి, మెదడు సరిగా పనిచేయడానికి అవసరం.


బి 12, పాలు,పెరుగు,చీజ్ ,గుడ్లు, చేపలు, చికెను మొదలైన వాటిలో లభిస్తుంది.


ఉప్పు, చక్కర, క్రొవ్వు పదార్ధాలు తగ్గిస్తే మంచిది. అధిక ఉప్పు అధిక రక్తపోటుకు, కీళ్ల నొప్పులకు దారి తీసే అవకాశం ఉంది.


అలాగే చక్కర ఊబకాయానికి, కొంత ఎముకల దృఢత్వం తగ్గడానికి కారణమవుతుంది.


అధిక క్రొవ్వు గుండె పోటుకు కారణం కావచ్చు.


అన్నిటికన్నా ముఖ్యంగా నీరు ఎక్కువ తీసుకోవడం అవసరం.


దాహమైనా కాక పోయిన నీళ్లు త్రాగడం అవసరం.


40+ సం దాటినవారు ఎక్కువగా మతిమరుపు వచ్చిందని అంటూ ఉంటారు. ఒక సర్వే ప్రకారం వీళ్ళు నీళ్లు తక్కువ తీసుకోవడం కూడా మతిమరుపుకు ఉన్న కారణాల్లో ఒకటని తేలింది.


చక్కగా పండ్లు, కూరలు, ఆకుకూరలు, మొలకలు, తృణధాన్యాలతో కూడిన మితాహారాన్ని తీసుకుంటూ,శరీరానికి తగినంత వ్యాయామాన్ని ఇస్తే సరిపోతుంది.

ధన్యవాదములు 🙏


No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE