NaReN

NaReN

Monday, August 15, 2022

సీతారామం....

 సీతారామం....

కరెక్టుగా 80 ఏళ్లక్రితం హాలివుడ్ లో సిటిజెన్ కేన్ అని సినిమా వచ్చింది. బిలియనీర్, పత్రికాధిపతి అయినా హీరో కేన్ మరణసమయంలో ఒక పదం ఉచ్చరిస్తాడు. ఆ పదం వెనుక కారణాలను అన్వేషించే క్రమంలో కేన్ బాల్యం నుండి అతను జీవితంలో పైకెదగిన క్రమంగురించి చూపిస్తారు ఫ్లాష్ బ్యాక్ రూపంలో...

ఈ సినిమా విడుదలయ్యాక సంచలన విజయం సాధించింది. ఒక వ్యక్తి జీవితంలో రహస్యాకోణాలు తెలుసుకోవటం వీక్షకులకు ఎప్పటికి ఆసక్తిదాయకమే. అది ప్రముఖులైతే ఇక చెప్పాల్సిన పనిలేదు.

ఈ స్క్రీన్ ప్లే ఫార్ములాను మొదట పట్టుకుంది నాగ్ అశ్విన్ మహానటి సినిమాలో ఉపయోగించాడు. అసలు సావిత్రి బయోగ్రఫీ అంత గొప్పదేం కాదు. తెలిసి తెలిసి ఉమనైజర్, రెండో పెళ్లి వాడిని చేసుకుంది. డబ్బు పట్లక్రమశిక్షణ లేదు. తాగుడుకు బానిసయ్యింది. తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంది. మరి ఈ కథ సినిమాగా ఎలా మెటీరియలైజ్ అయ్యింది అంటే సిటీజెన్ కేన్ స్క్రీన్ ప్లే ఫార్ములాయే. ఒక ప్రముఖ వ్యక్తిని అన్వేషిస్తూ ఒక జంట లేదా వ్యక్తులు తాము అన్వేషించే వ్యక్తి యొక్క వివరాలు సేకరించటం ఆ వ్యక్తి జీవితంలోని మలుపులు, ట్విస్టులు ప్రేక్షకుల ఆసక్తిలోని టెంపో తగ్గకుండా ఉపయోగపడతాయి. కథకుడు ఇక్కడే సగం విజయం సాధిస్తాడు. మిగతాది సంగీతం, నటినటుల ప్రతిభా విశేషాలమీద ఆధారపడి ఉంటుంది.

ఇక్కడ సీతారామం దర్శకుడు హను రాఘవపూడి ఇదే టెక్నిక్ ఉపయోగించాడు. ఎత్తుగడ కూడా సీతను వెతకటంతో ప్రారంభించి రామ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవటంతో కథ ముగుస్తుంది. రష్మిక, తరుణ్ భాస్కర్ వెదుకులాటలో మధ్యమధ్యలో పెద్దగా ట్విస్టులేం ఉండకపోయినా దుల్కర్ సల్మాన్, మృణల్ ఠాకూర్ ల మధ్య అందమయిన సుందర దృశ్యాకావ్యం లాంటి ప్రేమ సన్నివేశాలు అతి సుందరంగా అనిపిస్తాయి. బహుశా ఈ సినిమా పర్యవేక్షణ నాగ్ అశ్విన్ దే అయ్యుంటుంది. హను రాఘవపూడి మీద మణిరత్నం ప్రభావం ఎక్కువగా ఉన్నట్టుంది. మొదటి సినిమా అందాలరాక్షషిలోనే అర్ధం అవుతుంది. హీరోహీరోయిన్లు నాలుగడుగుల దూరంలో ఉన్నా ఘాట్టిగ గీతాంజలి సినిమా స్టయిల్ లో మాట్లాడటం వగైరా...

ఇక కథ విషయానికి వస్తే సినిమా కథేమి గొప్పగా అనిపించదు. కానీ దుల్కర్ సల్మాన్ ఉన్నాడే... ఆద్యంతం తన నటనతో కట్టిపడేస్తాడు. క్లీన్ షేవ్ తో అందంగా, హుషారయినా నటనతో ఆకట్టుకుంటాడు.  దుల్కర్ కాక ఇంకో హీరోను ఊహించలేము అన్నంత బాగా చేశాడు. తండ్రిలాగే మంచి కంఠస్వరం చాలామంది తెలుగు హీరోలకన్నా ఉచ్చారణ బాగుంది. నానీ, శర్వానంద్ లు హీరో అయ్యుంటే సినిమా ఇంతబాగా ఉండేది కాదని ఖచ్చితంగా చెప్పగలను. హీరోయిన్ పెద్ద అందగత్తె కాదు కానీ తన నటనతో మెస్మరైజ్ చేస్తుంది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ తో రామ్ గురించి మాట్లాడేటప్పుడు రోజా సినిమాలో మధుబాల గుర్తుకురాక మానదు. చెప్పాను కదా హను మీద మణిరత్నం ప్రభావం ఉందని. ఈ సినిమాకు సంగీతం మైనస్ అనే చెప్పవచ్చు. పాటలు బాగుండి ఉంటే మణిరత్నం రోజా లెవెల్ లో ఉండేది. వెన్నెల కిషోర్, మురళీశర్మ, గౌతమ్ వాసుదేవ్, వారిపరిధిలో బాగా చేశారు. ప్రియదర్శి, సునీల్, రాహుల్ రవీంద్రన్ లవి జస్ట్ గెస్ట్ క్యారెక్టర్స్. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ సుమంత్, అటు పాకిస్తానీ సైన్యం మంచిదే ఇటు రామ్ మంచివాడే మధ్యలో విష్ణును అంటే సుమంత్ ను విలన్ ను చేసిపారేశారు. మంటల్లో చిక్కుకున్న అమ్మాయికోసం రామ్ వెళితే అసలు అక్కడ ఉండకుండా సుమంత్ వెళ్ళొపోవచ్చు కానీ రామ్ కోసం ఆగి తను బలి అయ్యాడు. తన కుటుంబం కోసం దేశద్రోహ చర్యకు పాల్పడుతాడు. సగటు మనిషిలాగా ఆలోచించాడు. చివర్లో కోర్టు మార్షల్ కు భయపడి ఆత్మహత్య చేసుకుంటాడు. సుమంత్ హీరో క్యారెక్టర్లకోసం పాకులాడకుండా ఇలాంటి సపోర్టింగ్ క్యారెక్టర్ లతో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకోవచ్చు.

సినిమా చూడొచ్చు... బోర్ కొట్టదు. 

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE