NaReN

NaReN

Monday, August 29, 2022

వినాయకుని పూజించే 21 రకాల ఆకులు

 వినాయకుని పూజించే 21 రకాల ఆకులు

వినాయకుని పూజించే 21 రకాల ఆకులు..మన ఆరోగ్యాన్ని కాపాడే దివ్యౌషధాలు.

అవి ఏమిటంటే...

     1. మాచీపత్రం                              2. బృహతీపత్రం (వాకుడు)

     3. బిల్వపత్రం (మారేడు)                 4. దూర్వాయుగ్మం (గరికె)

     5. దుత్తూరపత్రం (ఉమ్మెత్త)             6. బదరీపత్రం (రేగు)

     7. అపామార్గపత్రం (ఉత్తరేణి)            8. వటపత్రం (మఱ్ఱి)

     9. చూతపత్రం (మామిడి)                10. కరవీరపత్రం (గన్నేరు)

   11. విష్ణుక్రాంతపత్రం                        12. దాడిమీపత్రం (దానిమ్మ)

   13. దేవదారుపత్రం                          14. మరువకపత్రం (మరువం)

   15. సింధువారపత్రం (వావిలి)            16. జాజీపత్రం (సన్నజాజి)

   17. గండకీపత్రం                              18. శమీపత్రం (జమ్మి)

   19. అశ్వత్థపత్రం (రావి)                    20. అర్జునపత్రం (మద్ది)

   21. అర్కపత్రం (తెల్ల జిల్లేడు)


ఈ పత్రాలలో కొన్ని పాలు స్రవించేవి, మరికొన్ని పసరు స్రవించేవి. స్వహస్తాలతో త్రుంచేటప్పుడు వాటినుంచి స్రవించే పాలు, పసర్లు కొంచమైనా మన చర్మ రంధ్రాలగుండా శరీరంలోకి వెళ్లి రక్తాన్ని శుద్ధిచేసి, నరాలకు పుష్టిని కలిగిస్తాయి. ఆ పత్రాలను సేకరించేందుకు చాలా సమయం చెట్ల దగ్గర మొక్కల దగ్గర గడుపుతూ, అవి విడుదల చేసే ప్రాణవాయువును పీలుస్తాం.మామూలు మొక్కలు విడుదల చేసే ప్రాణవాయువు కన్న, ఓషధీ మొక్కలు విడుదల చేసే ప్రాణవాయువు మృత్యుంజయ కారకాలు కనుక  ఊపిరితిత్తులు శుద్ధిపడి, శ్వాస సంబంధమైన వ్యాధుల నుంచి విడుదల పొందుతాం. ఇది ఆరోగ్య కారణం. ఏనుగు వన సంచారి. ఆకులు, అలములు దాని ఆహారం. కనుక గజముఖుడైన వినాయకుని ఆకులతోనే అర్చించాలి. ఇది భౌతిక కారణం అంతేకాక.. అవసరమున్నా, లేకపోయినా, ఏనుగు.., తన తొండాన్ని కాళీగా ఉంచకుండా ఏ తీగనో, కొమ్మనో లాగుతూంటుంది. అలాగే గజముఖుడైన వినాయకుడు మన మనో వనసంచారి. ఆయన అంకుశం లాంటి తన తొండంతో మన మనస్సులలోని కల్మష భావాలనే కలుపు  మొక్కలను సమూలంగా పీకేసి, తన మోదక ప్రసాదాలతో మన బుద్ధిని పవిత్రం చేసి, ఆనందమయ మార్గంలో మనలను నడుపుతాడు. ఇది ఆధ్యాత్మిక కారణం. అందుకు కృతఙ్ఞతగా వివాయకునికి ఇష్టమైన పత్రాలతో ఆయనను పూజిస్తాం.

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE