NaReN

NaReN

Wednesday, August 31, 2022

ఉపాధ్యాయ వృత్తి

         ఉపాధ్యాయ వృత్తి 

 సమాధానం చెప్పలేని విద్యార్థుల ప్రశ్నలు ఎన్నో!


ప్రభుత్వ పాఠశాలలలో కొంతమంది విద్యార్థులు  అడిగే ప్రశ్నలు *గొప్ప గొప్ప శాస్త్ర వేత్తలని తలపిస్తాయి* .


అలా ఒక ఉపాధ్యాయుడి Service లో ఎదురైన సంఘటనల ఆధారం గా విద్యార్థులు అడిగిన కొన్ని ప్రశ్నలు మీ ముందు:


 *చంద్రునిపై కాలుమోపడం* నిజమే  అని నేను నమ్మాను. అయిదో తరగతిలో ఈ వార్త చదివి విన్పిస్తే... పిల్లలంతా ఆశ్చర్యంగా నమ్మారు.

ఒక్క.. సతీష్ గాడు తప్ప...

 నమ్మిన మిగతా పిల్లలందర్నీ జాలిగా చూసాడు .  నన్నూ, పేపర్ లోని అమెరికా వాళ్లు దిగిన చంద్రమండలం బొమ్మని మార్చి మార్చి చూసాడు. కొంచెం సేపు వాడి చూపులు నన్ను కలవర పెట్టాయి. 

 

'నీ డౌట్ ఏంట్రా... అమెరికా వాళ్లు ఖచ్చితంగా చంద్రమండలానికి వెళ్లి వచ్చారు. అదే ఈ వార్త' అన్నాను.  “నేను నమ్మట్లేదు సార్...” అన్నాడు ధృడంగా... “ఎందుకురా... నువ్వేమైనా చూసొచ్చావా” అన్నాను కోపంగా. ప్రపంచమంతా ఒప్పుకుంటుంటే... వీడేంటి అన్న అసహనం పుట్టుకొచ్చింది.   “ *చంద్రమండలం మీద గాలి లేదన్నారు కదా సార్... మరి అమెరికా వాళ్ల జెండా ఎలా రెపరెపలాడుతుంది?”* అన్నాడు. ఖంగుతిన్నాను...


వాడి ప్రశ్న వందలాది వేట కొడవళ్లు గా మారి... అమెరికా వైపు దూసుకెళ్తున్నట్టు... అగ్రరాజ్యాన్ని నిలదీస్తున్నట్టు... కలవర పెట్టింది. వాడి మొహంలో చిద్విలాసం. 

*నిజమే . ఇప్పుడు నాకూ నమ్మకం కలగట్లేదు.....*


ఇరవై ఏళ్ల లో ఎన్ని బదిలీలైనా.... ఏ వూరికెళ్లినా ఆ ప్రశ్నలు వెంటాడుతాయి. ప్రశ్న వేసిన ఆ పిల్లల మొహాలు మర్చిపోలేనంతగా వేటాడుతాయి. 


పదేళ్లకింద చర్లపల్లె స్కూల్లో అలాంటి ప్రశ్నే ఎదురైంది...

నా ప్రశ్న వేసిన నాలుగో తరగతి చదివే *రమేష్* గాడి మొహం ఇప్పటికీ మనసులోంచి చెక్కు చెదరలేదు.


అప్పట్లో నాలుగో తరగతి తెలుగు వాచకంలో ' *'కల్పవృక్షం'* అనే పాఠం వుండేది. తాటిచెట్టు కల్పవృక్షం లాంటిది. తాటికమ్మలు గుడిసె వేసుకోవడానికి... తాటి ముంజలు తినడానికి... తాటి దోనెలు నీరు పారించుకోవడానికి... ఇలా తాటిచెట్టులోని ప్రతీది మనిషికి పనికొస్తుంది. ఇలా అడిగిందల్లా ఇస్తుంది కాబట్టి తాటిచెట్టును కల్పవృక్షంతో పోల్చారు... అంటూ పాఠాన్ని వివరించినప్పుడు...   చెబుతున్నంత సేపూ... రమేష్ గాడి మొహం చిన్నబోయింది. వాడి కళ్ళల్లో తడి... నేను అబద్దం చెప్తున్నట్టు కోపం...

నాకేమి అర్ధం కాలేదు... “రమేష్... ఏమైందిరా...” అనడిగాను.


“మా అయ్య రోజూ తాటికల్లు తాగొచ్చి అమ్మనూ, నన్నూ, తమ్మున్ని బాగా కొడతాడు.. తాటిచెట్టు మంచిదెట్లయితది సార్...”

వాడి ప్రశ్నకి... షాక్ తిన్నాను. నన్నే కాదు... విద్యావ్యవస్థనే ప్రశ్నించినట్లుంది వాడి ప్రశ్న. నిజానికి తాటిచెట్టు పాఠంలో 'కల్లు' ప్రస్తావన ఎక్కడా రాలేదు. *తాటిచెట్టు* *కల్పవృక్షంతో పోల్చదగిందేనా...* 

వాడికి నేను సమాధానం చెప్పాలి.

ఏం చెప్పాలి...???


చివరకు “తాటికల్లు మంచిదేరా... కాకపోతే ఓ కప్పుగాని, అరకప్పు గాని తాగితే మంచిది... కాని మీ నాన్న కుండల కొద్దీ తాగుతాడు కాబట్టి అలా ప్రవర్తిస్తున్నాడు...” అంటూ ఇంకొంచెం విపులంగా చెప్పాను. అయినా నా సమాధానం వాన్ని సంతృప్తి పర్చలేదు. అంతకు మించి చెప్పడానికి నాక్కూడా ఏం తోచలేదు. వాడు అయిష్టంగానే కూచున్నాడు.


వాడి ప్రశ్న ఇప్పటికీ ఇలా వెంటాడుతూనే వుంటుంది.


 సుజాత టీచర్ ఓరోజు మూడో తరగతిలో *బాతు బంగారు గుడ్డు* పాఠం చెప్పింది. ఒక బాతు రోజూ బంగారు గుడ్లు పెడుతుంటే... ఆత్యాశతో దాన్ని కోసి...

యజమాని భంగపడ్డాడని అనే పాఠ్యాంశాన్ని చెప్పింది.

తీరా ఒక పిల్లాడు వేసిన ప్రశ్నకి ఆమెకు చిర్రెత్తుకొచ్చి వాడి వీపు బద్దలు చేసింది. ఇంతకీ వాడు అడిగింది ఏమిటంటే....

“ *బాతుని కోస్తే తప్పేంటి టీచర్... బాతు కడుపులో గుడ్డు తయారవుతుంది కాని... బంగారం తయారు కాదు గదా... అందుకే బాతుని కోసి చూసాడేమో టీచర్...* యజమాని తప్పేంటీ? కాదంటారా?” అనడిగాడు.

 

 ఈ మధ్య మా స్కూళ్ళ లోI 'నిజాయితీ పెట్టె' లు పెట్టాలని విద్యాశాఖ సూచించింది. ఏ పిల్లవాడికైనా ఏదైనా దొరికితే దాంట్లో వేయాలి. టీచర్ దాన్ని తీసి అది పోగొట్టుకున్న పిల్లలకి అందజేస్తాడు. ఇది పిల్లల్లో నిజాయితీని పెంచుతుంది. పిల్లలు కూడా ఏవి దొరికినా ఉత్సాహంగా దాంట్లో వేస్తున్నారు. మొన్నీమధ్య ' *తిరుపతి* నా పెన్ను దొంగతనం చేసాడు సార్' అంటూ రాధిక అనే అమ్మాయి నాకు కంప్లయింట్ చేసింది.

 “అవును... వాడు పెన్ను దొంగతనం చేసాడు సార్..” అంటూ పిల్లలందరూ చెప్పారు.

తిరుపతి గాడిని పిలిచి అడిగితే మౌనంగా వుండిపోయాడు. వాడి బ్యాగ్ తీసి పుస్తకాలు బయట పడేసి వెతికినా దొరకలేదు. చివరికి గట్టిగా అడిగితే... నేనే తీసాను అని ఒప్పుకున్నాడు. “ఎక్కడ దాచావురా” అని అడిగితే... నిజాయితీ పెట్టిని చూపించాడు. నాకు ఆశ్చర్యమేసింది. 


పెట్టెని తెరచి చూస్తే... రాధిక పెన్ను అందులో వుంది.

“దాంట్లో ఎందుకు వేసావురా?” అనడిగాను.

“రోజూ అందరికీ ఏవేవో దొరుకుతున్నాయి. పెట్టెలో వేస్తున్నారు. నాకేం దొరకట్లేదు... అందుకే పెన్ను తీసి అందులో వేసాను” అని చెప్పాడు. నాకు బుర్ర తిరిగిపోయింది.

పిల్లలందరిలోను ఒకటే ప్రశ్న...

తిరుపతి దొంగనా... నిజాయితీ పరుడా...

దొంగతనం చేసాడు కాబట్టి... దొంగే కదా సార్... అన్నారు కొందరు. పెట్టెలో వేసాడు కాబట్టి నిజాయితీ పరుడే కదాసార్... అని మరి కొందరు పిల్లలు వాదించారు.

 చివరికి వాడు *నిజాయితీ పరుడే* అని వాళ్లని సమాధాన పర్చడానికి ఒక పీరియడ్ అయిపోయింది.

ఇలాంటి ఇబ్బందికర ప్రశ్నలకి సమాధానం దొరక్క చాలా మంది టీచర్లు సహనం కోల్పోతారు. 


 *ముఖ్యంగా తరగతి గదిలో దొంగతనం, కులం ఈ రెండు ఉద్రిక్తతని సృష్టిస్తాయి.*


 అలాగే కులం ప్రస్తావన వచ్చినప్పుడల్లా నాకు *వేదవతి* అనే పాప గుర్తిస్తుంది. శ్రీరాములపల్లె స్కూల్లో పని చేసేటప్పుడు... మధ్యాహ్న భోజనం సమయంలో ప్రతి మంగళవారం ఉడకబెట్టిన కోడిగుడ్డు పెట్టేవాళ్లం. 


మూడో తరగతి చదివే వేదవతి అనే పాప మాత్రం తన ప్లేటులో వేసిన గుడ్డుని టీచర్లు చూడకుండా వేరే పిల్లలకి ఇచ్చేది. ఓసారి అది గమనించిన నేను హెడ్ మాస్టర్ కి చెప్పాను. ఆయన పాపని పిలిచి గుడ్డు తింటే గుండెకు బలం వస్తుందని బుజ్జగించి మరీ మరీ చెప్పటంతో చాలా ఇష్టంగా కోడిగుడ్డు తింది. 


ఆ తర్వాత వేదవతి నాల్రోజుల వరకూ పాఠశాలకు రాలేదు. అనుమానంతో నేనూ, హెచ్.ఎం. కల్సి వాళ్లింటికి వెళ్లాం. మమ్మల్ని చూడగానే వాళ్లమ్మ దాడి చేసినంత వేగంగా కయ్యానికి దిగింది.

“మేం బ్రాహ్మలం... మా పాపచేత  కోడిగుడ్డు తినిపిస్తారా... మీ స్కూల్ కి నా బిడ్డని చస్తే పంపించం.” అంటూ గొడవ పడింది. గుడ్డు తిన్న పాపానికి వేదవతిని బాగా కొట్టినట్టుంది. జ్వరంతో పడుకుంది. మమ్మల్ని చూడగానే భయంగా.... నీరసంగా లేచి నిల్చుంది. 


కోడిగుడ్డు శాఖాహారమే అంటూ మహాత్మగాంధీ చెప్పిన మాటలు కూడా ఆమె దగ్గర ఏం పని చెయ్యలేదు. చివరికి పాప చదువు పాడైపోతుందని, కోడి గుడ్డు తనకి పెట్టించమని మేం హామీ ఇచ్చాక గానీ బడికి పంపడానికి ఒప్పుకోలేదు.


వేదవతి జ్వరంతోనే మర్నాడు స్కూల్ కొచ్చింది. వేదవతి మెల్లిగా తలొంచుకొని నా దగ్గర కొచ్చింది.

“హోం వర్కు చేసావా?” అనడిగాను.

మాట్లాడలేదు... నిమిషం సేపు నిశ్శబ్దంగా నా కళ్లలోకి సూటిగా చూస్తూ... “ *మేమెందుకు కోడిగుడ్డు తినకూడదు సార్?”* అనడిగింది.

ఎవరో గుండెమీద సర్రున చరిచినట్లయింది నాకు... ఆ ప్రశ్నకు ఏ సమాధానం లేదు నా దగ్గర... 

ఇంట్లో స్వేచ్చని చంపే ఆచారాలు బడిలో కూడా ఎంతగా ప్రభావం చూపిస్తాయో వేదవతి ప్రశ్న నన్ను ఇప్పటికీ వెంటాడుతుంది. 


“దానికి బదులు నీకు అరటిపండు తెప్పిస్తాను సరేనా” అని భుజం తట్టి పంపించాను.


పిల్లల ప్రశ్నలకు మనసంతా నమ్మకం నిండేలా జవాబు చెప్పకపోతే ఏదో వెలితిగా వుంటుంది. వాళ్ల అనుమానంలోంచి పుట్టే ప్రశ్నకి రాగద్వేషాలుండవు. 


సినారేకి జ్ఞానపీఠం అవార్డు వచ్చాక చాలామంది పండిత పామరులు రకరకాల ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేసారు. ఓసారి స్కూల్ పిల్లలు కూడా ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు.. మేధావులెవరూ అడగని ప్రశ్న ఒక పాప అడిగింది.

' *మీ పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి కదా. మరి మీ పేరు ముందు 'ఎస్' రావాలిగాని సి' ఎలా వస్తుంది?"* అని.

ఆయన ఆశ్చర్యపోయారట... ఇప్పటివరకూ ఎవరూ అడగని ప్రశ్న... “పదో తరగతి మార్కుల మెమోలో 'ఎస్'కి బదులు 'సి' అనీ పడిందమ్మా అప్పట్నించి సి. నారాయణరెడ్డి అనే పిలుస్తున్నారు' అని నవ్వేసారట.  


తరగతి గది లోపల పుట్టే ప్రశ్నలో నిజాయితీ వుంటుంది. *సమాధానం కూడా అంతే నిజాయితీగా లేనప్పుడు రానురాను వాళ్లు ప్రశ్నలు వేయటం మానుకుంటారు.* 


 *ప్రశ్నించే స్వేచ్చని పాఠశాలల్లో బాగా విస్తరిస్తే*  ప్రతి  పాఠ్యాంశం గురించి మేమంతా హోంవర్క్ చేసుకోవాల్సిందే...

Monday, August 29, 2022

వినాయకుని పూజించే 21 రకాల ఆకులు

 వినాయకుని పూజించే 21 రకాల ఆకులు

వినాయకుని పూజించే 21 రకాల ఆకులు..మన ఆరోగ్యాన్ని కాపాడే దివ్యౌషధాలు.

అవి ఏమిటంటే...

     1. మాచీపత్రం                              2. బృహతీపత్రం (వాకుడు)

     3. బిల్వపత్రం (మారేడు)                 4. దూర్వాయుగ్మం (గరికె)

     5. దుత్తూరపత్రం (ఉమ్మెత్త)             6. బదరీపత్రం (రేగు)

     7. అపామార్గపత్రం (ఉత్తరేణి)            8. వటపత్రం (మఱ్ఱి)

     9. చూతపత్రం (మామిడి)                10. కరవీరపత్రం (గన్నేరు)

   11. విష్ణుక్రాంతపత్రం                        12. దాడిమీపత్రం (దానిమ్మ)

   13. దేవదారుపత్రం                          14. మరువకపత్రం (మరువం)

   15. సింధువారపత్రం (వావిలి)            16. జాజీపత్రం (సన్నజాజి)

   17. గండకీపత్రం                              18. శమీపత్రం (జమ్మి)

   19. అశ్వత్థపత్రం (రావి)                    20. అర్జునపత్రం (మద్ది)

   21. అర్కపత్రం (తెల్ల జిల్లేడు)


ఈ పత్రాలలో కొన్ని పాలు స్రవించేవి, మరికొన్ని పసరు స్రవించేవి. స్వహస్తాలతో త్రుంచేటప్పుడు వాటినుంచి స్రవించే పాలు, పసర్లు కొంచమైనా మన చర్మ రంధ్రాలగుండా శరీరంలోకి వెళ్లి రక్తాన్ని శుద్ధిచేసి, నరాలకు పుష్టిని కలిగిస్తాయి. ఆ పత్రాలను సేకరించేందుకు చాలా సమయం చెట్ల దగ్గర మొక్కల దగ్గర గడుపుతూ, అవి విడుదల చేసే ప్రాణవాయువును పీలుస్తాం.మామూలు మొక్కలు విడుదల చేసే ప్రాణవాయువు కన్న, ఓషధీ మొక్కలు విడుదల చేసే ప్రాణవాయువు మృత్యుంజయ కారకాలు కనుక  ఊపిరితిత్తులు శుద్ధిపడి, శ్వాస సంబంధమైన వ్యాధుల నుంచి విడుదల పొందుతాం. ఇది ఆరోగ్య కారణం. ఏనుగు వన సంచారి. ఆకులు, అలములు దాని ఆహారం. కనుక గజముఖుడైన వినాయకుని ఆకులతోనే అర్చించాలి. ఇది భౌతిక కారణం అంతేకాక.. అవసరమున్నా, లేకపోయినా, ఏనుగు.., తన తొండాన్ని కాళీగా ఉంచకుండా ఏ తీగనో, కొమ్మనో లాగుతూంటుంది. అలాగే గజముఖుడైన వినాయకుడు మన మనో వనసంచారి. ఆయన అంకుశం లాంటి తన తొండంతో మన మనస్సులలోని కల్మష భావాలనే కలుపు  మొక్కలను సమూలంగా పీకేసి, తన మోదక ప్రసాదాలతో మన బుద్ధిని పవిత్రం చేసి, ఆనందమయ మార్గంలో మనలను నడుపుతాడు. ఇది ఆధ్యాత్మిక కారణం. అందుకు కృతఙ్ఞతగా వివాయకునికి ఇష్టమైన పత్రాలతో ఆయనను పూజిస్తాం.

తెలుగంటే.....

 తెలుగంటే...వేమన

తెలుగంటే...నన్నయ

తెలుగంటే...తిక్కన

తెలుగంటే...ఎఱ్ఱాప్రగడ

తెలుగంటే...పోతన్న

తెలుగంటే...అల్లసాని పెద్దన

తెలుగంటే...ఆర్యభట్టు

తెలుగంటే...త్యాగయ్య

తెలుగంటే...కేతన

తెలుగంటే...అన్నమాచార్య

తెలుగంటే...త్యాగరాజు

తెలుగంటే...తెనాలి రామకృష్ణ

తెలుగంటే...పొట్టి శ్రీరాములు

తెలుగంటే...అల్లూరి సీతారామరాజు

తెలుగంటే...కందుకూరి వీరేశలింగం

తెలుగంటే... గిడుగు రామ్మూర్తి

తెలుగంటే...గురజాడ

తెలుగంటే...శ్రీ శ్రీ

తెలుగంటే...క్షేత్రయ్య

తెలుగంటే...శ్రీనాధ

తెలుగంటే...మొల్ల

తెలుగంటే...కంచర్ల గోపన్న

తెలుగంటే....కాళోజి

తెలుగంటే...కృష్ణమాచార్య

తెలుగంటే...సిద్ధేంద్ర

తెలుగంటే...గౌతమీ పుత్ర శాతకర్ణి

తెలుగంటే...రాణీ రుద్రమదేవి

తెలుగంటే...రాజరాజ నరేంద్రుడు

తెలుగంటే...రామలింగ నాయుడు

తెలుగంటే...తిమ్మనాయుడు

తెలుగంటే...రామదాసు

తెలుగంటే...ఆచార్య నాగార్జున

తెలుగంటే...పోతులూరి వీరబ్రహ్మం

తెలుగంటే...జిడ్డు కృష్ణమూర్తి

తెలుగంటే...వుప్పలూరి గోపాల కృష్ణమూర్తి

తెలుగంటే...సింగేరి శంకరాచార్య

తెలుగంటే...వీర పాండ్య కట్టబొమ్మన

తెలుగంటే...విశ్వేశ్వరయ్య

తెలుగంటే...బాబూ రాజేంద్రప్రసాద్

తెలుగంటే...చిన్నయ్య సూరి

తెలుగంటే...సర్వేపల్లి రాధాకృష్ణన్

తెలుగంటే...పీవీ నరసింహారావు

తెలుగంటే...రాజన్న

తెలుగంటే...సుశీల

తెలుగంటే...ఘంటసాల

తెలుగంటే...రామారావు

తెలుగంటే...అక్కినేని

తెలుగంటే...సూర్యకాంతం

తెలుగంటే...ఎస్.వీ.రంగారావు

తెలుగంటే...అయ్యలరాజు రామభద్రుడు

తెలుగంటే...సరోజిని నాయుడు

తెలుగంటే...పింగళి వెంకయ్య

తెలుగంటే...పైడి మర్రి వెంకట సుబ్బారావు

తెలుగంటే....టంగుటూరి ప్రకాశం

తెలుగంటే...చిలకమర్తి లక్ష్మీనరసింహం

తెలుగంటే...భాస్కరుడు

తెలుగంటే...దేవులపల్లి

తెలుగంటే...ధూర్జటి

తెలుగంటే...తిరుపతి శాస్త్రి

తెలుగంటే...గుఱ్ఱం జాషువ

తెలుగంటే...కోరాడ మహాదేవశాస్ట్రీ

తెలుగంటే...కోరాడ రామకృష్ణయ్య

తెలుగంటే...కోరాడ రామచంద్రకవి

తెలుగంటే...కొనకళ్ల వెంకటరత్నం

తెలుగంటే...మల్లన్న

తెలుగంటే...నండూరి

తెలుగంటే...పానుగంటి

తెలుగంటే...రామానుజం

తెలుగంటే...రావి శాస్త్రి

తెలుగంటే...రవి వర్మ

తెలుగంటే...రంగనాధుడు

తెలుగంటే...కృష్ణదేవరాయలు

తెలుగంటే...తిరుపతి వెంకటకవులు

తెలుగంటే...విశ్వనాథ

తెలుగంటే...నన్నే చోడుడు

తెలుగంటే...ఆరుద్ర

తెలుగంటే...ఎంకి

తెలుగంటే...ఆదిభట్ల

తెలుగంటే...గాజుల సత్యనారాయణ

తెలుగంటే...మల్లాది సుబ్బమ్మ

తెలుగంటే...వెంపటి చిన సత్యం

తెలుగంటే...ఉషశ్రీ

తెలుగంటే...బాపు

తెలుగంటే...రమణ

తెలుగంటే...జంధ్యాల

తెలుగంటే...ముళ్ళపూడి

తెలుగంటే...మంగళంపల్లి బాలమురళీకృష్ణ

తెలుగంటే...అక్కిరాజు ఉమాకాంతం

తెలుగంటే...తిలక్

తెలుగంటే...అడివి బాపిరాజు

తెలుగంటే...జక్కన

తెలుగంటే...అచ్చమాంబ

తెలుగంటే...దాశరథి

తెలుగంటే...మల్లినాథ సూరి

తెలుగంటే...భవభూతి

తెలుగంటే...ప్రోలయ నాయకుడు

తెలుగంటే...రాళ్ళపల్లి 

తెలుగంటే...కట్టమంచి

తెలుగంటే....భద్రాద్రి రామన్న

తెలుగంటే...తిరుపతి ఎంకన్న

తెలుగంటే...గోంగూర

తెలుగంటే...గుత్తోంకాయ్

తెలుగంటే...కొత్తావకాయ్

తెలుగంటే...ఉలవచారు

తెలుగంటే....పెరుగన్నం

తెలుగంటే...ముద్దపప్పు

తెలుగంటే...పండుమిరప

తెలుగంటే...తాంబూలం

తెలుగంటే...పులిహోర

తెలుగంటే....సకినాలు

తెలుగంటే....మిర్చి బజ్జి

తెలుగంటే...బందరు లడ్డు

తెలుగంటే....కాకినాడ ఖాజా

తెలుగంటే.....జీడిపాకం

తెలుగంటే...మామిడి తాండ్ర

తెలుగంటే...రాగి ముద్ద

తెలుగంటే...జొన్న రొట్టె

తెలుగంటే...అంబలి

తెలుగంటే...సంక్రాంతి

తెలుగంటే...గోదారి

తెలుగంటే...గొబ్బిళ్ళు

తెలుగంటే...గోరింట

తెలుగంటే...మాగాణి

తెలుగంటే...సాంబ్రాణి

తెలుగంటే...ఆడపిల్ల ఓణి

తెలుగంటే...చీరకట్టు

తెలుగంటే...ఓంకారం

తెలుగంటే...యమకారం

తెలుగంటే....మమకారం

తెలుగంటే...సంస్కారం

తెలుగంటే...కొంచెం ఎటకారం

తెలుగంటే...పట్టింపు

తెలుగంటే...తెగింపు

తెలుగంటే....లాలింపు

తెలుగంటే...ముక్కుపుడక 

తెలుగంటే...పంచెకట్టు

తెలుగంటే...ఇంటిముందు ముగ్గు

తెలుగంటే...నుదుటిమీద బొట్టు

తెలుగంటే...ఆంధ్ర, రాయలసీమ,తెలంగాణ

తెలుగంటే...తల్లిపాలభాష

తెలుగంటే...ప్రేమా, జాలీ, అభిమానం

తెలుగంటే... మన సంస్కృతి, సంప్రదాయం

తెలుగంటే... మన ఆత్మగౌరవం

తెలుగంటే...నీవు నేను మనం

తేనెలూరు తెలుగంటే ఆంధ్ర కోనసీమ పంట

తెలుగు నేలంటే రాయలేలిన సీమ రాయలసీమ

తెలుంగు ఆణమంటే తెలంగాణ

జై తెలుగు తల్లీ 🙏

తెలుగు భాషా ప్రేమికులందరికీ....

*తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు*

ప్రతిరోజు తెలుగు ప్రగతికి వెలుగు

ప్రతిరోజు తెలుగు ప్రగతికి వెలుగు


    నేడు తెలుగు వాళ్ల పిల్లలు ఇంగ్లీష్ పిల్లలైపోయారు

ఇంట్లో ఇంగ్లీష్ బల్లో ఇంగ్లీష్ ఇంక తెలుగు ఎక్కడుంది?

అని ప్రశ్నించుకుంటే సమాధానం తెలుగు వాళ్లకే తెలియాలి

ఇంగ్లీష్ రాకుంటే కూడు లేదు గుడ్డ లేదు గూడు లేదు అన్నట్లు మారిపోయింది ప్రస్తుతం

కారణం ఏమంటే కార్పొరేట్లో చదివి కంట్రీ వదిలి వేరే కంట్రీ కి వెళ్లి పొడిచేద్దామనే పోరాటం

ఈ పోరాటానికి తల్లిదండ్రులే పునాదైతే మరోవైపు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లు

ఇలా ఇంటిలోన ఇంగ్లీష్ బల్లోన ఇంగ్లీష్ అయితే తెలుగు బిడ్డకు తెలుగు ఎక్కడ వస్తుంది?

 తెలుగు బిడ్డను ఇంగ్లీష్ బిడ్డగా తయారు చేసే తల్లిదండ్రులారా మీరే చెప్పండి

పాపం మీరేం చెప్తారు లేండి

మీ చుట్టూ లోకం మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే మీరు మాత్రం ఏం చేస్తారు

ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్ప, అని అందరూ ఇంగ్లీషే మాట్లాడుతుంటే మీరు మాత్రం ఏం చేస్తారు

ఇంగ్లీష్ వస్తేనే జాబ్ వస్తుందంటే మీ పిల్లల్ని మీరు ఇంగ్లీష్ నేర్పించక తెలుగు నేర్పిస్తారేంటి

ఇంగ్లీషు వాళ్ళు వెళ్లారనుకుంటున్నారా లేదు ఇండియా మొత్తాన్ని ఇంగ్లీషు వాళ్లని చేశారు వాళ్లు అసాధ్యులు

అమ్మ అని నేర్పాల్సిన మనం

మమ్మీ అని నేర్పిస్తుంటే

మరి అమ్మ అనే మాట రాబోయే కాలంలో పుస్తకాల్లోనే చూడాల్సి వస్తుందేమో దాని అర్థం డిక్షనరీస్లో వెతకాల్సి ఉంటుందేమో

అన్ని ఇంగ్లీషులోనే పలికితిమి

అన్ని ఇంగ్లీషులోనే చదివితిమి

అన్ని ఇంగ్లీష్ మయమే అయిపోయా

మరి ఇలా అయితే మరి తెలుగునెలా బ్రతికించుకోవాలి

తెలుగుకి తెరదించాల్సిందేనా?

ఒకప్పుడు తెలుగు భాష ఉండేది అని రాబోయే తరం చెప్పుకోవాల్సిందేనా?

తెలుగు గ్రంథాలు, తెలుగు మేధావులు, తెలుగు రాజులు అందరూ కనుమరుగేనా?

 ఆలోచించండి తెలుగుని ఎలా వెలుగొందేనా చెయ్యాలని

ఆలోచించండి తెలుగు వాళ్ళై

తెలివిగలవాలై

తెలుగు తేనెను రుచిచూసిన వాళ్ళై

తెలుగు తెగువ చూపే వాళ్ళై

ఆలోచించండి

తెలుగు వెలగాలంటే

తెలుగు వాళ్లే పరిశ్రమలు సృష్టించాలి

తెలుగు వాళ్లే పరిపాలకులవ్వాలి

అప్పుడే తెలుగు మళ్లీ బడిలో పుడుతుంది అమ్మ ఒడిలో పుడుతుంది ప్రతి బిడ్డ నాలుకపై పుడుతుంది

తెలుగు తేట పదం

తెలుగు కమ్మని మాట

ఇంగ్లీష్ చదువుల మధ్య తెలుగు నేర్పిద్దాం

తల్లిదండ్రులారా

ఉపాధ్యాయులారా

పెద్దలారా

రోజుకో గంట తెలుగు పద్యం పలికించండి

తెలుగు గద్యం వినిపించండి

తెలుగు కథ చదివించండి

తెలుగు వాళ్ళ గురించి చెప్పండి

తెలుగు పై ఆసక్తి కలిగేలా పిల్లలతో తెలుగు తేనెలలికే మాట మాట్లాడండి

ఇంగ్లీష్ మబ్బులు ఎన్ని కమ్మిన తెలుగు సూర్యుడిలా వెలగాలి

తెలుగు పి యుగాంతం లేదు తెలుగు ఎప్పుడు అమరత్వమే అమృతత్వమే

జైయొస్తు తెలుగు తల్లి జైయవచ్చు మా తెలుగు తల్లి జైయ్యొస్తూ..


అక్షర దోషాలుంటే క్షమించండి తెలుగుని ప్రేమించండి తెలుగులో మాట్లాడండి తెలుగు వాళ్లగా జీవించండి..


అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి......


Sunday, August 28, 2022

వయస్సు మీరుతున్న కొద్దీ ఎక్కువగా మాట్లాడాలి

 *వయస్సు మీరుతున్న కొద్దీ ఎక్కువగా మాట్లాడాలి*


 వైద్యులు ఇలా అంటున్నారు.  *పదవీ విరమణ చేసిన వారు (సీనియర్ సిటిజన్లు) ఎక్కువగా మాట్లాడాలి, ఎందుకంటే జ్ఞాపకశక్తి కోల్పోకుండా నిరోధించడానికి ప్రస్తుతానికి మార్గం లేదు.  ఎక్కువగా మాట్లాడటం ఒక్కటే మార్గం.*


సీనియర్ సిటిజన్లు ఎక్కువగా మాట్లాడితే కనీసం మూడు ప్రయోజనాలు ఉన్నాయి.


  *మొదటిది:* మాట్లాడటం మెదడును సక్రియం చేస్తుంది మరియు మెదడును చురుగ్గా ఉంచుతుంది, ఎందుకంటే భాష & ఆలోచన ఒకదానితో ఒకటి సంభాషించుకోవడం, ముఖ్యంగా త్వరగా మాట్లాడటం, ఇది సహజంగానే వేగంగా ఆలోచించే ప్రతిబింబాన్ని కలిగిస్తుంది మరియు జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది.  మాట్లాడని సీనియర్  సిటిజన్లు, జ్ఞాపకశక్తి కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


  *రెండవది:* మాట్లాడటం అనేది చాలా మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది, మానసిక అనారోగ్యాన్ని దూరం చేస్తుంది మరియు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.  మనం తరచుగా ఏమీ అనలేము, కానీ దానిని మన గుండెల్లో పాతిపెట్టి, మనల్ని మనం ఉక్కిరిబిక్కిరి చేస్తాము._ ఇది నిజం!  కాబట్టి!  సీనియర్లుకు  ఎక్కువ మాట్లాడే అవకాశం కల్పించడం మంచిది.


  *మూడవది:* మాట్లాడటం వల్ల చురుకైన ముఖ కండరాలకు వ్యాయామం చేయవచ్చు & అదే సమయంలో, గొంతుకు వ్యాయామం చేయవచ్చు & ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది, అదే సమయంలో, ఇది కళ్ళు & చెవులు క్షీణించడాన్ని తగ్గిస్తుంది మరియు మైకము వంటి గుప్త ప్రమాదాలను తగ్గిస్తుంది.  & చెవిటితనం.


 *సంగ్రహంగా చెప్పాలంటే, రిటైర్ అయినవాళ్ళు, అంటే సీనియర్ సిటిజన్లు  *సాధ్యమైనంత వరకు ఎక్కువగా మాట్లాడటం మరియు వ్యక్తులతో చురుగ్గా సంభాషించడం, అల్జీమర్స్‌ను నివారించే ఏకైక మార్గం. దీనికి వేరే ఎటువంటి చికిత్స లేదు.*

 *కాబట్టి  సీనియర్లను కూడా బంధు మిత్రులతో ఎక్కువగా మాట్లాడేలా ప్రోత్సహిద్దాo*

ఇద్దరు అమ్మాయిల కథ

 *ఇద్దరు అమ్మాయిల కథ ...



 *ఈ కధ ముప్పై అయిదేళ్ళ క్రితం 12 మార్చి 1982 న మాదాపూర్ అనే గ్రామం లో ఉత్తర ప్రదేశ్ లోని గౌండ జిల్లాలో మొదలయ్యింది* 


 *క్రిమినల్స్ గురించి సమాచారం రావటం తో తన సబ్ అర్దినేట్స్ తో కలిసి DSP ఎస్.పి. సింగ్ రాత్రి వేళ హుటాహుటిన వెళ్ళాడు.అతని శరీరం* *మర్నాడు ఉదయం ప్రభుత్వ అసుపత్రి కి చేరింది. మరో 12 మంది దుండగులతో కలిసి అతను బాంబు దాడిలో చనిపోయినట్లు బార్య విభా సింగ్ కి సమాచారం పంపారు.* 


 *నిజానికి DSP సింగ్ కి అతని* *సబ్ అర్దినేట్స్ కి మధ్య ఉన్న వైరం అతన్ని పొట్టన పెట్టుకుంది. అతని సబ్ ఆర్దినేట్స్ ఒక నకిలీ ఎన్కౌంటర్ లో చంపేశారు.* 

 *“దయచేసి నన్ను కాల్చొద్దు. నాకు ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు” అనేది ఆయన చివరి మాట.* 


 *సింగ్ భార్య 'విభా సింగ్' హై కోర్టుని ఆశ్రయించింది. సిబిఐ కి కేసు బదలాయించారు. తోటి ఉద్యోగులు క్రిమినల్స్ తో కలసి ఈ దారుణానికి పాల్పడినట్లు సిబిఐ చార్జ్ షీట్ ఫైల్ చేసింది. సుదీర్గమయిన కోర్టు ప్రక్రియ మొదలయింది.* 


 *DSP సింగ్ హత్య జరిగినప్పటికి, అతనికి బార్య విభా సింగ్ కి కింజాల్ అనే ఆర్నెళ్ళ పాప, ఇంకా లోకం చూడని (ప్రింజాల్ సింగ్) బిడ్డ ఉన్నారు.* 

 *తల్లి కి వారణాసి ట్రెజరీ లో ఓక చిన్న ఉద్యోగం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. తండ్రి మరణాన్ని ప్రశ్నిస్తూ న్యాయం కోసం తల్లి చేసిన పోరాటం నీరు కారి పోయింది. భర్త తో పాటు పని చేస్తున్న ఉద్యోగులు ఆమెకి ఎవరు సహకరించలేదు.* 


 *ఆమె ఉద్యోగం లో జాయిన్ అయింది. రెండో బిడ్డ భూమి మీదకి వచ్చింది.* 

 *ఇద్దరు పిల్లలని ఆమె చదివించడం మొదలెట్టింది.* *కొద్ది ఆదాయం, తండ్రి లేని ఒంటరి కుటుంభం. అన్ని రకాల* *గడ్డు సమస్యలని ఎదుర్కుంది. పిల్లలిద్దరూ వారి చదువుల కోసం అనేక త్యాగాలు చేసారు.* *తండ్రి ఫోటో ని చూస్తూ.. అతన్నే ఇన్స్పిరేషన్ గా తీసుంటూ ఇష్టపడి చదువు సాగించారు.* 


 *పెద్దమ్మాయి కింజాల్ డిల్లీ లోని అత్యున్నతమయిన “లేడి శ్రీరాం కాలేజ్” లో సీటు సంపాదించింది. కింజాల్ డిగ్రీ మొదటి సంవత్సరం లో ఉన్నప్పుడు తల్లి కి కాన్సర్ అని తెలుసుకుంది. ఆమె ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదని తెలిసిన రెండు రోజుల కి వ్రాసిన పరిక్షల లో ఆమె యునివర్సిటీ టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. తల్లి మరణ శయ్య వద్ద తామిద్దరు UPSC క్రాక్ చేస్తామని మాట ఇచ్చింది.* 


 *2004 లో తల్లి మరణానంతరం అక్క చేల్లెల్లిద్దరు డిల్లీ చేరారు. ముఖర్జీ నగర్ లో ఒక సాదారణ గది లో నివాసం ఉంటూ UPSC కి చదవటం మొదలెట్టారు. మిత్రుల వద్ద అరువు తెచ్చుకున్న పుస్తకాలతో వాళ్ళు యజ్ఞం మొదలెట్టారు. స్వగ్రామం మరిచి పోయారు. బందువులు లేరు. ఒక పండగ లేదు ఒక సరదా లేదు. ఒక విరామం లేదు. వాళ్లిద్దరు ఒకరి కొకరు ప్రేరణ. వాల్లిదరికి తల్లి తండ్రి ప్రేరణ.* 


 *2007 లో కింజాల్ సింగ్ IAS, ప్రింజాల్ సింగ్ IRS ని సాధించారు. వారిద్దరి పట్టుదల విజయగాధ జ్యుడిషిల్ వ్యవస్థని తాకింది. తండ్రి ని చంపిన 31 ఏళ్ల తర్వాత, చార్జ్ షీట్ చేసిన 27 ఏండ్ల తర్వాత ఎనిమిది మంది పోలిస్ అధికారులని నిందితులుగా నిర్ధారించింది. ఎస్ పి సింగ్ నిజాయితీని, తల్లి ఆరోపణలని నిజమని ప్రపంచానికి కోర్టు రుజువు చేసింది. తీర్పు చెప్పినప్పుడు అప్పటి 'లక్ష్మి పుర ఖేరి' జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ గా ఉన్న కింజాల్ సింగ్ దుఖం దాచుకోలేక పోయింది. కన్నీటి పర్యంతం అయింది.* 


 *ఆడపిల్లలని తక్కువ గా చేసి చూసే/మాట్లాడే వాళ్లకి కింజాల్ సింగ్, ప్రింజాల్ సింగ్ ఒక సమాధానం.* 


 *🇮🇳దేశం గర్వించదగ్గ ఈ సోదరీమణులు ఇద్దరు నేటి అనేక మంది పిల్లలకి ఆదర్శం.*🌈


🕉️🌞🌎🏵️🌼🚩

Saturday, August 27, 2022

బ్రహ్మరాక్షసుడి సంగీతం


*బ్రహ్మరాక్షసుడి సంగీతం*

మూలం: ఎ.కె.రామానుజన్, ఫోక్ టేల్స్ ఫ్రం ఇండియా 

తెలుగు అనువాదం: నారాయణ


*పేదబ్రాహ్మణుడొకడు తన పేదరికానికి తట్టుకోలేక కాశీయాత్రకని బయలుదేరాడు. ఎండలో చాలాదూరం నడిచీ నడిచీ అలసిపోయిన అతనికి, చక్కని తోట ఒకటి కనిపించింది. ఆ తోటలోని మహావృక్షాల నీడన విశ్రాంతిగా కూర్చొని, వెంట తెచ్చుకున్న అటుకులు భోంచేద్దామనుకున్నాడు అతను. ముందుగా కాలకృత్యాలు తీర్చుకొనేందుకని అతను ఓ పొద మాటున కూర్చోగానే గంభీరమైన స్వరం ఒకటి 'వద్దు' అన్నది.*

*అతను గబుక్కున లేచి అది 'ఎవరి గొంతు' అని అన్ని వైపులా చూశాడు; కానీ ఎవ్వరూ కనిపించలేదు. ఆ తర్వాత అతను నోరు కడుక్కునేందుకుగానూ అక్కడే ఉన్న కుంట దగ్గరకు పోగానే మళ్లీ అదే స్వరం వినబడింది: 'వద్దు' అని! అయితే ఈసారి అతను ధైర్యంగా తన పని కానిచ్చాడు, ఆ హెచ్చరికను పట్టించుకోకుండా.*

*అయితే అతను తన వెంట తెచ్చుకున్న అటుకుల మూటను విప్పినప్పుడు, మళ్లీ ఆ గొంతు "వద్దు" అన్నది. అతను దాన్నీ పట్టించుకోకుండా, తను తినగలిగినన్నింటినీ తిని, మిగిలిన వాటిని తిరిగి మూటగట్టుకొని, ముందుకు బయలుదేరాడు. అంతలో అదే స్వరం "వద్దు,వెళ్లకు" అన్నది.

బ్రాహ్మణుడు ఆగి, నలుదిక్కులా చూశాడు. ఎవ్వరూ కనబడలేదు. అందుకని అతను "ఎవరునువ్వు? ఎందుకిలా శబ్దం చేస్తున్నావు?" అని అరిచాడు.*


*"పైకి చూడు, నేనిక్కడున్నాను" అన్నది గొంతు. అతను పైకి చూసేసరికి, ఆ చెట్టు కొమ్మల్లో ఇరుక్కుని ఒక రాక్షసుడు కనబడ్డాడు.*


*ఆ రాక్షసుడు తన దీనగాథను బ్రాహ్మణునితో ఇలా మొరపెట్టుకున్నాడు. "గత జన్మలో నేనూ నీలాగానే ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టి, గాన కళలో ఆరితేరాను. నా జీవితకాలమంతా నేను సంగీత రహస్యాల్ని సేకరించటంలోనే వెచ్చించాను తప్పిస్తే, వాటిని ఎవ్వరితోటీ పంచుకోలేదు; ఏ ఒక్కరికీ నేర్పలేదు. అందుకనే ఈ జన్మలో నేను రాక్షసుడినవ్వాల్సి వచ్చింది. భగవంతుడు నాకిచ్చిన శిక్ష ఇది. నువ్వలా వెనక్కి తిరిగిచూస్తే అక్కడో చిన్న గుడి కనబడుతుంది. ఆ గుడిలో ఒక సంగీతకారుడు సన్నాయి వాయిస్తూంటాడు- రోజంతా! అతను వాయించినంత ఘోరంగా సన్నాయిని ఎవ్వరూ వాయించలేరు- అన్నీ అపశృతులే. ఆ శబ్దం నాకు కలిగించే వేదన అంతా ఇంత అని చెప్పలేను - నా చెవుల్లో కరిగిన సీసం పోసినంత బాధగా ఉంటుంది. నేను దాన్ని అస్సలు భరించలేకపోతున్నాను. అతను వాయించే స్వరాల్లో తప్పుగా ఉన్న స్వరం ప్రతి ఒక్కటీ నాలోంచి బాణం మాదిరి దూసుకుపోతున్నది. ఆ శబ్దాలకు నా శరీరం తూట్లుపడి జల్లెడ అయిపోయినంత బాధ కలుగుతున్నది. ఒళ్లంతా నొప్పులే నొప్పులు. ఇదిగనక ఇలాగే కొనసాగితే నాకు పిచ్చెక్కి నేను ఏవేవో చేయటం తథ్యం. రాక్షసుడిని గనుక నన్నునేను చంపుకోలేను కూడాను. మరి ఈ చెట్టును విడిచి పోనూ పోలేను - నన్ను ఈ చెట్టుకు కట్టేశారు. కనుక ఓ బ్రాహ్మణుడా, నువ్వు చాలా మంచివాడివి. నీకు పుణ్యం ఉంటుంది. నామీద దయ తలుచు. తీసుకెళ్లి దూరంగా కనబడే ఆ తోటలోకి చేర్చు. అక్కడ నేను కనీసం కొంచెం ప్రశాంతంగా గాలి పీల్చుకోగలుగుతాను. అలా చేస్తే నా శక్తులు కూడా కొన్ని నాకు తిరిగి వస్తాయి. ఒకప్పుడు నీలాగే బ్రాహ్మణుడై, ఇప్పుడు నాలాగా రాక్షసుడైనవాడిని ఉద్దరించినందుకుగాను, నీకు బహు పుణ్యం లభిస్తుంది." అన్నాడు.*


*పేద బ్రాహ్మణుడు కరిగిపోయాడు. కానీ పేదరికం అతన్ని రాటుదేల్చింది. అతనన్నాడు -"సరే, నేను నీ కోరిక తీరుస్తాను. నిన్ను వేరే తోటకు చేరుస్తాను - అయితే దానివల్ల నాకేం ప్రయోజనం? నువ్వు బదులుగా నాకోసం ఏం చేస్తావు?" అని.*


*"నీ ఋణం ఉంచుకోను. నీకు మేలు చేస్తాను. నాకీ ఒక్క సాయం చెయ్యి చాలు" అని ప్రాధేయపడ్డాడు బ్రహ్మరాక్షసుడు.*

*'సరే'నని బ్రాహ్మణుడు వాడిని భుజాలమీద ఎక్కించుకొని, గుడికి దూరంగా ఉన్న వేరే తోటలోకి తీసుకుపోయి వదిలాడు.*

*బ్రహ్మరాక్షసుడి కష్టాలు తీరాయి. సంతోషం వేసింది. దానితోపాటు, పోయిన కొన్ని శక్తులు కూడా తిరిగివచ్చాయి వాడికి. వాడు బ్రాహ్మణుడిని ఆశీర్వదించి, అన్నాడు -"నువ్వు పేదరికంతో బాధపడుతున్నావని నాకు తెలుసు. నేను చెప్పినట్లు చేయి - ఇక జన్మలో పేదరికం నిన్ను పీడించదు. ఇప్పుడు నేను స్వతంత్రుడిని- కనుక నేను పోయి, మైసూరు రాజ్యపు యువరాణిని ఆవహిస్తాను. నన్ను వదిలించటం కోసం రాజుగారు రకరకాల మాంత్రికుల్ని రప్పిస్తారు. కానీ నేను మాత్రం వాళ్లెవరికీ లొంగను. నువ్వు వచ్చాకగానీ నేను ఆమెను వదలను. తన కుమార్తెను పట్టిన భూతాన్ని వదిలించినందుకుగాను సంతోషించి మహారాజుగారు, జీవితాంతం నిల్చేంత సంపదను నీపైన కురిపిస్తారు. అయితే ఒక్క షరతు - ఆ తర్వాత నేను వెళ్లి వేరే ఎవరినైనా ఆవహించినప్పుడు, నువ్వు ఇక ఎన్నడూ అడ్డురాకూడదు. దీనికి విరుద్ధంగా ఏనాడైనా జరిగిందంటే నేను నిన్ను తినేస్తాను మరి, ఆలోచించుకో" అని.*

సైకిల్ తొక్కడం-నడవటం

 సైకిల్ తొక్కడం-నడవటం


*సైకిల్ తొక్కడం అనేది ఏ దేశ ఆర్థిక వ్యవస్థకి(GDP) అయిన గొడ్డలి పెట్టు లాంటిది.*


*ఇది హాస్యాస్పదంగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం ...*


*సైక్లిస్ట్ దేశానికి పెద్ద విపత్తు, ఎందుకంటే.... అతను కారు కొనడు, అప్పు చేయడు,*

*కారుకు బీమా చేయడు, పెట్రోల్ కొనడు, కారును* *సర్వీసింగ్ చేయడు, డబ్బు చెల్లించి కారును పార్క్ చేయడు, ట్రాఫిక్ ఫైన్ కట్టడు, అంతే కాకుండా  అతను లావుగానూ అవ్వడు.*


*అవును ... అతను ఆరోగ్యవంతుడు అన్నది నిజం....*


*కానీ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు, ఎందుకంటే  అతను మందులు కొనడు.* *ఆసుపత్రికి మరియు వైద్యుని వద్దకు వెళ్ళడు. ఇది దేశ GDP కి అస్సలు తోడ్పడదు.*


*అదే దీనికి విరుద్ధంగా, ఒక ఫాస్ట్ ఫుడ్ దుకాణం తేలవడం వల్ల 30 ఉద్యోగాలు సృష్టించబడతాయి ..*.


*10 గుండె వైద్యులు,10 మంది దంతవైద్యులు,10 మంది బరువు తగ్గించేవారు...!*


 *గమనిక: - నడక అనేది దీని కంటే ప్రమాదకరమైనది. ఎందుకంటే పాదచారులు సైకిల్ కూడా కొనరు.*


😊😃😀

కుక్కర్లో వండిన అన్నం ఆరోగ్యానికి మంచిదేనా ?

 కుక్కర్లో వండిన అన్నం ఆరోగ్యానికి మంచిదేనా ? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో వివరణ.

సాధారణం చాలా మంది ఇళ్లలో కానీ రూంలలో అన్నం ప్రెషర్‌ కుక్కర్లో వండుతుంటారు. ప్రెషర్‌ కుక్కర్లు లేని సమయంలో కట్టెల పొయ్యిపై, ఆ తర్వాత గ్యాస్‌ సిలిండర్‌పై గిన్నెలోనే వండేవారు.

ఇప్పుడు కాలం మారుతున్నకొద్ది విధానాన్ని మార్చుకుంటున్నారు.

ప్రెషర్‌ కుక్కర్లలో వండే వారు చాలా మందే ఉన్నారు. దీని వల్ల గ్యాస్‌ ఆదా కావడమే కాకుండా అన్నం త్వరగా అవుతుంది. మన దేశంలో అన్నం ప్రధానమైనది. దేశంలోని చాలా ప్రాంతాల్లో వరి అన్నాన్ని ఆహారంగా చాలా మంది తీసుకుంటారు. అయితే ప్రెషర్‌ కుక్కర్‌లో అన్నం వండితే ఆరోగ్యానికి మంచిదేనా..? కాదా అన్న సందేహం కలుగుతుంటుంది. దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే?

ప్రెషర్‌ కుక్కర్‌లో అన్నం వండుకుని తినడం ఆరోగ్యానికి మంచిదేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రెషర్‌ కుక్కర్‌లో వండే అన్నం రుచిగా ఉండడమే కాకుండా కుక్కర్‌లో వండిన అన్నంలో పిండి పదార్థం తొలగిపోతుందట. అంతేకాకుండా ఫ్యాట్‌ కంటెంట్‌ కూడా తక్కువగా ఉంటుంది. కుక్కర్‌లో వండిన అన్నంలో కార్బోహైడ్రేట్స్‌, ప్రొటీన్‌ లాంటి నీటిలో కలిగే పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇక కుక్కర్‌లో వండిన అన్నంతో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు. అన్నం సులువగా జీర్ణమవుతుంది. ఈ అన్నంలో ప్రోటీన్స్‌, పిండి పదార్థాలు, ఫైబర్‌ కంటెంట్‌ లాంటి పోషకాలు కూడా ఉంటాయట. ప్రెషర్‌ కుక్కర్‌లో వండటం వల్ల బియ్యంలో, నీళ్లలో ఉండే హనికర బ్యాక్టీరియా నశించిపోతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.




Thursday, August 25, 2022

నీ తోడు ఎవరుంటారు

        నీ తోడు ఎవరుంటారు ⁉️


నాకు...ఓ రైలు ప్రయాణంలో ఓ ఊరు వెళుతుండగానేను కూర్చున్న భోగీలో నాసీటు కింద కాళ్లదగ్గర  ఒక పాత నలిగిపోయిన పర్సు కనిపించింది.


దానిని పైకి తీశాను.అందులో కొద్దిపాటి నోట్లు ఒక కృష్ణుడిఫోటో తప్ప ఏమీ లేవు. ఎవరిదో తెలిపే ఆనవాళ్ళు ఏమీ లేవు.

ఎలా తిరిగి ఇవ్వడం?

ఈ పర్స్ ఎవరిదండీ ?అంటూ అడిగా అక్కడ ఉన్నోల్లతో.... అందరూ పర్స్ కేసి చూశారు, తమ జేబులు తడుముకున్నారు.


ఇంతలో పక్కబెర్తులో కూర్చుని భగవద్గీత చదువుకుంటున్న ఒక పెద్దాయన నెమ్మదిగా వచ్చి అది తన పర్స్ అని చెప్పాడు.

మీ పర్సు అని నమ్మకం ఏమిటీ ?ఏదైనా ఆనవాలు ఉంటే చెప్పండి అన్నాను. "అందులో కృష్ణుడి ఫోటో ఉంటుందండీ"అన్నాడాయన. 

"ఆ ఒక్క ఆనవాలు చెబితే ఎలాగండీ ?ఇంకా ఏదైనా చెప్పండి.మీ ఫోటో పెట్టుకోవచ్చు కదా !"అడిగాను.

అప్పుడు ఆ పెద్దాయన చెప్పిన సమాధానం మన అందరికీ ఒక పాఠమే.

బాబూ..! 

అది నాకు చిన్నప్పుడు మా నాన్న ఇచ్చిన పర్సు, అప్పుడు నాకు మా అమ్మానాన్న అంటే చాలా ఇష్టం అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో పెట్టుకున్నాను.

కాలం గడిచేకొద్దీ నేను చాలా అందంగా ఉన్నాను అని నాకు అభిప్రాయం కలిగింది. అందుకని నేను అప్పుడు పర్సులో నా ఫోటో పెట్టుకున్నాను.


నాకో ఉద్యోగం వచ్చి పెళ్లి అయ్యింది.నా భార్య చాలా అందగత్తె.నాకు ఆమె అంటే చాలా ప్రేమ.అపుడు ఆమె ఫోటో పర్సులో పెట్టుకునే వాడిని.


ఇంకో రెండు సంవత్సరాలకి నాకు కొడుకు పుట్టాడు. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడి కోసం ఆఫీసు వదలగానే ఇంటికి వచ్చి వాడితోనే లోకం అన్నట్టుగా గడిపేవాడిని.

వాడిని భుజాల మీద మోస్తూ రోజంతా గడిపేవాడిని.వాడిని నా పక్కనే పడుకోబెట్టుకునే వాడిని.వాడే నా లోకం. అప్పుడు పర్సులో వాడి ఫోటో పెట్టుకునే వాడిని.వాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు.


నా భార్య మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది.

కొడుకు నన్ను మరచిపోయాడు.నాకెవ్వరూ లేరు.ఇపుడు భయం వేస్తోంది. ఈ వయసులోనేగా తోడు కావాలి.అందుకని నాకు తోడుగా కృష్ణుడిని పెట్టుకున్నాను.ఆయనే నాకు ఇపుడు తోడు.


నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు.

నా విచారానికి ఓదారుస్తాడు.

నాతో ఎప్పుడూ ఉండే ఆయనను ఎప్పుడో పర్సులో పెట్టుకోవలసిన నేను చాలా ఆలస్యంగా గుర్తించాను. ఇప్పుడు నేను ఆయనతో గడుపుతున్నాను.


#భగవద్గీత చదువుతుంటే స్వయంగా ఆ జగద్గురువే నాతో మాట్లాడుతున్న అనుభూతి,ఆనందం కలుగుతున్నాయి.చిన్నతనం నుంచీ నన్ను విడిచిపెట్టిపోయే అశాశ్వతమైన అంశాలకే ప్రాధాన్యత ఇచ్చాను తప్ప,శాశ్వతమైన పరమసత్యం ఈ భగవద్గీత అనే నిజాన్ని విస్మరించాను.జీవితం అర్ధభాగం పైగా గడిచిపోయిన తరువాత ఈ #బ్రహ్మవిద్యపై శ్రద్ధ కలిగినదుకు సంతోషించాలో,కనీసం నూటికి 90 మందికిపైగా ఇప్పటికీ #దేవునివాచ పై శ్రద్ధ లేనందుకు విచారించాలో తెలియడం లేదు అన్నాడు ఆ పెద్దాయన.


ఆయన మాటల్లో ఆవేదన,ఆయన కళ్ళల్లో పలుచటి నీటిచెమ్మ లీలగా కనిపించాయి.

నేను మారు మాట్లాడకుండా పర్సు ఆయనకు ఇచ్చేశా.

పక్క స్టేషనులో రైలు ఆగింది,నేను దిగవలసినది అక్కడే.రైలు దిగి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నా ఆలోచనలు మాత్రం వేగంగానే సాగుతున్నాయి.బయటకు రాగానే ఎదురుగా గోడపై

"భగవద్గీత చదవండి,శ్రీ కృష్ణుని నిజభావం తెలియండి" అని వ్రాసి ఉన్న బోర్డు చూసి,దానిపై ఉన్న నెంబర్ కి కాల్ చేసి నాకు భగవద్గీత కావాలని అడిగాను.ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి నేనున్న రైల్వేస్టేషన్ కు 20 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్నానని,మీకు ఆలస్యం అవుతుందంటే మీ అడ్రస్ కు తెచ్చి ఇస్తామని చెప్పాడు.గంట సమయమైనా నేను ఇక్కడే వేచి ఉంటాను వెళితే భగవద్గీత గ్రంథంతోనే ఇంటికి వెళ్తాను అని చెప్పాను.

సుమారు 25 సంవత్సరాల వయసున్న వ్యక్తి అర్ధగంటకి  బైకుపై వచ్చి నా నెంబర్ కి కాల్ చేసాడు. అతనిని చూసి చెయ్యి పైకెత్తి పిలిచాను.అతను దగ్గరకు వచ్చి "భగవద్గీత" నా చేతిలో పెడుతూ ఆలస్యం అయ్యింది అన్న,క్షమించాలి అన్నాడు.ఆ మాటల్లో మర్యాద..... నిజంగానే "భగవద్గీత" ఇంత సంస్కారం నేర్పుతుందా అని చిరునవ్వు నవ్వి,ఆ గ్రంథం యొక్క వెల చెల్లించి,ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పి,ఆటోని పిలిచాను.ఆ పెద్దాయన చెప్పింది నిజమే.,  భగవద్గీత పట్టుకుని అడుగులు వేస్తుంటే స్వయంగా ఆ దేవదేవుడే నా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది.

 

భగవంతుడు తప్ప నిన్ను కాపాడేవాడే లేడు... నిత్యం మనకు ఎన్ని పనులు వున్న భగవంతునికి , భగవంతుడు చెప్పిన భగవద్గీత కు కాస్త సమయం కేటాయిస్తే ఆయన మన కోసం జీవితకాలం తోడు వుంటాడు. 

ఆయన్ని అర్జునుడిలా శరణు వెడితే!

నీ జీవితామంతా అదే అర్జునుడికి తోడుగా ఉన్నట్టే ఉండి.. నిన్ను నడిపిస్తాడు


జై శ్రీ కృష్ణ

Wednesday, August 24, 2022

నిన్న నేడు రేపు

 నిన్న నేడు రేపు


*నిన్న ఏమి తీసుకురాకుండానే*

*వచ్చాము*

*నేడిక్కడ చాలానే సంపాదిస్తున్నాం*

*రేపు ఏమి తీసుకుపోకుండానే*

*వెళ్తాము*


*అసలు లెక్కంతా తప్పే...*

*మనమిక్కడ ఉన్నందుకు*

*ఎంతో కొంత కిరాయి ఇవ్వాలి..*

*కాని మనం కూడబెడుతున్నాం*


*తీసుకురానప్పుడు... తీసుకుపోనప్పుడు*

*ఎందుకీ అనవసరపు అత్యాశలు.. ద్వేషాలు.*


*ఈ ప్రపంచానికి నువు కొంత భారంగా*

*కొన్నేళ్ళు బతికి నప్పుడు*

*ఏమిచ్చావు... ఈ ప్రపంచానికి నువ్వు*

*ఏం చెల్లించావు ... ఈ లోకానికి రుసుము*


*నా వరకైతే పనికొచ్చే నాలుగు మాటలు చెప్పేస్తున్నాను*

*ఇవి నా పొట్ట నింపవని నాకు తెలుసు*

*కాకపోతే కొందరి మనసుల్లో సంతోషాన్ని నింపేస్తాయి*

*మరి కొందరి గుండెల బరువును ఖాళీ చేస్తాయి*


*నువ్వు కూడా ఏదో ఒకటి చెయ్..*

*నాకు తెలుసు నువ్వు చేస్తావని...*

*నీకు అడ్డు పడే స్వార్థాన్ని*

*కొంచెం కొంచెం జరుపు*

*ఈ ప్రపంచం నిన్ను చాలా చాలా దగ్గర చేసుకుంటుంది*

    

          

Monday, August 22, 2022

అద్దెఇల్లు-జ్ఞానిలక్షణం

 అద్దెఇల్లు-జ్ఞానిలక్షణం


అద్దె ఇంట్లో ఉన్నవాడు, ఆ ఇంట్లో ఉన్నంతకాలం

'మా ఇల్లు' అనే అంటాడు.

తన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు 

ఇంటి యజమానితో కూడా అదే అంటాడు

'ఏమండీ! రేపు మా ఇంటికి రండి...' అని.


'మా ఇల్లు' అన్నాడని అతనితో యజమాని గొడవపడడు.

యెందుకంటే వ్యవహారం కోసమే అలా అంటారని

ఇరువురికీ తెలుసు.


అలాగే ఈ తనువు తనకు అద్దె ఇల్లు లాంటిది.

వ్యవహార నిమిత్తం నా శరీరం, నా సంసారం, నా ప్రపంచం, నా దైవం అంటాడు.


కానీ యజమాని భగవంతుడు.


యజమాని భగవంతుడు అనేది 

జ్ఞప్తి కలిగి ఉన్నవాడు - జ్ఞాని. 

మరచి ఉన్నవాడు - అజ్ఞాని.


అద్దె ఇల్లు పెచ్చులూడితే అద్దెకున్నవాడు ఏమీ చింతించడు.

ఆ ఇల్లు ఖాళీ చేసి మరొక ఇల్లు చూసుకుంటాడు.


ఇక ఈ శరీరం నిలబడని వ్యాధి వచ్చింది...

వదిలేసి మరొక ఉపాధిని వెతుక్కుంటాడు.

అదే పునర్జన్మ. 


ఇల్లు మారితే యజమాని మారుతాడు.

కానీ శరీరం మారితే యజమాని(భగవంతుడు) మారడు.


సకలసృష్టికీ యజమాని ఆయనే.

సృష్టి యావత్తు భగవంతునికి ఓ సంకల్పం అంతే.


ఆయన ఒకేసారి మొత్తాన్ని ఖాళీ(లయం) చేసేస్తాడు.

అనగా సంకల్పరాహిత్యంగా ఉంటాడు.

నీవు నిద్రలో ఉన్నట్టు.


దేవుని సంకల్పరాహిత్యమే 

జీవునికి జన్మరాహిత్యము.


కాబట్టి బంధమైనా, మోక్షమైనా భగవంతుని సంకల్పమే.


అందుకే అన్నమయ్య ఓ సంకీర్తనలో ఇలా అన్నారు-

"మదిలో చింతలు, మైలలు మణుగులు, వదలవు నీవవి వద్దనక."


భగవంతుడు "వద్దు" అనుకుంటే ఉండవు.

అంతేగానీ మనం వద్దు అనుకుంటే పోవు.


నా సంకల్పం కూడా భగవంతుని సంకల్పంలో అంతర్భాగమే కదా అంటావేమో!


ఇక బాధేముంది?


నీ శరీరం భగవంతుని శరీరంలో(సృష్టిలో) అంతర్భాగం.

నీ మనస్సు భగవంతుని మనస్సులో(మాయలో) అంతర్భాగం.


జీవుని బంధమోక్షములు దేవుని లీలావిలాసములు.


శరీరం ఉంటే ఉండనీ... ఊడితే ఊడనీ... 

బంధం ఉంటే ఉండనీ... మోక్షం వస్తే రానీ...


ఏదైనా సరే ఉంటే ఏమి? లేకుంటే ఏమి?

అని ఉండటం జ్ఞానిలక్షణం.

***

ఓ తండ్రి ఆవేదన

  ఓ తండ్రి ఆవేదన

                   తన మాటల్లోనే..



👉నాకు77 ఏండ్లు. నా భార్య చనిపోయి 10 సంవత్సరాలు అవుతోంది. 


👉నాకు 3గురు కొడుకులు.. ఒక్కొక్క నెల ఒక్కో కొడుకు ఇంట్లో నా జీవనం


👉ఆప్యాయంగా పలకరించే మనిషి కోసం ఆరాటపడే వారిలో నేనూ ఒకడిని...ఇంక 4 రోజుల్లో చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి..


👉ముడతలుపడ్డ తన వేళ్ళతో రోజులు లెక్కపెట్టుకుంటున్నాడు ఆ పెద్దాయన.


👉చిన్నకోడలి దగ్గరికి పోవడానికి ఇంక కొన్ని గంటలే సమయం ఉంది.


👉పోయిన పండుగకి 2వ కొడుకు పంచలు తీసిచ్చాడు 

అవి బాగా పాతబడిపోయాయి


👉పెద్దకొడుకు కొనిచ్చిన అద్దాలు పగిలిపోయి 3 వారాలు అయింది.కొడుక్కి చెపితే విసుక్కుంటాడని అద్దాలు పెట్టుకోవడం మానేశాను.

కోడలితో చెప్తే గొడవ అవుతుందని చెప్పలేదు.


*ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేని మనస్తత్వం నాది..*


👉చిన్నకోడలికి చెప్పి అద్దాలు మార్చుకోవాలి. ఇంకా 4 రోజులుంది. అందరూ ఆఫీస్ కు వెళ్ళాక ఆ పంచలు ఉతుక్కోవాలి

నల్లగా ఉంటే చిన్నకొడలు కొప్పడుతుంది.


👉4 రోజులు గడిచిపోయాయి...హాస్టల్ నుండి ఇంటికి పోయే పిల్లవాడిలా ఆనందం నాకు..కొడుకు బస్ ఎక్కించి వెళ్ళిపోయాడు


👉బస్ దిగగానే నా "చిన్నకొడలు" నాకోసం స్కూటీ తెచ్చింది

నన్ను చూడగానే ' అద్దాలు ఏమయ్యాయి మామయ్యా?' 

అని అడిగింది


👉బ్యాగ్ లో ఉన్నాయి పదమ్మా! అన్నాను. తీసి పెట్టుకోమని ఆర్డర్ వేసింది


👉పగిలిపోయాయని చెప్పాను. కోపంగా నా వంక చూసింది. తలవంచుకున్నాను.


👉సరే! జాగ్రత్తగా నా వెనుక కూర్చోండి' అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది...నాకు ఇష్టమైన బాదంపాలు త్రాగించి,అద్దాల షాపు దగ్గరికి వెళ్లి అద్దాలు ఆర్దరు చేసి ఇంటికి బయలుదేరింది కోడలు.


👉దారి మధ్యలో ఇలా అంది.

'అందుకే మామయ్యా! మిమ్మలి ఎక్కడికీ పంపడం నాకు ఇష్టముండదు


👉ఆ అద్దాలు కూడా తీసి ఇవ్వలేనంత బిజినా నీ కొడుకు..ఆ పంచ ఎలా ఉందో చూడరా వాళ్ళు. మిమ్మల్నే అనాలి'


👉పోనిలేమ్మా! ఎవ్వరినీ ఏమి అనకు.'అన్నాను


👉 స్కూటీలో వెళ్తుండగా ' మామయ్యా! జాగ్రత్తగా కూర్చోండి. కావాలంటే నా భుజంపై తల వాల్చుకోండి.' అంది కోడలు.


👉 ఆమె భుజంపై తల వాల్చుకున్నాను.

కుతురిలా చూసుకునే కోడలు భుజంపై తల వాల్చగానే కళ్ళల్లో కన్నీరు....!!


👉ఇంటికి చేరగానే నా బ్యాగ్ తీసి బట్టలన్నీ తీసింది...ఇలా అడిగింది...


👉 నిజం చెప్పండి ! మీ బట్టలు మీరే ఉతుక్కుంటున్నారు కదా!'


👉'లేదమ్మా! వాషింగ్ మెషిన్ లో వేస్తారు..'అన్నాను.

అబద్ధం చెప్పేసి తలవంచుకున్నాను


👉నన్ను ఒక టీచరులా సీరియస్ గా చూసింది..తలవంచుకున్న నన్ను చూసి పక్కున నవ్వేసింది...


👉'నా బాధ మీకు అర్థం అవుతోందా.. మిమ్మల్ని చూసుకోలేనంత బిజీగా ఉన్నవారి ఇంటికి మీరు ఎందుకు వెళ్లడం.


👉ఇక్కడ నేను మీ చిన్నకొడుకు సరిగ్గా చూసుకోవడం లేదా చెప్పండి మామయ్యా!'

 

👉కోడలి రెండు చేతుల్లో నా ముఖాన్ని ఉంచి వెక్కి వెక్కి ఏడ్చాను...

'నన్ను పసిబిడ్డలా చూసుకునే నీ దగ్గరికి ఎప్పుడు వస్తానా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తానమ్మా!


👉మరు జన్మ ఉంటే నీకు బిడ్డనై పుట్టాలని ఉంది తల్లీ! ' ప్రేమగా నువ్వు చూసుకునే ఈ నెల రోజుల అనుభూతి మిగితా అన్ని నెలలకు సరిపోతుంది


నీ రుణం ఎలా తీర్చుకోను తల్లీ!

ఇలా అన్న నన్ను ప్రేమతో ఓదార్చింది నా కోడలు... కాదు కాదు నా కూతురు.......!!!


 *పెద్దవారు పసిపిల్లలతో సమానం..* *వారికి ఆకలి వేసి అడిగేదాకా చూడకండి..* 


పిల్లలకు ఆకలివేస్తుందని తెలుసుకుని అన్నం పెడతాం కదా !వీరుకూడా అంతే!


 *ఈ ప్రపంచంలో..!!* 

 *తల్లిదండ్రులు తర్వాతే ఎవరైనా..🙏*

-------------

Sunday, August 21, 2022

ఆస్తి

 *ఆస్తి*

వాళ్లిద్దరూ మంచి స్నేహితులు.. 

పెద్దయ్యారు..పెళ్ళిళ్ళు అయ్యాయి వాళ్లకు..ఒకరు గోవింద్ ..ఇంకొకరు శ్రీనాథ్..

 ఇద్దరి పుట్టిన ఊరు బాసర.. అక్కడే చదువు, సంస్కారం నేర్చుకున్నారు..

 

ప్రస్తుతం హైదరాబాద్ లో ఉద్యోగం ఇద్దరికీ.. గోవింద్ స్కూల్ టీచర్.

 శ్రీనాథ్ కి సెక్రటేరియట్ లో ఉద్యోగం... ఏరా అంటే ఏరా అనే సాన్నిహిత్యం వాళ్ళది... 


జీవితం మాత్రం శ్రీనాథ్ ని కొంచెం డబ్బున్న వాడిగా మార్చింది..గోవింద్ పిల్లలకు చదువు చెప్పుకుంటూ టీచర్ గా ఉండి పోయాడు..అద్దె ఇల్లు, సిటీ బస్ ప్రయాణం మామూలు విషయం గోవింద్ కి..కానీ ఎప్పుడూ తన స్థితి కి బాధ పడలేదు..


పెళ్లయిన తరువాత చాలా మార్పులు వచ్చాయి వాళ్ళ జీవితాల్లో... 


గోవింద్ భార్య  సరళ..పేదింటి అమ్మాయి.. గోవింద్ మేనమామ కూతురే.. అందలం ఎక్కాలని ఆశ సరళ కు..కానీ తీరేదెలా ?


ఎప్పుడయినా సరళ హంగులు, ఆర్భాటాలు కావాలని అడిగితే నవ్వి ఊరుకునే వాడు గోవింద్.. మన దేశం లో నూటికి 40 మందికి ప్రతి రోజూ తిండి లేదు..వాళ్ళతో పోలిస్తే మనం నయమే కదా అంటాడు..పాపం సరళ కోరికలు తీర్చలేనందుకు కొంచెం బాధ పడుతూ ఉంటాడు అప్పుడప్పుడు..


ఆడవాళ్లు  తమ పక్కన వాళ్ళతో పోల్చుకుని తమ జీవితాలలో లేనివి ఏమిటో ఇట్టే తెలుసుకుంటారు... వాళ్లకు ఉన్న గొప్ప విషయాలను  మాత్రం అంతగా పట్టించు కోరు.. ఇక్కడ కూడా అదే జరిగింది... సొంత ఇల్లు, సొంత కారు లేవని బాధ సరళకు....  


శ్రీనాథ్ భార్య లక్ష్మి.. మంచి కుటుంబం నుండి వచ్చింది.. దాన ధర్మాలు చేయటం అలవాటు..దైవ భక్తి మెండుగా ఉంది...ఉన్న సంపద ను చూసి మిడిసి పాటు లేదు లక్ష్మికి...  లక్ష్మి, సరళ కూడా స్నేహితులయ్యారు. 

ఇళ్లకు రాక పోకలు కూడా బాగానే ఉన్నాయి...  లక్ష్మి కి సరళ అమాయకత్వం బాగా నచ్చుతుంది.. పిచ్చి పిల్ల.. సంపదలు ఉన్నా , సఖ్యం మరియు సౌఖ్యం ఉండాలి జీవితం లో ..అదే చెప్పింది చాలా సార్లు.. నువ్వెన్నయినా చెప్పు లక్ష్మీ... డబ్బులున్న దారే వేరు..చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేని జీవితాలు ఎందుకు ? ఎవరికి ఉపయోగ పడినట్లు..?? 

రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి.. నలుగురూ పెద్దవాళ్ళయ్యారు...


అది ఆగస్ట్ నెల.. ఆ నెలలో శ్రీనాథ్  రిటైర్ అవుతున్నాడు...మరుసటి నెల సెప్టెంబర్ లో గోవింద్ రిటైర్మెంట్ ..


ఆగస్ట్ 31 వ తారీకు రానే వచ్చింది..శ్రీనాథ్, లక్ష్మి ఇంటికి వచ్చి మరీ పిలిచారు.. రిటైర్మెంట్ ఫంక్షన్ కి రావాలని... పిలవక పోయినా గోవింద్ వెళ్ళేవాడే.. ఇప్పుడు సరళ కూడా వెంట వెళ్ళింది... శ్రీనాథ్ యూడీసీ గా రిటైర్ అయ్యాడు.. ఫంక్షన్ బాగా జరిగింది సెక్రటేరియట్ లో వాళ్ళ డిపార్ట్మెంట్ లో.. చాలా మంది శ్రీనాథ్ ని మెచ్చుకున్నారు..మంచి వాడు.. పని లో చురుకుదనం చూపించే వాడని.. అతను రిటైర్ అవటం డిపార్ట్మెంట్ కి తీరని లోటుగా గుర్తు చేసుకున్నారు..


స్నేహితుడి తరపున గోవింద్ మాట్లాడాడు... మరో జన్మంటూ ఉంటే శ్రీనాథ్ కి మళ్ళీ స్నేహితుడుగా పుట్టాలని..స్నేహానికి ప్రాణం ఇచ్చే శ్రీనాథ్ తనకు తన కుటుంబం లో మనిషని చెప్పాడు.. అందరూ ఆనందించారు...


ఆ రాత్రి దగ్గర్లో ఉన్న కామత్ హోటల్ లో భోజనం చేశారు శ్రీనాథ్, గోవింద్ కుటుంబాలు... చాలా రోజుల తరువాత సరళ బయట భోజనం చేసింది.. ఆమెకు నిజంగా అసూయగా ఉంది.. శ్రీనాధ్ ది మంచి ఉద్యోగం.. రిటైర్మెంట్ ఫంక్షన్ బాగా చేసారు..అందరూ పొగిడారు ఆయనను..


వచ్చే నెల లో తన భర్త గోవింద్ రిటైర్మెంట్ వుంది.. మామూలు స్కూలు టీచర్ గా చేరి ఇప్పుడు ఒక స్కూల్ హెడ్మాస్టర్ గా రిటైర్ అవుతున్నాడు.. అప్పుడు ఫంక్షన్ యెలా జరుగుతుందో ఏమో ?? శ్రీనాథ్ రిటైర్మెంట్ ఫంక్షన్ లా ఆర్భాటంగా ఎలాగూ జరగదు...కనీసం లో కనీసం తల దించు కోకుండా జరిగితే చాలు...అలా చాలా మంది దేవుళ్ళకు మొక్కింది..


రిటైర్మెంట్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ సరళ లో ఆందోళన పెరిగి పోతూ వచ్చింది... ఇద్దరూ వెళ్లి శ్రీనాథ్ ని, లక్ష్మి నీ పిలిచారు ఫంక్షన్ కి..మనసులో మాత్రం, న్యూనతా భావం నిండి ఉండటం వలన ,  సరళ వాళ్లు రాక పోతే బాగుండునని చాలా సార్లు అనుకుంది.. గోవింద్ మాత్రం మామూలుగానే  ఉన్నాడు.. మామూలు రోజుల్లాగే రిటైర్మెంట్ రోజు వచ్చింది..


ఆ రోజు మామూలు గా స్కూల్ కి వెళ్లి కొన్ని క్లాసులు కూడా తీసుకున్నాడు పిల్లలకు.... అదే తన ఆఖరి క్లాసు కావటం తో రుద్ధమైంది ఆయన గొంతు..  కష్టం మీద క్లాసు కానిచ్చి స్టాఫ్ రూమ్ కి వచ్చాడు గోవింద్..


సాయంత్రం నాలుగు గంటలయ్యింది..  ఆ పాటికే సరళ ను , పిల్లలను తీసుకుని శ్రీనాథ్ వాళ్లు కూడా స్కూల్ కి వచ్చారు.


శ్రీనాథ్ కి చాలా సంతోషంగా ఉంది..గోవింద్ రిటైర్ అవుతున్నాడు.. వాడూ ,తను కలిసి ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపాలి..ప్లాన్ వేసుకున్నాడు.


సరళ కు బెంగగా ఉంది..ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉంది తనకు.. ఫంక్షన్ త్వరగా అయిపోతే బాగుండును..అనుకుంది.


తలవొంపులుగా ఫంక్షన్ జరుగుతుంది ..తను తట్టుకోలేదు...మామూలు స్కూల్ టీచర్ రిటైర్ అయితే కొన్ని వేలమంది, లక్షల మంది టీచర్లు ఉన్నారు భర్తీ చేయటానికి... టీచర్  రిటైర్మెంట్ అంత గొప్ప విషయం కాదు.. తొందరగా ముగించి ఇంటికి చేరుకోవాలని ఆరాటం సరళకు.. పిల్లలు కూడా వచ్చారు..తండ్రి రిటైర్మెంట్ చూడడానికి...


సరళ వాళ్ళను స్టాఫ్ రూం లో కూర్చో బెట్టారు..మిగతా టీచర్లు..


అప్పటి వరకూ పెద్దగా జనం లేరు . విద్యార్థులు , టీచర్లు అందరూ కలిసి ఒక వంద మంది ఉంటారు.. వాళ్ళు రోజూ స్కూల్లో ఉండే వాళ్లే కదా.. సరళ కు పెద్దగా సంతోషం కలగ లేదు ... ఇంకో పది నిముషాలకు ఫంక్షన్ మొదలవుతుందనగా ...ఎక్కడినుండి వచ్చారో..దాదాపు ఇంకో వంద మంది పైనే జనం వచ్చారు..వాళ్లు పిల్లల బంధువులని తెలిసింది... 


ఫంక్షన్ ఆరుబయట చెయ్యాలని నిర్ణయం చేశారు...అందరూ కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు..చాలా మంది నుంచునే ఉన్నారు...ఫంక్షన్ అయ్యేంత వరకూ..


ఎక్కడి నుండో పల్లకీ ని తీసుకు వచ్చారు... మాస్టారు గోవింద్ ను పిల్లలు పల్లకీ లో కూర్చుండ బెట్టారు.. కొంత మంది టీచర్లు, పిల్లల బంధువులు పల్లకీ మోయటానికి సిద్ధ పడ్డారు... సరళ కు అంతా కల గా ఉంది... పల్లకీ లో  గోవింద్ ని కూర్చో బెట్టి లేప బోతుండగా ఎవరో అరిచారు..

మాస్టారి గారి ధర్మ పత్ని ని కూడా పల్లకీ లో కూర్చో బెట్టాలని.. అందరి బలవంతం మీద పల్లకీ లో కూర్చుంది సరళ.. గోవింద్ తో...పెళ్లి రోజు తరువాత మళ్లీ ఇన్నాళ్ళకు...పల్లకీలో ఎక్కడం.. సరళ కు సంతోషం తో కళ్ల వెంట నీళ్ళు వచ్చాయి..


పల్లకీ లేచింది..చిట్టి చేతులతో పిల్లలు కూడా పల్లకీ మోస్తున్న వాళ్ళకు సాయపడుతున్నారు.. ఆ దృశ్యం మనోహరం గా ఉంది.. కాలం కొన్ని క్షణాలు అలా ఆగిపోతే బాగుండునని అనిపించింది సరళ కు.. గోవింద్ కి భాధ గానూ, సంతోషం గానూ ఉంది..పిల్లలూ జాగ్రత్త .. మీరు ఇబ్బంది పడకండి అంటూ వాళ్ళను వారిస్తున్నాడు..అయినా వాళ్లు వినటం లేదు ...


ఇంతలో పల్లకీ ని దింపారు.. ఎందుకో అర్థం కాలేదు సరళ కు, గోవింద్ కు... 


కారు దిగి నెమ్మదిగా వచ్చి నమస్కారం చేశాడు గోవింద్ కి ఆ వచ్చినాయన... గోవింద్ కాళ్ళకు దండం పెట్టాడు.. ఆ వచ్చినాయన జిల్లా ఎస్పీ గారు.. వెంట పది మంది పోలీసులు..  ఈ లోపల ఇంకో కారు వచ్చి ఆగింది.. వచ్చింది జిల్లా 

జడ్జ్ గారు..ఆయన కూడా తన వాళ్ళతో వచ్చారు.. 


జిల్లా ఎస్పీ, జడ్జ్ గారు, 

మిగతా వాళ్లు పల్లకీ మోస్తుండగా నిర్ణీత స్థలానికి చేరారు..


నీళ్ళు, కాళ్ళు  కడిగే ఇత్తడి పళ్ళెం వచ్చాయి...ఎక్కడి నుండో... ఎస్పీ, జడ్జ్ గార్లు గోవింద్ మాస్టారి కాళ్ళు కడిగి తల మీద చల్లుకున్నారు... కొంత మంది ఆడవాళ్ళు హారతి ఇచ్చారు గోవింద్ కి, సరళ కు.. ఆ రోజు పూల వాన కురిపించారు అందరూ  వారిద్దరి మీద..


పిల్లలు మాస్టారు గోవింద్ గారి గురించి మాట్లాడుతూ ఏడ్చేసారు.

ఇంచుమించు టీచర్ల పరిస్థితి కూడా అంతే..అందరి కళ్ళు చెమ్మగిల్లాయి.. జిల్లా ఎస్పీ,జడ్జ్ కూడా మాట్లాడారు. తమ జీవితం లో తాము సాధించిన విజయాలు అన్నీ గోవింద్ మాస్టారి వలనే అని గర్వంగా చెప్పారు.. ఆయన పక్కన కూర్చోవటం కూడా వాళ్లకు మనస్కరించక నుంచునే ఉన్నారు..చాలా సేపు... 


అప్పటి వాతావరణం చెప్పటం కష్టం.. శ్రీనాథ్ సంతోషం చెప్పనలవి కాదు..తన స్నేహితుడికి జరుగుతున్న గొప్ప గౌరవం..అది.. వాడికి జరిగినా తనకూ జరిగినట్లే... 


శ్రీనాథ్ మాట్లాడుతూ చెప్పాడు..ఇక్కడున్న ఇన్ని వందల మంది లో  తనొక్కడే గోవింద్ ని ఆప్యాయంగా ఒరేయ్  అని పిలువ గల అర్హత  కలవాడవటం  సంతోషంగా ఉందని అన్నాడు..


చివరగా గోవింద్ మాట్లాడాడు..

పిల్లలందరికీ నా ఆశీస్సులు... ఒకప్పటి నా విద్యార్థులు ఈ నాడు జిల్లా కు జడ్జ్ గానూ, ఎస్పీ గానూ ఉండటం తనకు ఎంతో సంతోషంగా ఉందని ..ఇలా పిల్లల్ని మంచి ఉన్నత స్థితి లో చూడటం తనకు గర్వ కారణం అనీ, ఈ పిల్లలే తన ఆస్తి ,ఐశ్వర్యం , వీళ్ళే నా సర్వస్వం అంటూ ...మాట్లాడలేక పోయాడు.

 

నాకు ఇంత గొప్ప వరం ఇచ్చిన భగవంతుడిని కోరేదొకటే అన్నాడు.. నా పిల్లలందరికీ మంచి భవిష్యత్తును, దీర్ఘాయువును ఇమ్మని కోరాడు..


పిల్లలను పట్టుకోవడం ఎవరి తరం కాలేదు..అంతలా అభిమానించారు  గోవింద్ మాస్టారును.. 


ఫంక్షన్ ముగిశాక  అందరూ కలిసి వచ్చి గోవింద్ ని ఇంటి వరకూ దిగ బెట్టారు....వెళ్ళలేక వెళ్ళారు పిల్లలందరూ...


ఆ రోజు రాత్రి  శ్రీనాథ్ , లక్ష్మి వారి పిల్లలూ గోవింద్ ఇంట్లోనే ఉండి పోయారు...


భోజనాలు అయిన తరువాత గోవింద్ పాతికేళ్ల  కొడుకు సుబ్రహ్మణ్యం,  తల్లితో అన్నాడు... నాన్న గారికి ఇంత ఆస్తి ఉందని నాకు ఇంత వరకూ తెలియదమ్మా ....


నాకూ ఇంత వరకూ తెలియదురా  అన్నది సరళ ఎంతో సంతోషంగా.. .


శ్రీనాథ్ కల్పించుకుని అన్నాడు..

వీడు కుబేరుడికి ఏం తీసిపోడు.. మనః స్ఫూర్తిగా చెపుతున్నాను.. 


సరళ గోవింద్ వంక చూసింది.. గోవింద్ ...మనకు ఈ సంపద చాలు సరళా  ఈ జన్మకు ...  అన్నాడు..


ఆకాశం లో ఒక మెరుపు మెరిసింది.. గురువులు పూజ్య నీయులు .. వారు ప్రోగు చేసుకున్న  ఆస్తి పిల్లల అభిమానమే...  (సంగ్రహణ ':: మూర్తి ,.ఇలాంటి అనుభూతి నా జీవితంలో కూడ పొందాను )

Thursday, August 18, 2022

శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం

 *శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం*




1. శ్రీకృష్ణుడు 5,252 సంవత్సరాల క్రితం జన్మించాడు

2. పుట్టిన తేది క్రీ. పూ. 18.07.3228 (3228 B.C)

3. మాసం : శ్రావణం

4. తిథి: అష్టమి

5 . నక్షత్రం : రోహిణి

6. వారం : బుధవారం

7. సమయం : రాత్రి గం.00.00 ని. 

8  జీవిత కాలం : 125 సంత్సరాల 8 నెలల 7 రోజులు

9. నిర్యాణం: క్రీ పూ 18.02.3102(3102 B.C)

10. శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగినది

11  కురుక్షేత్రం జరిగిన 36సం. తరువాత నిర్యాణం

12. కురుక్షేత్రం క్రీ.పూ. 08.12.3139న మృగసిర శుక్ల ఏకాదశినాడు ప్రారంభమై 25.12.3139 న ముగిసినది. క్రీ.పూ 21.12.3139న 3గం. నుంచి 5గం.లవరకు సంభవించిన సూర్య గ్రహణం జయద్రదుని మరణానికి కారణమయ్యెను.

13. భీష్ముడు క్రీ.పూ. 02.02.3138న ఉత్తరాయణంలో మొదటి ఏకాదశినాడు ప్రాణము విడిచెను.

14. శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు. అవి:

మధురలో కన్నయ్య

ఒడిశాలో జగన్నాధ్

మహారాష్ట్ర లో విఠల (విఠోబ)

రాజస్తాన్ లో శ్రీనాధుడు

గుజరాత్ లో ద్వారకాదీసుడు & రాంచ్చోడ్

ఉడిపి, కర్ణాటకలో కృష్ణ


15. జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు

16. జన్మనిచ్చిన తల్లి దేవకీ

17. పెంచిన తండ్రి నందుడు

18. పెంచిన తల్లి యశోద

19. సోదరుడు బలరాముడు

20. సోదరి సుభద్ర

21. జన్మ స్థలం మధుర

22. భార్యలు : రుక్మిణీ, సత్యభామ, జాంబవతీ, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ

23. శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం. వారు : చాణుర - కుస్తీదారు

కంసుడు - మేనమామ

శిశుపాలుడు మరియు దంతవక్ర - అత్త కొడుకులు

24. శ్రీకృష్ణుని జీవితం కష్టాల మయం. తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు.  

25. శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నరాని శ్రీ కృష్ణుడుని అందరూ ఆటపట్టిస్తూ, అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది. 

26. కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనం కి మారవలసి వచ్చింది. 

27.  14-16 ఏళ్ల వయసు వరకు బృందావనం లో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14-16 వయస్సులో మధుర లో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు.

28. తను మళ్ళీ ఏపుడూ బృందావనానికి తిరిగి రాలేదు.

29. కాలయవన అను సింధూ రాజు  నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది.

30. వైనతేయ తెగకు చెందిన ఆటవికులు సహాయంతో జరాసందుడిని గోమంతక కొండ (ఇప్పటి గోవా) వద్ద ఓడించాడు.

31. శ్రీకృష్ణుడు  ద్వారకాను పునర్నిర్మించారు.

32. అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16-18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమంకు తరలివెళ్ళెను.

33. గుజరాత్ లో గల ప్రభాస అను సముద్రతీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి ఐన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్త ను కాపడెను.

34. తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేసెను. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించెను.

35. పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్థపింపజేసెను.

36. ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడెను.

37. రాజ్యము నుండి  వెడలగొట్టునపుడు పాండవులకు తోడుగా నిలిచారు.

38. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించునట్టు చేసెను.

39  ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారక నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూసేను.

40. అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించెను.

41. శ్రీకృష్ణుడు  జీవితం విజయవంతమైనదేమీ కాదు. జీవితములో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు. జీవితపు ప్రతీ మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు. 

43. జీవితములో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి / ఎవరికీ అంకితమవ్వలేదు.

అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు ఐనప్పటికీ తను ఎప్పుడు వర్తమానములోనే బ్రతికాడు. 

44. శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ.

(సేకరణ)

స్నేహితుల స్వాతంత్ర్య సంభాషణ

 ఇద్దరి స్నేహితుల స్వాతంత్ర్య సంభాషణ (తప్పక చదవండి):






మీ నుండి మా దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 years

అయింది, తెలుసా? అని అన్నాడు రాజేష్ ఒక ఇంగ్లాండ్ పౌరుడితో(పీటర్ తో) 


అప్పుడు ఆ ఇంగ్లాండ్ పౌరుడు కొన్ని ప్రశ్నలు అడిగాడు.


మీ దేశం పేరేమిటి?


ఇండియా అన్నాడు రాజేష్..


మీ దేశానికి మేము పెట్టిన పేరు అది. మీ దేశం అసలు పేరే నీకు తెలియదు. ఇప్పుడు తెలుసుకో. భారత్ మీ దేశం పేరు.


నువ్వు చదువుకున్న చదువు ఏ మీడియం?


ఇంగ్లీష్ మీడియం..


ఇంగ్లీష్ అనేది మా భాష. నువ్వు చిన్నప్పటి నుండీ మా భాషను నేర్చుకుంటూ పెరిగావు. మా భాషను మాట్లాడుతూ పెరిగావు. మా ఇంగ్లీష్ కల్చర్ ను నేర్చుకుంటూ పెరిగావు. నీ హై స్కూల్,

ఇంటర్మీడియేట్, డిగ్రీ చదువులన్నీ ఇంగ్లీష్ లోనే చదివావు.


చివరికి ఇప్పుడు నువ్వు చేసే Master Degree కూడా మా ఇంగ్లీష్ వాడి దేశంలోనే.


నీ దేశం పేరు మా ఇంగ్లీష్ వాడు పెట్టింది. నువ్వు తినే

తిండీ, వేసుకునే బట్టా మా ఇంగ్లీష్ వాడు పెట్టింది. నువ్వు

చదివిన చదువు మా ఇంగ్లీష్ వాడిది. నువ్వు నేర్చుకున్న కల్చర్ మా ఇంగ్లీష్ వాడిది.


ఇప్పుడు చెప్పు రాజేష్. మీ భారతీయులకు మా ఇంగ్లీష్

వారి నుండి నిజంగా స్వాతంత్ర్యం వచ్చిందా అని సూటిగా అడిగాడు పీటర్..


అంటే మా దేశానికి ఇంకా స్వాతంత్ర్యం రాలేదా పీటర్ అని బాధపడుతూ అడిగాడు రాజేష్..


ఎప్పుడైతే మీ దేశంలోని విద్యా వ్యవస్థ మీ దేశం యొక్క

సంస్కృతీ సంప్రదాయాలను బోధించడం మొదలు పెడుతుందో, రామాయణం లోని ధర్మ సూక్ష్మాలను, భగవద్గీతలోని జ్ఞాన సూక్ష్మాలను విద్యార్థులకు బోధించడం మొదలు పెడుతుందో, ముఖ్యంగా ఒకప్పటి మీ దేశ భాష అయిన సంస్కృతంలోని నీతి సూక్తులను బోధించడం మొదలు పెడుతుందో, మా దేశం యొక్క బ్రాండెడ్ ఉత్పత్తులను వాడడం మీ దేశం ఎప్పుడైతే తగ్గిస్తుందో, మీ దేశం సొంతంగా, అధికంగా ఉత్పత్తులను ఎప్పుడైతే తయారు చేసుకుంటుందో, అప్పుడే మీ దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు రాజేష్ అని భుజం మీద చెయ్యి వేసి చెప్పాడు పీటర్.


మా భారత దేశం యొక్క సంస్కృతి గురించి నాకన్నా

నువ్వే బాగా తెలుసుకున్నావ్, ఎలా పీటర్? 


నీకూ నాకూ ఒకటే తేడా రాజేష్. నువ్వు MS చదవడానికి

ఈ London University కి వచ్చావు. నేను Sanskrit, Hinduism మీద study చేయడానికి వచ్చాను. అంతే తేడా.


ఏది ఏమైనా నీకు 75 th స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు రాజేష్. Happy Independence Day అని చెప్పి

వెళ్ళిపోయాడు పీటర్.

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE