NaReN

NaReN

Sunday, April 4, 2021

బిల్డింగ్ కి నాకు ఏదో అనుబంధం ఉంది

 బిల్డింగ్ కి నాకు ఏదో అనుబంధం ఉంది



ఓ తండ్రి కూతురుతో బైక్ మీద వెళ్తున్నాడు. తండ్రి కూతురుకి చాకొలేట్ ఇప్పిద్దామని బండి ఆపి, "నువ్విక్కడే ఉండు, చాకొలేట్ తీసుకొస్తా, ఎక్కడికి వెళ్లకు," అని షాపుకి వెళ్లి తిరిగి వచ్చేసరికి కూతురు కనపడలేదు.


కంగారు పడి చుట్టుపక్కల చూస్తే కొంచెం దూరంలో ఓ బిల్డింగ్ ను చూస్తూ, దాని వైపే వెళ్లిపోతున్న కూతురు కనిపించింది. 


వెంబడి పరుగెత్తుకెళ్లి ఆపబోతుంటే, "నన్నాపొద్దు, ఈ బిల్డింగ్ కి నాకూ ఏదో అనుబంధం ఉన్నట్టుంది, పోయిన జన్మలో అనుకుంటా.." అంటూ చెబుతోంది.


తండ్రి కూతురి చెంప మీద ఒక్కటిచ్చి, "నీ మొహం.. అది పోయిన జన్మకాదు, ఈ జన్మలోనే నువ్వు చదువుకుంటున్న స్కూల్. ఏడాది నుండి స్కూళ్లు లేకపోయేసరికి నీకు తెలవటం లేదు," అని చెప్తే స్పృహలొకొచ్చింది.. 😂😩😂

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE