NaReN

NaReN

Sunday, April 4, 2021

ఫోటోలు ఫ్రీ.......

 ఫోటోలు ఫ్రీ....... 


కస్టమర్: 2 రోజుల పెళ్ళి ఫోటోలు తీయడానికి ఎంత ప్యాకేజీ 📦 తీసుకుంటారు.


నేను: 60000/-☺️


కస్టమర్: అంతనా.😳.. ఒక్క ఆల్బమ్, వీడియో తియ్యటానికి ఎందుకంత ధర తీసుకుంటున్నారు...?


నేను: మీరు ఎంత అయితే బాగుంటది అనుకుంటున్నారు.☺️


కస్టమర్: 7500/- అయితే అదే ఎక్కువ. ఫోటోలు తీసి ఆల్బమ్ చెయ్యటమే కదా..😏


నేను: అవును కదా.. అది మీరు కూడా చేసుకోవచ్చు.☺️


కస్టమర్: అదెలా... తియ్యటం రాదు కదా.? ☹️


నేను: 7500/- నాకు ఇవ్వండి. నేను మీకు నేర్పిస్తాను😊. మీకు 52500/- మిగిలిపోతాయి👍🏻. మరియు ఫోటోగ్రఫీ నాలెడ్జి కూడా వస్తుంది.👌🏻


కస్టమర్: ఓకే, అలా అన్నావ్ బాగుంది.👍🏻


నేను: సరే మరి. స్టార్ట్ చెద్దమ్.

ముందుగా ఒక కెమెరా తీసుకోండి (180000)

లెన్స్ (120000)

లైట్స్ సెటప్ ( 30000+)

Extra బ్యాటరీలు, బ్యాగులు మెమొరి కార్డులు వగైరా (15000)


కస్టమర్: ఓరి దేవుడా😳.. ఇవన్నీ నాదగ్గర లేవుగా.... నాకు కేవలం ఆల్బమ్, వీడియో కావాలి. ఇవన్నీ కొని తరవాత నేనేం చేస్కోవాలి.


నేను: క్షమించాలి,  ఇంకోవిషయం మరిచిపోయాను. వీడియో కెమెరా మరియు దాని సెటప్ విషయం. వీటిని కూడా కొనాలి.



కస్టమర్: నిజమా ? ఇంతుందా...?


మీరు ఇచ్చే ధర కేవలం ఆల్బమ్, వీడియో కి కాదు. 

మా నాలెడ్జి కి

మా అనుభవానికి

మా నేర్పుకి

మా ఓర్పుకి

మా సర్వీసుకి

మా సమయస్పూర్తికి

మా మర్యాదకి


మీ తీపి జ్ఞాపకాలను.. మీకు సమయం లేకున్నా మీ వెంట పడి... మిమ్మల్ని బతిమాలి... బామాలి... మిమ్మల్ని మెప్పించి.... ఒప్పించి... మీ ఇంట్లో... మీ గోడకు... మీ ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ తగిలిస్తే మీ ఇంటికొచ్చి పోయే మీ బంధువులు మీ ఫ్యామిలీ ఫోటో చూసి సంబర పడుతుంటే అది చూసి మీరు సంబరపడాలని మీ సంబరంలో మా సంబరాన్ని వెతుక్కునే మా వెర్రి తనానికి మీరు ఎంత ఇచ్చిన తక్కువే....


దయచేసి ఏ పనిని తక్కువగా అంచనా వేయకండి. కొందరి కుటుంబాలలో

ఎన్ని కుటుంబ కలహాలు ఉన్నా మీరంతా కలిసి ... నవ్వుతూ... కలకాలం సంతోషంగా  ఉంటూ అప్పుడప్పుడు మమ్మల్ని గుర్తు చేసుకోవాలి అని రోజు ఆ భగవంతుణ్ణి కోరుకునేది ఒక్క ఫోటోగ్రాఫర్ మాత్రమే. నలుగురికి సంతోషాన్ని పంచే ఈ వృత్తిని ఎంచుకున్నందుకు నాకు చాలా గర్వంగా కూడా ఉన్నది.🙏

2 comments:

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE