NaReN

NaReN

Sunday, April 4, 2021

నేటి అక్షర వార్తలు - 04.04.2021

నేటి అక్షర వార్తలు (04.04.2021)
ఫాల్గుణ మాసం సప్తమి ఆదివారం

1969 ఏప్రిల్ 04న డా.డెంటన్ కూలీ మొట్టమొదటి కృత్రిమ హృదయాన్ని ఉపయోగించారు

1975 ఏప్రిల్ 04న *మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపించబడింది*

ఆధ్యాత్మిక తెలుగు రచయిత్రి *చల్లా సత్యవాణి జననం* 

అమెరికాకు చెందిన పాస్టర్, ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు
*మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మరణం*

నిజామాబాద్ జిల్లాకు చెందిన అపర దానకర్ణుడిగా పేరుపొందిన వ్యక్తి *రాజా నర్సాగౌడ్ మరణం*

దేశంలో గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 89,129 కరోనా కేసులు, 714 మంది మృతి

తెలంగాణను హడలెత్తిస్తున్న కరోనా.. మళ్లీ వెయ్యి దాటిన పాజిటివ్ కేసులు.. శాస్త్రవేత్తల వార్నింగ్

కోవిడ్‌ సంక్షోభంలో సెలూన్‌ షాపు యజమాని ఔదార్యం.. ప్రైవేటు టీచర్లకు ఉచిత సేవలు

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం.. వచ్చే వారం నుంచి టెన్త్ ప్రత్యక్ష తరగతులు

హైదరాబాద్ మేడ్చల్ లోవిధులు నిర్వహిస్తోన్న పారిశుధ్య కార్మికులపైకి దూసుకొచ్చిన టిప్పర్, అక్కడికక్కడే దశరథ్ మ‌ృతి

రెండోదఫా స్కౌట్స్ అండ్ గైడ్స్‌ రాష్ట్ర చీఫ్ కమిషనర్ గా ఎన్నికైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

జాఫ్నాలో పర్యటించిన మొట్టమొదటి ప్రధాని మోదీ.. తమిళులకు అండగా ఉంటాం.. ఈరోడ్ ఎన్నికల సభలో నడ్డా

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ

సీఎం కేసీఆర్ ముందుచూపు వల్లే తెలంగాణలో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతూ దేశానికి పాఠాలు నేర్పిస్తుంటే కేంద్రం మాత్రం కుంటి సాకులతో రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులకు కోత పెడుతోందన్నారు మంత్రి కేటీఆర్. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కూడా రైతులకు 24గంటల ఉచిత విద్యుత్‌ అందించడం లేదన్నారు

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు జవాన్లు మృతి.. 12 మంది భద్రతా సిబ్బందికి గాయాలు

తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక ప్రకటన.. ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా

కరోనాను అరికట్టేందుకు దేశ రాజధానిలో ‘విశ్వశాంతి మహాయజ్ఞం’.. పూజలు, శ్లోకాలతో మారుమ్రోగిన ఆలయ ప్రాంగణం

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. 24గంటల్లో అరలక్ష మార్కుకు చేరువలో కేసులు

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE