NaReN

NaReN

Thursday, April 1, 2021

తమలపాకులు ఎందుకు వాడుతారో తెలుసా..?

 తమలపాకులు   ఎందుకు వాడుతారో మీకు తెలుసా..? 

కర్మకాండలు, పెళ్లిళ్లకు ఎందుకు వాడుతారు.. ఎప్పుడైనా ఆలోచించారా..?


Betel Leaves Benefits : సనాతన భారతీయ చరిత్రలో ఆయుర్వేదానికి ప్రత్యేక చరిత్ర ఉంది. ఎందరో మహానుభావులు పలు వ్యాధులకు చికిత్సల గురించి వివరించారు. వివిధ రకాల మొక్కలు, ఆకులు, వేళ్లను పరిష్కారంగా సూచించారు. అయితే కర్మకాండలు, పెళ్లి్ళ్లు, శుభకార్యాలు, పండుగలు ఏది జరిగినా కచ్చితంగా ఉండాల్సిన ఆకు తమలపాకు..



ఏ ఆకుకు ఇంత ప్రాధాన్యం లేదు.. దేవుడి దగ్గర కూడా పెట్టే ఏకైక ఆకు తమలపాకు. ఎందుకంటే ఈ ఆకులో శరీర రక్షణ వ్యవస్థను కాపాడే గుణం ఉంటుంది. ఎందుకంటే ఫంక్షన్లు, పండుగలు, పెళ్లిళ్లు జరిగినప్పుడు జనాలు ఎక్కువగా దగ్గర దగ్గర ఉంటారు. తద్వారా ఒకరు పీల్చిన గాలి మరొకరు పీల్చడం వల్ల అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంటుంది.


అయితే తమలపాకులను అక్కడ ఉంచడం వల్ల అందులోని కెమికల్స్ వీటిని అరికట్టడంతో తోడ్పడుతాయి. అలాంటి ఔషధ గుణాలు కలిగిన ఆకును పండితులు ప్రాచీన రోజుల్లోనే గ్రహించి అన్ని కార్యాల్లో వినియోగించేలా చేశారు. ఒక ఆచారంగా మనం ప్రతి కార్యంలో తమలపాకును ఉపయోగిస్తున్నాం కానీ అసలు విషయం ఇది. అసలు తమలపాకులో ఉండే ఔషధ గుణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.




తమలపాకు తెల్లరక్త కణాలు, లింపోసైట్లను విపరీతంగా పెంచడంలో దోహదం చేస్తుంది. అంతేకాకుండా ఎటువంటి ఇన్‌ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది. మోనోసైట్లను పెంచి శరీరానికి చెడు చేసే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అంతేకాకుండా తమలపాకులను తింటే తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అందుకే చాలామంది తాంబూలం, పాన్ రూపంలో దీనిని తీసుకుంటారు. ఎందుకంటే నూనెలతో కూడిన వంటకాలు, మాంసాహారం పదార్థాలు తిన్నప్పుడు వెంటనే జీర్ణమయ్యేలా చేస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే పిపిరాల్ ఏ, బి అనేవి లివర్‌ క్లీన్ చేయడంలో చాలా బాగా పనిచేస్తాయి.


No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE