NaReN

NaReN

Tuesday, April 6, 2021

నేటి పంచాంగం - 06-07-2022

 నేటి రాశి ఫలాలు - 11-07-2022

*SKY Life-ఆకాశ జీవనం క్యాలెండర్ సౌజన్యం తో*


ఈ రోజు పుట్టిన రోజు, పెళ్ళిరోజు, ఇంకేమైనా విశేష రోజు జరుపుకొంటున్న మిత్రులకి,  శ్రేయోభిలాశులకి, ఆత్మీయులకి,  మరియు వారి కుటుంబసభ్యులకు,

            *శుభమస్తు*

*🙏 ఓం శ్రీగురుభ్యోనమః🙏*


*11-07-2022* నాటి

*ద్వాదశ రాశుల* వారికి  *సోమవారం* ( ఇందువాసరే) యొక్క దిన  ఫలాలూ       


*మేషం*

 ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. వృత్తి వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.


*వృషభం*

 నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.  కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. ఉద్యోగమున వివాదాలు సర్దుమణుగుతాయి.


*మిధునం*

వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. బంధుమిత్రులు నుండి శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. ఆలోచనలు ఆచరణలో పెడతారు.


*కర్కాటకం*

 సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ విషయాలలో కొంత నిరుత్సాహం తప్పదు. సంతాన విద్య వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.


*సింహం*

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి.  నిరుద్యోగులకు మరింత కష్టం తప్పదు. వృత్తి వ్యాపారాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉంటాయి. ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.


*కన్య*

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ చేస్తారు.


*తుల*

ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఉద్యోగ విషయంలో ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి. అనుకొన్న సమయానికి పనులు పూర్తి కావు. వ్యాపారస్తులకు వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి. బందుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.


*వృశ్చికం*

 స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు శ్రమకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.


*ధనస్సు*

దాయాదులతో స్థిరాస్తి వివాదాలు తప్పవు. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన  కార్యక్రమాలలో స్వల్ప వివాదాలు ఉంటాయి. ధన పరంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది.


*మకరం*

వృత్తి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.


*కుంభం*

 అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.


*మీనం*

 వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరగటం వలన శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ తప్పదు. ఉద్యోగమున ఒడిదుడుకులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది.

  

*శుభాకాంక్షలు*                                                        

శుభం భవతు, సన్మంగలని సంతు, 

ఇష్ట, కమ్యర్త్త ఫల సిద్ధిరస్తు,. 

మానోవంచా ఫల సిద్ధిరస్తు, 

ఇష్టదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు

*లోకా సమస్తా సుఖినో భవతు*

➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️

💐పంచాంగం *09-07-2022*


*శ్రీ శుభకృత్ నామ సంవత్సరే - ఉత్తరాయనే - గ్రీష్మ ఋతౌ - ఆషాఢ మాసే - శుక్ల పక్షే*


 తిధి 🕉️ :- *దశమి(దశమ్యాం) ప 11-44 వరకు తరువాత ఏకాదశి*


*శని వారము - స్థిర వాసరే* 


 నక్షత్రం⭐:- *స్వాతి ఉ 07-29 వరకు తరువాత విశాఖ*


సూర్యోదయం🌄 :- *05-35*

 

సూర్యాస్తమయం🌅:- *06-35*


శుభసమయం⚛️:  *సా 06-00*


~వర్జ్యం: *ప 12-51 నుండి 02-23 వరకు*


~దుర్ముహూర్తo  *ఉ 05-35 నుండి 07-19 వరకు* 


విశేషం💫 : *చాక్షుష మన్వాది,మహాలక్ష్మి వ్రతారంభం,శాఖ వ్రతం*


ఆబ్దిక తిథి ⚪⚪⚪: *శు ఏకాదశి*


➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️


*08-07-2022* నాటి

*ద్వాదశ రాశుల* వారికి  *శుక్రవారం* ( బృగువాసరే) యొక్క దిన  ఫలాలు   


*మేషం*

వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు.


*వృషభం*

నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు ఉన్న అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.


*మిధునం*

సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.  


*కర్కాటకం*

ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మొండి బాకీలు వసూలవుతాయి.


*సింహం*

నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. 


*కన్య*

ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.


*తుల*

ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు.


*వృశ్చికం*

కుటుంబంలో కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి.


*ధనస్సు*                                       నిరుద్యోగులకు కలలు నిజమవుతాయి. ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. పాతమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.


*మకరం*

వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. ఆత్మీయుల సహాయ సహకారాలతో ఋణ సమస్యలు నుండి బయటపడతారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.


*కుంభం*

చిన్నతరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యక కొత్త సమస్యలు చోటుచేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు భాద్యతలు ఉంటాయి. అవసరాలకి ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.


*మీనం*

ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలలో నూతన వస్త్రఆభరణాలు కొనుగోలు చేస్తారు. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు.

 

*శుభాకాంక్షలు*                                                        

శుభం భవతు, సన్మంగలని సంతు, 

ఇష్ట, కమ్యర్త్త ఫల సిద్ధిరస్తు,. 

మానోవంచా ఫల సిద్ధిరస్తు, 

ఇష్టదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు

*లోకా సమస్తా సుఖినో భవతు*


➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️


*06-07-2022* నాటి

*ద్వాదశ రాశుల* వారికి  *బుధవారం* ( సౌమ్యవాసరే) యొక్క దిన  ఫలాలూ       


*మేషం*

 విలువైన  వస్తువులు  కొనుగోలుచేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున కుటుంబ సభ్యులతో  ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో  ఆర్థిక పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి  ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. 


*వృషభం*

 ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. సహోద్యోగులతో వివాదాలుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో  తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.


*మిధునం*

దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన  పనులలో అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నలోపం లేకపోయినా ఫలితం ఉండదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.


*కర్కాటకం*

ఉద్యోగమున మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో  సన్నిహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.


*సింహం*

 ఆర్థికంగా అవసరానికి ధనం లభించక ఇబ్బంది పడతారు. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. సన్నిహితులతో  మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి.


*కన్య*

వృత్తి వ్యాపారాలలో  అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు  సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.  కుటుంబ సభ్యుల నుండి  ఆకస్మిక  ధనలాభం పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. భూ సంభందిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.


*తుల*

 దీర్ఘకాలిక  ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటా బయట  కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి  ఉద్యోగాలలో ప్రయత్నాలు కలిసిరావు. 


*వృశ్చికం*

సమాజంలో పెద్దలతో పరిచయాలు కలుగుతాయి. గృహమునకు చిన్ననాటి మిత్రుల  రాక ఆనందం  కలిగిస్తుంది. ఉద్యోగాలలో మరింత  అనుకూల పరిస్థితులుంటాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరులతో  వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో   కీలక  సమాచారం సేకరిస్తారు.


*ధనస్సు*

 ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి  ఉపశమనం పొందుతారు. ప్రయాణాలలో నూతన  వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల  నుండి అరుదైన ఆహ్వానాలు  అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నిరుద్యోగ యత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడుతాయి. 


*మకరం*

జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర దర్శనం  చేసుకుంటారు. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. 


*కుంభం*

విద్యార్థులు పోటీపరీక్షలలో  మరింత కష్టపడాలి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని  నిర్ణయాలు మార్చుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారమున  నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. దూరపు  బంధువులతో స్వల్ప  విభేదాలు ఉంటాయి.


*మీనం*

ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సోదరుల  నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు.

  

 *శుభాకాంక్షలు*                                                        

శుభం భవతు, సన్మంగలని సంతు, 

ఇష్ట, కమ్యర్త్త ఫల సిద్ధిరస్తు,. 

మానోవంచా ఫల సిద్ధిరస్తు, 

ఇష్టదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు

*లోకా సమస్తా సుఖినో భవతు*


నేటి రాశి ఫలాలు - 07-04-2021

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_07, ఏప్రియల్ , 2021_*                 *_సౌమ్య వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

మిశ్రమకాలం. చేపట్టే పనుల్లో ఓర్పు, సహనం పట్టుదల అవసరం. అనవసరమైన ఆలోచనలతో కాలాన్ని వృథాచేయకండి. *_శివ సహస్రనామ పారాయణ మంచినిస్తుంది_* .

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

కీలక వ్యవహారాలలో తోటివారి ఆలోచనలు మంచి చేస్తాయి. ధర్మసిద్ధి కలదు. కొందరి ప్రవర్తన మీ మనసును చికాకు పరుస్తుంది. అకారణ కలహసూచన ఉంది, కాబట్టి వాదనలకు దూరంగా ఉండటమే మంచిది. *_లక్ష్మీదేవి సందర్శనం మంచినిస్తుంది._* 

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

 వృత్తి, ఉద్యోగాల్లో తోటివారి ప్రోత్సాహంతో అనుకున్నది సాధిస్తారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పట్టుదలతో ముందుకు సాగుతారు. అధికారులను మెప్పించడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది. *_ఇష్టదేవతారాధన శుభం_* 

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_* 

అనుకూలమైన సమయం. బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు. చేపట్టిన పనులను ప్రణాళికబద్దంగా పూర్తిచేసి అందరి ప్రశంసలను అందుకుంటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. *_సుందరకాండ పారాయణం శుభప్రదం._* 

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. *_లక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం_* .

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

శ్రమకు తగిన ఫలితాలుంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న విషయాలను సాగదీయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. *_ఆదిత్యహృదయం పఠించడం మంచిది_* 

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

చేపట్టే పనుల్లో పట్టుదల అవసరం. కుటుంబ సభ్యులతో అభిప్రాయ బేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఎవ్వరితోను వాదోపవాదాలు చేయకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. *_లక్ష్మీధ్యానం శుభప్రదం._* 

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సంఘటనలవల్ల నిరుత్సాహం, విచారం, కలుగుతాయి. శత్రువుల జోలికి పోరాదు. *_దుర్గ ఆరాధన వల్ల మేలు జరుగుతుంది._* 

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

అదృష్టం పడుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. *_ఆంజనేయస్వామి సందర్శనం శుభప్రదం._*

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

శ్రమఫలిస్తుంది. అనవసర విషయాలను సాగదీయకండి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. *_గోవింద నామాలు జపిస్తే మంచిది._* 

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

మనోధైర్యంతో ప్రయత్నించి అనుకున్నది సాధిస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లోపాల్గొంటారు. బంధుమిత్రులను కలుస్తారు. దైవ బలం కాపాడుతోంది. *_విష్ణు ఆరాధన చేస్తే మంచిది._* 

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

చేపట్టేపనుల్లో లాభాలున్నాయి. ఆర్ధిక విషయాల్లో ఒకమెట్టు పైకి ఎదుగుతారు. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. *_ఇష్టదైవ ఆరాధన శుభప్రదం._* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

నేటి పంచాంగం 07.04.2021

 

.నేటి పంచాంగం 07.04.2021

🌹  🌹  ॐ  卐  ॐ  🌹  🌹

🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏

    🌞 *ఏప్రిల్ 7, 2021* 🌝

*_శ్రీ శార్వరి నామ సంవత్సరం_*

*ఉత్తరాయణం*

*శిశిర ఋతువు*

*ఫాల్గుణ మాసం*

*కృష్ణ పక్షం*

తిధి: *ఏకాదశి* తె4.28వరకు

(తెల్లవారితే గురువారం)

వారం: *బుధవారం* (సౌమ్యవాసరే)

నక్షత్రం: *ధనిష్ఠ* తె5.29

యోగం: *సాధ్యం* సా4.49

తదుపరి శుభం

కరణం: *బవ* సా4.46

తదుపరి *బాలువ* తె4.28

ఆ తదుపరి కౌలువ

వర్జ్యం: *ఉ9.23 - 10.59*

దుర్ముహూర్తం: *ఉ11.37 - 12.26*

అమృతకాలం: *రా7.01 - 8.37*

రాహుకాలం: *మ12.00 - 1.30*

యమగండం: *ఉ7.30 - 9.00*

సూర్యరాశి: *మీనం*

చంద్రరాశి: *మకరం*

సూర్యోదయం: *5.54*

సూర్యాస్తమయం: *6.10*

     🌼 *స్మార్త ఏకాదశి* 🌼

           *లోకాః సమస్తాః*

           *సుఖినోభవంతు*

  *సర్వే జనాః సుఖినోభవంతు*

   ☘☘☘🙏☘☘☘

   🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉

Monday, April 5, 2021

కరోనా - నవరసాలు

 😷😷😷😷😷😷😷😷😷


కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి 'నవరసాలు ..


*1) నిమ్మకాయ:* 

రోజు నిమ్మకాయ రసం త్రాగండి. దీనివల్ల విటమిన్ C పెరుగుతుంది. 


*2) బాదo:* 

ఒకరోజు ముందు రాత్రి నానబెట్టిన బాదాంను మరుసటి పొద్దున్న తిన్నండి. విటమిన్ E తో పాటు జలుబు నుండి రక్షిస్తుంది. 


*3)పెరుగు:* 

రోజు పెరుగును తినండి, తేనే కూడా  బాగుంటుంది. ఇది విటమిన్ D తో కూడి వుంటుంది. 


*4) పసుపు:* 

మీ వంటలలో  పసుపును ఎక్కువగా వాడండి.  ఇది ఇమ్యూన్ బూస్టర్.


*5) పాలకూర:* 

ఈ ఆకుకూరల్లో విటమిన్ C దండిగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తిని ఇస్తుంది. 


*6) అల్లం:* 

గొంతులో మంటను, వికారాన్ని తగ్గిస్తుంది. 


*7) వెల్లుల్లి :* 

ఇది ఒక ఆధ్బుతమైన ఔషధం. రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది. 


*8) ప్రతిరోజు వాకింగ్ చేయండి.*

ఆసనాలు,ప్రాణాయామం చేయండి,

మెడిటేషన్ లో కూర్చోండి


*9) ఎండు ద్రాక్ష ( కిస్ మిస్ ) :* 

ఇందులో జింక్, ఐరన్, ఫైబర్ మరియు B12 విటమిన్ కలిగిన పండు. 


*పైన వివరించిన పండ్లు, ఆకుకూరలు, ,వంట దినుసులు మీ ఆహరంలో తప్పకుండా తీసుకోండి.దీనివల్ల మీ శరీరం కరోనా వైరస్ తో ధైరంగా పోరాడే శక్తిని ఇవ్వటమే కాదు అసలు మిమ్మల్ని ఏమీ చేయలేదు...*


😷😷😷😷😷😷😷😷

నేటి పంచాంగం 06.04.2021

 నేటి పంచాంగం 06.04.2021

*卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐* 

🌟 *మంగళవారం, ఏప్రి 06.04.2021 ల్ 6, 2021* 🌟

    *_శ్రీ శార్వరి నామ సంవత్సరం_*

  *ఉత్తరాయణం*   *శిశిర ఋతువు* 

   *ఫాల్గుణ మాసం*  *బహుళ పక్షం* 

తిధి : *నవమి* ఉ5.58వరకు

           తదుపరి *దశమి* తె5.04

వారం : *మంగళవారం* (భౌమ్యవాసరే)

నక్షత్రం : *శ్రవణం* తె5.23 

యోగం : *సిద్ధం* సా6.35

                తదుపరి సాధ్యం 

కరణం  :  *గరజి* ఉ5.58

                 తదుపరి *వణిజ* సా5.31

             ఆ తదుపరి *భద్ర/విష్ఠి* తె5.04

వర్జ్యం   :  *ఉ9.39 - 11.14* 

దుర్ముహూర్తం : *ఉ8.22 - 9.11* &

                        *రా10.52 - 11.39*

అమృతకాలం:  *రా7.07 - 8.41*

రాహుకాలం   :  *మ3.00 - 4.30* 

యమగండం/కేతుకాలం: *ఉ9.00 - 10.30*

సూర్యరాశి: *మీనం*  ||  చంద్రరాశి: *మకరం*

సూర్యోదయం: *5.56* || సూర్యాస్తమయం: *6.10*

 *_సర్వే జనా సుఖినోభవంతు_*

              శుభమస్తు🙏

________________________________________   

           *_గోమాతను పూజించండి_* 

           *_గోమాతను సంరక్షించండి_*

Sunday, April 4, 2021

చదువుకున్న మూర్ఖులు

 చదువుకున్న మూర్ఖులు

నేటి రాశిఫలాలు 05.04.21

  05-04-2021 సోమవారం నేటి రాశిఫలాలు


మేషం : దైవ, సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంగారు, వెండి, వస్త్ర వ్యాపార రంగాల వారికి మెళకువ అవసరం. ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. చేతి వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తులకు దైనందిన కార్యక్రమాలు యధావిధిగా సాగుతాయి. 


వృషభం : వైద్యులు, ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉపాధ్యాయులు మార్పులకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడుల విషయంలో దూకుడు మంచిదికాదు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోనివారికి మార్పులు అనుకూలిస్తాయి. బేకరీ, స్వీట్స్, తినుబండారాల వ్యాపారులకు, తయారీదారులకు ఒత్తిడి పెరుగుతుంది. 


మిథునం : ఆలయం సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు సానుకూలమవుతుంది. విద్యార్థులకు సంతృప్తి కానవస్తుంది. ఎల్ఐసీ ఏజెంట్లకు, బ్రోకర్లకు అధికారుల నుండి ఒత్తిడి తప్పదు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అధిక పర్యటనల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. 


కర్కాటకం : ఆర్థిక విషయాల్లో అనుకోని ఇబ్బందుల ఎదురయ్యే సూచనలున్నాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఒత్తిడి అధికం. గృహ నిర్మాణాలు, మరమ్మతులలో వ్యయం అధికం. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ద వహించండి. స్త్రీలకు అయిన వారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. 


సింహం : ఉద్యోగస్తులకు ప్రయాణాలలో ఎక్కువ చికాకులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. రావలసిన ధనం అందటంతో మానసికంగా కుదుటపడతారు. ఉమ్మడి ఆర్థిక వ్యవహారాల్లో మాటపడాల్సి వస్తుంది. విదేశీ వ్యవహారాలు, విద్య, రవాణా, ప్రణాళికలు, బోధన, ప్రకటనల రంగాల వారు ఆచితూచి వ్యవహరించండి. 


కన్య : కొత్తపనులు ప్రారంభించడంలో అడ్డంకులు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే  వాయిదాపడతాయి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. 


తుల : మార్కెట్ రంగాల వారికి నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. విదేయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త రుణాలు, పెట్టుబడుల కోసం యత్నిస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కొంటారు. ఉమ్మడి కుటుంబ విషయాలలో మాట పడాల్సి వస్తుంది. 


వృశ్చికం : దైవ, సేవ, పుణ్య కార్యక్రమాల పట్ల ఆసక్తితో పాటు ధనం అధికంగా వెచ్చిస్తారు. బీమా, పెన్షన్, వ్యవహారాలు క్రయ విక్రయాలు చిక్కుల్లో ఎదురవుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో మెళకువ వహించండి. పాత మిత్రులతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రయాణాలకై చేయుయత్నాలు ఫలిస్తాయి. 


ధనస్సు : ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు వ్యవహరిస్తారు. బంధువుల మధ్య అనురాగ్య వాత్సల్యాలు పెంపొందుతాయి. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి. 


మకరం : రియల్ ఎస్టేట్ వ్యాపారుకు ఒత్తిడి తప్పదు. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. లాయర్లకు చికాకులు తప్పవు. ఆడిటర్లకు పురోభివృద్ధి కానవస్తుంది. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టుట వల్ల దేనిలోనూ ఏకాగ్రత వహించలేరు. ఇతరుల దైవ సేవా కార్యక్రమాలలో మీపట్ల ఆకర్షితులవుతారు. 


కుంభం : అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. వృత్తుల వారికి సదావకాశాలు, ప్రజా సంబంధాలు బలపడతాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. మీ ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది. సహకార సంఘాలలో వారికి రాజకీయాలలో వారికి చికాకు తప్పదు. 


మీనం : ప్రభుత్వ సంస్థల్లో వారికి ఆశించినంత గుర్తింపు లభించదు. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. దీర్ఘకాలిక రుణాలను తీర్చి ఊపిరి పీల్చుకుంటారు. బంధు మిత్రులతో పట్టింపులెదుర్కొంటారు. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. 

             💦🐋🐥🐬💦

నేటి పంచాంగం 05.04.21

 నేటి పంచాంగం 05.04.21

🕉️ శుభమస్తు


*తేది : 5, ఏప్రిల్ 2021*


ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా


సంవత్సరం : శార్వారినామ vvv

M job n c? సంవత్సరం


ఆయనం : ఉత్తరాయణం


మాసం : ఫాల్గుణమాసం


ఋతువు : శిశిర ఋతువు


కాలము : శీతాకాలం


వారము : సోమవారం


పక్షం : కృష్ణ (బహుళ) పక్షం


తిథి : నవమి(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 2 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 2 గం॥ 21 ని॥ వరకు)


నక్షత్రం : ఉత్తరాషాఢ(ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 9 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 2 గం॥ 7 ని॥ వరకు)


యోగము : శివము


కరణం : తైతిల


వర్జ్యం : (ఈరోజు ఉదయం 10 గం॥ 8 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 11 గం॥ 43 ని॥ వరకు)


అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 7 గం॥ 43 ని॥ నుంచి  ఈరోజు రాత్రి 9 గం॥ 18 ని॥ వరకు)


దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 42 ని॥ నుంచి  ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 31 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 11 ని॥ నుంచి  ఈరోజు సాయంత్రం 4 గం॥ 0 ని॥ వరకు)


రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 39 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 9 గం॥ 11 ని॥ వరకు)


గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 50 ని॥ నుంచి  ఈరోజు సాయంత్రం 3 గం॥ 22 ని॥ వరకు)


యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 45 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 12 గం॥ 17 ని॥ వరకు)


సూర్యోదయం : ఉదయం 6 గం॥ 7 ని॥ లకు


సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 29 ని॥ లకు


సూర్యరాశి : మీనము


చంద్రరాశి : ధనుస్సు

           💦🐬🐥🐋💦

ఆడవాళ్లు - ఆభరణాలు

 ఆడవాళ్లు - ఆభరణాలు

ఏ రోజు ఏ ఆభరణాలు ధరిస్తే శుభం..?


మహిళలు నిత్యం ఆభరణాలు ధరిస్తారు. సందర్భాన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి. అయితే గ్రహాలను అనుసరించి ఆభరణాలు ధరించాల్సి ఉంటుంది. ఏ రోజు ఏ రకమైన నగలు ధరిస్తే మంచిదో తెలుసుకోవడం ముఖ్యం.


వారంలో రోజుకో గ్రహాధిపతి ఉంటాడు. ఆదివారానికి సూర్యుడు అధిపతి అయితే, శుక్రవారానికి శుక్రుడు అన్నట్టు.. ఆయా వారాలని బట్టి ఆ రోజుకి ఉండే గ్రహాధిపతిని అనుసరించి ఏ నగలు ధరించాలో తెలుసుకోవాలి. నిత్యం నవగ్రహాలను అనుసరించి ఆభరణాలు ధరించడం ద్వారా శుభఫలితాలుంటాయి.


అయితే బంగారంతో పొదిగించిన ఆభరణాలు లేకపోయినా.. తమ తమ స్థోమతకు తగినట్లు ఇప్పుడు దుకాణాల్లో అమ్మబడే ఆభరణాలతో ప్రతిరోజూ అలంకరణ చేసుకోవడం మంచిది.


*ఇక ఏ వారంలో ఎలాంటి ఆభరణాలు ధరించాలో తెలుసుకుందాం.*


*ఆదివారం* (సూర్యగ్రహానికి ప్రీతికరమైన రోజు) కెంపులతో చేసిన నగలు.. చెవిపోగులు, హారాలు మొదలగునవి ధరించడం శుభప్రదం. దీనిద్వారా నేత్ర సంబంధిత వ్యాధులు, శరీర తేజస్సు, ప్రకాశవంతం పొందవచ్చును.


*సోమవారం* (చంద్రగ్రహానికి ప్రీతికరమైన రోజు) ముత్యాలతో తయారు చేసిన ఆభరణాలు.. హారాలు, గాజులను వేసుకోవడం మంచిది. ముత్యాలతో తయారయ్యే గాజులను, చెవిపోగులను వాడటం ద్వారా మనశ్శాంతి, అనుకున్న కార్యములో విజయం చేకూరుతుంది.


*మంగళవారం* (కుజ గ్రహానికి ప్రీతికరమైన రోజు) పగడాలతో చేసిన ఆభరణాలు.. దండలు, ఉంగరాలను వాడటం మంచిది. పగడాలతో తయారైన ఉంగరాలను, దండలను వాడటం ద్వారా కుటుంబ సంక్షేమం చేకూరటం, ఈతిబాధలు తొలగిపోవడం వంటి ఫలితాలుంటాయి.


*బుధవారం* (బుధ హానికి ప్రీతికరమైన రోజు) పచ్చల పతకాలు, గాజులు మొదలగునవి వాడటం మంచిది. విద్యాకారకుడైన బుధునికి ప్రీతికరమైన ఈ రోజున విద్యార్థులు పచ్చని రంగుతో కూడిన ఉంగరాలు, స్త్రీలతే హారాలు వినియోగించడం మంచిది. దీంతో బుద్ధికుశలతలు పెరగడం, ధనలాభం, కార్యసిద్ధి చేకూరుతుంది.


*గురువారం* బృహస్పతి (గురుభగవానుడు) కోసం పుష్యరాగముతో తయారైన చెవిపోగులు, ఉంగరాలు వంటి ఆభరణాలు ధరించడం మంచిది. దీంతో గురుగ్రహ ప్రభావంతో అవివాహితులకు కళ్యాణం జరగడం, వ్యాపారాభివృద్ధి, కార్యసిద్ధివంటి ఫలితాలుంటాయి.


*శుక్రవారం* శుక్రుని (శుక్రగ్రహం) కోసం వజ్రాల హారాలు, ముక్కుపుడక వాడటం ద్వారా స్త్రీలకు సౌభాగ్యం, ఆర్థిక సమస్యలు తొలగిపోవడం, పదోన్నతులు, అనుకున్న కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. లక్ష్మిదేవి అనుగ్రహం కూడా పొందినవారవుతారు.


*శనివారం* (శనిగ్రహం) శనికోసం నీలమణి, మణిహారాలు వంటి ఆభరణాలు ధరించడం మంచిది. దీనిద్వారా శనిగ్రహ ప్రభావంతో తలెత్తే సమస్యలు కొంతవరకు సమసిపోతాయి. నీలమణితో తయారైన హారాలు చెవిపోగులు, ఉంగరాలు ధరించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయని రత్న శాస్త్రం చెబుతోంది.

ఫిన్లాండ్‌ 100/100

 ఫిన్లాండ్‌ 100/100

బిల్డింగ్ కి నాకు ఏదో అనుబంధం ఉంది

 బిల్డింగ్ కి నాకు ఏదో అనుబంధం ఉంది

పిల్లలు - క్రమశిక్షణ

 🍃🌟  *తల్లిదండ్రులకు చేతులు జోడించి నమస్కరించి చేసుకుంటున్న విన్నపం ఏమనగా..*

 

           *అయ్యా 🌷*


✍ *క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్ పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా, వారిప్రవర్తనలో మార్పు రావడం లేదు.  ఉపాధ్యాయులు చూస్తూ, ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు.*


*తల్లిదండ్రులకు  తమ పిల్లలపై  శ్రద్ద, నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు.*


*క్రమశిక్షణ మాటలతో రాదు.  కొద్దిపాటి దండన,  భయభక్తులు ఉంటేనే వస్తుంది.*


*పిల్లలకి బడిలో భయంలేదు. ఇంట్లో భయం లేదు. అందుచేతనే సమాజం ఈరోజు భయభ్రాంతులకి గురి అవుతున్నది. వాళ్ళే ఈ రోజుల్లో రౌడీలుగా తిరుగుతున్నారు.  అభం శుభం తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు.*


*గురువుని గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతుంది.  ఇది నిజం.*


*గురువంటే భయం లేదు,  గౌరవం లేదు. ఇక చదువు, సంస్కారం ఎట్లా వస్తుంది?*


*కొట్టొద్దు!తిట్టొద్దు! బడికి రానివాడ్ని ఎందుకు రావట్లేవు అని అడగొద్దు!  చదవాలని, హోమ్ వర్క్ అని, కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు! ఒకవేళ కొట్టినచో బడి ముందు ధర్నా! టీచర్ పై దాడి! పోలీస్ కేసు!*


*6వ తరగతి నుండే కటింగు స్టైలు, చినిగినజీన్స్ గోడల మీద కూర్చోవడం.  వెళ్ళేవారిని వచ్చేవారిని కామెంట్స్ చేయడం.  అరేయ్ సార్ వస్తున్నారురా! అని అంటే, వస్తే రానియ్ అనే పరిస్తితి.*


*దరిద్రం ఏంటంటే,  కొంతమంది తల్లిదండ్రులే మావాడు చదవకున్నా ఏమికాదు, మావాడిని మాత్రం కొట్టవద్దు అంటున్నారు.*


*ఇంకొక విషయం ఏమిటంటే ఎవరు బాబు నీకు కటింగ్ చేయించినది అంటే మా నాన్న సార్ అంటున్నారు*


*ఇదే అలుసుగా పిల్లలు టీచర్ ఏదన్నా అనగానే పోలీస్ స్టేషన్కు పోతున్నారు.* 


*పెన్ను ఉంటే పుస్తకం ఉండదు, పుస్తకం వుంటే పెన్ను వుండదు.  కొనరు, తెచ్చుకోరు.  భయం ఉండాలని రెండు దెబ్బలు వేద్దామంటే ఎటునుంచి పోయి ఎటువస్తాదో అని భయం.  ఇవన్నీ చూస్తుంటే పిల్లల కంటే సార్లకే భయం ఎక్కువగా వుంది.*


*కొట్టకుండా, తిట్టకుండా, భయం లేకుండా చదువు వస్తాదా?*


*భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందంట!  అలానే ఉంది నేటి పిల్లల వ్యవహారం.*


*స్కూల్లో తప్పుచేసినా కొట్టకూడదు, తిట్టకూడదు, కనీసం మందలించకూడదు ప్రేమతో చెప్పాలట.  ఇదెలా సాధ్యమ్?*


*మరి సమాజం ఎందుకు అలా చేయదు? మొదటి తప్పేకదా అని ఊరుకుంటుందా?*


*మంచి నేర్పేవాళ్ళకి (స్కూల్లో) హక్కులుండవు.  ప్రవర్తన మార్చుకో అని టీచర్ చిన్నప్పుడే కొడితే నేరం.  వాడు పెద్దయ్యాక అదే తప్పు చేస్తే మరణం.*


       *తల్లిదండ్రులకు నా మనవి...  పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయులతోనే జరుగుతుంది.  ఎక్కడో...  ఒకటో అరో...   ఒకరిద్దరు టీచర్లు చేసిన తప్పులకు,  అందరి ఉపాధ్యాయులకు ఆపాదించవద్దు.  99శాతం టీచర్లు పిల్లలు బాగుండాలనే వ్యవహరిస్తారు.  ఇది యదార్ధం.  ఇకనైనా ప్రతీ చిన్న విషయానికి టీచర్లను నిందించవలదు.

       

          మేము చదువుకునే రోజుల్లో కొంతమంది టీచర్లు మమ్మల్ని దారుణంగా కొట్టేవారు.  అయినా ఏనాడు మా పేరెంట్స్ వచ్చి టీచర్లను నిలదీయలేదు. మా బాగుకోసమే అని అనుకునేవారు.

*మొక్కయి వంగనిది మానై వంగున*!!!!!

        

*ముందుగా తల్లిదండ్రులు టీచర్ అంటే గౌరవం, భయం ఉండేటట్లు పిల్లలకు మానసిక తర్ఫీదు ఇవ్వాలని మనవి.

ఫోటోలు ఫ్రీ.......

 ఫోటోలు ఫ్రీ....... 


కస్టమర్: 2 రోజుల పెళ్ళి ఫోటోలు తీయడానికి ఎంత ప్యాకేజీ 📦 తీసుకుంటారు.


నేను: 60000/-☺️


కస్టమర్: అంతనా.😳.. ఒక్క ఆల్బమ్, వీడియో తియ్యటానికి ఎందుకంత ధర తీసుకుంటున్నారు...?


నేను: మీరు ఎంత అయితే బాగుంటది అనుకుంటున్నారు.☺️


కస్టమర్: 7500/- అయితే అదే ఎక్కువ. ఫోటోలు తీసి ఆల్బమ్ చెయ్యటమే కదా..😏


నేను: అవును కదా.. అది మీరు కూడా చేసుకోవచ్చు.☺️


కస్టమర్: అదెలా... తియ్యటం రాదు కదా.? ☹️


నేను: 7500/- నాకు ఇవ్వండి. నేను మీకు నేర్పిస్తాను😊. మీకు 52500/- మిగిలిపోతాయి👍🏻. మరియు ఫోటోగ్రఫీ నాలెడ్జి కూడా వస్తుంది.👌🏻


కస్టమర్: ఓకే, అలా అన్నావ్ బాగుంది.👍🏻


నేను: సరే మరి. స్టార్ట్ చెద్దమ్.

ముందుగా ఒక కెమెరా తీసుకోండి (180000)

లెన్స్ (120000)

లైట్స్ సెటప్ ( 30000+)

Extra బ్యాటరీలు, బ్యాగులు మెమొరి కార్డులు వగైరా (15000)


కస్టమర్: ఓరి దేవుడా😳.. ఇవన్నీ నాదగ్గర లేవుగా.... నాకు కేవలం ఆల్బమ్, వీడియో కావాలి. ఇవన్నీ కొని తరవాత నేనేం చేస్కోవాలి.


నేను: క్షమించాలి,  ఇంకోవిషయం మరిచిపోయాను. వీడియో కెమెరా మరియు దాని సెటప్ విషయం. వీటిని కూడా కొనాలి.



కస్టమర్: నిజమా ? ఇంతుందా...?


మీరు ఇచ్చే ధర కేవలం ఆల్బమ్, వీడియో కి కాదు. 

మా నాలెడ్జి కి

మా అనుభవానికి

మా నేర్పుకి

మా ఓర్పుకి

మా సర్వీసుకి

మా సమయస్పూర్తికి

మా మర్యాదకి


మీ తీపి జ్ఞాపకాలను.. మీకు సమయం లేకున్నా మీ వెంట పడి... మిమ్మల్ని బతిమాలి... బామాలి... మిమ్మల్ని మెప్పించి.... ఒప్పించి... మీ ఇంట్లో... మీ గోడకు... మీ ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ తగిలిస్తే మీ ఇంటికొచ్చి పోయే మీ బంధువులు మీ ఫ్యామిలీ ఫోటో చూసి సంబర పడుతుంటే అది చూసి మీరు సంబరపడాలని మీ సంబరంలో మా సంబరాన్ని వెతుక్కునే మా వెర్రి తనానికి మీరు ఎంత ఇచ్చిన తక్కువే....


దయచేసి ఏ పనిని తక్కువగా అంచనా వేయకండి. కొందరి కుటుంబాలలో

ఎన్ని కుటుంబ కలహాలు ఉన్నా మీరంతా కలిసి ... నవ్వుతూ... కలకాలం సంతోషంగా  ఉంటూ అప్పుడప్పుడు మమ్మల్ని గుర్తు చేసుకోవాలి అని రోజు ఆ భగవంతుణ్ణి కోరుకునేది ఒక్క ఫోటోగ్రాఫర్ మాత్రమే. నలుగురికి సంతోషాన్ని పంచే ఈ వృత్తిని ఎంచుకున్నందుకు నాకు చాలా గర్వంగా కూడా ఉన్నది.🙏

నేటి అక్షర వార్తలు - 04.04.2021

నేటి అక్షర వార్తలు (04.04.2021)
ఫాల్గుణ మాసం సప్తమి ఆదివారం

1969 ఏప్రిల్ 04న డా.డెంటన్ కూలీ మొట్టమొదటి కృత్రిమ హృదయాన్ని ఉపయోగించారు

1975 ఏప్రిల్ 04న *మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపించబడింది*

ఆధ్యాత్మిక తెలుగు రచయిత్రి *చల్లా సత్యవాణి జననం* 

అమెరికాకు చెందిన పాస్టర్, ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు
*మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మరణం*

నిజామాబాద్ జిల్లాకు చెందిన అపర దానకర్ణుడిగా పేరుపొందిన వ్యక్తి *రాజా నర్సాగౌడ్ మరణం*

దేశంలో గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 89,129 కరోనా కేసులు, 714 మంది మృతి

తెలంగాణను హడలెత్తిస్తున్న కరోనా.. మళ్లీ వెయ్యి దాటిన పాజిటివ్ కేసులు.. శాస్త్రవేత్తల వార్నింగ్

కోవిడ్‌ సంక్షోభంలో సెలూన్‌ షాపు యజమాని ఔదార్యం.. ప్రైవేటు టీచర్లకు ఉచిత సేవలు

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం.. వచ్చే వారం నుంచి టెన్త్ ప్రత్యక్ష తరగతులు

హైదరాబాద్ మేడ్చల్ లోవిధులు నిర్వహిస్తోన్న పారిశుధ్య కార్మికులపైకి దూసుకొచ్చిన టిప్పర్, అక్కడికక్కడే దశరథ్ మ‌ృతి

రెండోదఫా స్కౌట్స్ అండ్ గైడ్స్‌ రాష్ట్ర చీఫ్ కమిషనర్ గా ఎన్నికైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

జాఫ్నాలో పర్యటించిన మొట్టమొదటి ప్రధాని మోదీ.. తమిళులకు అండగా ఉంటాం.. ఈరోడ్ ఎన్నికల సభలో నడ్డా

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ

సీఎం కేసీఆర్ ముందుచూపు వల్లే తెలంగాణలో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతూ దేశానికి పాఠాలు నేర్పిస్తుంటే కేంద్రం మాత్రం కుంటి సాకులతో రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులకు కోత పెడుతోందన్నారు మంత్రి కేటీఆర్. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కూడా రైతులకు 24గంటల ఉచిత విద్యుత్‌ అందించడం లేదన్నారు

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు జవాన్లు మృతి.. 12 మంది భద్రతా సిబ్బందికి గాయాలు

తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక ప్రకటన.. ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా

కరోనాను అరికట్టేందుకు దేశ రాజధానిలో ‘విశ్వశాంతి మహాయజ్ఞం’.. పూజలు, శ్లోకాలతో మారుమ్రోగిన ఆలయ ప్రాంగణం

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. 24గంటల్లో అరలక్ష మార్కుకు చేరువలో కేసులు

రూ.100 ఇస్తే ఏం చేస్తావు?

 రూ.100 ఇస్తే ఏం చేస్తావు? ఆ స్టూడెంట్ ఆన్సర్ కి టీచర్ ఫిదా..! 20 ఏళ్ల తర్వాత ఏమైందంటే?*

 


బయట జోరుగా వర్షం పడుతుంది.తరగతి గదిలో టీచర్ పాఠం బోధిస్తున్నారు. పిల్లలు శ్రద్దగా వింటున్నారు. కానీ వాతావరణం డల్ గా ఉండడంతో ఆ ఎఫెక్ట్ పిల్లల ముఖాల్లో కూడా కనిపిస్తుంది.వాళ్ల మైండ్స్ ని జనరేట్ చేయాలనే ఉద్దేశంతో  జేబులో నుండి వందరూపాయలు తీసి ఇప్పుడు నేను ఈ వందరూపాయలు ఇస్తే మీరేం చేస్తారు అంటూ ప్రశ్నించారు టీచర్.


నేను బొమ్మకారు కొనుక్కుంటా అంటూ మెరిసే కళ్లతో సమాధానం చెప్పాడొక విద్యార్ధి నేను ఫ్రెండ్స్ తో కలిసి సమోసాలు కొనుక్కుని తింటాను అంటూ పెదవులు తడుపుకుంటూ చెప్పాడు మరో విద్యార్ధి. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం సర్,నేను ఆ డబ్బులతో క్రికెట్ బ్యాట్ కొనుక్కుంటాను అన్నాడు మరొక విద్యార్ధి.


*నేను మా అమ్మకి కళ్లజోడు కొంటాను* సర్ అని”  చివరగా ఒక విద్యార్ధి  సమాధానం ఇచ్చాడు *ఆశగా వందరూపాయల వైపు చూస్తూ. వెంటనే టీచర్ ఆ విద్యార్ధి వైపు తిరిగి , మీ అమ్మకి నువ్వెందుకు కళ్లజోడు కొనడం? ఆ పని మీ నాన్న చేస్తాడు. కాబట్టి ఈ వందరూపాయలతో నీకోసం నువ్ ఏం కొనుక్కుంటావ్ అని రెట్టించి అడిగాడు*


*నాకు మా నాన్న లేడు సర్,చనిపోయాడు.మా అమ్మ టైలర్ పని చేసి నన్ను మా చెల్లిని చదివిస్తుంది . బట్టలు కుట్టేటప్పుడు మా అమ్మ కళ్లు కనపడక చాలా ఇబ్బంది పడుతుంది* తను సంపాదించినది మా చదువులకి , తిండికే సరిపోవట్లేదు . అందుకే కళ్లజోడు కొనుక్కోవట్లేదు. మీరు ఈ డబ్బులిస్తే మా అమ్మకి కళ్లజోడు కొంటాను అంటూ మళ్లీ అడిగాడు ఆశగా.


*కుర్రాడి చెప్పిందంతా విన్నాక టీచర్ కళ్లు చెమర్చాయి . కన్నీళ్లను తుడుచుకుంటూ సరే ఇస్తాను, కానీ ఒక షరతు అంటూ ఆగాడు. చెప్పండి సర్ మీరేం చెప్పినా చేస్తాను , మా అమ్మకి కళ్లజోడు కొనిపెట్టడం కంటే నాకు ఏది ఎక్కువ కాదు అంటూ హుషారుగా అన్నాడు*


*వందరూపాయలు ఆ కుర్రాడి చేతిలో పెడుతూ రేపు నువ్ పెద్దయ్యాక పెద్ద ఆఫీసర్ అవుతావు కదా ,అప్పుడు నాకు ఈ వందరూపాయలు తిరిగి ఇచ్చేయాలి ఇదే ఆ షరతు అన్నాడు. అంతేకాదు నువ్ జీవితంలో చాలా గొప్పవాడివి కావాలి,అవుతావు అంటూ దీవించాడు*


*ఈ సంఘటన జరిగిన 20 ఏళ్ల తర్వాత ఆ  స్కూల్ ముందు ఒక కార్ వచ్చి ఆగింది. ఆ రోజు కూడా వర్షం కురుస్తుంది పదిహేనేళ్ల క్రితం జ్ణాపకాన్ని కళ్లముందు నిలబడానికా అన్నట్టుగా. తరగతి గదిలో టీచర్ పాఠం చెప్తున్నారు*


*ఎక్స్క్యూజ్ మి సర్ అంటూ వినపడిన ద్వారం వైపు ఎస్ అంటూ సమాధానం *ఇస్తూ టీచర్ తలతిప్పారు. తనతో పాటు స్టూడెంట్స్ కూడానూ. మీరిచ్చిన వందరూపాయలు సర్ అంటూ , ఆ రోజు తన తల్లి కళ్లజోడు కోసం ఇచ్చిన వందరూపాయల్ని తిరిగిస్తూ ,*పాదాభివందనం చేసిన ఆ విధ్యార్ధి ఇప్పుడు *ఒక జిల్లా కలెక్టర్*


*అవును ఒక మనిషి ఎప్పుడూ తన కోసం కాకుండా తన దేశం *కోసం,తన కుటుంబం కోసం ఆలోచిస్తూ, దయాగుణం మానవతా హృదయం కలిగి ఉంటే ఎప్పటికైనా సక్సెస్ అవుతారు*

*మనలోని ఉన్నతమైన లక్షణాలు మనల్ని గొప్పగా ఎదిగేలా*,

మనలోని అవలక్షణాలే మనల్ని జీవితంలో పైకి ఎదగకుండా వెనక్కి లాగుతుంటాయి  అనడానికి *ఈ స్టోరి ఒక చక్కటి ఉదాహరణ*

మనిషి ఇరుక్కున్నాడు...

🤔మనిషి ఇరుక్కున్నాడు...
గ్లోబలైజేషన్ లో...🤔

👉డ్రమ్ముల మోతను సంగీతమంటున్నారు.!

👉పీలికబట్టల్ని 
వస్త్ర ధారణ అంటున్నారు.!

👉భౌతిక అకర్షణను ప్రేమని పిలుస్తున్నారు.!

👉సహజీవనాన్ని సంసారమంటున్నారు.!

👉గ్రాఫిక్ గిమ్మిక్కులను సినిమా అంటున్నారు.!

👉డూప్ ల పోరాటాన్ని
హీరోయిజం అంటున్నారు.!

👉పదవుల పోరాటాన్ని
ప్రజాస్వామ్యమంటున్నారు

👉అధికార ఆరాటాన్ని రాజకీయమంటున్నారు.!

👉ఆస్తుల పంపకాన్ని కుటుంబం అంటున్నారు.!

👉సరదాలను సంస్కృతి అంటున్నారు.!

👉భుక్తి మార్గాన్ని చదువు అంటున్నారు.!

👉కోరిన కోర్కెలు తీరిస్తేనే... దేవుడంటున్నారు.!

👉ఆస్తి ఉంటేనే... గొప్పవాడు అంటున్నారు.!

👉మందు పోయిస్తేనే...
మిత్రుడు అంటున్నారు.!

👉కట్నం తెస్తేనే...
భార్య అంటున్నారు.!

👉సొమ్ములు తెస్తేనే...
సంసారం అంటున్నారు.!

👉కాసులు తెస్తేనే...
కాపురం అంటున్నారు.!

👉 నిజాయితీగా ఉంటే... అసమర్ధుడంటున్నారు.!

👉 సక్రమంగా ఉంటే... అమాయకుడంటున్నారు.!

👉అసత్యాలు మాట్లాడితే... 
బ్రతక నేర్చిన వాడంటున్నారు.!

👉నిజం పలికితే...
బ్రతక నేర్వని వాడంటున్నారు.!

👉న్యాయబద్ధంగా ఉంటే... 
ఎలా బ్రతుకుతాడో అంటున్నారు.!

👉అన్యాయంగా బ్రతికినా...
ఎంచక్కా ఉన్నాడంటున్నారు.!

👉అన్యాయాన్ని ఎదిరిస్తే...
అతనికెందుకు అంటున్నారు.!

👉నిజాయితీగా బ్రతికితే... కూడుపెడుతుందా అంటున్నారు.!

👉మాయకమ్మిన జీవితాన్ని శాశ్వతమనుకుంటున్నారు.!

👉మరణమనే మహా సత్యాన్ని విస్మరిస్తున్నారు.!

👉 పరిస్థితులకు అనుగుణంగా. పాత అర్ధం చెరిగిపోయి,
ప్రయోజనాలకు అండగా...
పరమార్ధం ఆవిర్భవిస్తోంది.!

🤔స్వార్ధ కాంక్షాణుగుణంగా... విపరీతార్ధం ఆవిష్కృతమవుతోంది.!🤔

*ఇదే గ్లోబలైజేషన్ మహిమ అంటే*

🔥 టెక్నాలజీ పెరిగింది...
🔥 సౌకర్యం పెరిగింది...
🔥 విలాసం పెరిగింది...
🔥 విజ్ఞానం పెరిగింది...
🔥 కాలుష్యం పెరుగింది...
🔥 ఖర్చు పెరిగింది...
🔥 కల్తీ పెరిగింది...
🔥 రసాయన బంధం పెరిగింది...
🔥 అన్నీ పెరిగాయి...

కానీ! *పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు*  
*మన ఆయుష్ ప్రమాణం మాత్రం 50% పైగా తగ్గింది*

*సర్వే జనా సుఖినోభవంతు*

Saturday, April 3, 2021

ఉన్నది చాలదా?

       ఉన్నది చాలదా? 

నిత్యజీవితంలో ఉన్నదానితో ఆనందపడడమే సంతృప్తి...ఒక రోజు ఒక పెద్ద మనిషి ఓ బ్యాంకులోంచి డబ్బులు తీసుకుని డబ్బుల పెట్టెను భుజాన వేసుకుని ద్విచక్రవాహనంలో వెళ్తున్నాడు, ఆ పెట్టెలో వంద రూపాయల కట్టలు దాదాపు వంద ఉన్నాయి. 

అయితే మార్గమధ్యంలో గతుకుల రోడ్డుపై వెళ్తుండడంతో పెట్టె మూత కొద్దిగా తెరచుకుంది, అందులోంచి ఓ వంద రూపాయల కట్ట కింద పడిపోయింది...

అది చూసుకోకుండానే అతను వేగంగా వెళ్ళిపోతున్నాడు, కింద పడిన నోట్ల కట్టలోంచి ఒక్క నోటు మాత్రం బయటికొచ్చి గాల్లో ఎగిరెళ్ళి కాస్తంత దూరంగా పడిపోయింది...ఆ నోటు పడిన పక్కగా ఒకతను నడుచుకుంటూ వచ్చాడు, అతను ఆ ఒక్క నోటూ తీసుకుని దగ్గర్లో ఉన్న ఇరానీ కేఫ్‌కి వెళ్ళాడు...ప్లేటు దోసె, ప్లేటు ఇడ్లీ తిని, ఒక కాఫీ తాగాడు, ఆ తర్వాత అక్కడికి దగ్గర్లో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళాడు, అక్కడి హుండీలో ఓ పది రూపాయల నోటు వేసి, దేవుడికి కృతజ్ఞతగా దణ్ణం పెట్టుకున్నాడు, సంతోషంతో ఇంటికి చేరాడు...పడిపోయిన నోట్ల కట్టలో 99 అక్కడే ఉన్నాయి, ఆ దార్లో కాస్సేపటికి వేరే ఒకడు వచ్చాడు. అతను ఆ నోట్ల కట్ట తీసుకున్నాడు, వెంటనే లెక్కపెట్టాడు, వంద రూపాయల నోట్లు 99 ఉన్నాయి, మళ్ళీ మళ్ళీ లెక్కించాడు, ఎన్నిసార్లు లెక్కించినా 99 ఉన్నాయి...


బ్యాంకులో 99 నోట్లున్న కట్ట ఇవ్వరు, కనుక మిగిలిన నోటు ఆ పక్కనే ఎక్కడో పడి ఉండవచ్చని అనుకుని వెతకడం మొదలుపెట్టాడు. చాలాసేపు వెతికాడు, కానీ ఫలితం లేకపోయింది, అయినా వెతుకులాట మానలేదు.ఈ కథను చెప్పిన ఓ గురువు ఫకాలున నవ్వాడు. ఒక్కనోటు దొరికిన వ్యక్తి దర్జాగా హోటల్‌ కు వెళ్ళి ఇడ్లీ తిన్నాడు, కాఫీ తాగాడు, కానీ 99 నోట్లు దొరికిన వ్యక్తి వాటిని ఖర్చు పెట్టుకోక మరో నోటు కోసం వెతకడం మొదలు పెట్డాడు...

 నీతి :మనం ఈరోజు లభించిన దానితో ఉన్నదానితో అనుభవించము... దానితో తృప్తిపడము లేని దానికోసం బుర్రలు పాడుచేసుకుంటాము, ఉన్నదాని పట్ల శ్రద్ధ ఉండదు...దేహం ఓ వైపు లాగుతుంటే మనసు మరోవైపు పోతుంటుంది, ఈ రెండింటి మధ్య సమన్వయం లేకుంటే ఎంతున్నా అసంతృప్తి తప్పదు, సంతృప్తి వుండదు.

Thursday, April 1, 2021

తమలపాకులు ఎందుకు వాడుతారో తెలుసా..?

 తమలపాకులు   ఎందుకు వాడుతారో మీకు తెలుసా..? 

కర్మకాండలు, పెళ్లిళ్లకు ఎందుకు వాడుతారు.. ఎప్పుడైనా ఆలోచించారా..?


Betel Leaves Benefits : సనాతన భారతీయ చరిత్రలో ఆయుర్వేదానికి ప్రత్యేక చరిత్ర ఉంది. ఎందరో మహానుభావులు పలు వ్యాధులకు చికిత్సల గురించి వివరించారు. వివిధ రకాల మొక్కలు, ఆకులు, వేళ్లను పరిష్కారంగా సూచించారు. అయితే కర్మకాండలు, పెళ్లి్ళ్లు, శుభకార్యాలు, పండుగలు ఏది జరిగినా కచ్చితంగా ఉండాల్సిన ఆకు తమలపాకు..



ఏ ఆకుకు ఇంత ప్రాధాన్యం లేదు.. దేవుడి దగ్గర కూడా పెట్టే ఏకైక ఆకు తమలపాకు. ఎందుకంటే ఈ ఆకులో శరీర రక్షణ వ్యవస్థను కాపాడే గుణం ఉంటుంది. ఎందుకంటే ఫంక్షన్లు, పండుగలు, పెళ్లిళ్లు జరిగినప్పుడు జనాలు ఎక్కువగా దగ్గర దగ్గర ఉంటారు. తద్వారా ఒకరు పీల్చిన గాలి మరొకరు పీల్చడం వల్ల అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంటుంది.


అయితే తమలపాకులను అక్కడ ఉంచడం వల్ల అందులోని కెమికల్స్ వీటిని అరికట్టడంతో తోడ్పడుతాయి. అలాంటి ఔషధ గుణాలు కలిగిన ఆకును పండితులు ప్రాచీన రోజుల్లోనే గ్రహించి అన్ని కార్యాల్లో వినియోగించేలా చేశారు. ఒక ఆచారంగా మనం ప్రతి కార్యంలో తమలపాకును ఉపయోగిస్తున్నాం కానీ అసలు విషయం ఇది. అసలు తమలపాకులో ఉండే ఔషధ గుణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.




తమలపాకు తెల్లరక్త కణాలు, లింపోసైట్లను విపరీతంగా పెంచడంలో దోహదం చేస్తుంది. అంతేకాకుండా ఎటువంటి ఇన్‌ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది. మోనోసైట్లను పెంచి శరీరానికి చెడు చేసే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అంతేకాకుండా తమలపాకులను తింటే తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అందుకే చాలామంది తాంబూలం, పాన్ రూపంలో దీనిని తీసుకుంటారు. ఎందుకంటే నూనెలతో కూడిన వంటకాలు, మాంసాహారం పదార్థాలు తిన్నప్పుడు వెంటనే జీర్ణమయ్యేలా చేస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే పిపిరాల్ ఏ, బి అనేవి లివర్‌ క్లీన్ చేయడంలో చాలా బాగా పనిచేస్తాయి.


Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE