NaReN

NaReN

Monday, May 20, 2024

రాజకీయ ఉద్యోగులకు ప్రవేశ పరీక్ష

IPS- INDIAN POLITICAL SERVICES

రాజకీయ ఉద్యోగులకు ప్రవేశ పరీక్ష



*ఎన్నికల్లో పోటీ చేసే వారికి కూడా  పరీక్ష  పెట్టాలి*


1, సామాజిక సమస్యలు వాటిని ఎదుర్కొనే మార్గాలు,భారత దేశ చరిత్ర.. నైసర్గీక స్వరూపం ఆయా ప్రాంతాల వెనుకబాటు తనం.. అపరిష్కృత సమస్యలు ముందు నాయకులు చేసిన మంచిపనులు,, మాట ఇచ్చి చేయని పనులు 


2.ముందు ఎన్నికల్లో ఓటమి పాలైన వ్యక్తి ఎందుకు ఓడిపోయారో విశ్లేషణ


3.ముందు ఎన్నికల్లో నెగ్గిన వ్యక్తి హామీలు... వారు సాధించిన గొప్పదనం.. పదవిలో వచ్చిన అవినీతి ఆరోపణలు....


*ఇలాంటి అంశాలు మీద సమగ్ర పరీక్ష పెట్టాలి.*

*" నేనే " నెగ్గితే... ఏమి చేస్తారో  అవినీతి రహిత ప్రజాస్వామ్యం ఎలా నిర్వహణ చేస్తారో  లిఖిత పూర్వక పరీక్ష పెట్టాలి*


*నామినేషన్ వేసేటప్పుడు జనగణమన... వందేమాతర గేయాలు తప్పులు లేకుండా... చెప్పగలిగితేనే నామినేషన్ స్వీకరించాలి.*



*కనీసం రాబోయే ఎన్నికల నుండి అమలు చేస్తే బాగుంటుంది.*


*బొత్తిగా సమస్యలు తెలియనివారు హోదా కోసం పదవులు సంపాదించేవారికి పదవే పరమావధి అనుకునేవారికి అసెంబ్లీ లో సమయం వృథా చేసి సభ్య సమాజం తలదించుకునేలా బాషా ప్రయోగం అటువంటి వారిని కొంత మార్పు తీసుకొని రావోచ్చు.*


*మీరేమంటారు....*


*మీ అభిప్రాయాలను నిరభ్యంతరంగా నాతో పంచుకోండి.*


మీ

పసుపులేటి నరేంద్రస్వామి

9848696955

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE