NaReN

NaReN

Friday, May 10, 2024

బట్టీల దుకాణం

 *బట్టీల దుకాణం*


అర్థమయ్యేలా టీచర్స్  పాఠం  చెప్పేవారు .

  కష్టపడి కాకుండా పిల్లలు  ఇష్టపడి చెదివే వారు . 

ఆ అమ్మాయికి ఏడో తరగతి లో కూడా మంచి మార్కులొచ్చాయి .



" ఇంత తేలితేటలున్న అమ్మాయి ని ఈ స్కూల్ చదివిస్తున్నావేంటి ? ఇక్కడ చదివితే ఐఐటీ వస్తుందా ? కనీసం ఎనిమిదో తరగతి  నుంచి ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ అందేలా చూడు   "  తల్లికి పక్కింటి వారి   హిత బోధ. 


స్కాలర్షిప్ టెస్ట్ లంటూ పత్రికా ప్రకటనల్లో   హోరెత్తించే ఉత్తర భారత  దేశానికి చెందిన ఐఐటీ కోచింగ్ షాపు..  దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ లో ..  కూతుర్ని ఎనిమిదిలో చేర్పించింది .


" ఏడు దాకా బాగా చదివేది . ఇప్పుడు ఇంటికి రావడం తోటే సెల్ ఫోన్ . ఎంత చెప్పినా వినదు. మా బంధువు మీ గురించి ఫేస్బుక్ ద్వారా తెలుసుకొన్నారు . దయ చేసి మా అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వండి సార్ " . నాతో ఆ తల్లి .. 


ఇంటికొచ్చాక రోజుకు మూడు నాలుగు గంటలు  ఇంస్టాగ్రామ్ ద్వారా తన స్కూల్ స్నేహితులతో చాట్ చేస్తోంది . తన క్లాసులో అందరూ ఇదే చేస్తారు .  ఐఐటీ ఫౌండేషన్ పేరుతొ పెద్ద తరగతుల పాఠాలను టీచర్స్  చెప్పిపోతుంటారు . అవి అర్థం కావు . బట్టీ  కొట్టాలి . మార్కులు  తక్కువొస్తే సెక్షన్స్ మార్చేస్తారు . అక్కడ పరిస్థితి మరింత దారుణం  క్రీడలు .. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లాంటి క్లాసులు పేరుకే ఉంటాయి . చదువంటే విరక్తి పుడుతోంది . ఇంటికొచ్చాక స్నేహితులతో చాట్ చేస్తే కాస్త  రిలీఫ్ . .. ఇవీ ఎనిమిదో తరగతి అమ్మాయి నుండి నేను గ్రహించిన విషయాలు  . 


తల్లి కూతురు తో స్నేహితురాలిగా  వ్యవహరిస్తోంది . 

కూతురు ఇంస్టాగ్రామ్ అకౌంట్  పాస్ వర్డ్ తెలుసు . 

 అమ్మాయి ఇంకా  పూర్తిగా గతి తప్ప లేదు . చెడు సావాసాలు ఇంకా మొదలెట్టలేదు  . మొబైల్ అడిక్షన్ మొదటి దశలో వుంది . 

సుమారుగా అరగంట  కౌన్సిలింగ్ చేసి    యెన్ ఎల్ పీ ఇచ్చాను .


తండ్రి అమీర్పేట్ లో ఒక కోచింగ్ సెంటర్ నడుపుతాడు . పెద్దబ్బాయి  పదో తరగతి . రెండో వాడు  ఎనిమిది . ఇద్దరూ ఎస్ ఆర్ నగర్ లోని  తెలుగు ఐఐటీ కోచింగ్ షాప్ లో చదువుతారు . 


మొబైల్ కి పూర్తి స్థాయి బానిసలు.  వద్దంటే తిరగబడుతారు . కోపం..  అసహనం .. చిరాకు  . తండ్రి అని  కూడా చూడకుండా నోటికేది వస్తే అది మాటలాడుతారు . 


"స్కూల్ వారిని కలవలేదా?"   అడిగాను .


 " అయ్యో .. ఎన్నో సార్లు సార్ .. "అది మీ ఇంట్లో జరిగే వ్యవహారం . మాకేంటి సంబంధం?  మీరు చూసుకోవాలి" అని ఛీత్కారంగా మాట్లాడారు  సార్ ..నేను విద్య రంగంలో ఉన్నాను. కానీ పిల్లల విషయం లో దారుణమయిన తప్పు చేశాను . ఎలాగైనా సాయం చేయండి సార్ " 


"ఆ స్కూల్ చదివే మిగతా పిల్లల సంగతేంటి? " .


" అమ్మాయిల సంగతి నాకు తెలియదు సార్ . వీళ్ళ  క్లాసులో  అబ్బాయిలందరికీ  అకౌంట్స్ వున్నాయి . స్కూల్ నుండి రాగానే వాట్సాప్ గ్రూప్స్ ద్వారా గేమ్స్ ఆడుతారు . ఎంత సేపు ఫోన్ వదలరు "


"మీ పిల్లలిద్దరూ మొబైల్ అడిక్షన్ రెండో దశలో వున్నారు . వారిపై ఇప్పుడు కౌన్సిలింగ్ పనిచేసే అవకాశం తక్కువ . మానసిక వైద్యుడి ద్వారా మందులు ఇవ్వాలి . వాటికి సవాలక్ష సైడ్ ఎఫెక్ట్స్ . ఈ పద్దతి వద్దనుకొంటే  సెల్ ఫోన్ అనుమతించని రెసిడెన్షియల్ స్కూల్ లో  చేర్పించండి . లేకపోతే పరిస్థితి మరింత దిగజారుతుంది. మూడో దశకు వెళ్ళితే .. హింస కు దిగుతారు . అప్పుడు ఘోరాలు జరిగిపోతాయి " చెప్పాను.


చిన్న బాల శిక్ష .. పెద్ద బాల శిక్ష ! 


ఒక పక్క ఐఐటీ కోచింగ్ షాపులు .

 బట్టీ  చదువులు .

 ఎనిమిదో తరగతి లో ఇంటర్ పాఠాలు .

పాఠాలు చెప్పేవారికి...  చెప్పించే  వారికి   సంవత్సరం తిండి ఒకే రోజు తినిపించాలి . అప్పుడు తెలిసొస్తుంది .   అది చేసేవాడు లేదు కనుకే .. విచ్చలవిడి తనం .


 చెప్పేవారికే  పాఠాలు అర్థం కావు .క్లాసులో పాఠం వల్లే వేస్తారు . అర్థం కానీ  పాఠాన్ని పదేపదే చదవాలి . పరీక్షలో రాయాలి . మార్కులు తేవాలి . ఇది పెద్ద బాలలకు నేడు ఐఐటీ షాప్స్ విధిస్తున్న శిక్ష .


 పిల్లలకు చదువంటే ఆసక్తి చచ్చింది  . 

ఎక్కడో రాజస్థాన్  కోట  లో ఫ్యాన్ కు వేలాడకుండా మిగిలిన కొంత మంది ర్యాంకర్ లను  కొనుగోలు చేసి...  కోట్లు వెచ్చించి ... ప్రకటనలతో తల్లితండ్రుల బ్రెయిన్ వాష్  చేసే ఐఐటీ ఫౌండేషన్ దుకాణ యజమానులు...  తమ ఆటలు ఎక్కువ కాలం సాగవని గ్రహించారు . తమ దుకాణాలను విదేశీ వెంచర్ కాపిటలిస్ట్ లకు అమ్మి...  వేల కోట్లు కొట్టేసారు. 

 

వంతెన పైనుంచి కింద  నీటిలోని తన  ప్రతిబింబాన్ని చూసి మరో కుక్క అనుకొని అత్యాశకు పోయి...  మొరిగి...  నోటిలో ఉన్న మాంసం ముక్క ను...  నది పాలు చేసిన శునకం  కథను...  చదవని నేటి  తెలుగు తల్లితండ్రులు మాత్రం ఇంకా ఐఐటీ ఆశల ఊయలలో .. 


ఇద్దరిలో ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్ కు ఉద్యోగం రాకపోయినా...  వచ్చిన వారి జీతం నెలకు యాభై వేలు దాటాక పోయినా...  తెలుగు వారికి పట్టిన ఐఐటీ పిచ్చి ఇప్పట్లో వదలదు . అది తెలుగు పేరెంట్స్ కంజెనిటల్ డిసార్డర్ .


 

 ఐఐటీ ఫౌండేషన్ అంటే కాన్సెప్ట్ ను అర్థం చేసుకొని విశ్లేషణ...   అనుప్రయుక్తం అనే పద్దతిలో చదవాలి అని వీరికి అర్థం కావడానికి జీవిత కాలం సరిపోదు .  


చిన్న బాల శిక్ష : 

 ఇంటర్నేషనల్  స్కూల్స్ . 

ఇవి ఇప్పుడు  విదేశీ వెంచర్ క్యాపిటలిస్టుల చేతిలో  .

అవును మరి .. లాభాలు ఎక్కడుంటే ఈ విదేశీ గద్దలు అక్కడ వాలిపోతాయి . 


 యునెస్కో వద్దంది. 

ఇంగ్లాండ్ నెథర్లాండ్స్ ఫ్రాన్స్ లాంటి అనేక దేశాలు  నిద్దుర లేచాయి . 


చేతులు కాల్చుకొని .. బుద్ధి వచ్చింది దేవుడా అంటూ వారు నిషేదిస్తున్న  విధానాలనే  ఈ విదేశీ వెంచర్ క్యాపిటలిస్టులు  ఇప్పుడుఇక్కడ  మోడరన్  ట్రెండ్  పేరుతొ ఇక్కడ ప్రవేశ పెడుతున్నారు 


స్కూల్ లో  ఉండే  ఆరేడు  గంటల్లో అయిదారు గంటలు పిల్లలు డిజిటల్ బోర్డు పై వీడియో చూస్తూ గడపాల్సిందే .  

పాఠం సరిగా రాని వారినైనా టీచర్స్ గా నియమించి శాలరీ బిల్లు తగ్గించుకొనే ప్లాన్ వారిది . ఆహా..  ఓహో .. మా వాడి స్కూల్ లో మొత్తం డిజిటల్ పాఠాలు .

 ఇదే లేటెస్ట్...  అనుకొనే బకరా మనస్తత్వం డబ్బున్న తల్లితండ్రులది .


 ఐ స్ట్రైన్ .. మక్యూలర్ డీజెనెరేషన్ .. టెక్స్ట్ నెక్ .. రిపిటీటివ్ స్ట్రైన్ ఇంజురీ .. ఈ మాటల్ని పాపం  ఈ కొత్త తరం తల్లితండ్రులు ఇంకా వినలేదు . 


కనీసం తమ పిల్లల తో మాట్లాడాడనికి సమయం దొరకని బిజీ లైఫ్ వారిది .

 ఎంత ఫీజు కడితే అంత గొప్ప స్కూల్ అని భావించే ఈ నయా తరం తల్లితండ్రులు...  ఇంట్లో పిలల్లు హోమ్ వర్క్ పేరుతొ టాబ్స్ మొబైల్స్ పైన చేస్తున్న దేంటో చూడలేరు . చూసినా ఇక ఇప్పుడు పెద్దగా చేసేదేమి లేదు . 


  చేతులు కాల్చుకొన్నాక  ఇప్పుడు పాశ్చత్య  దేశాలు మేలుకొన్నాయి . 

"డిజిటలిజెషన్ .. పిల్లల కోసం  కాకుండా  విద్యా వ్యాపారుల కోసం జరుగుతోంది" అని సాక్షాత్తూ యునెస్కో చెప్పింది  .


 ఇంటర్నేషనల్ స్కూల్ చదివిస్తేనే తమ స్టేటస్ నలుగురికీ తెలుస్తుందని భావించే తల్లితండ్రులు కళ్ళు తెరవడానికి ఇంకా చాలా కాలం పడుతుంది . 

అప్పటికి  ఈ పిల్లలు ఇన్సొమ్నియా ..  కార్పల్ టన్నెల్ సిండ్రోమ్...  నోమోఫోబియా...  సోషల్ ఐసోలేషన్..  హైపర్ ఆక్టివిటీ డిసార్డర్...  లాంటి నోరు తిరగని రోగాల బారిన పడుంటారు . 


కార్పొరేట్  వైద్య శాలలకు పండగే పండగ . అన్నట్టు ఇప్పుడు అవి కూడా విదేశీ కంపెనీ ల చేతిలో .. 


తల్లితండ్రుల అతి ప్రేమ .. అజ్ఞానం ..    వేల/లక్షల     పసిమొగ్గల జీవితాలను తుంచేస్తోంది . 

వీరిని రక్షించడానికి ఏ దేవుడైనా కొండదిగి వస్తాడా ? 


విదేశీ కంపెనీ ల ధనదాహానికి మన పిల్లల జీవితాలు బలైపోకుండా వుండాలంటే ..  ప్రతి   తల్లి తండ్రిలో సరైన అవగాహన అవసరం .


 ఈ మెసేజ్ని...  మీ బంధువులతో ... మిత్రులతో షేర్ చేసుకోండి . వెయ్యి మందిలో ఒక్కరు కళ్ళు తెరిచినా ఆ పిల్లల బతుకులు భాగుపడ్డట్టే.. 

ఆ పుణ్యం మీకు దక్కుతుంది .


No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE