NaReN

NaReN

Friday, May 31, 2024

Tips and Tricks for Healthy Hair in School


 According to *Hair Care for Kids: Tips and Tricks for Healthy Hair in School*

1. Maintains a neat and professional appearance

2. Demonstrates respect for oneself and others

3. Helps promote a positive learning environment

4. Establishes a sense of responsibility and self-care

5. Encourages good hygiene practices

6. Sets a standard for personal grooming

7. Reinforces school rules and expectations

8. Promotes equality and unity among students

9. Prepares students for future workplace expectations

10. Helps prevent distractions in the classroom

11. Improves overall appearance and presentation

12. Shows pride in one’s appearance

13. Encourages confidence and self-esteem

14. Prevents potential safety hazards

15. Fosters a sense of discipline and self-control

16. Encourages students to take pride in their appearance

17. Helps students focus on academics rather than appearances

18. Creates a sense of unity and cohesion among students

19. Sets a standard for professionalism

20. Encourages students to take care of their personal hygiene

21. Helps students develop good grooming habits

22. Prepares students for future job interviews and professional settings

23. Encourages students to follow school rules and guidelines

24. Demonstrates respect for authority and school policies

25. Reinforces the importance of following rules and regulations

26. Promotes a positive image of the school in the community

27. Encourages students to adhere to social norms and expectations

28. Helps prevent distractions and disruptions in the learning environment

29. Sets a standard for appropriate attire and grooming in school

30. Encourages students to take responsibility for their appearance and behavior. 

                  🙏🙏🙏

Thursday, May 30, 2024

GRT వారి కాశి సత్రం


GRT వారి కాశి సత్రం

 GRT వారు కాశి/వారణాసిలో హోటల్ కమ్ సత్రం ప్రారంభించింది.


దక్షిణ భారత ఆహారాన్ని అందిస్తారు. గది అద్దెలు నామమాత్రం. ఆహారం ఉచితం.


మిత్రులు ఇటీవల వారణాసికి వెళ్లి GRT నిర్మించిన సత్రంలో బస చేశారు ....

పేరు మాత్రమే సత్రం, కానీ గదులు అన్ని సౌకర్యాలతో అద్భుతంగా ఉన్నాయి, మీకు ఎక్కడా లభించదు.


గరిష్టంగా ముగ్గురు ఒక గదిలో ఉండగలరు... వారు ఉదయం కాఫీ, టిఫెన్, లంచ్, సాయంత్రం టీ మరియు రాత్రి భోజనం అందిస్తారు. ... రూమ్ సర్వీస్ లేదు... అన్ని ఆహారాలు ఉచితంగా మరియు అపరిమితగా...అమావాస్య రోజున వారు ఉల్లిపాయలు & వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని అందిస్తారు.


మేము గత అమావాస్యకు అక్కడ ఉన్నాం ఎలా నిర్వహించాలా అని ఆలోచిస్తున్నాము... మేము డైనింగ్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు అది ఉల్లి/వెల్లుల్లి లేని ఆహారం అని సూచించే పెద్ద బోర్డు ఉంది. అనేక రకాల వస్తువులు.... నిజానికి బయటి ఆహారం మనకు సరిపడదు కాబట్టి వారు తమ అతిథులను అక్కడ మాత్రమే తినమని పట్టుబట్టారు.

ఖాళీ చేస్తున్నప్పుడు ఆ అన్నదాన ట్రస్ట్ కోసం సహకారం అందించాలనుకున్నాము.. వారు అంగీకరించలేదు...


ఒక టిప్ బాక్స్ ఉంది... టిప్ ఇవ్వడం తప్పనిసరి కాదు... కానీ మేము అది లేకుండా వెళ్లలేము ఎందుకంటే వారి సేవ నిజంగా అద్భుతమైనది.... మీరు చుట్టూ తిరగడానికి అక్కడ చాలా EVలు లభిస్తాయి... V ఆనందించారు మేము అక్కడ ఉండడానికి మరియు GRT యొక్క సేవ నుండి టోపీలు...

వారణాసికి వెళ్లే ఎవరైనా, GRTలో ఉండండి... గది అద్దె కూడా చాలా చౌకగా ఉంటుంది... గదులు స్టార్ హోటల్ గదుల్లా ఉన్నాయి... సరికొత్త మోడల్ హైఫై ఫిట్టింగ్స్‌తో. 


ఇక్కడి నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని ప్రదేశాలు... శంకర మఠం, గంగానది, విశ్వనాథర్ ఆలయం మరియు ఇతర దేవాలయాలకు వెళ్లడానికి మీకు పుష్కలంగా ఎలక్ట్రిక్ వాహనాలు లభిస్తాయి.


GRT హోటల్..కాంటాక్ట్ నెం.7607605660.


వసతి కోసం వారి వెబ్‌సైట్‌ని సందర్శించండి...

grtkasichatram.com   లేదా GOOGLE IT మరియు లాగిన్ అవ్వండి.

ఆన్‌లైన్ ద్వారా మాత్రమే బుకింగ్.


కాశీని సందర్శించాలనుకునే వ్యక్తులకు ఇది ఉపయోగకరంగా ఉండవచ్చు. 👍🏻


ఓం నమః శివాయ 🌹🙏🌹


grtkasichatram.com

మనల్ని నాశనం చేసే 5 అలవాట్లు

 *మనల్ని నాశనం చేసే 5 అలవాట్లు*



                           •••••••

1 . *వాయిదా వేయడం* ( procrastination )

2 . *ఫిర్యాదు చేయడం*)

( complaining 

3 . *అతిగా ఆలోచించడం* ( overthinking )

4 . *పోల్చుకోవడం*

 ( comparison )

5 .*(సురక్షిత ప్రాంతంలో ఉండాలనుకోవడం)* 

 (staying comfort zone)


.1.........*వాయిదా వేయడం ..........*

ఏవేవో చేయాలనుకుంటాం . జీవితానికి లక్ష్యాలు పెట్టుకుంటాం . కానీ వాటిని రేపు ,, ఎల్లుండి,,,వారం ,,, సంవత్సరం అని వాయిదా వేసుకుంటూ వుంటాం ..పుణ్యకాలం కాస్తా వెళ్లిపోయాక... చేసేదేముండదు ఇక . 

.2..............*ఫిర్యాదు చెయ్యడం..........*

ఇదో దరిద్రపు అలవాటు . మనకు శక్తి తక్కువగా ఉన్నప్పుడు మనం ఎదుటి వారి మీదనో,,ఇంకెరి మీదనో ఫిర్యాదు చేస్తాం.9ఈ భూమ్మీద ఎవ్వరూ సరి కాదు...ఇంకా సరిగ్గా ఉన్న మనిషి పుట్టలేదు.

మనలోని ఏదైతే లోపమో,అవలక్షణమో, వాసనో ,అసమర్థతో వుంటే అది బయటి వాళ్ల మీద ఫిర్యాదు గా మారుస్తాం.

.3.........*అతిగా ఆలోచించడం..........*

ఆలోచించటానికి ఏమీ లేనప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నట్టు బొత్తిగా అర్థం కాదు...ఒక సమస్య అతిగా ఆలోచిస్తే పరిష్కారం అవుతుంది అంటే భూమ్మీద మనుషులందరూ పనీ పాటా వదిలేసి కేవలం ఆలోచిస్తూ కూర్చొని వుండేవాళ్ళు. ఈ భూమ్మీద మనం అతిథులం మాత్రమే..కాబట్టి  మన బుర్రకి అతిగా పనిపెట్టకూడదు.

  4.        ........ *పోల్చుకోవడం* ..........

ఇదో పనికిమాలిన అలవాటు . సూది చేసే పని గునపం చెయ్యలేదు..గునపం చేసే పని సూది చెయ్యలేదు.దేని ప్రత్యేకత దానిదే...మల్లెపూలు వచ్చే సువాసన గులాబీలు ఇవ్వలేవు . గులాబీలు ఇచ్చే సువాసన మల్లెలు ఇవ్వలేవు.దేని ప్రత్యేకత దానిదే.మరుగు దొడ్లు కడిగే వాని ప్రత్యేకత వానిదే,,విమానం నడిపే వాని ప్రత్యేకత వానిదే.కాబట్టి మన జీవితంలో ఎవ్వరితోనూ మనల్ని పోల్చుకోకూడదు.ఈ భూమ్మీద మనకు మనం మాత్రమే ప్రత్యేకం.అలాగే ఎవరికి వారు ప్రత్యేకమే.                                                       5. *సురక్షిత ప్రాంతము* లోఉండాలనుకోవడం....

భూమ్మీద చాలా మంది ఇంత డబ్బులు వుంటే సురక్షితం గా ఉంటామనో,,ఇన్ని ఆస్తులు వుంటే సురక్షితం గా ఉంటామనో

లేకపోతే ఫలానా జాగా లో వుంటే సురక్షితం గా వుంటామనో అనుకుంటారు. ముందు మనం నిద్రలో నుండి మేల్కొవాలి.

అలాంటివేమీ లేవు...సురక్షిత ప్రాంతంలో  వుండి నేర్చుకునేది ఏమీ వుండదు.

యుద్ధం చేసే వాడు గెలుస్తాడు... ఆడే వాడు గెలుస్తాడు..

*సురక్షితం గా ఉండాలనుకునే వాడు జీవితంలో ఏ పాఠాన్నీ నేర్చుకోలేడు..*

                   ************

             

Tuesday, May 28, 2024

ఎండు ద్రాక్ష ఎలా తినాలి

 ఎండు ద్రాక్ష ఎలా తినాలి

ఎండు ద్రాక్ష తినే ప్రతి ఒక్కరు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి.



ఆరోగ్యంగా ఉండడానికి మీరు డ్రై ఫ్రూట్స్ రెగ్యులర్ గా తింటున్నారా.. అయితే ద్రాక్ష అలాగే క్రిస్మస్ తినేటప్పుడు ఎలా తింటున్నారు.. ఎన్ని తింటున్నారు..


అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఎలాంటివి తింటే మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.. వీటిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి.? కొనేటప్పుడు ఎలాంటివి చూసి కొనుక్కోవాలి. ఇలాంటి విషయాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం..ఎండుద్రాక్ష లో చాలా రకాల స్వీట్స్ లో వాడుతుంటారు. అయితే వీటిని నీటిలో నానబెట్టి తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.. నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్షను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు ఉంటాయి. ఒక గ్లాసులో ఎనిమిది లేదా పదిహేను ద్రాక్షాలు వేసి నానబెట్టండి. వీటిని ఉదయాన్నే మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి నీటిలో వేసి పరగడుపున తాగాలి. ఇలా చేయడం వల్ల అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.


ఎండు ద్రాక్ష లో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. అందువల్ల ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంతేకాదు నేచురల్ షుగర్ అద్భుతంగా ఉంటాయి. ఒకవేళ మీరు తీపి వద్దు అనుకున్నప్పుడు ఇలాంటి ఎండు ద్రాక్షాలు లేదా కిస్మిస్ ని మీ వంటల్లో వేసుకుంటే మరి షుగర్ గాని ఎటువంటి వాడాల్సిన పని కూడా ఉండదు. అలాగే ఎండు ద్రాక్షలో మనకి తెలిసినవి కొన్ని రకాలు అయితే చాలా రకాలు ఉంటాయి అంట. వాటిలో ముఖ్యంగా గోల్డెన్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి ఇంకొన్ని బ్లాక్ కలర్ లో కూడా ఉంటాయి. అయితే ఎండు ద్రాక్షలో క్యాలరీలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటిని తక్కువ తీసుకోవాలి. ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా అని ఎక్కువగా తీసుకుంటే లేనిపోని సమస్యలు వస్తాయి. ఎండు ద్రాక్షలో ఫైబర్ అధికంగా ఉంటుంది.


కాబట్టి జీర్ణశక్తి పెంచడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఇలా నానబెట్టడానికి ముందు కొంచెం వాష్ చేసి నానబెట్టండి. ఎందుకంటే మనం ఈ ఎండు ద్రాక్షతోపాటు ఈ నానబెట్టుకున్న నీటిని కూడా తాగాలి. కాబట్టి ఉదయాన్నే మీరు ఎందుకు ద్రాక్షాను బ్రష్ చేసుకున్న తర్వాత పరగడుపున చక్కగా నమిలి తినండి. ఆ తర్వాత ఈ వాటర్ తాగండి. ఇలా మీరు నమిలి తినడం ఇష్టం లేకపోతే మిక్సీలో వేసి పేస్టులా చేసుకుని ముందుగా చెప్పుకున్నట్టు వాటర్ లో వేసుకుని కూడా తాగేయొచ్చు. ఎండు ద్రాక్షలో ఉండే ఆంటీ బ్యాక్టీరియా లక్షణాలు బాడ్బ్రీయులకు తొలగించడంలో చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. అంటే ఎవరికైతే నోటి దుర్వాసన ఎక్కువ ఉంటుందో సమస్యలతో ఇబ్బంది పడుతుంటారో వాళ్ళు ఇలా ఎండు ద్రాక్షాలు తినడం అలవాటు చేసుకుంటే నోటి దుర్వాసనకు కారణం అయ్యే బ్యాక్టీరియాను నివారించడంలో ఈ ఎండు ద్రాక్ష అద్భుతంగా సహాయపడుతుంది.


సుల్తాన్ ఎండు ద్రాక్షాలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఫైబర్ పొటాషియం, ఐరన్ బట్టి అనేక ఖనిజాలు ఉంటాయి. మీరు కచ్చితంగా వీటిని ఆహారంలో అయితే చేర్చుకోండి. అయితే మీరు అధిక పరిమాణంలో ఎండు ద్రాక్ష మాత్రం తినకూడదు. ఎలా తీసుకున్నా గాని వీటిని డైరెక్టుగా అయితే తినకూడదు. గుర్తుంచుకోండి. ఎండుద్రాక్షను ఎప్పుడు తిన్నా రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే పరగడుపునే తినాలి.


Monday, May 27, 2024

టైమ్ బ్యాంక్

 టైమ్ బ్యాంక్


✅"ఎంతో మంచి ఆలోచన,ఒక్క సారి చదవండి!"💥


*స్విస్ టైమ్ బ్యాంక్*



స్విట్జర్లాండ్ లో చదివే ఓ విద్యార్థి పరిశీలన:


స్విట్జర్లాండ్ లో చదివేటప్పుడు నేను ఓ పాఠశాల దగ్గర్లోనే కిరాయికి ఉండే వాడిని.


మా ఇంటి ఓనరు,67 సం॥ల, ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా రిటైరైన ఒంటరి మహిళ.

ఆమెకు వచ్చే పెన్షనుతో ఆమె హాయిగా జీవించవచ్చు.

అయినప్పటికీ ఆమె ఒక 87సం॥ల వృద్ధునికి సేవ చేసే పనికి కుదిరింది.


నేనామెను డబ్బు కోసం పని చేస్తున్నారా?అని అడిగాను.


"నేను డబ్బు కోసం పని చేయడం లేదు,నా సమయాన్ని *'టైమ్ బ్యాంక్ '* లో దాచుకుంటున్నాను.


వృద్ధాప్యంలో,నేను కదలలేని పరిస్థితుల్లో తిరిగి వినియోగించుకుంటాను."అన్న ఆమె జవాబు నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది.


ఈ టైమ్ బ్యాంక్ అనే భావన తొలిసారిగా విన్న నాలో ఆసక్తి పెరిగి మరిన్ని వివరాలడిగాను.


టైమ్ బ్యాంక్ అనేది స్విస్ ప్రభుత్వ సామాజిక భద్రతా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమం.


ప్రజలు తాము యవ్వనంలో,ఆరోగ్యంగా ఉన్నపుడు వృద్ధులకు,అనారోగ్యంగా ఉన్నవారికి సేవలందిస్తూ,సమయాన్ని దాచుకొని,

తిరిగి వారికి అవసరమున్నపుడు ఉపయోగించుకోవచ్చు.


  దరఖాస్తుదారులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి,ప్రేమపూర్వక సంభాషణా నైపుణ్యం కల్గి ఉండాలి.


ప్రతిరోజు వారి సేవలను కోరుకునే వారికి అందించగలగాలి.


వారి సేవాకాలాన్ని వారి వ్యక్తిగత ఖాతాలలో సామాజిక భద్రతా మంత్రిత్వశాఖ జమ చేస్తుంది.


అలా ఆమె వారానికి రెండు రోజులు రెండు గంటల చొప్పున వృద్ధులకు సేవలందించడానికి వెళ్లేది.


వారి గదుల్ని శుభ్రం చేయడానికి,సరుకులు తేవడానికి,వారికి సన్ బాత్ లో సహకరించడానికి, కొద్దిసేపు ముచ్చడించడానికీ సమయాన్ని కేటాయించేది.


  అంగీకారం ప్రకారం సంవత్సరం తర్వాత టైమ్ బ్యాంక్ ఆమె సేవాకాలాన్ని లెక్కించి,'టైమ్ బ్యాంక్ కార్డు'జారీ చేసేది.


ఆమెకు ఇతరుల సహాయం అవసరమున్నపుడు తన కార్డును ఉపయోగించుకుని తన ఖాతాలో ఉన్న సమయాన్ని వడ్డీతో సహా తిరిగి వాడుకునేది.


ఆమె దరఖాస్తును పరిశీలించి, టైమ్ బ్యాంక్ ఒక వాలంటీర్ ను ఆమె ఇంటికి గానీ, ఆస్పత్రికి గానీ పంపేవారు.


  ఒకరోజు నేను స్కూల్లో ఉన్నపుడు ఆమె నన్ను పిలిచి,కిటికీ శుభ్రం చేస్తుంటే స్టూల్ పైనుండి జారిపడ్డానని చెప్పింది. 


నేను వెంటనే సెలవు పెట్టి,ఆమెను ఆస్పత్రికి తీసుకు వెళ్లాను.


ఆమె మడమ దగ్గర విరిగి,కొంత కాలం పాటు మంచం పైనే ఉండవలసి వచ్చింది.


నేను కొన్ని రోజుల పాటు ఇంటి పట్టునే ఉండడానికి సిద్ధమౌతుంటే,ఆమె ఏమీ దిగులు పడనవసరం లేదన్నది.


ఆమె అప్పటికే టైమ్ బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నది.

ఆశ్చర్యకరంగా రెండు గంటల్లోపే ఆవిడకు సేవలందించడానికి టైమ్ బ్యాంక్ వాలంటీరును పంపించింది.


ఆనెలంతా ఆ వాలంటీర్ ప్రతిరోజూ ఆవిడ బాగోగులు చూసుకుంటూ,     రుచికరమైన వంటలు చేస్తూ,సరదాగా కబుర్లు చెబుతూ ఉండేది.


సరైన సేవల వల్ల ఆమె త్వరలోనే కోలుకుని,తిరిగి తన పనులు తాను చేసుకోవడం మొదలైంది.

తానింకా ఆరోగ్యంగానే ఉన్నందున తిరిగి టైమ్ బ్యాంక్ లో మరింత కాలాన్ని నమోదు చేసుకుంటానంది ఆమె.


ఈరోజుల్లో స్విట్జర్లాండ్ లో వృద్ధులకు టైమ్ బ్యాంకులు సేవలందించడం అనేది సర్వసాధారణమైంది.


ఈ విధానం దేశ భీమా ఖర్చుల్ని తగ్గించడమే కాక, అనేక సామాజిక సమస్యల్ని కూడా పరిష్కరిస్తుంది.స్విస్ ప్రజలు కూడా ఈ విధానానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. 


ఒక సర్వే ప్రకారం సగం మంది స్విస్ పౌరులు ఈ విధానంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది.


 ప్రభుత్వం కూడా ఈ 'టైమ్ బ్యాంక్ 'విధానాన్ని చట్టబద్ధం చేసింది.


  ప్రస్తుతం ఆసియా దేశాల్లో కూడా క్రమంగా "ఒంటరి గూటి-వృద్ధ పక్షులు" పెరిగి పోవడం ఒక సామాజిక సమస్యగా మారుతున్నది.


👍ఆలోచించండి!మనకు కూడా స్విట్జర్లాండ్ *"టైమ్ బ్యాంక్ "* విధానం ఒక మహత్తరమైన ప్రత్యామ్నాయమే కదా...!?

భర్త-భార్య

 భర్త - భార్య



ఒక 60 సంవత్సరాల భర్త, అతని భార్య 

ఇద్దరు సముద్రం ఒడ్డున నడుచుకుంటూ వెళ్తుంటే ఒక బాటిల్ కనిపించింది ..........

ఓపెన్ చేస్తే అందులోంచి ఒక దెయ్యం

వచ్చింది...,....

నన్ను విడిపించినందుకు

మీ ఇద్దరికీ ఒక్కో కోరిక తీరుస్తా అని అన్నది 

Wife : నేను నా భర్త తో కలిసి world tour

చేయాలని వుంది......

దెయ్యం ఒక చిటిక వేసి రెండు వరల్డ్ టూర్

టికెట్స్ ఇచ్చింది.........

భర్త ని అడిగింది.....

మరి నీ కోరిక ఏంటి అని ??

Husband : నాకంటే 30 సంవత్సరాలు

చిన్నగా వున్న భార్య కావాలి అన్నాడు........

అంతే...

దెయ్యం ఒక చిటిక వేసింది 

భర్త ని 90 సంవత్సరాల వాడిగా

మార్చేసింది !!

Moral :- భర్తలు గుర్తుంచుకోవాలి

దెయ్యం కూడా ఆడదే అని 😂😂😂😂

మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలని 😂😂



Tuesday, May 21, 2024

మీరు ఎందుకు జన్మించారో తెలుసా

 మీరు ఎందుకు జన్మించారో తెలుసా


మీరు ఇంద్రియ సుఖాలు అనుభవించడానికి రాలేదు 

కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవడానికి రాలేదు

ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి రాలేదు

గౌరవ మర్యాదలు పొందడానికి రాలేదు

మీరు అందరికంటే గొప్పవారు అని ఇతరులకు నిరూపించేందుకు రాలేరు


మీరు మీరెవరో తెలుసుకోవడానికి వచ్చారు


ఈ తల్లిదండ్రులు భార్య పిల్లలు తోడబుట్టిన వారు వీరందరూ ఎవరికి వారు వచ్చారు ఎవరికివారు వెళతారు అని తెలుసుకోవాలి

ఈ బంధాలు బంధాలు కాదు అని తెలుసుకోవాలి


కనిపించేది వినిపించేది చూసేది ఏది శాశ్వతం కాదు అని తెలుసుకోవాలి...


అంతట దైవమే ఉన్నాడు అని గుర్తించాలి


ఈ దేహం కూడా శాశ్వతం కాదు అని తెలుసుకోవాలి

దేహంలో ఉన్న ఆత్మ శాశ్వతం అని తెలుసుకోవాలి

శాశ్వతమైనదే నేను అని గుర్తించి దర్శించాలి


మీరెవరో మీరు తెలుసుకుంటేనే మీరు వచ్చిన పని పూర్తయినట్లు లేకపోతే 


మీరు వచ్చిన పని  మర్చిపోయి తిరుగుతున్నట్లే ..


ఉన్నతిలో వినయంతో ఒదిగి చూడు తెలుస్తుంది

సమ్మతిలో వివేకంతొ మెలిగి చూడు తెలుస్తుంది..


వ్యర్ధాలను తొలగిస్తే అసలురూపు బయల్పడును

శిల అయినా హృదయమైన చెక్కి చూడు తెలుస్తుంది


స్వార్ధాలకి దాసుడౌతు కరుడుగట్టె మనిషి మనసు

మానవతను మేల్కొల్పగ తట్టి చూడు తెలుస్తుంది .


కర్మలనే ఉలితోనిను మెరుగుపెట్టు సర్వేశుడు...

కష్టాలను సాధనగా తలచి చూడు తెలుస్తుంది..


అవకాశమే ఆయుధం


మనిషిని బతికించే మధురసాయనం లాంటి మహాశక్తి- ఆశ. అది మరణశయ్యపై నుంచీ లేపి మళ్ళీ నడిపించగల మహామంత్రం. మనిషిని నిట్టనిలువునా చీల్చి మసి చేసే మారణాయుధం- నిరాశ. అది ఎంతటి శక్తిమంతుడినైనా దుర్బలుణ్ని చేసే మహమ్మారి. ఏ రంగంలోనైనా జయాపజయాలు, కష్టసుఖాలు సహజం.


ఎదగాలనుకున్నవారికి ఎదురుదెబ్బలు తప్పవు. ఓరిమితో తట్టుకుని నిలబడాలి.


దెబ్బ తగిలితే గాని నొప్పి తెలియదు. తగిలిన ప్రతి గాయాన్ని ఓపికతో మాన్పుకొని మళ్ళీ ప్రయత్నం కొనసాగించాలి. మధుర పదార్థం మోతాదుకు మించి స్వీకరిస్తే వెగటు పుడుతుంది. విజయాలకే అలవడిన జీవితానికి ఓటమి బాధ తెలియదు. అందుకే ఎప్పుడైనా పరాజయం ఎదురైనా కుంగిపోకూడదు. కష్టాల్ని అనుభవించాలి. రాటు తేలాలి. ఓటమి కాటుతోనే గెలవాలన్న కసి, పట్టుదల మొదలవుతాయి. పరాజయాన్ని డీ కొట్టి స్థిరంగా నిలిచినప్పుడు, కష్టాన్ని తట్టుకుని సుఖానికి ఎదురుచూసినప్పుడు- వాటి శక్తి తెలుస్తుంది. వీటికి తగిన ప్రణాళికల్ని సిద్ధంచేసుకోవాలి. అహరహం శ్రమించాలి. ఎత్తుకు వైయెత్తులు వెయ్యాలి. చాణక్యుడిలా గెలుపు సూత్రాన్ని సొంతం చేసుకోవాలి. విజయ కంకణధారుల ధాటికి తలవంచి ఓటమి పలాయనం చిత్త గిస్తుంది.


 చిమ్మచీకటిలో పొరుగూరికి బయలుదేరాడో వ్యక్తి దారిలో కుంభవృష్టి మొదలైంది. రక్షణ కోసం ఓ చెట్టునీడకు చేరాడు. ఆ పక్కనే ఓ దిగుడు బావి. జారి అందులో పడిపోయాడు. ప్రాణా లపై ఆశ కోల్పోయి చీకట్లో కాలం. గడిపాడు. తెల్లవారింది. వర్షం తగ్గింది. బయటపడే మార్గం కనపడలేదు. ఇంతలో ఈదురుగాలికి చెట్టుకొమ్మ బావిలోకి ఒరిగింది. వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదా వ్యక్తి, మూడు, నాలుగు సార్లు ప్రయత్నించాక కొమ్మ పట్టుకుని పైకి వచ్చాడు. దైవానికి కృతజ్ఞతలు చెప్పి ముందుకు సాగిపోయాడు. జీవితంలో యాదృచ్ఛికంగా లభించిన అవకాశాల్ని తెలివిగా దక్కించుకున్నవారే విజ్ఞులు, తగిన కృషి, పట్టుదల, విశ్వాసం, దైర్యం- ప్రయత్నానికి తోడవ్వాలి. అప్పుడు విజయం తలవంచి దాసోహమనక తప్పదు.


అవకాశాలు తమంత తాముగా మన చెంతకు చేరవు. మనం అన్వేషించాలి. తపించాలి శ్రమించాలి. చేజిక్కించుకుని కార్యనిర్వాహణలో విజయం సాధించాలి. మనలోని ఆసక్తి, శ్రద్ధ గమనించిన వివేకులు కొందరు తమ చెయ్యి అందించి అవకాశాల బాటలు పరుస్తారు. ఆ చేతులను బలంగా పట్టుకుని ఎగబాకి ఆ బాటలో విజయ ధ్వజాన్ని నాటాలే గాని, జారిపోకూడదు. స్వశక్తితో ఇతరులను ఒప్పించి మెప్పించాలి. విజయపరంపరను ఖాతాలో జమచేసుకోవాలి. వేలు వంచనిదే వెన్న అయినా దక్కదని గ్రహించాలి. అనుభవాన్ని, తెలివిని, శక్తిని కలగలుపుకొని గడ్డిపోచలను బలిష్టమైన పలుపు తాడుగా మార్చుకోవాలి. చేతికందిన అవకాశాల్ని స్వార్థ ప్రయోజనాలకు కాకుండా పరహితంగా ఉపయోగించాలి. వాటి ఫలితాలు లోకకల్యాణానికి ఉపకరించిననాడు పరమార్థం నెరవేరినట్లే. పూలబాటలో తాము నడుస్తూ పదిమందినీ తమతో నడిపించాలి. దానం, ధర్మం, సమాజసేవ నిర్వహించే అవకాశం చేతికందినప్పుడు పరమాత్మ ఆదేశంగా స్వీకరించి ఇతరుల సంక్షేమానికి నడుంకట్టేవారు ధన్యజీవులు...


మనసు పోకడలు


మనిషి నడతలన్నీ మనసు పోకడలను బట్టే ఉంటాయి. మనో చాంచల్యం మన చర్యల్లో కనిపిస్తుంది. మన చర్యలను బట్టే మనకు గౌరవ మర్యాదలుంటాయి. వైద్యులు వ్యాధి మూలాలను పట్టుకుంటేనే రోగం మందులతో శాంతిస్తుంది. తగిన చికిత్స చెయ్యడానికి వీలవుతుంది. తల్లిదండ్రులు తమ సంతానం గొప్పవాళ్లు కావాలని ఆరాటపడతారు. వారి దృష్టిలో గొప్పదనం అంటే ధనార్జన, హోదా, అధికారం, సాంఘిక గౌరవం. ఇవన్నీ ఉన్నా శీలం లేకపోతే, ఏమీ లేనట్లే. శీలం గలవారినే జ్ఞానం ఆశ్రయించి ఉంటుంది.

జ్ఞానం అంటే కేవలం వివేకంతో కూడిన లోకజ్ఞానం కాదు. పరిణతి చెందిన ఆధ్యాత్మికతనే శుద్ధ జ్ఞానం అంటారు. జ్ఞానానికి శుద్ధత ఏమిటి అనుకోవచ్చు. బంగారాన్ని శుద్ధి చేస్తేనే మేలిమి బంగారం అవుతుంది. జ్ఞానిక్కూడా సందేహాలు ఉంటాయి. జనక మహారాజు వద్దకు శుకమహర్షి వెళ్ళి సందేహాలు తీర్చుకోవడం ఇందుకు ఉదాహరణ. జ్ఞానం ఒక మహా సముద్రం. దాన్ని యథాతథంగా స్వీకరించగల శక్తి అందరికీ ఉండదు. ఒక్క అగస్త్యుడే సముద్రాలను ఆపోశనం పట్టినట్లు చెబుతారు. సముద్ర జలాలను సూర్యుడు ఆవిరిగా మార్చి మేఘాలకు అందిస్తాడు. అప్పుడు వాటిలోని లవణ లక్షణం పోతుంది. మేఘాలు శుద్ధ జలాలను వర్షిస్తాయి. అవే కొండలనుంచి సెలయేళ్లుగా, నదులుగా ప్రవహిస్తాయి. ఆ నీరు ప్రాణదాతగా ప్రకృతికి జీవం ప్రసాదిస్తుంది.ఆదిత్యయోగీ..


జ్ఞానమూ అంతే. జ్ఞానమూలం పరమాత్మ. ఆయన నుంచి శబ్ద బ్రహ్మంగా వేదాలు మహర్షులు విన్నారు. అవి శ్రుతులయ్యాయి. వాటిని మననం చేసుకుంటూ సుబోధకంగా శిష్య పరంపరకు చెప్పారు. అవే స్మృతులు. అనేక వడపోతల తరవాత జ్ఞానం శుద్ధం, పరిశుద్ధం సుగ్రాహ్యంగా మారి జిజ్ఞాసువులకు అందుబాటులోకి వచ్చింది. 


మనిషి ఇంటిని, ఒంటిని శుభ్రం చేసుకుంటాడే తప్ప మనసులోని మకిలిని వదిలించాలనుకోడు. అసలు సమస్య అంతా మనసుతోనే. దాన్ని శూన్యం చేసుకోవాలంటారు జ్ఞానులు. కొందరు తీవ్రమైన సాధనలు చేసేవారు ‘మనోనాశ్‌’ అనే స్థితికి చేరతారు. ఇది దాదాపు అవధూత స్థితి. భారతీయ ఆధ్యాత్మికత ఆత్మస్వరూపుడైన అంతర్యామికి తొలి తాంబూలం ఇస్తుంది. అంతర్యామి దాసుడే అసలైన భక్తుడు. అంతర్యామి అంటే ఆలయ శిలామూర్తి కాదు. సృష్టిలోని సమస్త ప్రేమ, ఆనందం, అనంతత్వం- ఇవన్నీ కలగలిసిన ఒక దివ్యతేజం. విశ్వంభరగా ఉన్న నిత్య చైతన్యం. దాన్ని దర్శించాలంటే మనం ఆత్మస్థితికి చేరుకోవాలి. మనం మోస్తున్న మనసు, బుద్ధి అనే రెండు బరువుల్ని వదిలించుకోవాలి, లేదా జ్ఞానాగ్నిలో దహనం చెయ్యాలి. అంటే వాటి ప్రమేయం నశించాలి.

‘నేను’కు నిర్వచనాలు మనసు, బుద్ధి. ‘నేను’ నశించాక మిగిలేది అనంతుడు, అజేయుడు, శాశ్వతుడైన బ్రహ్మమే. సృష్టిలో బ్రహ్మం కానిదేదీ లేదంటుంది యోగవాసిష్ఠం. అంటే, మనంకూడా బ్రహ్మస్వరూపులమే. కాని, ఆ జ్ఞానం మనకు లేదు. అలా లేకపోవడమే మాయ. మన జీవితకాల యుద్ధం ఈ మాయతోనే. మాయను జయిస్తే, ప్రపంచమనే మత్తు, భ్రమలోంచి బయటపడితే, ఎదురుగా కనిపించేది అంతర్యామే. ఆ మహా తేజస్సు ఎప్పుడూ, అలాగే, అక్కడే ఉంటోంది. ఎప్పుడు మనం అంతర్యామిని చూడగలుగుతామో అక్కడితో మనం గమ్యం చేరినట్లే. మన జీవనయానం ముగిసినట్లే. ఇవి జరగాలంటే- మనసు పోకడల్ని గమనిస్తూ, మనల్ని మనం ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. తడబడకుండా, దారి తప్పకుండా...


ఈ జీవితం తర్క...కుతర్క కాలక్షేపం,

వ్యర్థ వినిమయ వస్తుసముదాయం

కుప్పలుగా పోగేసుకునే చెత్తల నిలయం

తనూ, మనో రోగాల విలాస కుహరం 

సరళమైన,స్పష్టమైన మార్గపయనం

సత్యమేదో నీ ముందు నిలుపును నిత్యం.....

మిడత కథ

 మిడత కథ 

అందరూ చిన్నప్పుడు పుస్తకాల్లో చదివే ఉంటారు . అదే కథకు ఇండియన్ వెర్షన్ ఇక్కడ ఇవ్వబడింది.



*ఒరిజినల్ కథ :*


*ఒక చీమ మండు వేసవిలో చెమటలు కక్కుకుంటూ శ్రమించి పుట్ట ని నిర్మించుకుని ఆహార ధాన్యాలను సంపాదించుకుంటూ పుట్టలో నిలవ చేసుకుంటూ ఉంటుంది . అదే సమయంలో మిడత చీమని చూసి బుద్ధిహీనురాలని హేళన చేస్తూ , ఆడుతూ పాడుతూ వేసవికాలం అంతా గడిపేస్తుంది . శీతాకాలం లో చీమ తన పుట్టలో వెచ్చగా తలదాచుకుంటూ , ఆహార కొరత లేకుండా హాయిగా జీవిస్తూ ఉంటుంది . మిడత మాత్రం గూడు తిండి లేక చలికి గజ గజ లాడుతుంది . ముందుచూపు లేని  తన తెలివితక్కువ తనానికి విచారిస్తుంది .*


*ఇదే కథకి ఇండియన్ వెర్షన్ :*


*చీమ వేసవికాలంలో చెమటలు కక్కుకుంటూ శ్రమించి పుట్టని నిర్మించుకుని ఆహార ధాన్యాలను నిల్వ చేసుకుంటూ ఉంటే , మిడత దానిని అవహేళన చేస్తూ వేసవికాలం అంతా ఆడుతూ పాడుతూ గడిపేస్తుంది . శీతాకాలం లో చీమ తన పుట్టలో వెచ్చగా జీవిస్తూ ఆహార కొరత లేకుండా ఉంటుంది .*

*మిడత ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తాను  ఈ సమసమాజంలో వివక్షకు గురవుతున్నానని, చీమ హాయిగా పుట్టలో వెచ్చగా* *జీవిస్తూ కడుపునిండా భోజనం చేస్తుంటే తాను మాత్రం ఎందుకు  ఆకలితో అలమటిిస్తూ చలికి గజ గజ లాడాలి అని ప్రశ్నించి తనకి జరుగుతున్న* *అన్యాయాన్ని సరి చెయ్యాలని డిమాండ్ చేస్తుంది*. 


*NDTV, CNN, IBN, TOI, ET, India Today, Malayala Manorama, TV9, ABN,*


 *మొదలైన టీ వీ చానల్స్ మిడతనీ, చీమనీ పక్క పక్కన చూపించి, బ్రేకింగ్ న్యూస్ తో వాయించడం మొదలు పెడతాయి . ప్రపంచం మొత్తం* *మిడత కి జరుగుతున్న ఘోరమైన అన్యాయానికి విస్తుపోతుంది.* *R. నారాయణా, CPI నారాయణా, సీతారాం ఏచూరి, ప్రకాష్ రాజ్, అరుంధతి రాయ్ మిడత కి సంఘీభావం ప్రకటిస్తూ టీవీల్లో జరిగే చర్చల్లో ప్రభుత్వాన్ని ఏకి పారేస్తారు. మేధా పాట్కర్,* *గద్దర్ లాంటి వారు ఇతర పార్టీలతో కలిసి మిడత కి ఉచితంగా ఇల్లూ ఆహార సౌకర్యం కల్పించాలని రిలే నిరాహారదీక్ష లు ప్రారంభిస్తారు.* *మాయావతి, ఒవైసీ లాంటి వారు దీన్ని అల్పసంఖ్యాక, మైనారిటీల మీద జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తుంది. మిడత కి న్యాయం చేయాలని ఇంటర్ నెట్ లో ఆన్ లైన్ పిటిషన్ లు వెల్లువెత్తుతాయి . కేరళ, DMK ప్రభుత్వాలు చీమలకి మిడత లకీ మధ్య సమానత్వం ఉండాలని ,  అందుకోసం చీమలు వేసవికాలంలో పని చేయడాన్ని నిషేధిస్తుంది .* 

*విద్యా శాఖా మంత్రి మిడత జాతికి అన్ని విద్యాలయాలలో ఉచిత అడ్మిషన్ మరియు రిజర్వేషన్ కల్పిస్తారు* .

*రైల్వే మినిస్టర్ ఉచిత ప్రయాణం తో బాటు మిడత జాతి కోసం ప్రతి రైల్ లో ఒక ప్రత్యేక బోగీ ఏర్పాటు చేస్తారు .* 

*ప్రభుత్వం మిడత జాతి మీద జరిగే అన్యాయ వ్యతిరేక చట్టం చేసి , చీమని అరెస్ట్ చేస్తుంది . చీమ ఇంటిని మిడత కి కేటాయించి ఒక పెద్ద సభ పెట్టి  తాళాలని అందజేస్తుంది . దీన్ని అన్ని టీ వీ లు లైవ్ కవరేజ్ ఇస్తాయి . బృందా కారత్ దీన్ని ప్రజాస్వామ్య విజయం గా పేర్కొని , ప్రతి సంవత్సరం ఆరోజున వివక్ష వ్యతిరేక దినం గా పాటించాలని పిలుపు నిస్తుంది . సామాజిక న్యాయం జరగడానికి ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో సవివరంగా పత్రికలన్నీ ఆర్టికల్స్ రాస్తాయి .*

.

.

*జైలు నుండి విడుదలైన తర్వాత చీమ అమెరికా వెళ్ళిపోతుంది .*

.

.

.

*కొన్నాళ్ల తర్వాత సిలికాన్ వేలీ లో చీమ వందలాది బిలియన్ డాలర్లతో ఒక కంపెనీ ప్రారంభిస్తుంది .*

.

.

.*ఇండియాలో సాలీడు జాతికి కూడా మిడత జాతికి కల్పించిన సౌకర్యాలు ఇవ్వాలని ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి .*

.

.

.

*మరో వంద సంవత్సరాలు గడిచినా ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం అని ప్రపంచం నలుమూలల అనుకుంటూ వుంటారు .*


*Hats off to the Great Democratic India..*


*_సోమరిపోతులకకి_* ,

*_బిక్షగాళ్ళ తయారీకి_* 


*_కొన్ని కుటుంబ పాలన రాష్ట్రాలు  ఆత్మ గౌరవం తుంగలో తొక్కి వెధవలుగా బతికే మార్గం చూపెడుతున్నారు._*


*_అన్నీ ఉచితం ! అంతా ఉచితం !_*


*45 ఏళ్ళదాకా నిరుద్యోగ భృతి,*


*45 ఏళ్ళనుండి వృద్ధాప్య పెన్షను.*


*_ఇంక జీవితంలో లేదు టెన్షన్,_*


*రోగమొస్తే ఆరోగ్యశ్రీ కార్డు*


*నిద్దరొస్తే సర్కారిచ్చిన ఇల్లు,*


*చుట్టాలొస్తే రూపాయికి కిలో సన్నబియ్యపువిందు !*

.

*అంతా బాగానే ఉన్నది !*


*భూతల స్వర్గం భారతదేశం !*


*కానీ*


*రోగానికి మందిచ్చి సేవచేయటానికి ఎవరుముందుకొస్తారు ?*


*ఇంటినిర్మాణానికి రాళ్ళెత్తే కూలీవస్తాడా ?*

.

*వ్యవస్థ ,సమాజం ఛిన్నాభిన్నం కాదా ! అసలు మన నాయకులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ, మనలోని ఆత్మ గౌరవాన్ని నాశనం చేస్తున్నారు.*


*పండుగలకు బహుమతి అడిగారా??*


*లేదు* 


*నాణ్యమైన జీవితం కావాలని అడిగారు.*


*రోడ్లు అడిగారు, కరెంటు, నీరు,విద్య , ఉద్యొగ కల్పన అడిగారు.* 


*కానీ*


*అవి కాకుండా ఇదేమి విచిత్రం.*


*అసలు మనం ఎటు పోతున్నాం.*


*అసలు సంఘర్షణ లేని జీవితం ఒక జీవితమేనా?*


*Is it worth living ???*

.

*ఒక గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారాలంటే* *"సంఘర్షణ"*


*ఒక లాల్ బహదూర్ శాస్త్రి ఒక ప్రధాని పీఠం దాకా రావాలంటే* *"సంఘర్షణ "*


*తన కలలు పండించుకోవడానికి  ఒక "కలామ్ " పడ్డది* *"సంఘర్షణ "*


*మనిషి ఎదగాలంటే కావాల్సింది సంఘర్షణ!*

.

*_పథకం చూడటానికి గొప్పదే_*

.

*ఇప్పటికే ప్రతి రంగం లోను పని చేసేవారు లేక కుదేలయిపోయింది !*

.

*వ్యవసాయానికి కూలీలేడు* 

*కొట్లోకి గుమాస్తా దొరకడు !*


*పనికి రమ్మంటే ఒక్కడూ రారు ! వచ్చినా సరిగా పని చేయరు.*

.

*మనిషిని పనికి పురికొల్పేది అతని ఆకలే ! ఆకలి తీర్చాలి* ! 


*కానీ ఉచితంగా కాదు ! అది తీరేమార్గం చూపించాలి !*


*చైనా లో ఒక సామెత. ఆకలితో ఉన్నవాడికి  చేపలు ఇవ్వకండి, చేపలు పట్టడం నేర్పండి*.

*అతనికి ఎప్పుడు ఆకలేసిన, ఆకలి తీరుతుంది.* 


*అంతే గాని అన్ని ఉచితంగా ఇస్తాను. ఏమిటిది ???*


.

*_ఎవరికి ఉచితమివ్వాలి_*?


*పని చేసుకోలేని వారికి ,వృద్ధులకు ,అనాధలకు* *అభాగ్యులకు.*

*వారికి చేయూతనిచ్చే వ్యవస్థ ను* *రూపొందించండి*.

.

*అందరికీ అన్నీ ఉచితం అని సోమరిపోతులను తయారుచేయవద్దు !*


*పనిచేయని వాడికీ, పని చేసే వాడికీ కూడా ప్రభుత్వమే అన్నీ సమకూరుస్తే, చివరకి పని చేసే వాడు కూడా పని చేయడం మానేస్తాడు. వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుంది,*


_*ఆలోచించండి... మేధస్సు గల ప్రజలారా....*


🙏🙏🙏🙏🙏🙏

ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో

 ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. 



సర్పంచ్ . మొదలు అన్ని ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ ! దివాలా వైపు సామాన్యులు.. ఓటు కు నోటు తెచ్చే ను  చేటు 🙏


రాజకీయ నాయకులు ఎంతో ఆర్భాటంగా తొడిగే ఖద్దరు చొక్కా వెనుక ఇతరులెవ్వరికి తెలియని కన్నీటి బాధలెన్నో ఉన్నాయి. రాజకీయం అనే రంగుల సముద్రంలో ఈదలేక అలసిపోతున్న రాజకీయ ఉద్దండులెందరో ఒడ్డున కూర్చుని వెనక్కి రాలేకా, ముందుకు వెళ్లలేక నిరీక్షిస్తున్న సందర్భాలను మనం సమాజంలో ఎన్నో చూస్తున్నాం. రాజకీయం అంటే అదేదో అద్భుత లోకమని భావించి యాదృచ్చికంగా ఆ రంగంలో ప్రవేశించి తీరా పీకల్లోతు కూరుకుపోయిన తర్వాత కానీ వెనక్కి రాలేమని తెలుసుకొని, మునుపటి జీవితం కోసం నిరీక్షిస్తున్న రాజకీయ బాధితులెందరో మనకు తారసపడతారు. అటువంటి వారి జీవితాల్లోకి తొంగిచూస్తే వారు పంటి బిగువున భరిస్తున్న బాధలెన్నో మనకు తెలుస్తాయి.


*జీవితాలు అతలాకుతలం..*


రాజకీయ మోజు ఎందరో జీవితాలను అతలాకుతలం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉన్నత స్థానంలో ఉన్న రాజకీయ నాయకుడి పరిస్థితి ఏమో కానీ, గ్రామ,మండల,జిల్లా స్థాయిలో రాజకీయం చేసే నాయకుల ఖర్చులు తడిసి మోపెడౌతున్నాయి. సర్పంచ్,ఎంపీటీసీ,ఎంపీపీ, జడ్పీటీసీ,సింగిల్ విండో చైర్మన్, నామినేటెడ్ పదవులు అనుభవించే వారు సైతం సంపాదించేది దేవుడెరుగు కానీ, కొందరు చేస్తున్న అడ్డగోలు ఖర్చులు మాత్రం వారికి గుదిబండలా మారుతున్నాయి. అధికార హోదా, దర్పం కోసం చేస్తున్న ఖర్చులు పెరిగి అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. పదవుల మీద వ్యామోహంతో ఎన్నికల్లో తలపడి కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఈ సందర్భంగా సంసార జీవితాలు అతలాకుతలమైన పట్టించుకోకుండా రాజకీయంలో ముందుకే వెళ్లాల్సిన పరిస్థితులు కొందరికి ఏర్పడుతున్నాయి. ఎన్నికల్లో ఓడిన వారు పెట్టిన ఖర్చు వెనక్కి రాక నష్టపోతే, గెలిచిన వారు హోదా తగ్గకుండా చేసే ఖర్చులతో ఆర్థికంగా నష్టపోతున్నారు.


*కారుంటేనే హోదా అనుకుంటున్నారు !*


ఒకప్పటి రాజకీయాల్లో ఓ స్థాయికి ఎదిగిన నాయకులే కార్లు మెయింటెన్ చేసేవారు. కానీ నేటి రాజకీయాల్లో ఆ పరిస్థితి లేదు. గ్రామస్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీ,ఇతర పదవుల్లో గెలిచిన వెంటనే దర్పం కోసం కార్లు కొంటున్నారు. ఇప్పుడున్న సమాజంలో లక్షో, రెండు లక్షలో చెల్లిస్తే కంపెనీలు వాయిదాల రూపంలో కార్లు ఇస్తున్నారు. ఈ రకమైన వాయిదాలతో కొనుగోలు చేసిన కార్లతో రోజు ఐదు మందిని కారులో ఎక్కించుకుని వారి రోజువారీ ఖర్చులు నాయకుడే భరించటం నేటి రాజకీయాల్లో పరిపాటిగా మారింది. ఏమి లేదన్నా రోజుకు రూ,3 నుంచి 4 వేల వరకు గ్రామస్థాయి నాయకుడికి ఖర్చవుతుంది. ఎంత లేదన్నా నెలకు రాజకీయాల కోసం లక్ష మించకుండా ఖర్చు చేసే నాయకులు ఎందరో ఉన్నారు. ఈ విధంగా ఏడాది మెయింటెన్ చేసేలోపు అనుచర వర్గం ఖర్చులు, కారు కంటూ తడిసి మోపెడై ఇవన్నీ చెల్లించేందుకు చేతిలో చిల్లి గవ్వ లేక ప్రిస్టేజి కోసం పెద్దలు సంపాదించిన ఆస్తిని అమ్మో, తాకట్టు పెట్టో డబ్బులు సర్ది, తెల్లారేసరికి ఖద్దరు ధరించి నిన్నటి లాగే ముఖం మీద చిరునవ్వు చిందించు కుంటూ ప్రజలతో మమేకం అవుతున్న నాయకులు మన కళ్ళముందే ఉన్నారు. మరి కొందరైతే రాజకీయ హోదా తగ్గించుకోలేక, సంపాదన లేక పిల్లల చదువులు, పెళ్లిళ్లు అప్పులు చేసే గొప్పగా చేస్తున్నారు.


*రాజకీయాల్లో ఆదాయం ఉంటుందా ?*


వాస్తవంగా రాజకీయం అంటే సేవా దృక్పథం. క్రమంగా రాజకీయం ఒక ఫ్యాషన్ గా మారి కోట్ల సంపాదనకు పదవి కేంద్రబిందువుగా ఉందనే భ్రమలో గ్రామీణ నాయకులు,యువకులు మరికొందరు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు. వాస్తవంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గెలిస్తే కొంత ఆర్థిక అధికారం ఉంటున్నప్పటికీ, లక్షల, కోట్లు మిగిలించుకునే పరిస్థితులు ఇక్కడేమి ఉండవు. ఎంపీటీసీ పదవి అంటావా మండల స్థాయిలో ఎంపీపీని ఎన్నుకునేందుకు అవసరమైన సంఖ్యకు మాత్రమే ఉపయోగపడి ప్రత్యేకాధికారాలంటూ ఏమి ఉండని పదవి ఎంపీటీసీ. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 15వ, ఆర్థిక సంఘం గ్రాంట్ జనాభా ప్రకారం ఒక్కో మనిషికి సగటున ఏడాదికి రూ,1610 చెల్లిస్తుంది.


పంచాయతీకి పన్నుల ద్వారా, రాష్ట్ర గ్రాంట్ ల ద్వారా ఏడాదికి వచ్చే నిధులు రూ,2 లక్షల నుండి రూ,5 లక్షలకు మించవు. ఈ నిధులన్నీ కూడా ప్రత్యేక నిబంధనల ద్వారానే ఖర్చు చేయాల్సి ఉంటుంది తప్ప, ఎన్నికైన సర్పంచ్ ఇష్టప్రకారమేమీ ఖర్చు చేసే అవకాశం ఉండదు. పదవీ కాంక్ష కోసం ఒక పంచాయతీకి ఏడాదికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా వచ్చే రూ,20,30 లక్షల నిధుల కంటే ఎన్నికల కోసం అభ్యర్థి చేసే ఖర్చు మాత్రం రూ,50 లక్షల వరకు ఉంటుందంటే రాజకీయాలు మనిషిని ఆర్థికంగా ఏ స్థాయికి దిగజారుస్తాయో అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది.


*ఆలోచనా విధానాలు మారాలి..*


రాజకీయాల్లో పోటీ చేసే నాయకులతో పాటు వారికి ఓటు వేసే ఓటరు ఆలోచనా విధానం కూడా మారినప్పుడే ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది. తాజాగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు వస్తాయనే ప్రచారం జోరందుకుంది. ఏ ఒక్కరి నోట్లో చూసినా సర్పంచ్ ఎన్నికలు వస్తాయి, ఎవరు ఎంత ఖర్చు పెడతారో అనే చర్చ విస్తృతంగా జరుగుతుంది. ఓటుకు నోటు ఆశించకుండా అభివృద్ధి కోసం ఓటు వేస్తామని ఓటరు, తాను గెలిచేందుకు ఓటర్లను ఎటువంటి ప్రలోభాలకు గురిచేయనని నాయకుడు ప్రతిజ్ఞతో ఎన్నికల కార్యక్షేత్రం లోకి అడుగు పెట్టినప్పుడే అభివృద్ధి పరుగులు తీస్తుంది.ఖద్దరు చొక్కా కన్నీటి వ్యథ పటాపంచలౌతుంది.

4 Easy Ways to Add More Veggies

 🥕 *4 Easy Ways to Add More Veggies to Your Daily Routine* 🥦


1️⃣ *Drink a Smoothie*: Blend your favorite veggies into a delicious smoothie for a nutrient-packed start to your day.


2️⃣ *Eat Boiled Vegetables*: Simple and quick, boiled veggies are a perfect side dish for any meal.


3️⃣ *Enjoy a Big Bowl of Curry*: Load up your curry with plenty of veggies for a hearty and healthy meal.


4️⃣ *Consume Baked Vegetables*: Roasting or baking brings out the natural flavors of vegetables, making them a tasty addition to any dish.


Boost your health with these veggie-packed tips! 🥗


 

Monday, May 20, 2024

5 *Lessons To Learn

 5 *Lessons To Learn* 

Here are five life lessons that you must learn from the philanthropist and business tycoon Ratan Tata...

Life Lessons From Ratan Tata

Former Chairman of the Tata Group, Ratan Tata is an industrialist and philanthropist; he has been awarded both Padma Vibhushan and Padma Bhushan. Take a look at five lessons you can learn from the business tycoon...

 1.*Building Trust Is Most Important* 

In an interview, Ratan Tata had stated that it is extremely important to build trust and that trust is the basis of any business. Building trust with the clients, staff and investors should be one's first priority.

 2.*Having A Control On Your Emotions* 

To achieve success in life and to build a successful business, one must have control on their emotions and should also know how to take failure. Insult must not be taken to the heart and should work as motivation.

 

 3.*Taking Risks In Life* 

To establish something for yourself and to fulfil our goals in life, it is important to take risks and step outside our comfort zone. This is crucial for both personal and professional growth.

 4.*Understanding How Crucial Team Work Is* 

Ratan Tata strongly believes that to establish something big, we require a great team because an individual cannot do everything on their own; the work must be split in a team.

  

 5.*Learning And Listening Is Important* 

The business tycoon has also said that we must continue to learn all our lives and that is the best way to achieve success - it continues even after you have attained a degree; to learn, it is important to listen to the other people and take appreciation and criticism in a way that it helps you.

Car lights

 CAR LIGHTS




Car lights are essential for safety, communication, and visibility while driving. Here is a breakdown of the different types of car lights and their functions, explained point by point:


1. Headlights

Low Beam (Dipped Beam):

Used for regular night driving and in poor visibility conditions.

Provides sufficient light without blinding oncoming traffic.

High Beam (Main Beam):

Used in very dark conditions where there is no oncoming traffic.

Provides maximum light output for greater visibility.

Should be turned off when approaching other vehicles to avoid dazzling other drivers.


2. Daytime Running Lights (DRLs)

Automatically turn on when the car is running.

Increase visibility of the car to other drivers during daylight hours.

Not as bright as headlights and primarily for safety.



3. Fog Lights

Front Fog Lights:

Located below the headlights.

Used in dense fog, heavy rain, or snow to improve visibility.

Emit a wide, low beam that cuts through fog and reduces glare.

Rear Fog Lights:

Brighter than regular tail lights.

Used to alert drivers behind you in poor visibility conditions.


4. Tail Lights

Located at the rear of the car.

Automatically illuminate when the headlights or DRLs are on.

Ensure the car is visible from behind at night or in low light conditions.


5. Brake Lights

Located at the rear of the car.

Illuminate when the brake pedal is pressed.

Alert drivers behind you that you are slowing down or stopping.


6. Turn Signal Lights (Indicators)

Located at the front, rear, and sometimes on the sides of the car.

Flashing lights that indicate the direction you intend to turn or change lanes.

Must be used before making a turn or lane change to inform other drivers.


7. Hazard Lights (Emergency Flashers)

Engage all turn signals to flash simultaneously.

Used to warn other drivers of a hazard, such as a breakdown or an accident.

Can also be used when driving slowly due to an emergency or obstruction.


8. Reverse Lights

Located at the rear of the car.

Illuminate when the car is put in reverse gear.

Signal to other drivers and pedestrians that you are backing up.


9. Parking Lights

Located at the front and rear of the car.

Used when parked on the side of the road, especially in poorly lit areas.

Dimmer than headlights and tail lights, providing minimal illumination.


10. Side Marker Lights

Located on the sides of the car, usually integrated into the headlights and tail lights.

Provide additional visibility of the car’s position and dimensions from the side.


11. Interior Lights

Dome Light:

Located on the ceiling inside the car.

Provides illumination inside the car when doors are opened or manually switched on.

Map Lights:

Usually located near the front seats, often in the overhead console.

Directed light for reading maps or other activities inside the car.


12. License Plate Lights

Located above or to the sides of the rear license plate.

Illuminate the license plate to ensure it is visible in low light conditions.


13. Daytime Indicator Lights

Indicate the status of various lights (e.g., headlights, fog lights) on the dashboard.

Help the driver ensure that the correct lights are in use.


14. Cornering Lights

Often integrated into the headlights or fog lights.

Illuminate the direction in which the car is turning to improve visibility during turns.


By understanding the different types of car lights and their functions, you can ensure proper use, enhance safety, and improve communication with other road users.

రాజకీయ ఉద్యోగులకు ప్రవేశ పరీక్ష

IPS- INDIAN POLITICAL SERVICES

రాజకీయ ఉద్యోగులకు ప్రవేశ పరీక్ష



*ఎన్నికల్లో పోటీ చేసే వారికి కూడా  పరీక్ష  పెట్టాలి*


1, సామాజిక సమస్యలు వాటిని ఎదుర్కొనే మార్గాలు,భారత దేశ చరిత్ర.. నైసర్గీక స్వరూపం ఆయా ప్రాంతాల వెనుకబాటు తనం.. అపరిష్కృత సమస్యలు ముందు నాయకులు చేసిన మంచిపనులు,, మాట ఇచ్చి చేయని పనులు 


2.ముందు ఎన్నికల్లో ఓటమి పాలైన వ్యక్తి ఎందుకు ఓడిపోయారో విశ్లేషణ


3.ముందు ఎన్నికల్లో నెగ్గిన వ్యక్తి హామీలు... వారు సాధించిన గొప్పదనం.. పదవిలో వచ్చిన అవినీతి ఆరోపణలు....


*ఇలాంటి అంశాలు మీద సమగ్ర పరీక్ష పెట్టాలి.*

*" నేనే " నెగ్గితే... ఏమి చేస్తారో  అవినీతి రహిత ప్రజాస్వామ్యం ఎలా నిర్వహణ చేస్తారో  లిఖిత పూర్వక పరీక్ష పెట్టాలి*


*నామినేషన్ వేసేటప్పుడు జనగణమన... వందేమాతర గేయాలు తప్పులు లేకుండా... చెప్పగలిగితేనే నామినేషన్ స్వీకరించాలి.*



*కనీసం రాబోయే ఎన్నికల నుండి అమలు చేస్తే బాగుంటుంది.*


*బొత్తిగా సమస్యలు తెలియనివారు హోదా కోసం పదవులు సంపాదించేవారికి పదవే పరమావధి అనుకునేవారికి అసెంబ్లీ లో సమయం వృథా చేసి సభ్య సమాజం తలదించుకునేలా బాషా ప్రయోగం అటువంటి వారిని కొంత మార్పు తీసుకొని రావోచ్చు.*


*మీరేమంటారు....*


*మీ అభిప్రాయాలను నిరభ్యంతరంగా నాతో పంచుకోండి.*


మీ

పసుపులేటి నరేంద్రస్వామి

9848696955

Sunday, May 19, 2024

చదువొస్తే ఉన్న మతి పోయిందట

 *చదువొస్తే ఉన్న మతి పోయిందట*


రాను రాను రాజు గుఱ్ఱం ఏమో అయినట్టు. . ముఖ్యంగా విద్యాశాఖలో అన్ని తప్పుల తడకలే. ఉన్నత చదువులు చదివిన వారి ఆధ్వర్యంలో ఉండే ఈ శాఖలో అన్ని అసంబద్ధ నిర్ణయాలే. మరో వైపు ఏ శాఖలో లేనన్ని సంఘాలు ఉండేది ఇక్కడే. ఉద్యోగుల సంఖ్య దాదాపు అన్ని శాఖలు కలిపినా ఇందులోనే ఎక్కువ. కానీ జరిగే తప్పులు ఎక్కువ, ప్రశ్నించే గొంతులు శూన్యం. 


*టెక్నాలజీ ఉన్నా అదే పరిస్థితి*


టెట్ అనేది ఈ నడుమ పెద్ద రాద్దాంతంగా మారి సుమారు ఏడాది నుండి కోర్టులో నానుతున్న సమస్యాత్మక అంశంగా తయారైంది. వేలకు వేల మంది లక్షలాది రూపాయలు తగలెట్టి కోర్టులో వాజ్యం వేశారు. అది ఇలా కొలిక్కి వస్తుందో లేదో, సంఘాలన్నీ డిల్లీకి అర్జంటుగా లగెత్తి మేమేదో చేశాం అనే బిల్డప్ ఇచ్చాయి. కానీ రేపు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అప్పటివరకు అంతా డోలాయమానం, గందరగోళం, మానసిక ఆందోళన. అలాంటి టెట్ ఏదోలా రాసేద్దాం అదృష్టం పరీక్షించు కుందాం అని చదువుకొని రాయబోతున్న వారికి పరీక్ష సెంటర్ల కేటాయింపు మరో తలనొప్పిగా తయారైంది. టెక్నాలజీ శాపంగా మారిన వైనం. మనుషులు చేసినా బాగుండు అనుకునే దుస్థితి. పది ప్రాధాన్యతలు అడిగి నచ్చిన జిల్లాను కేటాయించింది కంప్యూటర్ మెషిన్. గరిష్టంగా పక్క జిల్లాలకు దూర ప్రాంతాలకు కేటాయించిన దాన్ని తలచుకొని నెత్తి నోరు కొట్టుకుంటున్న ఉపాద్యాయులు. దీనిపై బీఈడీ డీఈడీ సంఘం నోరు తెరిచింది కానీ ఉపాధ్యాయుల కోసం ఉన్న నూటా పదకొండు సంఘాలు పెదవి విప్పిన పాపాన పోలేదు. వేలకు వేలు ఫీజు కట్టడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు వేలకు వేలు పోసి అసౌకర్యాలకు గురై ఆందోళనలో పరీక్ష రాయాల్సిన గతి మరొక ఎత్తు. ముందుగా దరఖాస్తు చేసిన వారికి పక్క జిల్లాల్లో చివరాఖరికి చేసిన వారికి సొంత జిల్లాలో పరీక్ష కేంద్రం కేటాయింపు వెనక మర్మం ఎంతకు అర్థం కావటం లేదు. తీరా ఇంత జరిగినా రేపు అక్కడ కంప్యూటర్లు ఎలా పని చేస్తాయి కరెంట్ ఉంటుందా లేదా ఇంటర్నెట్ వస్తుందా రాదా అన్నది మరో భయానకమైన అనుమానం. ఇది మన టెక్నాలజీకల్ తెలంగాణలో పరీక్షల పరిస్థితి. అంతా ముందులా ఉండదు. మేం అందరికీ ఫ్రెండ్లీ అన్న ప్రభుత్వం దీని మీద నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లే ఉంది ఉద్యోగ ఉపాధ్యాయుల పరిస్థితి. మిగతా సమస్యలు మాట్లాడితే ఇది ఒడువని ముచ్చటగా మిగిలిపోతుంది. మెడకు పడిన పాము కరవక మానదు కదా. ఏం చేద్దాం. భరిద్దాం. అంతకు మించి ఏం చెయ్యగలం? ఎన్నటికీ నోరు మూసుకోలేదు. అందులో ఇదీ ఒకటి.


_ఆల్ ద బెస్ట్_

Saturday, May 18, 2024

అమెరికా ఖరీదైన దేశం

 *అమెరికా ఖరీదైన దేశం, కానీ దాని పౌర సేవలు అత్యున్నత ప్రమాణాలు.*



 *వేసవిలో, తెలంగాణ లోని వరంగల్ నుండి ఒక కుటుంబం సెలవు కోసం యుఎస్ వెళ్ళింది.  అందులో ఒక జంట, వారి ఇద్దరు పిల్లలు మరియు ఆ వ్యక్తి తండ్రి ఉన్నారు.*


*న్యూయార్క్ నగరంలో మూడు రోజుల తర్వాత, వారు నయాగరా జలపాతానికి వెళ్లేందుకు కారును అద్దెకు తీసుకున్నారు.  NYC నుండి నయాగరా వరకు ఉన్న ఇంటర్‌స్టేట్ హైవే అద్భుతంగా ఉంది.*


 *వారి వెనుక కారులో ఒక 80 పైబడిన వయస్సు గల అమెరికన్ మహిళ వస్తుంది.*

 *భారతీయ పిల్లలు వెనుక  సీటుపై మోకరిల్లి, వెనుకకు చూస్తూ, నవ్వుతూ, వెనక్కి ఊపుతూ వెనుక కారులో వస్తున్న అమెరికన్ లేడీకి చేతులు ఊపుతూ ఉంటారు.*


*అకస్మాత్తుగా అమెరికన్ లేడీ కి ముందు కారులో ప్రయాణిస్తున్న భారతీయుల కారు వెనుక సీటు కిటికీలో నుండి ఒక వృద్ధ భారతీయుడి తల బయటకు వచ్చి రక్తం వాంతి చేసుకోవడం చూసింది.*


*ఆమె తన కారును పక్కన ఆపి వెంటనే సహాయం కోసం 911కి కాల్ చేసింది.*


*వెంటనే, ఆకాశంలో ఎయిర్ అంబులెన్స్ హెలికాప్టర్ కనిపించింది.  అది ఒక మైలు ముందుకి దిగి, కారును ఆపమని భారతీయ కుటుంబానికి సంకేతాలు ఇచ్చింది మరియు శిక్షణ పొందిన వైద్య సిబ్బంది వృద్ధుడిని దాదాపు ICUలో ఉన్న ఛాపర్‌లోకి తీసుకెళ్లారు.  ఆక్సిజన్ సరఫరా ప్రారంభమైంది.*


*హృదయ స్పందన రేటు మరియు ఇతర పారామితులు పర్యవేక్షించబడ్డాయి.  సూచనలను అందించడానికి జాన్ హాప్‌కిన్స్ నుండి ఒక స్పెషలిస్ట్ MD వీడియో కాల్‌లో ఉన్నారు.*

*అరగంటలో, వృద్ధుడు క్షేమంగా ఉన్నాడని మరియు మళ్లీ ప్రయాణించడానికి సరిపోతాడని ప్రకటించారు.*


*అమెరికన్ లేడీ 👍 త్వరిత సహాయం మరియు సమయానుకూల చర్యకు అభినందనలు!*


*ఈ సేవల కోసం, వ్యక్తి నుండి $ 5,000 డాలర్లు వసూలు చేయబడింది..*


*ఒక భారతీయ కుటుంబానికి ఇది చాలా డబ్బు.*


*ప్రణాళికేతర ఆర్థిక ఖర్చులతో, ఆ వరంగల్ వ్యక్తి షాక్‌కు గురయ్యాడు మరియు అతని తండ్రిని తిడుతూ..*


  *"పాన్ (కిళ్ళీ) తిని కారులోంచి ఉమ్మివేయాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు?"*

🤪😂🤣🤪😂

తొందరగా తెరవండరా బాబు


 *తొందరగా తెరవండరా బాబు*

********************


అరే!పెట్టెలు తొందరగా తెరవండిరా

ఈ టెన్షన్ తట్టుకోలేక పోతున్న!!

బి.పి. గడియకో రకంగా ఉంటుంది!

షుగర్ సరసరా ఎక్కిపోతుంది!

మీ అమ్మకడుపులు మాడ!!

ఆ పెట్టెలు తొందరగా తెరవెండహే!!గుండె ఆగేలా ఉంది!

పందేలు తెగ కాసేసుకుంటున్నారు!

అన్నం తిందామంటే నోటికి సహించడంలేదు!!

నిద్రపోదామంటే కునుకైన పట్టడం లేదు


ఓరే కాస్త ఆ పెట్టెలు.తొందరగా తెరవండిరా

మీకు పుణ్యముంటుంది ..ఆ...

మహిళ_మనస్తత్వం

 *మహిళ_మనస్తత్వం*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


*బావి దగ్గర ఓ యువతి నీళ్లు నింపుతుండగా ఓ వ్యక్తి అక్కడికి వచ్చాడు.  ఆ వ్యక్తి తనకు తాగడానికి నీళ్ళు ఇవ్వమని ఆ స్త్రీని అడగగా, ఆ స్త్రీ సంతోషంగా నీళ్ళు ఇచ్చింది.*



*నీళ్ళు తాగిన తర్వాత ఆ వ్యక్తి ఆ స్త్రీని అడిగాడు,దేవుడు స్త్రీ మనస్తత్వం ఎప్పుడూ  అర్ధం కాకుండా  ఎందుకు ఉంటుంది చెప్పగలవా అని ?*


*ఇది అడిగిన తర్వాత, ఆ మహిళ పెద్దగా కేకలు వేయడం ప్రారంభించింది, నన్ను రక్షించండి ... నన్ను రక్షించండి ...అని అని అంటూ*


*ఆమె అరుపు విని గ్రామ ప్రజలు పరిగెత్తుకు రావడం  మొదలుపెట్టారు, అప్పుడు ఆ వ్యక్తి ఎందుకు ఇలా చేస్తున్నారు  అని అడిగాడు, అప్పుడు ఆ మహిళ గ్రామస్థులు వచ్చి నిన్ను చాలా కొట్టాలి మరియు మీరు తెలివి కోల్పోయేలా  కావలి  అని చెప్పింది.*


*అది విని, ఆ వ్యక్తి, "నన్ను క్షమించు, మీరు మంచి మరియు గౌరవప్రదమైన మహిళ అని నేను అనుకున్నాను."*


 *తర్వాత బావి దగ్గర ఉంచిన కుండలోని నీళ్లన్నీ ఆ మహిళ శరీరంపై పోసుకుని పూర్తిగా ముద్దగా మారింది.అప్పుడే  గ్రామస్తులు కూడా బావి దగ్గరకు చేరుకున్నారు.*


 *ఏం జరిగిందని గ్రామస్థులు మహిళను అడిగారు.*


 *నేను బావిలో పడ్డాను, ఈ మంచి వ్యక్తి నన్ను రక్షించాడని ఆ మహిళ చెప్పింది.  ఈ మనిషి ఇక్కడ లేకుంటే ఈరోజు నా ప్రాణం పోయేది అని అన్నది.*


*గ్రామస్తులు ఆ వ్యక్తిని చాలా ప్రశంసించారు మరియు అతనిని తమ భుజాలపై ఎత్తుకున్నారు.  ఆయనను సత్కరించి బహుమానం అందజేశారు.*


*ఊరివాళ్ళు వెళ్ళిపోయాక ఆ స్త్రీ ఆ పురుషుడితో ఇప్పుడు ఆడవాళ్ళ స్వభావాన్ని అర్ధం చేసుకున్నావా???*


*మీరు స్త్రీని బాధపెట్టి, ఆమెను వేధిస్తే, ఆమె మీ ఆనందాన్ని మరియు శాంతిని దూరం చేస్తుంది మరియు మీరు ఆమెను సంతోషంగా ఉంచినట్లయితే, ఆమె మిమ్మల్ని మరణం నుండి కూడా కాపాడుతుంది అని...*

స్విట్జర్లాండ్

 *స్విట్జర్లాండ్*


ప్రపంచంలో ఈ దేశం పేరు వినని వారు ఉండరు. కొత్తగా పెళ్ళైయిన యువ దంపతులు ఆ దేశానికి హానీమూన్ కు వెళ్ళాలి అని కోరుకుంటారు. ఆ జ్ఞాపకాలను జీవితాంతం గుర్తుపెట్టుకోవచ్చని.



భూతల స్వర్గంగా పేరొందిన దేశం, శీతల దేశమైనా ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, సెలయేర్లు, మంచుతో కప్పబడిన పర్వత శ్రేణులు, అతి తక్కువ జనాభా, చుట్టుపక్కల ఉన్న అన్నిదేశాలతో చక్కటి సంబంధాలు, సైన్యం లేని దేశం (పేరుకు సైన్యముంది కానీ యుద్ధం చెయ్యడానికి కాదు. రెడ్ క్రాస్ సహాయకులుగా, శాంతి బృందాలుగా పనిచేస్తారు), శత్రువులు లేని దేశం. 18 ఏళ్ళు దాటితే మగపిల్లలకు నిర్బంధ సైనిక శిక్షణ ఉందా దేశంలో.


స్విట్జర్లాండ్ పేరు వింటే ఆ దేశపు బ్యాంకు వ్యవస్థ గుర్తుకు వస్తుంది. (చాక్లెట్స్, చీజ్ కు కూడా ఆ దేశం ప్రసిద్ధి పొందింది)


ఈ దేశానికి ఇంకో ప్రత్యేకత ఉంది. పౌరులందరూ చదువుకున్న వారే. ప్రభుత్వం ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలంటే అది ప్రజాభిప్రాయ ప్రకారమే సాధ్యపడుతుంది. మన దేశంలో చట్టసభల్లో సభ్యుల నిర్ణయమే అంతిమం. అక్కడ అలా కాకుండా దేశప్రజలకు ఉపయోగపడే చట్టాలు *"ప్రజాభిప్రాయ సేకరణతోనే సాధ్యం"*. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే నిర్బంధ వోటింగ్ ప్రజాభిప్రాయ సేకరణలో. ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు తమ హక్కును వినియోగించుకోవలసిందే.


*మిగతా దేశాల బ్యాంకులకు స్విట్జర్లాండ్ బ్యాంకులకు తేడా ఏమిటి? ఎందుకు అవి అంత ప్రాచుర్యం కలిగి ఉన్నాయి ఒకప్పుడు?*


ఆ దేశంలో ఉన్న ఎన్నో బ్యాంకుల్లోకి ప్రసిద్ధి పొందింది *"స్విస్ బ్యాంక్"* (ఇప్పుడు పేరు మారి UBS గా అందరికి పరిచయం). రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ స్విస్ బాంక్ ఒక కొత్త విధానాన్ని ప్రారంభించి విపరీతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. అత్యంత ధనిక దేశం. ఈ దేశం గురించిన ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం.


ఆక్కడి బ్యాంకుల విధానమేమిటంటే ప్రపంచంలో ఏ దేశ ధనిక పౌరుడైన స్విస్ బ్యాంకులో ఖాతా తెరవచ్చు. వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయి.


ఇతర దేశాల *"ధనిక"* పౌరుడు ఎలా సంపాదించాడు అన్నది ఆ బ్యాంకు అడగదు. ఒక నియంత తన దేశాన్ని దోచుకుని స్విస్ బ్యాంకులో దాచుకోవచ్చు, స్మగ్లర్లు, మాఫియా డాన్లు, మాధకద్రవ్యాల వల్ల సంపాదించినవారు, లాంచగొండి రాజకీయ నాయకులు, పన్నులు ఎగ్గొట్టే వ్యాపారస్తులు, మోసపురితంగా సంపాదించిన సొమ్ము, ఇలా ఎవరైనా అక్కడి బ్యాంకులో డబ్బుని మదుపు చెయ్యవచ్చు. రెండే రెండు రూల్స్ మాత్రం వర్తిస్తాయి.


మాములుగా మనం బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటే బ్యాంక్ మనకు వడ్డీ చెల్లిస్తుంది. కానీ స్విస్ బ్యాంక్ మాత్రం తన ఖాతాదారుల నుంచి రుసుము వసూలుచేస్తుంది. ఖాతాదారులు డబ్బే కాదు, ఖరీదైన వజ్రాలు, బంగారం, బంగారు నగలు, పెయింటింగ్స్, వెలకట్టలేని పురాతన వస్తువులు కూడా అక్కడి వాల్ట్స్ లో భద్రపరుచుకోవచ్చు.


స్విస్ బ్యాంకు ఖాతాదారులకు ఒకే ఒక షరతు విధిస్తుంది. ఇది మొదటి రూల్. ఖాతా తెరిచినప్పుడు ఫోటో, చిరునామా ఏది అడగదు . రీఛార్జి కార్డులా ఖాతాదారునికి అకౌంట్ నెంబర్, పాస్వర్డ్ మాత్రం ఇస్తుంది. లాకర్ తీసుకున్న వారికి తాళం చెవి ఇస్తుంది, ఇంకో తాళం తమ దగ్గర ఉంచుకుంటుంది. లాకర్ అంటే మనకు ఇచ్చే లాకర్ సైజ్ నుంచి, కావాలంటే ఒక పెద్ద గది అంత లాకర్ కూడా అద్దెకు ఇస్తారు. ఖాతాదారుల దాచుకునే వస్తువులను బట్టి లాకర్ పరిణామం. ఈ లాకర్స్ అవి కూడా భూమిలో నాలుగైదు అంతస్తుల కింద ఉంటాయి పటిష్టమైన భద్రతతో. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఆ లాకర్స్ దొంగలు దోచుకోలేకపోయారు అంటే ఊహించుకోవచ్చు ఎన్ని రకాల భద్రతా వలయాలు ఉన్నాయో.

                                                                                                                                                                                                           బ్యాంకు ఖాతాదారుని గుర్తుపెట్టుకోదు. అకౌంట్ నెంబర్, పాస్వర్డ్ చెప్పిన వ్యక్తికి ఖాతా నుంచి డబ్బులు తీసుకునే సౌకర్యం ఉంది. అలాగే ఆ రెండూ చెప్పి లాకర్ తాళం చెవి చూపిస్తే లాకర్ తెరిచే సౌలభ్యం ఏర్పరిచింది. 


ఇంకొక రూలు ఏమిటంటే ఖాతాలో ఎంత మొత్తం అయినా ఉండనివ్వండి, లేదా లాకర్స్ లో ఎంత విలువైన సామాగ్రి అయినా ఉండనివ్వండి. బ్యాంకు నిర్ణయించిన కాల పరిమితి లోపు ఖాతాను వాడకపోతే, అంటే ఒక పదేళ్లు లేదా ఇరవై ఏళ్ళ కాలం కావచ్చు, అప్పుడు ఆ ఖాతాను జప్తు చేసి అందులో ఉన్న మొత్తాన్ని ప్రభుత్వానికి అందచేస్తారు. 


రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ప్రపంచంలో అత్యంత ధనవంతులు యూదులు. జర్మనీ , పోలాండ్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, లక్సంబర్గ్ , నెదర్లాండ్స్ తదితర దేశాల యూదులే కాకుండా అమెరికాలో ఉన్న యూదులు కూడా ఈ బ్యాంకులో లెక్కపెట్టలేనంత డబ్బులు, బంగారం, వజ్రాలు, పెయింటింగ్స్ , కళాఖండాలు దాచుకున్నారు. అదంతా వారి కష్టార్జితం.


వీరే కాకుండా జర్మనీకి చెందిన నాజీ ఉన్నతాధికారులు, సైన్యాధికారులు యూదుల నుంచి కొల్లకొట్టిన కళాఖండాలు, బంగారం, నగదు దాచుకున్నారు. 


యుద్ధానంతరం యూదులు, అధికారులు, సైన్యాధికారులు చాలామంది తిరిగి రాలేదు తమ సొమ్ముని తీసుకోవడానికి. 


ఆ తరువాతి సంవత్సరాల్లో వివిధ దేశాధినేతలు, నియంతలు, మాఫియా డాన్ లు, మాధకద్రవ్యాల అక్రమ రవాణాదారులు, ఇతరులు తన అక్రమార్జనను ఈ బ్యాంకులో దాచుకొని తిరిగి రానివారున్నారు. 


ఆ విధంగా విపరీతంగా ధన నిలువలు పేరుకుపోయాయి. లాకర్స్ ఎన్నో ఏళ్లుగా తెరవకుండా పడి ఉన్నాయి. 


కొత్త శతాబ్ది ప్రారంభంలో అంటే 2000 సంవత్సరంలో ఇది జరిగింది.


అటువంటి పరిస్థితుల్లో ఒక సుముహూర్తాన అటువంటి ఖాతాలు అన్నిటికీ నోటీసులు ఇచ్చి నిర్ణీత సమయానికి ఎవరూ రాకపోతే ఆ ఖాతాలు జప్తు చేయబడ్డాయి. చేసిన ఖాతా లోంచి స్వాధీనం చేసుకున్న సొమ్ముని ప్రభుత్వ ఖజానాకు తరలించడం జరిగింది.


అలా ప్రభుత్వ ఖజానాకు వచ్చిన మొత్తం ప్రపంచంలోని నల్లధనంలో నలభై శాతం.


ప్రభుత్వం ఆయాచితంగా వచ్చిన సొమ్ముని ఎలా ఉపయోగించు కోవాలో అర్ధం కాక ప్రజాభిప్రాయం తెలుసుకుందాం అని తమ దగ్గర ఉన్న సొమ్ము ప్రతి పౌరునికి పంచితే ఒక మిలియన్ యూరోలు పైనే ముట్టుతాయి, లేదా ఏ రకంగా దేశ అభివృద్ధికి ఖర్చుపెట్టవచ్చో చెప్పండి మీ అభిప్రాయాన్ని అని వోటింగ్ నిర్వర్తించింది.


పదిహేను రోజుల సర్వే తరువాత 99.2% శాతం ప్రజలు, దేశ సుందరీకరణకు, తమ దేశాన్ని చూడడానికి వచ్చే యాత్రికుల సౌకర్యాలకు, టూరిజం అభివృద్ధికి ఖర్చుపెట్టాలి అని అభిప్రాయపడ్డారు.


దేశాభిమానులైన స్విట్జర్లాండ్ ప్రజలకు ఇదో పెద్ద విషయంలా అనిపించలేదు. ప్రతి పౌరునికి మిలియన్ యురొలు ఉచితంగా ఇస్తామనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశ సౌభాగ్యనికి ఆ దేశ ప్రజలు ఓటు వేశారంటే, మిగతా దేశ పౌరులకు ఆశ్చర్యం కలగవచ్చు.

                                                                                                                                                                                                             ఆ దేశ పౌరుల నిశ్చిత అభిప్రాయం ఏమిటంటే ఎందరో ఎన్నో విధాలుగా అన్యాక్రాంతంగా సంపాదించింది, అమాయకుల నుంచి కొల్లగొట్టి దాచుకున్న సొమ్ము తమకు ఉచితంగా ఇచ్చినా వద్దు అనేది 99.2% ప్రజల స్థిర అభిప్రాయం.


ఇక్కడ ఇంకో తమాషా జరిగింది. 


2000 జనవరి 25వ తారీఖు ప్రజలు ప్రభుత్వ సర్వే ఆఫీసు ముందర బారులు తీరారు చేతిలో బ్యానర్స్ పట్టుకొని.


ఆ గుమిగూడిన ప్రజల డిమాండ్ ఏమిటంటే, ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న ఉచిత ఒక మిలియన్ యూరోలు కోసం ఆశ పడి అందుకోసం ఓటు వేసిన 0.8% ప్రజల పేర్లు బహిర్గతం చేయాలని వారి కోరిక. 


ఈ 99.2 శాతం ప్రజల అభిప్రాయం ప్రకారం ఉచిత సొమ్ముని ఆశపడిన ఆ 0.08 శాతం ప్రజలు దేశానికి మచ్చ తెచ్చారు, వారి పేర్లు బహిర్గతం చేస్తే మిగతా పౌరులు అటువంటి చీడపురుగులకు దూరంగా ఉంటాము అన్నది వారి అభిప్రాయం.


ప్రభుత్వ ప్రతినిధులతో చాలాసేపు జరిగిన సంప్రదింపులతో ఒక ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం వారి పేర్లు బయట పెట్టదు. కానీ వారిని తగురీతిలో శిక్షిస్తుంది అని ప్రభుత్వం చెప్పడంతో వారు శాంతించారు.

                                                                                                                                                                                                                                          ఉచితాలు వద్దు అని 99.2 శాతం ప్రజలు ఏకాభిప్రాయం వ్యక్తపరిచారు అంటే, ఎంత తేడా మిగతా దేశ ప్రజలకు స్విట్జర్లాండ్ ప్రజలకు!?

*మనదేశంలో ఐతే ఉచితాలకు చచ్చిన వాడుకూడా లేచి వస్తాడు.*  🌺🌺🌺

Friday, May 17, 2024

విద్యా వ్యవస్థ

 విద్యా వ్యవస్థ 



ఒక ఉద్యోగి ఇండియాలో తాను చేసే జాబ్ విసుగొచ్చి రిజైన్ చేసి లండన్ లో అతిపెద్ద మాల్ లో ఒక సేల్స్ మాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు.


అది ప్రపంచంలోనే అతి పెద్ద మాల్. 

అక్కడ దొరకని వస్తువు అంటూ  ఉండదు.


ఇంతకు ముందు సేల్స్ మాన్ గా ఎక్కడైనా పనిచేసావా ?

అడిగాడు బాస్.


చెయ్యలేదు


సరే ! 

రేపు వచ్చి జాయిన్ అవ్వు. 

నీ పెర్ఫార్మన్స్ నేను స్వయంగా చూస్తా! 

.

తర్వాతి రోజు చాలా భారంగా నడిచింది సేల్స్ మాన్  కి. 


చివరకి సాయంత్రం ఆరు గంటలకి బాస్ వచ్చాడు.


ఈ రోజు ఎంత మంది కస్టమర్స్  కి  సేల్స్ చేశావు?



కేవలం ఒకరు అని బదులిచ్చాడు సేల్స్ మాన్ 


ఒకటేనా ! 

నువ్వు ఇక్కడ గమనించావా, అందరూ 40 నుండి 50 సేల్స్ చేస్తారు. 

సరే, ఎంత ఖరీదైన సేల్ నువ్వు చేశావో చెప్పు?


8,009,770 పౌండ్స్  చెప్పాడు మన సేల్స్ మాన్. 


వాట్ !! అదిరిపడ్డాడు  బాస్. 

అంత పెద్ద సేల్ ఏమి చేశావు? అడిగాడు. 


వినండి. ఒక పెద్దాయనకి ఒక చేపలు పట్టే పెద్ద గేలం అమ్మాను.


గాలం ఖరీదు నువ్వు చెప్పినంత ఎక్కువ ఖరీదు కాదే?  అన్నాడు బాస్.  

       

పూర్తిగా వినండి ..!!!


తర్వాత ఆ గాలానికి సరిపడే రాడ్, ఒక గేర్ అమ్మాను. ఎక్కడ చేపలు పట్టాలనుకుంటున్నారో అడిగితే దూరంగా నది ఒడ్డున అని చెప్పారు


దాని కన్నా ఒక బోట్  లో వెళుతూ నది మధ్య చేపలు పడితే  బాగుంటుందని ఒప్పించి బోట్ స్టోర్లో ఒక షూనర్ బోట్  డబల్ ఇంజన్ ఉన్నది కొనిపించాను. 


ఆ పెద్దమనిషి తన జీప్ కెపాసిటీ తక్కువ ఈ బోట్ ని తీసుకు పోలేదు అన్నారు.


అప్పుడు ఆటొమోబైల్ డిపార్ట్మెంట్ లో ఒక కొత్త 4 * 4 డీలెక్స్ బ్లాజర్ కొనిపించాను.


తరువాత అక్కడే నది ఒడ్డున ఉండటానికి కాంపింగ్ డిపార్ట్మెంట్ లో కొత్తగా ఒచ్చిన ఆరు స్లీపర్ల ఇగ్లూ కాంప్ టెంట్ దానిలో ఉండటానికి కావల్సిన భోజన సామగ్రి పాక్ చేయించాను.


బాస్ ఆశ్చర్యంతో రెండు అడుగులు వెనక్కి వేశాడు.


ఇవన్నీ ఒక గేలం కొనడానికి వచ్చిన వాడితో కొనిపించావా !!!


లేదు సార్ ! బదులు ఇచ్చాడు సేల్స్ మాన్.


మరి ?  అన్నాడు బాస్. 


ఆయన నిజానికి ఒక తల నొప్పి టాబ్లెట్ కోసం వచ్చారు. 

తలనొప్పికి టాబ్లెట్ కన్నా చేపలు పట్టే  హాబీ ద్వారా తగ్గించుకోవచ్చు అని ఒప్పించాను.


బాస్: అరే యార్ …!! 

ఇంతకీ  నువ్వు ఇండియాలో ఏం ఉద్యోగం చేసేవాడివి?


అప్పుడు ఆ సేల్స్ మాన్ చెప్పాడు 


, కార్పొరేట్ స్కూల్ లో టీచర్ ఉద్యోగం చేసేవాణ్ణి సార్.


టీచర్ కి, సేల్స్ కు,ఏంటి రిలేషన్?? అడిగాడు బాస్ 


ఏబిసిడి లు నేర్పమని వస్తే ,

పదిహేనేళ్ల తర్వాత వచ్చే ఐఐటి -నీట్-సివిల్స్ ,ర్యాంక్ పేరు మీద ఫీజులు వసూలు చేసేవాళ్ళం... అని ఆన్సర్ ఇచ్చాడు😃😃😃


ప్రస్తుతం భారతదేశంలో విద్యా వ్యవస్థ ఇలాగే ఉంది 



Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE