NaReN

NaReN

Sunday, June 18, 2023

ఎందుకు❓ ఏమిటి❓ ఎలా❓

 ఎందుకు❓ ఏమిటి❓ ఎలా❓


 నవ్వు నాలుగు విధాల చేటు అంటే ఏమిటి?


నవ్వకూడని సందర్భాలు , నవ్వే సందర్భాలూ చూసుకొని నవ్వాలని దాని పరమార్ధము.


*ఆవేదనతో తనకు జరిగిన అవమానాన్ని పంచుకుంటున్నప్పుడు నవ్వకూడదు.


అన్నిరకాలుగా ఓడిపోయినవాడిని , అవమానభారముతో వెళ్ళిపోతున్న వాడిని చూసి నవ్వకూడదు.


ముఖపరిచమున్న స్త్రీని చూసి పురుషుడు పలకరింపుగానే నవ్వాలిగాని అతిగా నవ్వకూడదు.


వివాహమైన పరస్త్రీ, పరపురుషులు ...ఒకరితో నొకరు నవ్వులాటలాడుకోకూడదు . . అది పురుషుని కన్న స్త్రీ కే అవమానము తెచ్చిపెడుతుంది.


గురువులవద్దా , పూజాదికాలసమయాలలో అధికంగాను , గట్టిగాను నవ్వకూడదు ...చిరునవ్వుతోనే పలుకరించుకోవాలి.

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE