NaReN

NaReN

Monday, June 26, 2023

ప్రభుత్వ బడి.. ప్రవేశాల జడి!

 


🔊ప్రభుత్వ బడి.. ప్రవేశాల జడి!



*🍥ఖమ్మం నగరం రోటరీనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కేవలం ఆంగ్లమాధ్యమ బోధన సాగుతోంది. ఇక్కడ ఒకటోతరగతి నుంచి అయిదోతరగతి వరకు 240 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఒక పోస్టు ఖాళీగా ఉంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరో ఇద్దరు ఉపాధ్యాయులు అవసరం. రోజూ ప్రవేశాల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు బారులు తిరుగుతున్నారు. సిఫార్సు లేఖలు తీసుకొస్తున్నారు.*


*🌀సర్‌.. ఒక్క సీటు ప్లీజ్‌.. కావాలంటే మా సర్పంచితో చెప్పిస్తాం.. జడ్పీటీసీ సభ్యులు సిఫార్సు చేశారు. మా ఎమ్మెల్యేతో చెప్పించమంటారా..? అనేక ప్రభుత్వ పాఠశాలల్లో తారసపడుతున్న దృశ్యాలివి. ప్రవేశాల సమయంలో పేరున్న ప్రైవేట్‌ స్కూళ్ల వద్ద రద్దీ ఉండటం సాధారణం. అదే స్థాయిలో సర్కారు బడులకు సైతం డిమాండ్‌ పెరగడం విశేషం. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల సీట్ల కోసం ప్రభుత్వ పాఠశాలల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కొన్నిచోట్ల ప్రైవేట్‌ పాఠశాలలను మాన్పించి సర్కారు బడుల్లో చేర్పిస్తున్నారు. గతంలో పొలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది ప్రవేశాల సంఖ్య భారీగా పెరిగింది. ఆచార్య జయశంకర్‌ బడిబాట కార్యక్రమం గడువునూ సర్కారు పొడిగించింది.*


*💠ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు మెరుగుపడటం, తెలుగు/ఆంగ్ల మాధ్యమాల్లో బోధన సాగుతుండటం, ఉపాధ్యాయులు చొరవ చూపటంతో ప్రవేశాల జోరు కనిపిస్తోంది. ‘మన ఊరు- మన బడి/ మన బస్తీ’ కార్యక్రమం ద్వారా రూపురేఖలు మారిన సర్కారు బడులకు విద్యార్థులు జైకొడుతున్నారు. సరికొత్తగా ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలతో పాటు రాత పుస్తకాలను ప్రభుత్వం ఉచితంగా అందజేయటం, ఉదయం రాగిజావ పంపిణీ, మధ్యాహ్న భోజనం కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతోంది.*


*💫ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ బడుల్లో 20వేల మంది విద్యార్థులు కొత్తగా చేరారు. ఇంతవరకు బాగానే ఉన్నా అక్కడక్కడ కొన్ని పాఠశాలల్లో బాలబాలికల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడం గమనార్హం. ఈ ప్రభావం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై పడనుంది. విద్యాసంవత్సరం ఆరంభంలోనే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఖాళీలకు తగ్గట్టు నియామకాలు చేయకపోవడం శోచనీయం. కొన్నిచోట్ల ఒకే ఉపాధ్యాయుడు ఐదు తరగతులకు బోధించాల్సి వస్తోంది. భద్రాద్రి జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలలు వందలాదిగా ఉన్నాయి. మరికొన్నిచోట్ల అసలు ఉపాధ్యాయులే లేరు.*


*✳️ప్రభుత్వ విద్యాలయాల్లో సంస్కరణలు ఫలిస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు వచ్చింది. డిజిటల్‌, ఆంగ్ల మాధ్యమంలో బోధన సాగుతుండటంతో సర్కారు బడులకు ఆదరణ పెరుగుతోంది. బాలబాలికల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయుల నోటిఫికేషన్ వేయాలి.

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE