NaReN

NaReN

Saturday, June 3, 2023

తాతయ్య స్ఫూర్తి


     తాతయ్య స్ఫూర్తి


      సరిగ్గా 60 సంవత్సరాల క్రితం ఒక చిన్న బాలిక *ఒక మర్రిచెట్టు కింద* కూర్చున్న ఒక పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు అయినా తన తాతకు గ్రామంలో ప్రతి ఒక్కరు ఇస్తున్న *గౌరవ మర్యాదలను* చూసి ఏంటి తాతయ్య ఈ ఊర్లో ప్రతి ఒక్కరు మీకు ఎనలేని  గౌరవం ఇస్తున్నారు. చివరికి మన ఊరు జమీందారు కూడా మీరంటే అంత అభిమానం అని అడగగా అదేమీ లేదమ్మా..!  అని చెబుతూనే..!  గ్రంథాలయానికి తీసుకెళ్లి ఇగో ఇక్కడ ఉన్న వందల పుస్తకాలను నేను చదవడం వల్ల అందులో ఉన్న విషయ జ్ఞానమంతా నాకు తెలియడం వల్లే నాకు  వారంతా గౌరవిస్తున్నారని చెప్పారు... అప్పుడు ఆ అమ్మాయి అమాయకంగా అయితే నేను *ఈ పుస్తకాలు📚 చదివితే* నాకు గౌరవం లభిస్తుందా..! అని అడగగా తప్పకుండా అని సమాధానం ఇచ్చారు.  ఇక సీన్ కట్ చేస్తే *ప్రతిరోజు అమ్మాయి తాతయ్య వెంట వెళ్తూ గ్రంథాలయంలోని పుస్తకాలు చదవడం* ప్రారంభించింది  ఎప్పటిలాగే రోజు తాతయ్య వేసే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూనే ఒకరోజు *నీకు పక్షి లాగా రెక్కలు* ఉంటే ఏమి చేస్తావమ్మా అని తాతయ్య అడగగా ఇప్పట్లాగే ఇంద్రధనస్సు పైకి ఎగురుతాను పక్షిలాగా ఆకాశంలో విహరిస్తాను అని కాకుండా పక్కూర్లో ఉండే గ్రంథాలయానికి వెళ్లి అక్కడ పుస్తకాలు చదువుతాను తాతయ్య అని భిన్నమైన సమాధానం రావడం గమనించిన తాతయ్య తనలో వచ్చిన మార్పును చూసి సంతోషపడ్డాడు. అలా చెప్తూనే అమెరికాలో ఆండ్రు కార్నిగి అనే వ్యక్తి తన సంపాదనతో ఎన్నో గ్రంథాలయాలు ఏర్పాటు చేశాడు ఆ విధంగా నీవు పెద్దయ్యాక కనీసం ఒకటి రెండు గ్రంథాలయాలన్న ఏర్పాటు చేయాలని తాతయ్య తన కోరికగా చెబితే ఓ తప్పకుండా తాతయ్య అని సమాధానం ఇచ్చిన బాలిక పెద్దయ్యాక కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి ఎన్నో పుస్తకాలు రచించి వేల కోట్ల అధిపతిగా చేరి ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో వేల గ్రంథాలయాలు ఏర్పాటు చేసి అనేక ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్లు ఏర్పాటు చేసిన అమృతమూర్తి మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి విద్యావేత్త *డాక్టర్ సుధా మూర్తి గారు.* 

     చూడండి మిత్రులారా..!ఎక్కడో కర్ణాటక రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో ఒక మర్రి చెట్టు కింద కూర్చున్న ఒక మధ్య తరగతి ఉపాధ్యాయులు అయిన తాత గారు తను చేస్తున్న కార్యకలాపాలు తన మనవరాలి రూపంలో ఎంత గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడో చూడండి. అందుకే మనం ఎక్కడున్నామన్నది కాదు..! ఎలా జీవిస్తున్నామన్నది చాలా ముఖ్యం. మన చర్యలే వారి యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని నిర్మిస్తాయని మర్చిపోవద్దు. మనం చేసే మంచి, చెడు మొత్తం ప్రపంచం చూస్తుంది... అనుకరిస్తుంది. మన పిల్లలు *కలాం..! సుధా మూర్తి..* లాగా కావాలని కలలు కంటున్న ప్రతి తల్లిదండ్రులు *కాలం ఎంతో విలువైనది* అలాంటి కాలం మనం *పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఫోన్ నొక్కుతూ.. టీవీ చూస్తూ* గడపడం ద్వారా *కాలం అంత విలువైనది కాదు..!* అని పరోక్షంగా మన పిల్లలకు నేర్పుతూ వారి పతనానికి కారణం  అవుతున్నాం..! కాబట్టి మన కార్యకలాపాలలో, సమయ పాలనలో మీరే వారికి ఆదర్శంగా లేకపోతే ఎలా...! 

*మీరే ఆలోచించండి.*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE