NaReN

NaReN

Friday, June 23, 2023

మనం మంచివాళ్లమా?

  మనం మంచివాళ్లమా?  

అయితే ఈ క్రింది సంధర్భాలలో మనం ఎలా ప్రవర్తిస్తారో చూసుకోండి.


ఒక మహిళ తన వాళ్ళతో ఒక పెద్ద హోటల్లో బస చేసింది. ఆమెకో చంటి పాప. ఆ హోటల్ మేనేజరుని *"పాపకు ఒక కప్పు పాలు దొరుకుతాయా"* అని అడిగింది. మేనేజరు *"దొరుకుతాయి! కానీ 100 రూపాయలు అని చెప్పాడు."

ఆ హోటల్ నుంచి ఇంటికెళ్ళేప్పుడు పాపకు మళ్ళీ ఆకలేసింది. దారిలో ఒక టీ స్టాల్లో పాపకు కప్పు పాలు తీసుకుని, 'ఎంత' అని అడిగింది. *"చిన్నపిల్లల పాలకు డబ్బులొద్దమ్మా! దారిలో పాపకు ఇంకా కావాలంటే తీసుకెళ్ళమ్మా!"* అని చెప్పాడు టీ స్టాల్ యజమాని. ఆ మహిళ ఆలోచించింది. *"ఎవరు ధనవంతులు? హోటల్ ఓనరా! టీస్టాల్ ఓనరా !!" నిజంగా పేదవాళ్ళు ఎవరు.


ఇంకో ఉదాహరణ చూద్దాం:


ఓ ధనవంతురాలు బట్టల షాపులో, "కొంచెం ధర తక్కువ బట్టలు చూపించండి, మా అబ్బాయి పెళ్లి, మా పనిమనిషికి పెట్టాలి" అని అడిగింది. కొంత సేపటికి ఆ ఇంటి పనిమనిషి అదే బట్టలు షాపుకు వచ్చి, *"మా యజమానురాలి కొడుకు పెళ్లి, ఒక మంచి సూట్ చూపండి. కొంచెం ధరెక్కువైనా ఫర్వాలేదు"* అని చెప్పింది. పేదరికం మనసులో ఉందా! పర్సులో ఉందా!


కొన్ని సార్లు సంపాదనలో పడి మనం మనుషులం అన్న సంగతి మరిచిపోతాం. అవసరమైన వాళ్ళకు ప్రతిఫలాపేక్ష లేకుండా చిన్న సహాయం చేద్దాం. అది డబ్బు సంపాదించడం కన్నా ఆనందాన్నిస్తుంది. 

స్వతహాగా మనం మంచివాళ్ళమే. మంచివాళ్ళ స్నేహం మరింత మంచివాళ్ళను చేస్తుంది. 

ప్రపంచం అంతా మంచివాళ్ళతో నిండి ఉంది. 

మీకెవ్వరూ కనిపించక పోతే మీరే మంచివాళ్ళుగా మారండి.



No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE