NaReN

NaReN

Wednesday, June 28, 2023

ఆ అంతరం - నిరంతరం*

 

*ఆ అంతరం - నిరంతరం*

ఆ అంతరం అలాగే ఉండిపోయింది


 మధ్యతరగతి అంతరంగంలో ఆ  అంతరం అలాగే ఉండిపోయింది🤔                   


1)* చిన్నప్పుడు రైల్లో ప్రయాణం చేసేటప్పుడు - తినడానికి , ఇంటినుండి అమ్మ చేసినవి తీసుకెళ్ళేవాళ్ళం.


 కొంతమంది - రైల్లో కొనుక్కుని తినేవాళ్ళని చూసినపుడు మనమూ అలాగే కొనుక్కుని తినాలనిపించేది!

 

అప్పుడు నాన్న చెప్పేవాళ్ళు, *అది మన స్థాయికి చేయదగ్గది కాదు, డబ్బులున్న గొప్ప వాళ్ళు చేసేది అని!*


ఇప్పుడు పెద్దయ్యాక - 

మనం కొనుక్కుని తినే టైంకి.....

 ఆ పెద్ద వాళ్ళు , గొప్పవాళ్ళు ఆరోగ్య రీత్యా ఆహారం ఇంటినుండి తెచ్చుకుని తింటున్నారు.😂


*దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది .*


*2)* చిన్నప్పుడు కాటన్ దుస్తులు వేసుకుంటే - కొంతమంది టెర్లిన్ బట్టలు తొడుక్కునే వాళ్ళు.

 అదిచూసి అటువంటివి కావాలనిపించినపుడు, నాన్న చెప్పే వారు ...

అది ఖరీదైనది మనం అంత పెట్టగలిగే వాళ్ళంకాదని!*   


పెద్దయ్యాక - 

మనం టెర్లిన్ వాడటం మొదలు పెడితే , వాళ్ళు  కాటన్ కు దిగారు. ఇప్పుడు, కాటన్ దుస్తులధరేఎక్కువ 🤪


*దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది ..*😒🤔


3)* చిన్నప్పుడు ఆడుకుంటూ ఉన్న కాటన్ ప్యాంటుకే - మోకాళ్ళ దగ్గర చినిగితే , పారేసెందుకు మనసొప్పక అమ్మ లేదా టైలర్ తమ పనితనం చూపి నీట్ గా రఫ్ చేసి ఇస్తే ..మళ్ళీ హ్యాపీగా వేసుకునేవాళ్ళం!


పెద్దయ్యాక చూస్తే - 

జనం ఆ మోకాళ్ళదగ్గర చిరుగులు ఉన్నవాటిని.... ఫ్యాషన్ పేరుతో అధికధరలకు కొంటున్నారు !


దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది ...*🤔😒


4)* ఓ వయసులో మనకు - సైకిల్ కొనగలగడమే కష్టం.


అదీ సాధించేసరికి - వాళ్ళు స్కూటర్ నడిపించేవాళ్ళు.


మనం - స్కూటర్ కొనే సమయానికి ....

వాళ్ళు కార్లలో తిరిగేవారు.


మనం కొంచెం ఎదిగి - మారుతి 800 కొనే సమయానికి ....

వాళ్ళు BMW ల్లో తిరిగారు.


 మనం రిటైర్మెంట్ వయసుకి  వచ్చిన కూడబెట్టుకున్న వాటితో  - కొంచెం పెద్ద కారు కోనేసమయానికి ....

 వాళ్ళు ఆరోగ్యావసరాలతో సైక్లింగ్ చేస్తున్నారు!


*దాంతో ఇప్పటికి ఆ అంతరం అలాగే ఉండిపోయింది* . .🤔😒

                        

ప్రతి దశలో ,

ప్రతి సమయాన ,

విభిన్న మనుషుల మధ్య - స్థాయి అంతరం ఉండనే ఉంటుంది.


*ఆ అంతరం - నిరంతరం* ఎప్పటికి ఉండి తీరుతుంది.


రేపటిఆలోచనతో ఇవాళ్టిది వదులుకుని .....😢

మళ్ళీ రేపటిరోజున - గతించిన  ఇవాళ్టి గురించి ,చింతించేకంటే..


ఇవాళ అందినదానితో ఆనందించు.. ఆస్వాదించు..

 *జీవితం కూడా సంతోషంగా ఉంటుంది*

1 comment:

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE