NaReN

NaReN

Sunday, January 1, 2023

తెలుగు వారందరం తెలుగు కాలపట్టిక పాటిద్దాం

 తెలుగు వారందరం తెలుగు కాలపట్టిక పాటిద్దాం


తెలుగు మాట్లాడే ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వము ఇకనైనా ప్రభుత్వ సెలవులను తెలుగు సంవత్సర ప్రమాణికంగా ప్రకటిస్తే బాగుంటుంది తర్వాత క్రమేపి పరీక్ష తేదీ లను మరియు హై స్కూలు కాలేజీ సెలవులను ఇతర కాల పట్టికలను కూడా తెలుగు సంవత్సర ప్రమాణికంగా ప్రకటిస్తే బాగుంటుంది.


తెలుగు మాతృభాష అయి ఉన్నా కూడా జన్మదిన వేడుకలు గాని వివాహ వేడుకలు గాని శుభ అశుభ కార్యక్రమాలు గాని తెలుగు తేదీలు (తిథులు) కంటే ఇంగ్లీషు తేదీలనే ఎక్కువ అనుసరిస్తారు. పంచాంగ కర్తల పుణ్యమా అని తెలుగు పండుగలను మాత్రము వారు నిర్ణయించిన తెలుగు తిథుల ప్రకారమే జరుపుకుంటున్నారు. ఇంగ్లీషు తేదీలకు సరియగు తెలుగు తేదీలను గూగుల్ లో సెర్చ్ చేసుకోవచ్చు.  కావున మున్ముందు తెలుగు తేదీలను పాటించడం అలవాటు చేసుకుంటే మంచిది


మన పండుగలకు కానీ శుభ  అశుభ కార్యక్రమాలకు గాని సంప్రదాయ పిండి వంటలు ఇంట్లో తయారు చేసుకొని జరుపుకునే ఆచారం ఉండేది. సంక్రాంతికి సకినాలు వినాయక చవితికి కుడుములు దీపావళికి లడ్డూలు స్వీట్స్ హర్షలు దసరాకు గారెలు బూరెలు సద్దులకు సత్తిపిండిలు ఉగాదికి భక్షాలు ఉగాది పచ్చడి ఇలా ఇంట్లో కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో సంబరంగా జరుపుకునేవారు కానీ కాలక్రమైనా సంప్రదాయ పండుగల కంటే బయటనే అనగా హోటల్లో గానీ రెస్టారెంట్ లో గాని పబ్బుల్లో గాని రిసార్ట్లో గాని 31 డిసెంబర్ ఈవెంట్ బర్త్డే పార్టీస్ మ్యారేజ్ డే పార్టీలు ప్రాసెసింగ్ ఫుడ్ జంక్ ఫుడ్ బేకరీ ఫుడ్ తో అట్టహాసంగా జరుపుకునే ఆచారము దిన దినము పెరుగుచున్నది.


ఆరోగ్యరీత్యా మనకు ఎటువంటి ఆహారము లాభదాయకము అని సాధ్యమైనంత వరకు పిల్లలకు తెలియపరిస్తే బయట దొరికే జంక్ ఫుడ్ కు అలవాటు పడరు. ఏ ఈవెంట్ లనైనా ఇంట్లోనే అమ్మ చేసిన పిండి వంటలతో ఎంజాయ్ చేస్తారు


మార్పు ఊరికనే రాదు మీరు మార్పు కోసం కష్టపడిన దానికంటే రెట్టింపు ఫలితాలు వస్తాయి.

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE