NaReN

NaReN

Saturday, January 7, 2023

యాపిల్ పండును తొక్కతో తినాలా ?

 Apple : యాపిల్ పండును తొక్కతో తినాలా? తొక్క లేకుండా తినాలా ? ఎలా తింటే మంచిదో నిపుణుల అభిప్రాయాన్ని తెలుసుకోగలరు.


యాపిల్ పండు.. ఔషధాలు మెండు.. నిజమేనండీ.. ఒక్క యాపిల్ లోనే మన శరీరానికి మంచి చేసే అనేక విటమిన్లు, వ్యాధి నిరోధక శక్తని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

అందుకే వైద్యులు ప్రతి రోజు ఒక యాపిల్ తినమని పదే పదే చెబుతుంటారు. ఇంకా చెప్పాలంటే రోజూ ఒక యాపిల్ తింటూ ఉంటే అసలు డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదట. అనేక రోగాల నుంచి రక్షణ లభిస్తుందట. యాపిల్ పండ్లను తినని వారి కన్నా.. తినే వారిలోనే రోగాలను ఎదుర్కొనే శక్తి బాగా ఉంటుందట. ఇది అతిశయోక్తి కాదండోయ్! ముమ్మాటికి వాస్తవం. వైద్యులే ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు.

తేడా ఎక్కడ ఉంది..?

అయితే యాపిల్ తినే విధానంలో కొంత తేడా ఉంటున్నట్లు వారు చెబుతున్నారు. తినే విధానంలో తేడా ఎంటా అని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి కొంత మంది యాపిల్ పండు పైన పొట్టు తీసేసి తింటూ ఉంటారు. దీని వల్ల శరీరానికి అందాల్సిన పోషకాలను నష్టపోతామని నిపుణులు సూచిస్తున్నారు. అసలు యాపిల్ లో ఉండే ఔషధాలు ఏంటి? దానిని ఎలా తినాలి? ఎలా తినకూడదు? వంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గుజ్జు కన్నా పొట్టులోనే పోషకాలు..

యాపిల్ పండు తినే సమయంలో చాలా మంది ఎంచక్కా ఓ చాకును తీసుకొని దాని పైన పొట్టునంతా ఊడబెరికి.. లోపలి గుజ్జుని తీసుకుని తింటుంటారు. అయితే యాపిల్ లో గుజ్జులో కన్నా దానిపై ఉండే పొట్టులోనే 4 నుంచి 6 రెట్ల ఎక్కువ పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పొట్టును తీసేసి తినడం వల్ల ఆ పోషకాలను కోల్పోయినట్లు అవుతుందని వివరిస్తున్నారు. సాధారణంగా యాపిల్ పై పొట్టు 0.3 ఎంఎం నుంచి 0.5ఎంఎం మందంతో ఉంటుంది. ఇది ఫైబర్‌ గుణాలను అధికంగా కలిగి ఉంటుంది.

పొట్టు పెద్ద ఇమ్యూనిటీ బూస్టర్..

యాపిల్ పై పొట్టు శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని అందివ్వడంలో సాయపడుతుంది. దీనిలో అధికంగా ఉండే పాలిఫినాల్స్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి మన శరీరంలోకి వెళ్తే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాక పొటాషియం, విటమిన్ ఈ కూడా పొట్టులోనే అధిక మోతాదులో ఉంటాయి. లోపలి గుజ్జుతో పోల్చుకుంటే పొట్టులో ఇవి 2 నుంచి 4 రెట్లు అధికంగా ఉంటాయి. పొట్టుతోనే యాపిల్ తీసుకోవడం ద్వారా వ్యాధులు దరిచేరే అవకాశం ఉండదు.

విటమిన్ ల సమ్మేళనం..

యాపిల్ పండు అనేక రకాల విటమిన్ల సమ్మేళనం అని నిపుణులు చెబుతుంటారు. పొట్టుతో పాటు తింటేనే అవి పుష్కలంగా శరీరానికి అందుతాయని వివరిస్తున్నారు. సాధారణంగా
ఒక మీడియం సైజ్ యాపిల్ లో విటమిన్ సీ 8.5 మిల్లీగ్రాములు.. విటమిన్ ఏ 100ఐయూ మేర ఉంటుంది. అయితే పొట్టు తీసేస్తే వీటి శాతం గణనీయంగా తగ్గిపోయి.. విటమిన్ సీ 6.5 మిల్లీగ్రాములు, విటమిన్ ఏ 60 ఐయూ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ యాపిల్ పండును పొట్టుతోనే తినాలి. పండును లోపలి గుజ్జుతో మాత్రమే తింటే దాని నుంచి ప్రయోజనం అంతగా ఉండదు.

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE