NaReN

NaReN

Tuesday, January 10, 2023

పాత సంప్రదాయాలు మళ్లీ మొదలు పెట్టండి

 * పాత సంప్రదాయాలు  మళ్లీ మొదలు పెట్టండి*

   

పెద్దలకు *"మహారాజశ్రీ"* అనే పదం వాడేవారు. 

పిన్నలకు *"ప్రియమైన"* లేక *"చిరంజీవి"* పదాలు వాడే వారు.

స్త్రీలకు పెద్దవాళ్ళైతే *" లక్ష్మి సమానురాలగు"* పదాలు వాడేవారు. 

విధవలకు *"గంగాభాగీరథీ సమానురాలగు"* అనే పదాలు వాడేవారు.

ఆ రోజుల్లో పోస్టుకార్డులు ఎక్కువగా వాడేవారు.

ఉత్తరం యొక్క శరీర భాగంలో ఆరోగ్య సమాచారాలు, కష్టసుఖాలు, కుటుంబ సమస్యలు, బాంధవ్యాలకు అనుగుణంగా సంభోదించుకొంటూ, పెద్దలకు నమస్కారాలు, పిన్నలకు దీవెనలతో ముగిస్తుండేవారు. 

ఆనాటి ఉత్తరాల్లో ప్రేమ, పెద్దరికం, చక్కని బాంధవ్యాలు కనిపించేవి.

వివాహాలు, అమ్మాయిల వోణీ ధారణ లాంటి శుభ సమాచారాలుంటే ఉత్తరానికి నలుమూలల *పసుపు* రాసి పంపిస్తుండేవారు. 

చావులాంటి అశుభ వార్తలుంటే *సిరా* ఉత్తరానికి నలుమూలల రాసి పంపిస్తుండేవారు. అలాంటి ఉత్తరాలు వస్తే చదివి బయటే చించి పడేస్తుండేవారు. 

మామూలు ఉత్తరాలను ఒక *తీగెకు గుచ్చి* పదిలంగా ఉంచుతుండేవారు.

నేడు ఉత్తరాల సాంప్రదాయం పోయింది. భాషలో సంస్కారహీనత, పెద్దలంటే నిర్లక్షత, గౌరవ రహితం. *చరవాణి* ద్వారా అర్ధం కాని లఘు సందేశాలు పంపించి చేతులు దులిపేసుకుంటారు. 


*🙏నమస్కరించే సంస్కారం పోయింది.*

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE