NaReN

NaReN

Saturday, January 14, 2023

పిల్లలుకి ఉపయోగపడే simple english

 పిల్లలుకి ఉపయోగపడే simple english


1. Good morning children!

 2.  Good morning everyone!

 3.  Good afternoon children!

 4.  Answer your roll call.

 5.  Attend your roll call.

 6.  Come here!

 7.  Why were you absent                yesterday?

 8.  Where have you been?

 9.  What happened?

10. Have you been to hospital?

11. How are you today?

12. Are you feeling better?

13. Who is absent today?

14. What's the matter?

15. Have you done your     homework?

16. Come here with your books!

17. Keep your books on the table.

18. It's good!

19. Do you remember?

20. Have you forgotten?

21. Don't let it happen again!

22. Don't write like this!

23. This is the way to do it.

24. Correct the mistake.

25. Now, children, listen to me!

26. Let's say a rhyme!

27. Let's sing a song!

28. Listen and repeat!

29. Say after me.

30. Let's say it together!

31. Are you ready?

32. Answer my question.

33. Answer this question.

34. Say it again, please!

35. Speak up! I can't hear you.

36. No, not at all!

37. Who can answer this?

38. Raise your hand! 

39. Say it correctly!

40. Who can say the right   answer?

41. Do you want to say it?

42. That's right!

43. Good!

44. Very good!

45. Exactly!

46. Shall we start the lesson?

47. I'm waiting for you to be quite.

48. Why are you talking?

49. Stop talking and be quite!

50. Is everyone ready for the lesson?

51. Don't make a noise!

52. Sit up straight!

53. Pass me a textbook!

54. Open your books at page  number 27.

55. Look at this picture!

56. What do you see in the picture?

57. What else?

58. Look at the black board!

59. Repeat after me!

60. Turn to page number 28.

61. Let's read the first paragraph!

62. Swarna, can you read the first sentence aloud?

63. Louder, please!

64. Quitely, please!

65. Underline the word 'cat'!

66. Circle the word 'cat'!

67. Stand up!

68. What's your name?

69. Spell your name!

70. Go to the black board!

71. Take a piece of chalk!

72. How do you spell the word 'cat'?

73. Write it on the board!

74. Draw the picture of a 'cat'.

75. Who will do the sum?

76. Who will correct the mistake?

77. Now it's your turn.

78. That's the way to do it.

79. Sharpen your pencil!

80. Write with a pencil!

81. Hold your pencil like this!

82. Pick up the pen!

83. Take notes!

84. Copy the word 'cat'.

85. Can I have your textbook?

86. Go and get a pen/pencil/eraser...

87. Bring me a pen/pencil/eraser...

87. Who will bring it?

88. Have you done this?

89. Rekha has completed.

90. Have you completed?

91. Show me your notes.

92. Show her your notebook.

93. Give it to him.

94. Put down the pens!

95. Close your books!

96. Keep your books in your bag!

97. Put your bag away!

98. Put it away!

99. Put everything away!

100. Put your books here!

101. Put your books there!

102. Clear off your desk!

103. Work in groups!

104. Work on your own!(Individual activity)

105. Ask for help.

106. Ask her to help you.

107. Well done!

108. Excellent!

109. Wonderful!

110. Keep it up!

111. Note down your hometask/homework.

112. Bring it tomorrow!

113. I'll check it tomorrow!

114. Don't forget!

115. Time is up!

116. Pack your things!

117. Now it's time to go!

118. Good evening children!

119. See you tomorrow!

120. See you on Monday


More such words will share to u all

సంక్రాంతి సంప్రదాయాలు

 సంక్రాంతి సంప్రదాయాలు



హిందూ సంప్రదాయంలో ప్రతి ఆచారం, సంప్రదాయం వెనుక భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం అనే మూడు ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. సంక్రాంతి అంటే పిండివంటలు చేసుకోవడం, దేవాలయాలకు వెళ్లి దండం పెట్టుకోవడమే కాదు. మన పెద్దలు అనుసరించే సంప్రదాయాల వెనకున్న మర్మం ఏమిటి? వాటి నుంచి మనమేం నేర్చుకోవాలి? ఛాందసత్వానికి పోకుండా శాస్త్రీయంగా ఎలా అర్థం చేసుకోవాలి.


ముగ్గులు.....


ఓర్పును నేర్పే కళ…

ఇంటి ముందు లోగిళ్లలో ఒక పెద్ద రథం ముగ్గో, నక్షత్రం ముగ్గో, సర్వవాకిళ్లు ముగ్గో వేస్తే చాలు. గంటసేపు ట్రెడ్‌మిల్ మీద వ్యాయామం చేసిన శ్రమకు సమానం. ముగ్గు వేయడం అంటే.. బోలెడన్ని చుక్కలు పెట్టాలి. వాటన్నిటినీ కలుపుతూ లైన్లు వేయాలి. ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఆ క్రమంలో ఎన్నిసార్లు పైకి లేవాలి, ఎన్నిసార్లు కిందికి వంగాలి.. లెక్కపెట్టుకోలేనన్నిసార్లు కదలాల్సి వస్తుంది. అందులోను జారిపోయే కొంగును సరిచేసుకుంటూ.. ముందుకు పడే జెడను వెనక్కి వేసుకుంటూ.. ముగ్గు మీద ఏకాగ్రతను సంధించాలి. ముగ్గు ఇంటికి అలంకరణే కాదు.అదొక మానసికోల్లాసం. మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును అందించే ఫజిల్‌సాల్వింగ్ లాంటిది. ముగ్గులు మనకో తాత్విక దృక్పథాన్ని తెలియజేస్తాయి.

రథం ముగ్గు తప్పనిసరి వేయాలి.

ఆ రథం యమధర్మరాజుది. 

అతన్ని సంక్రాంతి రోజు భూలోకం నుండి సాగనంపుతారు.

చలి వణుకుడుతో సంభవించే మరణాలకు స్వస్తి చెప్పినట్లు.

రథం పైన యమధర్మరాజు బొమ్మను వేసేవారు. ఆ రథానికి ఒక తాడు పెట్టేవారు,


యమధర్మరాజు చేతిలో దండం పెట్టేవారు. 

చేతిలో ముగ్గును పోసుకొని, వేళ్ల మధ్య సందుల ద్వారా ముగ్గును జార విడుస్తూ రథం వేసేవారు. ఆడ పిల్లలు ఆ ముగ్గుకు “గజ్జెలు “ కొట్టేవాళ్లు

పొడుగుముగ్గు అంచులకు అడ్డంగా చిన్న గీతలు - గజ్జెలు.

చేతిలో నుండి ముగ్గు జారాలంటే అది పొడిగా తేమ లేకుండా ఉండాలి. అందుకోసం ఒక టెంకెలో ముగ్గు తీసుకొని, నిప్పుకణికలు వేసేవాళ్లు

ముగ్గు పొడిలోని తేమ పోయేది.

వాకిలి కూడా కలాపితో తేమగా ఉండకూడదు.

అమ్మలందరూ ఈ ముగ్గును

వేయడానికి నాలుగు గంటలకు 

లేచేవారు. 

వేళ్లను ఆడిస్తూ ముగ్గు వేయడాన్ని

గోటి ముగ్గు అంటారు.


భోగిమంటలు.


వ్యామోహానికి నిప్పు

మనుషుల మీదైనా, వస్తువుల మీదైనా వెర్రివ్యామోహం పనికిరాదు. కరుడుగట్టిన అలాంటి కోరికలేవైనా ఉంటే వాటిని వదిలించుకోవాలి.  అప్పుడే జీవితం నిశ్చింతగా ఉంటుంది. ఈ మాటను ఊరికే చెబితే ఎవరు వినరు. భోగిమంట రూపంలో చెబితే వింటారన్నది పెద్దల నమ్మకం. మన లోపల పాతుకుపోయిన పాతను వదిలించుకోవడానికి భోగిమంట ఉపకరిస్తుంది. ఒక పూలతోట మీదుగా గాలి వెళితే అది సుగంధభరితం అవుతుంది. అదే గాలి ఒక మురికికాలువ మీదుగా వెళితే దుర్గంధంగా మారిపోతుంది. మనిషి ప్రాణం కూడా అంతే! మనిషి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే ఆయువు గాల్లోకి కలిసిపోతుంది. ఆ స్థితిని బట్టే పునర్జన్మ దక్కుతుంది. కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండమంటుంది భోగిమంట. ఇంట్లోని కుర్చీకి ఒక కాలు విరిగిపోయి కుంటుతున్నా సరే దాన్ని వదలం. “అది మా తాతగారిది. అదంటే నాకు సెంటిమెంటు” అని పట్టుకు వేళ్లాడతాం. పాడైపోయిన పాతవస్తువునే అంత సులువుగా వదులుకోకపోతే.. రేప్పొద్దున తుచ్ఛమైన ప్రాణాన్ని స్వేచ్ఛగా ఎలా వదలగలుగుతావు? అంతవరకు ప్రాణభయంతో నిశ్చింతగా ఉండగలవా? ఉండలేవు. అందుకే నీలోని పాతను భోగిమంటతోపాటు వదిలేయి.


గంగిరెద్దులు, హరిదాసులు....


భిక్షానికీ ఓ ధర్మం..

ఏ పనీ చేయకుండా బిచ్చమెత్తుకోవడం ధర్మం కాదు. గంగిరెద్దుల వాడైనా, హరిదాసైనా ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పే బిచ్చమెత్తుకుంటారు. గంగిరెద్దుల వాడైతే ఇల్లు కలవాళ్లు ఏదిచ్చినా గంగిరెద్దు మీదే వేస్తాడు తప్ప చేతికి తీసుకోడు. పాత చీరలిస్తే వాటినే తీసుకుంటారు. హరిదాసు కూడా ఏడాదికి ఒకసారే వచ్చి హరినామకీర్తనలు పాడి.. గిన్నెడు బియ్యం తీసుకుని సంతృప్తిగా ఇంటికెళ్లిపోతాడు. పండగ పోయాక మళ్లీ ఏ వీధిలోనూ కనిపించడు. హరిదాసు ఇంటి ముందుకొచ్చి గొబ్బెమ్మల్ని తొక్కి వెళితే మంచిది.


గుమ్మడికాయ....


తీగల్లా అల్లుకుపోవాలి..

ఎప్పుడూ గుర్తుకురాని గుమ్మడి సంక్రాంతి రోజున గుర్తుకొస్తుంది. గుమ్మడి పోషకాల గని. ధాతుపుష్టికి, సంతానవృద్ధికి పనికొస్తుంది. ఏడాదికి ఒకసారైనా గుమ్మడికాయ వంటల్ని తినాలన్నది పెద్దల మాట. గుమ్మడి ఆకారం విశ్వస్వరూపానికి ప్రతీక. గుమ్మడి పాదు కూడా విస్తృతంగా అల్లుకుపోతుంది. మనిషి జీవితాన్ని కూడా ఎంత విస్తృతి చేసుకుంటే అంత ఉత్తమం. ఇరుకైన మనస్తత్వం కలిగుంటే ఇరకాటంలోనే ఉండిపోవాల్సి వస్తుందని గుమ్మడి చెబుతుంది.


గొబ్బెమ్మలు....


అసహ్యం నుంచి అద్భుతం

కృష్ణ భక్తురాలైన గోపెమ్మ అనే పేరు నుంచి పుట్టిందే గొబ్బెమ్మ. ఈ భూమ్మీదున్న దేన్నీ అసహ్యించుకోకూడదు. ప్రతిదీ ప్రకృతి ప్రసాదితం. అసహ్యమైన పేడను కూడా అద్భుతంగా మలిస్తే అది గొబ్బెమ్మ అవుతుంది. జీవి కడుపులో ఉన్నంత కాలం పవిత్రమైనది. తల్లి కడుపు దాటి నేల మీద పడగానే అపవిత్రమైపోతుంది. అందుకే, నేల మీద పడని ఆవుపేడతోనే గొబ్బెమ్మలను చేస్తారు .


భోగిపండ్లు


యోగిత్వం.. బదరీఫలం

సంక్రాంతి వస్తే పిల్లలకు భోగిపండ్లు పోసి.. మురిసిపోతుంటారు  తల్లిదండ్రులు. ఇప్పుడైతే ఈ సంప్రదాయం తగ్గింది కానీ ఒకప్పుడు పిల్లలున్న ప్రతి ఇంట్లో భోగిపండ్ల దృశ్యాలు కనువిందు చేసేవి. అనాధి నుంచి వస్తున్న సంప్రదాయం ఇది. భోగిపండ్లు లేదా రేగుపండ్లలో ఎనలేని ఔషధగుణాలు ఉన్నాయి. చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు (పైబర్) పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కాని సమస్య తొలగిపోదు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు కనక.. ఆ లోటును పూడ్చేందుకు రేగుపండ్లను తినమనే వారు. రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. ‘భుక్త్వాచ బదరీఫలం’ అన్నది అందుకే. భోంచేసిన తర్వాత రేగుపండ్లు తింటే మంచిదన్నది దాని అర్థం. రేగుపండ్లు జఠరాగ్నిని ఉరకలెత్తిస్తాయి. శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి.బదరీవనం (రేగుపండ్ల తోట)లో వేదవ్యాసుడు తపస్సు చేసేవాడన్న మరో ఐతిహ్యం కూడా ఉంది. కాబట్టే ఆయనకు బాదరాయణుడు అన్న పేరొచ్చింది. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే – రేగుపండ్లు యోగిత్వానికి ప్రతీక. మరో విశేషమేమంటే రేగుపండ్లను జంతువులు తినవు. మనుషులే తింటారు. హిందూ సంస్కృతిలో రేగుపండ్లకున్న ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. పండగపూట పిల్లలకు చిల్లర నాణేలతో కలిపి భోగిపండ్లు పోస్తారు. ఆ సమయంలో తల మీద చిల్లర నిలబడితే ‘భోగి’ అవుతారని, రేగుపండ్లు మాత్రమే నిలబడితే ‘యోగి’ అవుతారన్నది ఒక విశ్వాసం.


గాలిపటం.


దారంలాంటిది జీవితం

ప్రతి మనిషికీ ఆత్మనిగ్రహం అవసరం. అది లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు.. మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెబుతుంది గాలిపటం. ఒడుపుగా లాగితే తెగిపోతుంది. వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైనా, జీవితమైన ముందుకు వెళుతుంది. అయితే చేతిలో దారం ఉంది కదాని ఎంతదూరమైనా గాలిపటాన్ని వదల్లేము. ఏదో ఒక సమయంలో మళ్లీ చుట్టచుట్టి గుప్పెట్లోకి తీసుకోవాల్సిందే. ఆ గుప్పెడు అనేది భగవంతుడులాంటిది. మనం ఎంత ఎత్తుకు ఎగిరినా భగవంతుని చేతిలోనే ఉన్నామన్న సంగతిని మరిచిపోకూడదు. గాలిపటానికి ఎన్ని రంగులున్నా, ఎంత పొడవు తోక పెట్టుకున్నా, ఎవరింటి మీద వాలినా దారం చుట్టక తప్పదు. అదే సూత్రం మనిషికీ వర్తిస్తుంది.


కోడిపందేలు.


యుద్ధనీతిని గెలిపించే పందెం

పండగ పరమార్థాన్ని మరిచిపోయి దాన్ని పరహింసగా మార్చాం. నేడు జరుగుతున్న కోడిపందేలే అందుకు నిదర్శనం. కోడిపందేలకు తరాల చరిత్ర ఉంది. కాని ఆ రోజుల్లో కోళ్లకు కత్తులు కట్టి ఆనందించేవారు కాదు. ఇప్పుడు కత్తులు కట్టి, డబ్బు కట్టలు పెట్టి జూదంగా మార్చేశారు. పాతరోజుల్లో ఇద్దరి మధ్య వైరం ఏర్పడితే దాన్ని కోడిపందెం ద్వారా పరిష్కరించేవారు మధ్యవర్తులు. పల్నాటి కాలంలో మాచర్ల, గురజాల మధ్య గొడవ యుద్ధానికి దారితీసింది. అలాంటి సమస్యను కోడిపందెమే పరిష్కరించింది.  యుద్ధనీతిని తెలియజేసింది.


పశు పూజలు


శ్రమకు కృతజ్ఞత

సంక్రాంతికి ఇంటి నిండా ధాన్యం వచ్చిందంటే.. అది పశువుల పుణ్యం. ఏడాది పొడవునా పశువులతో చాకిరీ చేయించడమే కాదు. పండగరోజైనా వాటిని పూజించి కృతజ్ఞత చెప్పుకోవాలంటుంది పశువుల పూజ. ఆ రోజు రైతులు నాగలి కట్టరు. ఎద్దుల మీద కాడి మోపరు. బండ్లు తోలరు. అందుకే ‘కనుమ రోజు కాకైనా కదలదు’ అంటారు.



Thursday, January 12, 2023

యుద్దం

 యుద్దం


ఒకానొక యుగంలో పక్షులకి, మృగాలకీ ఘోరాది ఘోరమైన మహాయుద్ధం జరిగింది. చాలా సంవత్సరాలు పక్షులు, మృగాలు కొట్టుకుంటూనే వున్నాయి.


ఒక రోజు పక్షులు నెగ్గితే, మరొక సారి జంతువులు నేగ్గేవి.


ఇలా యుద్ధం జరుగుతున్నప్పుడు గబ్బిలాలు మట్టుకు మోసం చేసాయి. ఏ జెట్టు గెలుస్తుంటే అటు వైపుకి మారిపోయి ఇటు జంతువులను, అటు పక్షులను రెండిటినీ మోసం చేసాయి. గబ్బిలాలు అంటే బాట్స్.


యుద్ధం జరుగుతున్నన్ని రోజులు యే జెట్టు ఈ విషయం గమనించలేదు.


ఇలా చాలా సంవత్సరాలు యుద్ధం జరిగేక పక్షులు, జంతువులూ బాగా అలిసిపోయాయి. ఇక యుద్ధం విరమించుకోవాలని నిశ్చయించి, సంధి చేసుకున్నాయి. ఇక మీద ప్రశాంతంగా వుండాలని, ఇలా ప్రాణహాని జరగకూడదని, ఒక నిర్ణయం చేసుకున్నాయి.


యుద్ధం ముగిసి పోయింది.


కాని, ఇప్పుడు గబ్బిలాలకు మట్టుకు ఏమి చేయాలో తెలియలేదు. ముందు పక్షుల దగ్గరకు వెళ్ళాయి. కానీ చాలా సార్లు గబ్బిలాలు పక్షులకు విపక్షంగా పోరాడాయని పక్షులు వాటిని దగ్గరకు రానీయలేదు.


పోనీలే అనుకుని గబ్బిలాలు మృగాల దగ్గరకు వెళ్ళాయి. మృగాలు వాటిని దుత్కారించాయి.


యే ఆశ్రయం లేని గబ్బిలాలు ఇటు పక్షులు కాలేక, అటు మృగాలు కా లేక వంటరిగా ఉండిపోయాయి.

భారత్ ఫస్ట్

 భారత్ ఫస్ట్


1983లో ఆ కుర్రాడు పదో తరగతి పరీక్ష వ్రాశాడు. స్టేట్ ఫస్ట్....!


1985 లో ఇంటర్మీడియట్ పరీక్ష ... స్టేట్ ఫస్ట్....!


ఐఐటి ఎంట్రన్స్ పరీక్ష వ్రాస్తే ...మళ్లీ స్టేట్ ఫస్ట్....!


1989 లో చెన్నై ఐఐటీ నుంచి 

కంప్యూటర్ సైన్సు కోర్సు పూర్తిచేశాడు... బ్యాచ్ ఫస్ట్.....!


అదే ఏడాది 'GATE' పరీక్ష... మళ్లీ ఫస్ట్ రాంక్....!


ఐఏఎస్ పరీక్ష వ్రాశాడు... మళ్లీ ఫస్ట్ ర్యాంక్....!


ఐఏఎస్ శిక్షణలో.... మరోసారి ఫస్ట్....!


ఇన్నేసి ఫస్టులు వచ్చిన వ్యక్తిని అమెరికా ఎర్రతివాచీ పరిచి, 

గ్రీన్ కార్డు వీసాఇచ్చి, పచ్చజెండా ఊపి మరీ 

మామెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో

చేరమని సీటు ఇచ్చింది!


మరి.... మామూలు వాడైతే ఎగిరి గంతేసేవాడే! 

మనవాడు మాత్రం 'నా చదువుకు నాప్రభుత్వం డబ్బు ఖర్చు చేసింది. ప్రభుత్వం డబ్బంటే ప్రజల డబ్బు! 

ప్రజలడబ్బంటే పేదల చెమట... వాళ్ల రక్తం... 

వారు కొనే వస్తువులపైన, వేసుకునే బట్టలపైనా, 

చెల్లించే బస్సు టికెట్టుపైనా కట్టిన పన్నులే..... తనను చదివించాయి!'


'అలాంటిది ఆ పేదల స్వేదాన్ని..., 

జీవన వేదాన్ని వదిలి అమెరికా వెళ్లడం ఏమిటి' అనుకున్నాడు. 


ఇక్కడే ఉండి ఐఏఎస్ పరీక్ష వ్రాసి ఐఏఎస్ అయ్యాడు.


చిన్నప్పటినుంచీ నేర్చుకున్న విలువలు పేదల పట్ల ప్రేమ, 

ఏదో చేయాలన్న తపన... 

వీటన్నిటికీ సరిపోయే ఉద్యోగం వచ్చిందనుకున్నాడు.


అతని పేరే-రాజు నారాయణ స్వామి"

కేరళలోని పాల్ఘాట్ కి చెందిన వాడు.

అయితే అసలు చిక్కులు అక్కడ్నించే మొదలయ్యాయి.

ప్రతి చోటా అవినీతి అధికారులు, మంత్రులు,

స్వార్థపరులు రాజ్యమేలడం కనిపించింది!


ఎక్కడికక్కడ పోరాటం చేయాల్సి వచ్చింది.


ఒక చోట ఒక మెడికల్ కాలేజీ లోని 

వ్యర్థజలాలు రైతుల పొలాల్లోకి వెళ్తుంటే'అడ్డుకున్నాడు 

రాజు నారాయణస్వామి. 

మరుక్షణమే ఆయనకు ట్రాన్స్ ఫర్ ఆర్డర్ వచ్చింది.


ఆ తరువాత తన మామగారు రోడ్డును బ్లాక్ చేస్తూ 

భవనం కట్టుకున్నాడు. "నా అల్లుడు కలెక్టర్..., నన్నేం చేయలేరు" అనుకున్నాడు.


మన కలెక్టర్ గారు ఆభవనాన్ని కూల్చి వేయించారు.

కోపంతో మామభగ్గుమన్నాడు.

భర్త మీద అలిగిన భార్య రాజు నారాయణ స్వామిని వదిలివెళ్లిపోయింది.


ఆ తరువాత రాజునారాయణస్వామి పన్నులు ఎగవేసిన

ఒక లిక్కర్ డాన్ ఇంటిపై సోదాలు జరిపించాడు.

ఆ లిక్కర్ డాన్ గారికి మద్దతుగా ఏకంగా ఒక మంత్రిగారే ఫోన్ చేశారు.


కలెక్టర్ గారు అవినీతిపై పోరాటంలో రాజీ లేదన్నాడు. 


అంతే ...!మళ్లీ ట్రాన్స్ ఫర్... మళ్లీ కొత్త ఊరు... కొత్త పని...! 


కొత్త చోట వానాకాలానికి ముందు మట్టితో 

చెరువులకు, నదులకు గట్లు వేయడం, 

బిల్లులు వసూలుచేసుకోవడం ఆ తరువాత వానలు పడటం...

వానకి గట్టు కొట్టుకుపోవడం.... 


మళ్లీ టెండర్లు... మళ్లీ పనులు... 

మళ్లీ బిల్లులు... మళ్లీ వానలు...ఇదే తంతు కొనసాగేది.


రాజు నారాయణ స్వామి.... దీన్ని అడ్డుకున్నారు.

'వానాకాలం అయ్యాక, కట్టలు నిలిస్తేనే బిల్లులు.... ఇచ్చేది ' అన్నాడు. మంత్రులు మళ్లీ ఫోన్లు చేసి బెదిరించారు.


మన కలెక్టర్ గారు ససేమిరా అన్నారు. 

అంతే..! మళ్లీ పాత కథ పునరావృతం అయింది.

చివరికి ఎక్కడ వేసినా ఈయనతో ఇబ్బందేనని 

అప్పటి కేరళ వామపక్ష ముఖ్యమంత్రి 'అచ్యుతా నందన్' 

మన రాజునారాయణస్వామిని ఎలాంటి 

ప్రాధాన్యతాలేని ఓ విభాగంలో పారేశారు.


చివరికి ఆయన నిజాయితీని,

పని పట్ల ఆయన శ్రద్ధను చూసి 'ఐక్యరాజ్య సమితి' నుంచి 

ప్రత్యేకంగా ఆహ్వానం వచ్చింది. 

'మాదగ్గర పనిచేయండి' అని కోరుతూ పిలువు వచ్చింది.


ఒక నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారి 

ఈ వ్యవస్థలో ఇమడలేక, అవినీతితో రాజీ పడలేక 

ఎక్కడో ప్యారిస్ లో పనిచేయడానికి వెళ్లిపోవ డానికిసిద్ధమయ్యాడు!


రాజు నారాయణ స్వామి మామూలు వ్యక్తి కాదు.

ఆయన 23 పుస్తకాలు వ్రాశారు.


వాటికి చాలా ప్రజాదరణ వచ్చింది. 

ఆయన వ్రాసిన నవలకు 'సాహిత్య ఎకాడెమీ' అవార్డు కూడా వచ్చింది. 


ఆయన వ్రాసిన నవలల్లో హీరో అన్యాయంపై 

విజయం సాధించి ఉండొచ్చు. కానీ 

నిజజీవితంలో హీరో అయిన రాజు నారాయణస్వామి"

మాత్రం పోరాడలేక అలసి దేశాన్నే వదలాల్సి వచ్చింది.


రాజు నారాయణ స్వామి ... ......

ఈ ఘనతవహించిన భారతదేశంలో 

ఒక ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలి పోయాడు" అని 

వ్రాయడం ఎవరికి ఇష్టం.. ?


కానీ కొన్ని కొన్ని జాడ్యాలు దేశాన్ని వదలాలంటే.. 

కొందరి చరిత్రలు అలా ఒక చరిత్రగా మిగులకూడదు... !


అందుకే.. అందరికీ తెలియాలంటే.. షేర్ చేయండి.. 

రాజు నారాయణస్వామి గారిది ఫెయిల్యూర్ స్టోరీ కాకూడదు......



Wednesday, January 11, 2023

గర్భిణీలకు సీమంతం ఎందుకు చేస్తారు

 గర్భిణీలకు సీమంతం చేయడం అనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. స్త్రీ గర్భవతి అయిన ఏడో నెలలో గానీ, తొమ్మిదో నెలలో గానీ సీమంతం వేడుకలు నిర్వహిస్తారు. కుదరని వాళ్ళు వేరే మాసాల్లో నిర్వహిస్తారు. ఎప్పుడూ ఏ శుభకార్యానికి లేని విధంగా ఈ సీమంతం వేడుకల్లో మాత్రం గర్భిణీకి ప్రతి ఒక్కరూ గాజులు తొడిగి.. పండంటి బిడ్డని కనమని ఆశీర్వదిస్తారు. తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షు కోరుతూ చేసే వేడుక ఈ సీమంతం. సీమంతం రోజున ఉదయాన్నే మంగళ స్నానం చేయించి.. జుట్టు సాంబ్రాణితో ఆరబెట్టి.. కాళ్లకు పసుపు రాసి, నుదుట కుంకుమ పెట్టి, పూలతో జుట్టుని అలంకరించి.. కొత్త చీర కట్టి కుర్చీలో కూర్చోబెడతారు. ముత్తయిదవులందరూ వచ్చి ఆశీర్వదిస్తారు. ఇంత ఘనంగా చేసే ఈ సీమంతం పండుగ వెనుక ఉన్న పరమార్థం ఏమిటి? దీని వెనుక ఏమైనా శాస్త్రీయ కారణాలు ఉన్నాయా? అవేంటో తెలుసుకుందాం పదండి.


ఆడవారి జాతక కర్మలని మొత్తం 16 కర్మలు ఉంటాయి. వీటిని జన్మ సంస్కారాలు అని కూడా అంటారు. బిడ్డ పుట్టక ముందు మూడు, పుట్టిన తర్వాత 13 జాతక కర్మలు ఉంటాయని పెద్దలు చెబుతారు. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు గర్భాదానం, పుంసవనం, సీమంతం అని మూడు జాతక కర్మలు ఉంటాయి. బిడ్డ పుట్టిన తర్వాత జాతకర్మ, నామకరణం, నిష్క్రమణ, అన్నప్రాశన, చూడాకరణ, కర్ణ వేద, అక్షరాభ్యాసం, ఉపనయనం, వేదారంభం, కేశాంత, సమావర్తన, బిడ్డకు వివాహం, అంత్యేష్టి అని 13 జాతక కర్మలు ఉంటాయని పెద్దలు చెబుతారు. అంత్యేష్టి అంటే కర్మకాండ అని అర్థం. చివరి దశలో చేసే సంస్కారం. శుభమా అని సీమంతం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు.. ఈ నెగిటివ్ ఆలోచన గురించి మనకెందుకులెండి.


సీమంతం వెనుక ఉన్న పరమార్థం:


కడుపులో ఉన్న శిశువుకి మొదటి రోజు నుంచి ప్రాణ శక్తి ఉన్నప్పటికీ.. మెదడుకి సంబంధించిన చైతన్య శక్తి 7వ నెలలో వస్తుంది. అప్పుడే శిశువుకి అన్నీ తెలియడం మొదలవుతుంది. అందుకే 7వ నెలలో శిశువుకి ఒక రకమైన మానసిక ధైర్యాన్ని ఇచ్చే ప్రక్రియలో భాగమే ఈ సీమంతం అని పెద్దలు చెబుతారు. ఈరోజున ముత్తైదువులు గర్భిణీకి గంధం రాసి, కొత్త గాజులు వేసి.. తాము తెచ్చిన కానుకలు, చీరలు, తినుబండారాలు ఇచ్చి తల్లిని సంతోషబెడతారు. తల్లి సంతోషంగా ఉంటే కడుపులో ఉన్న బిడ్డ కూడా బాగుంటుందని నమ్మకం. అలానే గర్భిణీని మానసికంగా ప్రసవానికి సిద్ధం చేయడమే ఈ సీమంతం యొక్క ముఖ్య ఉద్దేశం. ముతైదువులందరినీ చూసి గర్భిణీకి భయం తగ్గుతుంది.


ఇంతమంది సీనియర్లు పిల్లల్ని కని ఆరోగ్యంగానే ఉన్నారు అన్న ధైర్యం ఆమెకు కలుగుతుంది. తాను కూడా తనకు ఏమీ కాదు అన్న మానసిక ధైర్యంతో ఉంటుంది. సీమంతంలో ఎక్కువ గాజులు తొడగడం వెనుక కూడా ఒక కారణం ఉంది. గర్భిణీ యొక్క గర్భకోశం మీద జీవనాడుల ఒత్తిడి అనేది పడాలి. చేతుల్లో ఉండే నరాలకు, గర్భకోశానికి సంబంధం ఉన్న కారణంగా.. ఆ గాజుల ఒత్తిడి అనేది గర్భకోశం మీద పడుతుంది. గర్భకోశంపై కావాల్సినంత ఒత్తిడి పడడం వల్ల సుఖ ప్రసవం జరుగుతుందని శాస్త్రం చెబుతుంది.


రాగి లేదా కంచు పాత్రల్లో నీరు నింపి.. వాటి మీద మామిడాకులు, కొబ్బరి కాయ, గరికెలు వేస్తారు. గంటన్నర సేపు వేద మంత్రాలు చదువుతారు. ఆ తర్వాత ఈ నీటిలో యాలకులు, లవంగం, కుంకుమ పువ్వు, ఇతర ఔషధ మూలికలు కలుపుతారు. ఆ నీటితో గర్భిణీ స్త్రీకి మంగళ స్నానం చేయిస్తారు. ఇలా చేయడం వల్ల పుట్టబోయే బిడ్డకి ఆరోగ్యం చేకూరుతుంది. అలానే మర్రి చెట్టు ఆకులను పచ్చి పాలతో కలిపి ముద్దగా చేసి.. ఆ వాసనను పీల్చమని అంటారు. ఆ వాసన పీల్చడం వలన గర్భాశయం సురక్షితంగా ఉంటుంది. అందుకే మంగళస్నానం చేయించి.. గాజులు వేస్తారు.


ఇదొక కారణం అయితే.. మరో కారణం కూడా ఉంది. అత్తగారు ఒక్కరే తన కోడలిని చూసుకోవడం ఇబ్బంది అవుతుందని, అప్పటి వరకూ చూసి అలసిపోయి ఉండవచ్చునని.. ఇక ఏడో నెల నుంచి మేము చూసుకుంటామని చెప్పి పుట్టింటి వాళ్ళు తమ కూతురిని తీసుకెళ్లారు. అక్కడ నుంచి పురుడు పోసిన 5 నెలల వరకూ చూసుకుంటారు. అత్తగారికి విశ్రాంతి ఇవ్వాలన్న ఉద్దేశం కూడా ఇందులో భాగమే. ఇక అత్తింటి వారు, పుట్టింటి వారు పిండి వంటలు, స్వీట్లు పంచి పెడతారు. కూతురు/కోడలు ప్రసవం ఇద్దరం చూసుకున్నామని జనానికి తెలియజేస్తారు. కొంతమంది మొత్తం ఖర్చు పుట్టింటి వారే పెట్టుకుంటారు. స్థోమతను బట్టి చేసుకుంటారు. అయితే ప్రస్తుతం అత్తా, కోడళ్ల మధ్య గొడవలు ఎక్కువగా నడుస్తున్నాయి.



ఈ క్రమంలో కోడలు ఇబ్బంది పడితే కడుపున ఉన్న బిడ్డపై ఒత్తిడి పడుతుంది. ఈ కారణంగా పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతుంది. అందుకే కొంతమంది ఆడపిల్ల తల్లులు.. 5వ నెలలోనే తమ కూతురిని పుట్టింటికి తీసుకెళ్తారు. తీసుకెళ్లకపోయినా సీమంతం చేయడం వల్ల.. తనను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దవాళ్ళని చూసి కోడలికి ధైర్యం కలిగి ఒత్తిడి తగ్గుతుంది. తన కోసం ఇంతమంది వచ్చారు, తనకి ఇంతమంది ఉన్నారు అన్న ధైర్యం కలుగుతుంది. మరోవైపు అత్త గారు కూడా వేడుక కాబట్టి అయిష్టంగా ఉన్నా కూడా ఆ బంధువులని చూసి సానుకూల దృక్పథం కలుగుతుంది. నిజానికి ఈ వేడుక భర్త చేయాలని చెబుతారు. భర్త ఆమెను అపురూపంగా చూసుకోవాలని సీమంతం చేస్తారు. అదండి మరి.. సీమంతం వెనుక ఉన్న పరమార్థం. మరి మీకు తెలిసిన వాస్తవాలు ఏమైనా ఉంటే నరేన్ తో పంచుకోండి.


Tuesday, January 10, 2023

పాత సంప్రదాయాలు మళ్లీ మొదలు పెట్టండి

 * పాత సంప్రదాయాలు  మళ్లీ మొదలు పెట్టండి*

   

పెద్దలకు *"మహారాజశ్రీ"* అనే పదం వాడేవారు. 

పిన్నలకు *"ప్రియమైన"* లేక *"చిరంజీవి"* పదాలు వాడే వారు.

స్త్రీలకు పెద్దవాళ్ళైతే *" లక్ష్మి సమానురాలగు"* పదాలు వాడేవారు. 

విధవలకు *"గంగాభాగీరథీ సమానురాలగు"* అనే పదాలు వాడేవారు.

ఆ రోజుల్లో పోస్టుకార్డులు ఎక్కువగా వాడేవారు.

ఉత్తరం యొక్క శరీర భాగంలో ఆరోగ్య సమాచారాలు, కష్టసుఖాలు, కుటుంబ సమస్యలు, బాంధవ్యాలకు అనుగుణంగా సంభోదించుకొంటూ, పెద్దలకు నమస్కారాలు, పిన్నలకు దీవెనలతో ముగిస్తుండేవారు. 

ఆనాటి ఉత్తరాల్లో ప్రేమ, పెద్దరికం, చక్కని బాంధవ్యాలు కనిపించేవి.

వివాహాలు, అమ్మాయిల వోణీ ధారణ లాంటి శుభ సమాచారాలుంటే ఉత్తరానికి నలుమూలల *పసుపు* రాసి పంపిస్తుండేవారు. 

చావులాంటి అశుభ వార్తలుంటే *సిరా* ఉత్తరానికి నలుమూలల రాసి పంపిస్తుండేవారు. అలాంటి ఉత్తరాలు వస్తే చదివి బయటే చించి పడేస్తుండేవారు. 

మామూలు ఉత్తరాలను ఒక *తీగెకు గుచ్చి* పదిలంగా ఉంచుతుండేవారు.

నేడు ఉత్తరాల సాంప్రదాయం పోయింది. భాషలో సంస్కారహీనత, పెద్దలంటే నిర్లక్షత, గౌరవ రహితం. *చరవాణి* ద్వారా అర్ధం కాని లఘు సందేశాలు పంపించి చేతులు దులిపేసుకుంటారు. 


*🙏నమస్కరించే సంస్కారం పోయింది.*

Monday, January 9, 2023

జంట పదాలు

 *జంట పదాలు* 


*తెలుగు భాషలో జంటపదాలు అనేకం ఉన్నయి. ఇవి కొన్ని ద్వంద్వ సమాసములు.ఇల్లు వాకిలి, కట్టు బొట్టు, తోడు నీడ, పని పాట మొదలైనవి. ఇవి శుద్ధంగా ద్వంద్వ సమాసాలు అనడం కన్నా జంటపదాలు గానే పలుకుబడిలో ఉన్నాయి.ఎందుకంటే ఈ తెలుగు పదాలు సాధారణంగా వ్యప్తంగాకంటే సమస్తంగా ప్రయోగించటం విశేషం. తెలుగువాళ్ళు వీటిని జంటపదాలుగానే వాడతారు.*


 *విభజన* 

*ఈ జంట పదాలలో కొన్ని, రెండోపదం కూడా మొదటి పదం యొక్క అర్ధాన్నే ఇస్తూ మొదటి పదానికి వత్తాసుగా అంటె ఊతగా నిలబడుతుంది. సిగ్గు సెరము, ముసిలె మొతకన, బిడ్డ పాప మొదలైనవి లా. ఇవి జంటపదాలలో భాగమే. అందువల్లనే జంటపదాలను ద్వంద్వ సమాసాలనుంచి వేరు చేసి చెప్పడం జరుగుతుంది.*

*అలానే పరస్పర సన్నిహిత సంబంధం కలవి (ఇల్లు వాకిలి) జంటపదాలైతే, సమానార్ధక పదాలు ఊతపదాలవుతాయి. ఇవికాక మొదలైనవి* (etc), *తత్సంబంధమైనవి (and all) అనే తాత్పర్యంలో వచ్చే జంటపదాలు కొన్ని ఉన్నాయి. పురుగు పుట్ర, నగ నట్ర, కూర నార మొదలైనవి.వీటిని కూడా ఊతపదాలగానే అనటం బావుంటుంది.*

*ఇలానే మరికొన్ని పరస్పర విరుద్దమైనవి కూడా ఉన్నాయి.పెళ్ళి పెడాకులు, హీనం మానం, నీళ్ళు నిప్పులు మొదలైనవి ఈ రకానికి వస్తాయి.*

*జంటపదాలలో ముఖ్యంగా రెండోపదం యొక్క అర్ధం కాలక్రమంలో మరుగున పడిపోతున్నది.వాటి సహజ స్వభావం తెలియక, వ్యుత్పత్తి బోధపడక, అర్ధసామ్యం గుర్తురాక ఊతపదాలు చాలాభాగం వ్యర్ధంగా ఉపయోగించబడుతున్నది.*


 *కొన్ని జంటపదాలు* 


అంగడి-సంగడి- సంగడి అంటే స్నేహము. అంగడిన్ని స్నేహమున్ను పరస్పర సంబంధపదాలు


అంటు-సంటు- అంటరాని వస్తువు, తత్సంబంధము. అంటు-ముట్టు అని కూడా వాడుక.


అందం-చందం- ఊతపదాలు-చందం-అలంకరణ విధానం


అగ్గి-బుగ్గి- బుగ్గి-బూడిద


అచ్చట-ముచ్చట- అలంకారం-దానిపై కోరిక


అతుకు-బొతుకు- బొత్త-పాత్రలచిల్లి-అతుకు అనేమాటతో చేరి బొత్త, బొతుకు అయినది.


అరి-గురి- అరి-శత్రువు, గురి-శత్రువుమీది లక్ష్యం.


అల్లరి-చిల్లరి- చిలిపి చేష్టలు


అల్లి-బొల్లి- బొల్లి-అబద్దం చెప్పటం. ఆటల ధోరణి


ఆకు-అలము- అలము-శాకా విశేషము- ఆకూ అలమూ వేసి కూడ బెట్టాడు అనడం అలవాటు.


ఆర్చు-తీర్చు- బాధతొలగించుట.


ఆస్తి-పాస్తి- స్థిరమైన ఆస్థి-చరమైన ఆస్థి (గోడు గోద) అని అర్ధం.


ఇచ్చు-రొచ్చు- రొచ్చు-రొంపి, సంకటము. హీన స్థితి కు సంకేతం.


ఇరం-పరం- ఇహము పరము నుంచి వచ్చి యుండవచ్చును. లేక ఇరుగు-పొరుగు ఇట్లా భష్టమై వుండవచ్చును.


ఇరుగు-పొరుగు- ప్రక్కవాళ్ళు, సమీపస్థులు.


ఇల్లు-వాకిలి- ఇల్లు తత్సంబంధమైన వాకిలి.


ఈడు-జోడు- వయస్సుకు సంబంధించిన సమానత్వము.


ఉడుకు-మెడుకు- ఉడుకు-పరితపించు, మెడుకు- ఎక్కువ ఉడుకుట.


ఉరుకు-పరుగు- ఉరుకులు పరుగులు-తొందర


ఉలుకు-పలుకు- ఉలుకు-కదులుట. అదే ఉలకడు పలకడు.


ఊపర-దాపర- ఊబ- నపుంసకుడు, దాపరీడు-దొంగ.


ఎక్కా-ముక్కా- ఎట్లంటే అట్లు అని అర్ధం.


ఎడ్డి-మడ్డి- ఎడ్ది-బుద్ధి హీనత.


ఏండ్లు-పూండ్లు- పూండ్లు- అనేక సంవత్సరములు.


ఐసా-పైసా- అతో ఇటో తేల్చి వేయుట.


ఒడ్డు-పొడుగు- ఒడ్డు-స్థూలము, లావుపాటి.


కొంప- గోడి/గోడు- గోణి అంటె ఎద్దు. గోణి గోడి అయినది.అదే కొంపా గోడా.


కట్టె-కంప- కంప కూడ పెద్ద పొయ్యిలలోకి కట్టెలకి మారు పేరు.


కత్తి-కటారు- కటారి-కత్తి లేక పెద్దబాకు.


కధ-కమామీషు- కమామీషు-సంఘటనలు, వివరాలు.


కలి-గంజి- కలి (తమిళం) అంబలి, గంజి-అన్నంతో కూడినవార్పు నీరు.


కల్లి-బొల్లి- బొల్లి-ఒక చర్మరోగం. ఈ రోగం కలవాడు అబద్దాలు చెబుతాడని వాడుతారు.


కుమ్ము-దుమ్ము- కుమ్ములాడుకోవటం.


కూన-కురుజ- కురుజ్-చిన్నది. చిన్నవాళ్ళు అనే అర్ధం.


కూర-నార- నార-కూరమీద పీచు.


కూలి-నాలి- నాలి- చిన్నచూపు పని.


కోతి-కొండముచ్చు- కొండముచ్చు- అడవిలో తిరిగే నల్లమూతి కోతి.


గింజ-గిట్ర- గిట్ర-నగనట్ర లా అర్ధం చేసుకోవచ్చును.


చదువు-సంధ్య


చీకు-చింత- చీకు-నలత.


చీము-నెత్తురు- నెత్తురు-అభిమానానికి, చీము-అవమానానికి గుర్తు.


చిలువలు-పలువలు- చిలవ-నీరు కోడి, పలవ-చెట్టు పంగాలు. పరస్పరం సంబంధలేని విషయాలు అని అర్ధం.


చెట్టు-చేమ- చేమ- చేమగడ్డ.


చెత్త-చెదారం- చెదారం-తృణలేశము.


డబ్బు-దస్కం- దస్కం- చేవ్రాలు పెట్టిన విలువైన కాగితం.


తట్ట-బుట్ట- సర్దుకో అనిఅర్ధం.


తప్ప-దార- తప్పిపోయినట్లు అర్ధం.


తల-తోక- ఆద్యంతాలు లేని అభిప్రాయం.


తళుకు-బెళుకు- తళుకు-మిక్కిలి ప్రకాశము, బెళుకు- తళతళమని వెలుగు.


తీరు-దినుసు- దినుసు-ప్రకారం, విధము.


తెలివి-తేట- తెలివితేటలు.


తెప్ప-తేరు- ఉదా: దీపారాధన తప్ప తెప్పాలేదు, తీరూ లెదు.


తోడు-నీడ- నీడ-ఎల్లప్పుడు, వెంట


దిక్కు-దినాణం- ఉదా: దిక్కూ దివాణం లేనివాడవు


దేవుడు-దెయ్యం- వ్యతిరేకార్ధాలు తెలుపునవి.


నగ-నట్ర- ఉదా: నగ నట్ర చేయించాలి మరి!


నయీసు-నాగరికత- nice


నదురు-బెదురు- నదురు-కంటిభయం. ఎటువంటి భయంలేకపోవుట.


నీళ్ళు-నిప్పులు- ఉదా: నీళ్ళు నిప్పులూ ఇంకా చూసుకోలే!


నొప్పి-నోవి- నోవి (తమిళం) నొప్పి-.ఉదా: నొప్పి నోవి లేకుండ పడుకున్నాడు!


నోరు-వాయి- ఉదా: నోరు వాయి లేనివాడు పాపం.


పండగ-పబ్బం- పబ్బం-పండుగ.


పండూ-ఫలము- ఉదా: పండూ-ఫలము-ఏదీ పుచ్చుకోడు.


పని-పాట/పాటు- పని చెయ్యటము, చేస్తూ ఉత్సాహం కోసం పాడుకోవడం.


పరువు-ప్రతిష్ఠ- పేరు-ప్రతిష్ఠ.


What are moral stories?

 What are moral stories?

A moral (from Latin morālis) is a message that is conveyed or a lesson to be learned from a story or event. ... The moral may be left to the hearer, reader, or viewer to determine for themselves, or may be explicitly encapsulated in a maxim. A moral is a lesson in a story or in real life.


1.Two Headed Bird

Once upon a time a strange bird lived by the side of a river. His name was Parundam. He had two heads and one stomach.

For the two heads there were two mouths one for each one.

One day the bird was wandering for his food. After a long time he got a prey. It was very happy.

The first mouth was about to eat the full prey. The second mouth stopped the first mouth and demanded half of the prey.

"I will not give you anything," said the first mouth and ate all the prey.

The other mouth got angry. In order to take revenge, it decided to do one thing. It searched and gulped the poison it found.

"Though the mouths are two, the stomach is only one...The same stomach...it not it?"

So the poison spread all over the body. The strange bird died.

Moral : So, unity is the strength."

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

2.A Farmer and His Wife

A farmer said to his wife, "you are lazy. You work slowly and lethargically. You waste your time."

The wife was angry at the words of her husband.

She said to her husband, "You are wrong. Stay at home tomorrow. I will go to field. I will do your work there. Will you do my works at home here?"

The farmer said happily, "Very well. I will do your works back at home."

The wife said, "Milk the cow. Feed the pigs. Waste the utensils. Take care of our hen. Spin the yarn."

The woman went to the field. The farmer stayed back at home. He took a vessel and went to the cow to milk it. He tried to milk the cow. He received a good kick. He then went to the pig-sty. He hit his head against the beam. He went to feed the hen. He forgot to spin.

The wife returned from the field when it turned evening. The farmer hung down his head in shame. Thereafter, he did not find fault with his wife. They lived happily together for a long time.

Moral : The opposite should not underestimate their work

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

3.Happiness Not Given By Others

Only those who are capable of being alone are capable of love. The capacity to be alone is the capacity to love. It may look paradoxical to you, but it is not. It is an existential truth...only those people who are capable of being alone are capable of love, of sharing, of going into the deepest core of the other person - without possessing the other, without becoming dependent on the other, without reducing the other to a thing and without becoming addicted to the other. They allow the other absolute freedom, because they know that if the other leaves, they will be as happy as they are now. Their happiness cannot be taken by the other, because it is not given by the other.

Moral : Happiness Not Given By Others

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

4.The Devoted Mother

A mother duck and her little ducklings were on their way to a lake one day. The ducklings were very happy following their mother and quack-quacking along the way.

All of a sudden, the mother duck saw a fox at a distance. She was frightened, and shouted, "Children, hurry to the lake. There's a fox!"

The ducklings hurried towards the lake. The mother duck wondered what to do. Then she began to walk back and forth dragging one wing on the ground.

When the fox saw her, he became happy. He said to himself, "It seems she's hurt and can't fly! I can easily catch and eat her!" He ran towards her.

The mother duck ran, leading the fox away from the lake. The fox followed her. Now he wouldn't be able to harm her ducklings. The mother duck looked towards her ducklings and saw that they had reached the lake. She was relieved, so she stopped and took a deep breath.

The fox thought that she was tired and he came closer, but the mother duck quickly spread her wings and rose up in the air. She landed in the middle of the lake and her ducklings swam to her.

The fox stared in disbelief at the mother duck and her ducklings. The mother duck had tricked him cleverly. Now he could not reach them because they were in the middle of the lake.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

5.A Shepherd Boy and Wolf

A Shepherd Boy tended his master’s Sheep near a dark forest not far from the village. Soon he found life in the pasture very dull. All he could do to amuse himself was to talk to his dog or play on his shepherd’s pipe.

One day as he sat watching the Sheep and the quiet forest, and thinking what he would do should he see a Wolf, he thought of a plan to amuse himself. His Master had told him to call for help should a Wolf attack the flock, and the Villagers would drive it away. So now, though he had not seen anything that even looked like a Wolf, he ran toward the village shouting at the top of his voice, “Wolf! Wolf!”

As he expected, the Villagers who heard the cry dropped their work and ran in great excitement to the pasture. But when they got there they found the Boy doubled up with laughter at the trick he had played on them. A few days later the Shepherd Boy again shouted, “Wolf! Wolf!” Again the Villagers ran to help him, only to be laughed at again.

Then one evening as the sun was setting behind the forest and the shadows were creeping out over the pasture, a Wolf really did spring from the underbrush and fall upon the Sheep.

In terror the Boy ran toward the village shouting “Wolf! Wolf!” But though the Villagers heard the cry, they did not run to help him as they had before. “He cannot fool us again,” they said.

The Wolf killed a great many of the Boy’s sheep and then slipped away into the forest.

Moral: If you keep lying, no one will believe you even if you are speaking the truth. Always speak the truth.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

6.The Farmer and the Snake

A Farmer walked through his field one cold winter morning. On the ground lay a Snake, stiff and frozen with the cold. The Farmer knew how deadly the Snake could be, and yet he picked it up and put it in his bosom to warm it back to life.

The Snake soon revived, and when it had enough strength, bit the man who had been so kind to it. The bite was deadly and the Farmer felt that he must die. As he drew his last breath, he said to those standing around, “Learn from my fate not to take pity on a scoundrel”.

Moral : There are some who never changes their nature, regardless of how good we behave with them. Always stay alert and maintain the distance from those who are there only thinking about their own benefits.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

7.THE WOLF AND THE CRANE

A Wolf had been feasting too greedily, and a bone had stuck crosswise in his throat. He could get it neither up nor down, and of course, he could not eat a thing. Naturally, that was an awful state of affairs for a greedy Wolf.

So away he hurried to the Crane. He was sure that she, with her long neck and bill, would easily be able to reach the bone and pull it out. “I will reward you very handsomely”, said the Wolf, “if you pull that bone out for me”.

The Crane, as you can imagine, was very uneasy about putting her head in Wolf’s throat. But she was grasping in nature, so she did what the Wolf asked her to do. When the Wolf felt that the bone was gone, he started to walk away.

“But what about my reward!” called the Crane anxiously.

“What!” snarled the Wolf, whirling around. “Haven’t you got it? Isn’t it enough that I let you take your head out of my mouth without snapping it off?”

Moral: Expect no reward for serving the one who has no honor. Staying in a company of selfish people will not do anyone any favor.


HEART TOUCHING STORY

 *💕HEART TOUCHING  STORY .💕*

*_ఓ అధికారి యొక్క పాఠశాల సందర్శన - అనుభవాలు..._*

               *****

      *ఉదయాన్నే తప్పనిసరిగా ప్రార్థన సమయానికి పాఠశాలకు హాజరవ్వాలి.  ఎంతమంది ఉపాధ్యాయులు సమయానికి వస్తున్నారో తెలుసుకోవాలి.  ఈ మధ్య బొత్తిగా అందరిలో సమయపాలన (టైమ్ సెన్స్) కరువైంది. ఎవరూ పట్టించుకోవట్లేదని తెలిస్తే పనిచేసేవాడెవడు?! ఈరోజు నేను వెళ్ళే పాఠశాలలో అందరూ సమయానికి హాజరైతే ఎంతబావుండును. ఇలా పలు ఆలోచనలతో ఉదయం 9.00 గంటలకు ఓ ప్రాథమికపాఠశాల ఆవరణలో అడుగుపెట్టా, ఓ సందర్శనాధికారిగా!*


*అనుకున్నంతా అయ్యింది. చిన్నతరగతి పిల్లలందరూ పుస్తకాల సంచీలేసుకొని పాఠశాల అరుగు మీద కూర్చోనున్నారు. ఐదవతరగతి పిల్లలనుకుంటా, కొంతమంది పాఠశాల ఆవరణంతా శుభ్రం చేస్తున్నారు.  ఆడపిల్లలు తరగతిగదిని చీపురుతో శుభ్రం చేస్తుంటే మగ పిల్లలు బెంచీలెత్తి సహకరిస్తున్నారు. పాఠశాలంతా పిల్లలతో కళకళ లాడుతూ వుంది.*


*ఉపాధ్యాయులెక్కడ?? పరిసరాలంతా కళ్ళతోనే వెదికా? ఎక్కడా కనపడక పోయే సరికి ఇంకా రాలేదని నిర్థారణకొచ్చి సమయం కావడంతో ఓ పెద్ద పిల్లాడ్ని పిలిచి అసెంబ్లీ బెల్లు కొట్టమన్నా.*


*పిల్లలే స్వయంగా అసెంబ్లీ చక్కగా నిర్వహించారు. చాలా ఆనందం వేసింది. వారి క్రమశిక్షణ, వారి పద్ధతి చూసి.  ఉపాధ్యాయులు ఎవరూ ఇంకా రాలేదు. వారు రాకుండా నేను అసెంబ్లీ నిర్వహించడం ఖచ్చితంగా వారికి చెంప పెట్టే. ఈ సమయంలో వస్తే వారి ముఖం ఎలా వుంటుందో అనుకుంటూ ప్రక్కకు చూశా.*

*దూరంగా ఉన్న ఇంకో తరగతి గదిలోంచి ఒకావిడ చిన్న పిల్లాడికి మూతి తుడుస్తూ చెయ్యి పట్టుకొని గబగబా నా వైపు అడుగులు వేసుకుంటూ వస్తూ కనిపించారు. బహుశా ఉపాధ్యాయురాలేమో ననుకున్నా.*  


*కళ్ళతోనే నమస్కారం చెప్పారు. నేనూ అంతే! చిన్నగా తలూపా.  అసెంబ్లీ అయ్యింది. పిల్లలందరూ క్రమం తప్పకుండా వరుసగా తరగతి గదిలోకి వెళ్తున్నారు.  అప్పుడే చేరిన ఒకటవతరగతి చిన్నారిని ఇద్దరు పెద్దపిల్లలు చేతులు పట్టుకుని నడిపించుకెళ్తున్నారు.  చూడడానికి ఎంతో బావుందని పించింది.*


*ఉపాధ్యాయురాలు ఏదో మాట్లాడబోతుంటే నేనే కల్పించుకొని “ఎంతసేపయ్యిందండీ వచ్చి”? అన్నా! గొంతులో కొంత గాంభీర్యత ప్రదర్శిస్తూ.*

*“ఎప్పుడూ గం.8.30 కే పాఠశాలలో వుంటానండి” ఆవిడ సమాధానం.*

*“మరి ఈరోజో” ఆలస్యంగా వచ్చిన వారి సమాధానం ఇలానే వుంటుందనే ధోరణితో...* 

*“ఈరోజు కూడా గం.8.30 కే వచ్చానండీ” అని వినయం ప్రదర్శిస్తూ ఆవిడ సమాధానం.*

*“అసెంబ్లీకి హాజరైతే బావుండేది” ముక్తసరిగా ఒకింత అసహనంతో అని, ఈవిడొక్కరే కనిపిస్తున్నారు. మరి మిగిలిన అయ్యవార్లు... వారెప్పుడొస్తారో!!! అనుకుంటూ తరగతి గదిలోకి వెళ్ళా.*


*తరగతి విశాలంగా వుంది. ఈ మూలనుంచి ఆ మూల దాకా.  రంగు రంగు బొమ్మలతో, పాఠ్యాంశాలకు చెందిన బోధనా సామగ్రితో ఎంతో ఆకర్షణీయంగా వుందా తరగతి గది.*  


*గదిలోకి రాగానే బల్లమీదున్న పుస్తకాలు గబగబా సర్థుతూ, కుర్చీచూపించి కూర్చోమని వినయంగా చెప్పిందా ఉపాధ్యాయురాలు.*


*దీనికేం తక్కువలేదు. ఆలస్యంగా రావడం. కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక నటన. ఓ గంటో అరగంటో వుంటాడు.  వినయం నటిస్తే పోలా? అని మనసులో అనుకుంటూ ఉండే ఉంటుందని పించింది.* 


*కుర్చీలో కూర్చొన్నా!! ఆవిడ నిలబడే వుంది. అక్కడే ఖాళీగా వున్న కుర్చీ చూసి కూర్చోండి అందామనుకున్నా! ఎందుకో అనబుద్ది కాలేదు. "హాజరు పట్టీ ఇవ్వండి? ఎంతమంది ఉపాధ్యాయులు?" అడిగా ఇందాకటి అసహనానికి కొనసాగింపుగా.*


*”నేనొక్కర్తినేనండి ఇది ఏకోపాధ్యాయ పాఠశాలండీ" అవతలనించి సమాధానం.*


 *“పిల్లలు ఎంతమంది?!” ఒకింత ఆశ్చర్యంతో అడిగా.*


*“62 మంది అండీ” అంతే వినయంతో సమాధానం. షాక్ కి గురవడం నావంతయ్యింది.*


*పిల్లలు నిశ్శబ్దంగా ఎవరి పనులు వారు చేసుకుంటూ చదువుకుంటున్నారు. ఓ నాలుగేళ్ళ పిల్లాడు తరగతి గదంతా కలియతిరుగుతూ అందరికీ సూచనలిస్తున్నాడు.  చాలా ఉషారుగా చలాకీగా ఉన్నాడు.  అలా తిరుగుతున్న వాడు కాస్త ఒక్కుదుటున టీచర్ దగ్గరకొచ్చి చెయ్యి పట్టుకు గుంజుకొని తీసుకెళ్తున్నాడు రమ్మంటూ.  ఎందుకమ్మా!! అంటూ ఆవిడ, వాడి కూడా వెళ్తుంటే అప్పుడు గుర్తు పట్టా అసెంబ్లీ జరుగుతున్న సమయంలో టీచర్ చెయ్యిపట్టుకు తీసుకొచ్చింది వాడినేనని. ఎవరో రాయకుండా దిక్కులు చూస్తున్నారని కాబోలు టీచర్ కి ఫిర్యాదు చేస్తున్నాడు. 'అలాగే! ఈసారి అలా చేస్తే మళ్ళీ చెప్పమని' సున్నితంగా చెయ్యి వదిలించుకొని నాదగ్గర కొచ్చింది టీచర్.*


*వాడి నాయకత్వ లక్షణాలు, వాడి చెలాకీ తనం చూసి బహుశా వీడు ఈ టీచర్ కొడుకై వుంటాడు అనుకున్నా.  ఏంటో ఈ ఆడవాళ్ళకి ఉద్యోగం రావడం, ప్రసూతి సెలవులు, ఆపై మూడు నాలుగు సంవత్సరాల దాకా పిల్లల పెంపకం కూడా పాఠశాలలోనే! అయినా ఏమీ అనలేం. అనుకుంటూ ఓ నిట్టూర్పు విడిచా!*


*"మీరనుమతిస్తే పిల్లలకు పాఠాలు చెప్పి వస్తా"నంది ఆవిడ.  'ఉన్న రికార్డులన్నీ ఇక్కడ పెట్టి మీరు క్లాసుకి వెళ్ళండి' అన్నా ఒకింత అధికార దర్పాన్ని ఒలక బోస్తూ.*


 *అన్ని రికార్డులు, రిజిష్టర్లు బల్లమీద వుంచి పిల్లలకు పాఠాలు చెప్పడానికెళ్ళిందామె.*  


*ఆవిడ అక్కడికెళ్ళగానే ఎగురుకుంటూ వచ్చి వళ్ళో వాలి పోయాడు ఇందాకటి కుర్రాడు.  ఆవిడ వాణ్ణి ఒళ్ళో కూర్చో పెట్టుకొని మిగతా తరగతి పిల్లలకు పాఠాలు చెప్తోంది.*


*ఎందుకో నాకు ఆవిడని పిలిచి గట్టిగా అరచి చెప్పాలని పించింది “రేపట్నించి మీరు పిల్లాడ్ని తీసుకురాకండి” అని.  తమాయించుకొని ఊరుకొన్నా. రికార్డులు చూస్తూ జరుగుతున్నది ఓ కంట కనిపెడుతూనే ఉన్నా.* 


*దగ్గర్లో ఉన్న  రెండు, మూడు తరగతుల పిల్లల్ని పుస్తకాలు తెమ్మన్నా. ఒక్కొక్కరినీ లేపి పేజీ నంబరు చెప్పి చదవమన్నాను. అందరూ చక్కగా చదువుతున్నారు.  అడిగిన వాటికి సమాధానాలూ చెప్తున్నారు.  టీచర్ లానే వినయాన్నీ ప్రదర్శిస్తున్నారు.  పిల్లల మాటలు, అభినయగేయాలు, వారు ఆహార్యంతో చెప్తున్న కథలు నన్ను సమయాన్ని కూడా మరిచిపోయేలా చేశాయి. దాదాపు ఓ అరగంట గడిచినట్లుంది.  టీచర్ బానే చెపుతున్నట్లు ఉందనుకుంటూ చూట్టూ ఉన్న పిల్లల్ని కూర్చోమని టీచర్ కోసం చూశా.*  


*పిల్లలు రాసుకుంటున్నారు.  టీచర్ కనిపించలేదు. ఇప్పుడు ఆ చిన్నపిల్లాడి కోసం చూశా వాడూ కనిపించలేదు.  టీచర్ ఏరని పిల్లలని అడిగా?  ప్రక్క వరండాలో వున్నారని అనటంతో మెల్లిగా వెళ్ళి చూశా ఏంచేస్తున్నారోనని.*


*కూడా తెచ్చిన టిఫిన్ బాక్స్ లోదేదో పిల్లాడికి తినిపించడం అయిపోయినట్లుంది. మూతిని శుభ్రంగా కడిగి తన పమిట చెంగుతో తుడిచి తరగతి గదిలోకి పదమని చెప్తూ బాక్స్ సర్దడం నాకంట పడింది.*


*పాఠశాల సందర్శనకు ఎవరో వచ్చినారని కూడా పట్టింపులేకపోవడం, పాఠశాలలో బోధన కంటే స్వంత పనులకు ప్రాధాన్యత నివ్వడం, బడిలో పిల్లలందరినీ వదిలి తన పిల్లాడిదొక్కడిదే ఆకలిగా భావించడం… ఓ పక్క నాలో కోపం కట్టలు తెంచుకుంటోంది. ఆమె చేసే పని మంచిగా లేదని గట్టిగా చెప్పేద్దామని నోటి చివరిదాకా వచ్చింది. పిల్లల ప్రగతి, పాఠశాల వాతావరణం చూసి ఎందుకో నాలో నేనే నిగ్రహించుకోవాల్సి వచ్చింది.* 


*నన్ను చూసిన ఆవిడ “వచ్చేస్తున్నాను సర్, ఒక్కనిమిషం” అంది అదే వినయంతో.*


*ఆహా! ఎంత నటన!!? కసిగా నాలో నేనే అనుకున్నా. లాభంలేదు. ఈవిడకు పాఠం చెప్పాల్సిందే.. ఓ నిశ్చయానికి వచ్చేశా.*  


*టీచర్స్ డైరీ, లెసన్ ప్లాన్, రోజువారీ టి.ఎల్.ఎం, సిలబస్, పిల్లల డైరీ, పిల్లల నోటు పుస్తకాలు దిద్దడం, తరగతులవారీ సామర్థ్యాలు, సెన్సెస్ రిజిష్టర్, బడిబయటి పిల్లలూ, ఎస్.ఎం.సీ సమావేశాలు, తీర్మానాలు….. ఇక దాడి మొదలెట్టా.*


*నేనడిగిన వాటిలో కొన్నింటిని ఆవిడ చూపెడుతోంటే… మళ్ళీ ఆ కుర్రాడు!!  ఆవిడ చెయ్యి పట్టుకుని రమ్మంటూ గుంజుతున్నాడు.  ఆవిడ ఉండు నాన్నా!! వస్తాగా నువ్వెళ్ళు, నా కన్నవి కదూ! అంటోంది.*


*ఇక భరించడం నావల్ల కావట్లేదు. వెళ్ళదేమో ననుకున్నా. వాడి మొండి పట్టుదలో లేక ఆవిడ అతి గారాబమో!! ఎక్కడి పుస్తకాలక్కడ వదిలి వెళ్ళిపోతోంది.*


*మేడమ్!! నేను ఇంకో పాఠశాల కెళ్ళాలి.  వాడిని వదిలి కాసేపు ఇలా వస్తారా?? కొంత కఠినంగానే అన్నా ఈసారి.*


*నాన్నా కూర్చో, ఇప్పుడే వస్తా! సార్ పిలుస్తున్నారు.  నా కన్నవుకదా! సార్ ని పంపించి వస్తా కదా! అని ప్రేమగా బుగ్గలు రెండూ నిమిరి బల్ల దగ్గరకొచ్చింది.*


*ఆ పిల్లాడి పేరు ఎన్నో తరగతిలో వుంది? డైరక్టుగా పాయింటులోకొచ్చేశా!*


*"లేదండి, వాడికింకా నాలుగేళ్ళే” ఆవిడ సమాధానం.* 

*ఐదేళ్ళైతే ఈ ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ చేరుస్తావులే.  అయినా ఇప్పటికే ఏ కెజీలోనో వెసేసుండాలే?* *మనసులోనే అనుకున్నా.*

 

*ఈలోగా వాడు రాకెట్ లా రానే వచ్చాడు.* *మందుగోళీ ఇస్తావ్ గా ఇమ్మంటూ…*


*ఒక్కక్షణం అంటూ.. బీరువాలోంచి మందు బిళ్ళలు తీసి పిల్లాడితో మింగించి నీళ్ళు పట్టించింది.  వాడు పరిగెట్టు కుంటూ రయ్యిమని నాదగ్గర కొచ్చి “గుడ్ మార్నింగ్ సార్” అనుకుంటూ వెళ్ళి పోతుంటే చెయ్యి పట్టుకు ఆపా.*


*నీ పేరేంటి? మీ నాన్న గారు ఏంచేస్తారు??* *అల్లరెక్కువ చేస్తావా?  చెయ్యి అలా పట్టుకునే అడిగా.*


*_నా పేరు రాజేష్.  నేను క్లాస్ లీడర్ని.  మాటీచర్ పెట్టింది నన్ను. నాకు అమ్మా నాన్నా లేరు. అమ్మమ్మ వుంది. అల్లరేం చేయను. బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తాను. చెయ్యి వదలండి. నేను క్లాస్ చూడాలి_*

*అంటుంటే అప్రయత్నంగా వాడి చెయ్యి వదిలేశా.*


*వీడు టీచర్ కొడుకు కాడా?... మరెవరు??* 

*ఈవిడెందుకు ఇంత గారాబంగా చూస్తోంది??* 

*అంతా ఒక్కసారిగా తల్లక్రిందులైనట్లు అనిపించింది.  అమ్మా నాన్నా లేరు!!! చెవుల్లో గింగురు మంటోంది.*


*ఆవిడ రాగానే, నా ప్రశ్నలన్నీ ఆమె ముందుంచా?*


*అవునండీ పాపం వాడికి నాన్న చిన్నప్పుడే పోయాడు.  అమ్మ మొన్న మొన్ననే పోయింది.  మధ్యాహ్న భోజన సమయానికి ఈ పిల్లాడిని చంకనేసుకొని పాఠశాల కొస్తూ ఉండేది. తను కొంత తిని పిల్లాడికి కొంత పెట్టేది. అప్పుడప్పుడూ పదో పరకో అవసరాలకని, మందులకని అడిగి తీసుకెళ్తూ ఉండేది.* *తనలాంటి కష్టం ఎవరికీ రాకూడదని, పిల్లాడిని కూడా తల్లి తండ్రులుగా ఇద్దరం అన్యాయం చేశామని తరచు బాధ పడుతూ ఉండేది.  ఆ మాయదారి మహమ్మారి మా కుటుంబాన్నంతటినీ చుట్టేసిందని.. తన కొడుకును కూడా ఎప్పుడో ఒకప్పుడు మింగేస్తుందని.. తన తరవాత వాడిని ఎవరు చూస్తారో నని ఒకటే బాధ పడేది.*  

*ఒకరోజు ఉదయం, ఆయాసపడుతూ బడి జరుగుతుంటే పిల్లాడితో వచ్చి...*   *_“టీచరమ్మా!! టీచరమ్మా!!! నువ్విచ్చే డబ్బులతో మా అబ్బాయికి ఇన్నాళ్ళూ మందులు కొన్నాను. ఇక నేను బ్రతకనని పిస్తోంది.  అవకాశం వుంటే మధ్యాహ్నం కొంచెం మా అబ్బాయికి రోజూ ఇంత అన్నం పెట్టమ్మా. ఆ మాయదారి జబ్బు, వాడ్ని కూడా మాదగ్గరకి చేర్చేదాకా!!"_  అన్నది. తర్వాత వారం రోజులకు ఆవిడ పోయిందని తెలిసింది” అంటూ ఆవిడ విచారంగా చెప్తుంటే… అప్రయత్నంగా కళ్ళ వెంట నీళ్ళు జల జలా రాలాయి ఆ పిల్నాడ్ని తలుచుకొని.*

*ఇంతకీ సమస్యేమిటి అన్నాను?? తెలిస్తే ఏమైనా సహాయం చేయగలనేమో ననుకుంటూ...* 


*_“హెచ్.ఐ.వి పాజిటివ్”_ చెప్పింది టీచర్.* 

*ప్రక్కలో పిడుగు పడినట్లు, భూమి రెండుగా చీలిపోతున్నట్లు, నేనేదో అగాధంలోకి జారిపోతున్నట్లు అనిపించింది.* 

*అప్రయత్నంగా కుర్చీలోంచి లేచి నిల్చున్నా...* 


*టీచర్ ఇంతదాకా ఒళ్ళో కూర్చో పెట్టుకొని ప్రేమగా చూస్తున్నదీ, అన్నం తినిపించి మూతి తుడిచిందీ, నాన్నా, కన్నా అంటూ సంబోధిస్తున్నదీ ఆ పిల్లాడినా!!!!!!???.....*  


*ఆ టీచర్ ఓ మాతృమూర్తిలా కన్పిస్తోంది. నాప్రమేయం లేకుండానే నేను రెండు చేతులూ జోడించి _“అమ్మా!”_ 🙏🙏🙏అన్నాను.*

 *ఇంకా అక్కడ వుంటే ఒక చక్కటి పిల్లల ప్రపంచాన్ని పాడుచేసిన వాడినవుతానని పించింది.  ఎక్కడివక్కడ వదిలేసి బయటి కొచ్చేశా.  బయట ఒకరెవరో విద్యా కమిటీ మెంబరట కనిపించారు.  టీచర్ గారు రాక ముందు పిల్లలు ఇరవై లోపే వుండేవారని... ఇప్పుడు అరవై పైగా పెరిగారని, చక్కగా పిల్లలందరినీ ప్రేమగా చూస్తూ పాఠాలు చెబుతారని, మా పిల్లలు కూడా టీచర్ లా వినయంగా ఉండటం లాంటి మంచి బుద్ధులు నేర్చు కుంటున్నారని... ఎప్పుడూ ఉదయమే 8.00 లకే వచ్చేస్తారని ఆలస్యంగా వెళతారని…. ఇలా చెప్తుంటే..*


 *_పాఠశాలను, ఉపాధ్యాయుల పనితీరును ఒకరోజులో, ఒకగంటలో అంచనా వేయడం ఎవరి వల్లా సాధ్యం కాదని, పూర్తి విషయాలు తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి రాకూడదని తెలుసుకున్నాను._*


*టీచర్ కేదో పాఠం నేర్పాలనుకున్న నాకు ఆ సందర్శన ఒక చక్కటి గొప్ప పాఠం నేర్పింది.*

 *బరువైన హృదయంతో అక్కడి నుండి కదిలాను… ఒక వేదాంతిలా..., మరియూ జ్ఞానోదయమైన బుద్ధునిలా....* 

🙏🙏🙏🙏🙏

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE