NaReN

NaReN

Thursday, December 15, 2022

రూ.10 లక్షల కవరేజ్

 *రూ.10 లక్షల కవరేజ్..*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


ప్రభుత్వ ఆధీనంలోని భారతీయ తపాలా శాఖ.. టాటా ఏఐజీ సంస్థతో కలిసి గ్రూప్‌ యాక్సిడెంట్‌ గార్డ్‌ పేరిట ఒక ఇన్సూరెన్స్ ఉత్పత్తిని అందుబాటులోకి తెచ్చింది. దీనికింద ఏడాదికి కేవలం రూ.399 చెల్లించి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ కవర్ పొందవచ్చు.


*ఇన్సూరెన్స్ స్కీమ్..*

ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి సందర్భంలో అవి కేవలం కుటుంబాలకు వ్యక్తిగతంగానే కాకుండా ఆర్థిక కష్టాలను కలిగిస్తున్నాయి. ఒక వేళ ప్రమాదంలో ఇంటిని పోషించే వ్యక్తులు ఉన్నట్లయితే పరిస్థితులు పూర్తిగా తలకిందులవుతాయి. ఇలాంటి అనుకోని సందర్భాల్లో కుటుంబానికి ఆసరాను కలిగించేందుకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తీసుకోవటం తప్పనిసరి. ఇలాంటి వాటిని ధృష్టిలో ఉంచుకుని ఇండియన్ పోస్టల్ సర్వీస్ తక్కువ ఖర్చులో పాలసీని ప్రవేశపెట్టింది.


ప్రమాదంలో గాయపడితే చికిత్సకు..

యాక్సిడెంట్ కారణంగా ఆసుపత్రిలో చేరితే IPD ఖర్చుల కోసం గరిష్ఠంగా రూ.60 వేలు, అదే ఔట్ పేషెంట్ గా ట్రీట్ మెంట్ తీసుకుంటే గరిష్ఠంగా రూ.30 వేల పరిహారం లభిస్తుంది. ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం ఏర్పడినా, అవయవం కోల్పోయినా, పక్షవాతం వచ్చినా రూ.10 లక్షలు లభిస్తుంది. పాలసీదారు మరణిస్తే.. అతనిపై ఆధారపడిన ఇద్దరు పిల్లల చదువుల కోసం గరిష్ఠంగా లక్ష అందించబడుతుంది.


*ఖర్చులకు చెల్లింపు..*

మరణించిన పాలసీదారుని కుటుంబానికి అంత్యక్రియలకు రూ.5 వేలు అందిస్తారు. కుటుంబ ప్రయోజనాల కింద రూ.25 వేలు, ఆసుపత్రిలో రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున 10 రోజుల వరకు అందించటం జరుగుతుంది. ఇలా తక్కువ ప్రీమియంతో అద్బుతమైన ప్రయోజనాలను ఈ పోస్టల్ ఇన్సూరెన్స్ అందిస్తోందని మీకు తెలియజేస్తున్నాను.🙏🏻

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


పసుపులేటి నరేంద్రస్వామి

SKY LIFE FOUNDATION

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE