NaReN

NaReN

Thursday, May 11, 2023

ప్రేమ ఉన్నోడే పేదోడు

 ప్రేమ ఉన్నోడే పేదోడు


ఉన్నోళ్లు అన్నా..

అదృష్టవంతులన్నా కొందరే ..

ఏదైనా వారికే అనుకూలంగా జరుగుతుంది.. 

వారు అనుకునుకున్నదంతా... నెరవేరుతుంది.. 

ఏదైనా ఆ కొందరికే అందుతుంది.. 

అదృష్టమైనా ...ఆనందమైన..


 భయంతో... అదృష్టము

వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది!..

అన్ని దారులూ.. వాళ్ళకే రాచబాటలై...

అన్నీ వారితోనే జతకడతాయి..


కొందరు పేదోళ్లు.. 

అందరికీ వీళ్ళంటే అయిష్టం!..  

అందరూ వీళ్ళను ద్వేషిస్తారు..

దోషులుగా చూస్తారు. 

వీరికి కాలమెప్పుడూ కలసిరాదు..

కష్టాలు..కలతలు మాత్రం 

ఎప్పుడూ వీళ్ళవెంటే...  

దురదృష్టం వద్దన్నా వీళ్లవెన్నంటే...


అందుకే వీళ్ళకంటే వాళ్ళే నిజంగానే భాగ్యవంతులు...

కష్టాలెన్నడూ ఎరగనోళ్లు!... 

బ్రహ్మ సైతం చక్కని రాత రాసిన

అసలుసిసలైన గొప్పోళ్ళు.. 


కించిత్తు శరీర కష్టం లేకుండా... 

ఆవేదన్నదే ఎరుగని సుఖజీవులు!...

కానీ ఆత్మీయత..అనురాగాలు 

అంత త్వరగా వీరి దరికి చేరని నిర్భాగ్యులు !...


మమకారం..మానవత్వం 

ఎపుడూ పేదోళ్ళలోగిళ్లు...

నిఖార్సయిన ప్రేమ ఒక్కటే..

పేదోడికున్న ఆస్తి..ఐశ్వర్యం...

వీళ్ళకెన్నడూ వీడని బాధలే... 

వీరివెప్పుడూ వాడిన మొఖాలే!...


వీళ్లకు అడుగడుగునా 

ధ్వనించే మూగరోదన!...

వీల్లెప్పుడు అభాగ్యహీనత్వం!...

నిర్భాగ్య దీనత్వం...

వీళ్ళ చుట్టూ ఆవరించిన 

దురదృష్టం...

ఆరుగాలమంతా... 

అలుపెరుగని కాయకష్టం


వీళ్లెప్పుడు ఏ పనిచేసినా 

త్రికరణశుద్ధిగా చేస్తారు...

తమవంతు బాధ్యతగా...

వాళ్ళపాత్ర సమగ్రంగా పోషిస్తారు...

అందుకే కష్టాలు వారిని

ఎప్పుడూ వెతుక్కుంటూ వస్తాయి. 

చరిత్రలో సదా బతుకువెతలు వాల్లవే!..

మెతుకు కథలు వాళ్ళవే..

అందుకే అదృష్టమే

మీకు పునాది...

పేదోడికి" ప్రేమొక్కటే.".. 

తరతరాలకూ తరగని పెన్నిధి


No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE