NaReN

NaReN

Sunday, May 21, 2023

షష్టిపూర్తి ఎందుకు చేస్తారు?

 💐 షష్టిపూర్తి ఎందుకు చేస్తారు? 💐          

మానవుని సంపూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది. 60 సంవత్సరాలు నిండినప్పుడు చేసుకునేది షష్టిపూర్తి. ప్రతివారికీ మృత్యువు 60 వ యేట ‘ఉగ్రరథుడు’ అను పేరుతో, 70 వ యేట ‘భీమరథుడు’ అను పేరుతో , 78 వ యేట ‘విజయరథుడు’ అనుపేరుతో ఎదురుచూస్తుంటాడు. ఆరోగ్య. సమస్యలకు తట్టుకోవటానికి చేసే శాంతి ప్రక్రియ. షష్టిపూర్తి."*


*బృహస్పతి, శని 30 సంవత్సరాలకు మానవుని జన్మకాలంలో ఉన్నరాశికి చేరటానికి 60 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళిద్దరూ తాము బయలుదేరిన రాశికి చేరుకోవటంతో మానవుని జీవితం మరలా ప్రారంభమవుతుంది. తిరిగి జీవితం ప్రారంభం ఐనట్లు సంకేతం.*


*మానవుడు పుట్టిన తెలుగు సంవత్సరాలు (60) నిండుతాయి కనుక షష్టిపూర్తి.*


*షష్టిపూర్తి సందర్భంగా ఆయుష్కామన యజ్ఞము చేస్తారు. ఆయువును కోరి చేయు యజ్ఞము… ‘ఆయుష్కామనయజ్ఞము’*


*పెద్దలు ఈ ఆయుష్కామన యజ్ఞాన్ని చేసే పధ్ధతిని ఇలా చెప్పారు.*


*తెల్లని నూతన వస్త్రముపై తూర్పు దిక్కుగా 12 గీతలు గీసి వాటిమీద అయిదు అడ్డగీతలు గీసి మొత్తము 60 గదులు వచ్చే విధంగా చేస్తారు. వరుసకు 12 అయిదు వరుసలు తూర్పు దిక్కున బియ్యం పోసి కలశం ఉంచుతారు. ప్రభవ నుంచి క్షయ వరకు 60 సం. అధిదేవతలతో ఆవాహన చేస్తారు. దక్షిణాయన ఉత్తరాయణ దేవతలను , 6 ఋతువులను 12 మాసములను ఆవాహన చేస్తారు.*


*పక్షములను, తిదులను వారములను - వారదేవతలు అయిన - సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శనిని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు - అగ్ని, జలము, భూమి, విష్ణువు ఇంద్రుడు, ప్రజాపతి లను ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు శివుడు, దుర్గ, కుమారస్వామి, బ్రహ్మ - ఇంకా ఏకాదశ రుద్రులు , నక్షత్ర దేవతలు 27 యోగములు 11 కరణములు ఇలా అందరి దేవి దేవతా స్వరూపాలని మృత్యుంజయుని ఆవాహన చేసి బ్రాహ్మణోత్తములు మంగళాచరనములతో వేదయుక్తంగా ఈ కార్యక్రమం జరిపిస్తారు.*


*అపమృత్యు నివారణార్థం హోమాల్ని , జపాలని కుడా చేస్తారు. తదుపరి బ్రహ్మణులను సత్కరించి బంధుమిత్రులతో విందు ఆరగిస్తారు.* 


*పూర్వకాలంలో పురుషుడు ఏ వేడుక చేసుకున్నా భార్యకు కూడా జరిగినట్టే భావించేవారు కనుక స్త్రీలకు మళ్ళీ విడిగా షష్టిపూర్తి చేసే ఆచారంలేదు.*


*పెళ్లి సాధారణంగా జరగాలి. షష్టిపూర్తి ఘనంగా జరగాలని పెద్దల మాట. ఎందుకంటే షష్టిపూర్తి దృఢమైన ఆత్మీయతల సుగంధం పరిమళించే సందర్భం కనుక. బిడ్డలు తమ కృతజ్ఞతను తమ తల్లిదండ్రులకు అర్పించుకొనే అపురూప సందర్భం షష్టిపూర్తి."*

                                   

   *🙏లోకా సమస్తా సుజనోభవన్తు! 

సర్వే సుజనా సుఖినో భవతు 💐🙏🌹🌷

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE