సింహం - నక్క
ఆకలితో ఉన్న సింహం నక్కతో అన్నది. *ఏదన్నా జంతువుని తీసుకురా లేకపోతే నిన్ను తింటాను* అన్నది.
నక్క వెతగ్గా ఒక గాడిద కనబడింది. *సింహం నిన్ను తన వారసుడిగా నిన్ను ఈ అడవికి రాజును చేస్తానన్నది, నాతో రా!* అన్నది.
గాడిదను చూడగానే దాడి చేసి దాని చెవులు కొరికేసింది. గాడిద పారిపోతూ నక్కతో కోపంగా: *ఇంత మోసం చేస్తావా* అన్నది.
*పిచ్చిదానా! కిరీటం పెట్టడానికి చెవులడ్డమని కోరికిందంతే: ఏం సందేహించకు* అని నచ్చ చెప్పి మళ్ళీ తీసుకొచ్చింది.
ఈసారి దాడిలో దాని తోక దొరికితే కొరికి తెంపేసింది. మళ్ళీ పారిపోతూ కోపంతో బాధతో వెంట వస్తున్న నక్కతో: *మళ్ళీ మోసం చేశావు కదూ!*
నక్క: *ఛీ! ఛీ! అదేంలేదు. నీన్ను సింహాసనం మీద కూర్చోబెట్టడానికి తోక అడ్డమని కొరికేసిందంతే!* అన్నది.
సరే అని మళ్ళీ వచ్చిన గాడిదని సింహం చంపేసి నక్కతో: *దీని చర్మం వలిచి మెదడు, గుండె, లివరు ఊపిరితిత్తులు తీసుకురమ్మన్నది.*
నక్క మెదడు తాను తినేసి మిగిలినవి పట్టుకొచ్చింది. అవి చూసి సింహం: *వీటిలో మెదడేది?* అని అడిగింది.
నక్క: *ప్రభూ! దీనికి మెదడే లేదు. ఉండి ఉంటే మీరు దాడి చేస్తున్నా మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకు వచ్చేది కాదు కదా!* అన్నది.
*నిజమే!* అన్నది సింహం.
సందేశం: *మోసం చేసిన నక్క లాంటి అవినీతి నాయకులది గొప్పతనం కాదు పదే పదే వాళ్ళ మాటలు నమ్మి ఓట్లేసే ప్రజలదే తప్పంతా.*
No comments:
Post a Comment