*Let's Make ur day Fruitful*
*రేపు 22 మార్చి 2020 జాతీయ కుటుంబ దినోత్సవం*
*ఇంట్లో రేపు మనం ఏమి చేయవచ్చు ...?*
*కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయం గడిపే అవకాశం దొరికింది*
👉 ఉదయం
5.30 - 6.00:
మేల్కొలుపు / ఉదయం కార్యకలాపాలు / టీ / కాఫీ
👉6.00-6.45am:
ధ్యానం, దైవారాధన మొదలైనవి.
👉6.45 - 7.30:
యోగ / వ్యాయామం
👉7.30-8.30am:
భార్య మార్గదర్శకత్వంతో భర్త అల్పాహారం సిద్ధం చేయాలి.
పిల్లలు ఇంటిని శుభ్రపరచడం.
👉8.30-9.00am:
కుటుంబంతో అల్పాహారం.
👉9.00-10.00am:
కుటుంబం అంతా కలిసి వారి విజయాల గురించి మాట్లాడటం, భవిష్యత్ లక్ష్యాలు నిర్ణయించుకోవడం.
ఉదయం10.00-11.30:
క్యారం, చెస్, పచ్చీస్, అష్టా చెమ్మ మొదలైన ఇండోర్ గేమ్స్ ...
👉11.30 - 1.00:
కుటుంబ సభ్యులందరూ కలసి మధ్యాహ్న భోజనం తయారీ, అవకాశం ఉంటే కొత్త వంటకాలు ప్రయత్నం చేయవచ్చు.
👉1.00 - 2.00:
కుటుంబం అంతా కలిసి మధ్యాహ్నం భోజనం చేయటం.
👉2.00-3.30pm:
వంటగది మరియు ఇతర గదులను శుభ్రపరుచుకోవడం.
👉3.30-4.45pm:
టీ బిస్కెట్లు.
పెద్దలు తమ కుటుంబం / పూర్వీకుల నేపథ్యం / చరిత్రను కనీసం 3/4 తరాల పిల్లలకు వివరించాలి.
కుటుంబ హెచ్చు తగ్గులు / కష్ట సమయాలు, వైఫల్యాలు మరియు విజయం గురించి మాట్లాడుకోవడం.
కుటుంబం పాత ఫోటో ఆల్బమ్‌లను చూడొచ్చు.
👉4.45- సాయంత్రం 5.05:
బాల్కనీ, టెర్రేస్,
ప్రాంగణంలలో నిలుచొని
5 నిమిషాలు చప్పట్లు కొడుతూ నిరంతరం శ్రమిస్తున్న డాక్టర్లకు, వీధులను శుభ్రపరిచే సిబ్బందికి, ఇతర అత్యవసర సేవలు అందించే వ్యక్తులకు కృతజ్ఞతా భావాన్ని చూపిద్దాం.
👉5.05-6.30 pm:
భగవద్గీత లేదా ఏదైనా పురాణ కథలు చదవడం లేక వినడం
👉6.30-8.00pm:
కుటుంబ ఫోటోలు, వివాహ వీడియోలు మరియు సానుకూల విషయాలను పంచుకోవడం.
👉8.00-9.30pm:
రాత్రి భోజనం సిద్ధం చేసుకోవడం, అందరూ కలిసి భోజనం చేయడం.
👉9.30-10.30pm:
ప్రతి కుటుంబ సభ్యుడి వ్యక్తిత్వ మెరుగుదలకు మీ కుటుంబ సభ్యుని యొక్క 5 పాజిటివ్‌లు మరియు 5 ప్రతికూలతలను వ్రాసి, ఒకరితో ఒకరు పంచుకోండి.
*రాత్రి 10.30 - శుభ రాత్రి*
పసుపులేటి నరేంద్రస్వామి
No comments:
Post a Comment