NaReN

NaReN

Thursday, March 30, 2023

1850 లలో ఫేస్ బుక్

 *1850 లలో ఫేస్ బుక్ ఉండి ఉంటే, అప్పట్లో చాటింగ్ ఎలా సాగేదో తెలుసా...!*

*అతడు :- సఖీ…!*

*ఆమె :- ప్రియా…!*

*అతడు :- రాత్రి భోజనము పూర్తి అయినదా ?*

*ఆమె :- అయినది. మరి మీరు భుజింతిరా ?*

*అతడు :- ఎపుడో...!*

*ఆమె :- ఇంకా ?*

*అతడు :- ఇపుడే ముఖ వాచకమును తెరిచితిని. అందు తమరు ఎగుమతి చేసినట్టి “స్వతః చిత్రము” మహత్తరముగానున్నది. వేల ఇష్టములను నొక్కవలెనన్న పరవశము కలిగినది మాకు. కానీ ఒక ఇష్టము మాత్రమే లెక్కకు వచ్చును కదా !*

*ఆమె :- నా యొక్క స్వతః చిత్రము తమకు అంతగా నచ్చినదా ప్రియా ?*

*అతడు :- అవును దేవి. మీ వెనకాల జాలువారుచున్నట్టి జలపాతపు అందాలు తమ అధరహాసపు సౌందర్యము ముందు తేలిపోవుచున్నవి.*

*ఆమె :- పోండి స్వామి. మీరు మరీనూ…*

*అతడు :-ముఖవాచకము నందు ఆ యొక్క చిత్రము కిందనే వ్యాఖ్యను లిఖించితిని కదా సఖి. తమరు దానిని చదవనే లేదా ? ఇతరులు దానిని చదవకనే చదువుచూ లెక్కకు మించి ఇష్టములను నొక్కుచున్నారు.*

*ఆమె :- చదవకనేం...! పలు మార్లు పరిపరి విధములా చదివితిని. మిక్కిలి ఆనందమున మునిగితిని. ఇంకనూ ఆయొక్క మకరందపు మడుగులో నుండి పైకి తేలలేక పోవుచున్నాను.*

*అతడు :- అటులనా ?*

*ఆమె :- అవును స్వామీ…*

*అతడు :- ఇంకా...?*

*ఆమె :- మీరే చెప్పాలి.*

*అతడు :- వర్షము ఎడతెరిపి లేకుండగా కురియుచున్నది. అంతర్జాలమునకు సంకేతములు బహు అల్పముగా అందుచున్నవి. సందేశముల పంపకమునకు అంతరాయము కలుగుచున్నది. ఇక పడుకునెదము. ప్రాతః కాలమున మరలా శుభోదయముతో పలకరించుకొందాము.*

*ఆమె :- అవును స్వామీ... ఇక పవళింపవలెను. మీకు శుభరాత్రి.*

*అతడు :- అటులనే దేవి. మీకును నా తరుపున శుభరాత్రి మరియు మధుర కలలు.💐*

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE