NaReN

NaReN

Friday, March 3, 2023

పాఠశాలల్లో నో బ్యాగ్‌ డే

 

పాఠశాలల్లో నో బ్యాగ్‌ డే..


విద్యార్థులకు కృత్యాధార విద్య

సామాజిక అంశాలపై అవగాహన కల్పించేలా అభ్యాసాలు

తరగతుల వారీగా కార్యక్రమాలు

స్కూలు బ్యాగులు లేకుండా పాఠశాలలకు వచ్చిన విద్యార్థులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే కార్యక్రమాలను తరగతుల వారీగా నిర్ణయించారు నో బ్యాగ్‌ డే శనివారం నాలుగు ప్రధాన పిరియడ్లుగా విభజించి కార్యక్రమాలను అమలు చేస్తారు.

1, 2 తరగతుల విద్యార్థులకు

 మొదటి పిరియడ్‌ పాడుకుందాం.. ఇందులో అభినయ, జానపద, దేశ భక్తి గేయాలు, శ్లోకాలు వంటివి పిల్లలతో పాడించాలి.

రెండో పిరియడ్‌ .. మాట్లాడుకుందాం.. 

కథలు చెప్పడం పుస్తకాలలో కఽథలను చదవడం తమ అనుభవాలను తెలియజేయడం, పొదుపు కథలు పజిల్స్‌, సరదా ఆటలు ఆడించడం పిల్లలతో చేయించాలి.

మూడో పిరియడ్‌.. నటిద్దాం.. 

నాటికలు లఘు నాటికలు (స్కిట్స్‌) మూకాభినయాలు, ఏకపాత్రాభినాయాలు, నృత్యాలు వంటివి ప్రదర్శించవలసి ఉంటుంది.

నాలుగో పిరియడ్‌.. సృజన


పిల్లలలో సృజనాత్మక కళలను అభివృద్ధి చేసేందుకు వివిధ కార్యక్రమాలను అమలు చేయవలసి ఉంటుంది. బొమ్మలు గీయడం రంగులు వేయడం, బంకమట్టిని ఉపయోగించి బొమ్మలు నమూనాలు తయారు చేసే కార్యక్రమాలను చేపట్టాలి

3,4,5 తరగతుల విద్యార్థులకు


నో బ్యాగ్‌ డే కార్యక్రమాలను మూడు, నాలుగు, అయిదు తరగతులకు వినూత్నంగా చేపట్టేందుకు కార్యక్రమాన్ని నిర్ణయించారు.

మొదటి పిరియడ్‌.. సృజన : 


ఇందులో బొమ్మలు వేయడం, రంగులు దిద్దడం వంటి పనులతో పాటు మూకాభినయాలు వంటివి చేయించాలి. మాస్కులతో నాటికలు వేయించడం, అలంకరణ వస్తువులు తయారు చేయడం, నృత్యాలు చేయించడం వంటి పనులు చేయాలి.

రెండో పిరియడ్‌. తోటకుపోదాం,పరిశుభ్రత చేద్దాం 

ఈ కార్యక్రమంలో బడి తోటలో మొక్కలను సంరక్షించడం, పాదులు, కలుపు మొక్కలు తీయడం, ఎరువులు వేయడం, నీరు పెట్టడం, తరగతి గదలను శుభ్రంగా ఉంచడం వంటి పనులు చేయించాలి.*

మూడో పిరియడ్‌ .. చదువుకుందాం :

ఇందులో పాఠశాల గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను ఎంపిక చేసుకుని పిల్లలు చదవడం అందులో కథలను ఇతర అంశాలను ఇతర పిల్లలతో చర్చించడం చిన్న కథలు రాయడం వంటి పనులు చేయాలి


నాలుగో పిరియడ్‌.. విందాం విందాం : 

ఈ కార్యక్రమంలో ప్రాఽథమిక ఆరోగ్య కార్యకర్త, పంచాయతీ కార్యదర్శి వ్యవసాయాధికారి, పోస్టుమాస్టరు, వ్యాపారి, వ్యవసాయదారులను పాఠశాలకు ఆహ్వానించి వారితో వారికి సంబంధించిన కార్యక్రమాలను పిల్లలకు చెప్పించాలి

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE