NaReN

NaReN

Friday, August 2, 2024

సింప్లిసిటీ

 సింప్లిసిటీ



ఆరోజు చివరి రైలు ఆ స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నుండి వెళ్ళిపోయింది. తదుపరి రైలు రేపు ఉదయం వరకు రాదనే విషయం తెలియక ఒక వృద్ధురాలు రైలు కొరకు ఎదురుచూస్తూ ప్లాట్‌ఫారమ్ పై  కూర్చొని ఉంది. అది గమనించిన ఒక కూలీ ఆ తల్లిని అడిగాడు. అమ్మా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అని. దానికి సమాధానం గా ఆ పెద్దావిడ నేను నా కొడుకు వద్దకు ఢిల్లీ వెళ్ళాలి అని చెప్పింది. జవాబుగా కూలీ ఈ రోజు ఇక రైలు లేదు అమ్మా అని చెప్పాడు. అందుకు ఆ స్త్రీ నిస్సహాయంగా చూసింది. అయితే ఆమెకు వెయిటింగ్ రూమ్‌లో ఆశ్రయం కల్పించాడు. అంతటితో ఆగకుండా ఆ కూలీ ఆమె కొడుకు గురించి అడగగా ఆమె తన కొడుకు రైల్వేలో పనిచేస్తున్నాడని తల్లి బదులిచ్చింది. పేరు చెప్పండి, సంప్రదించడానికి మేము ప్రయత్నిస్తాము అన్నాడు ఆ కూలి. మా అబ్బాయిని అందరూ *లాల్ బహదూర్ శాస్త్రి అని పిలుస్తారు* అని ఆ అమ్మ బదులిచ్చారు. ఆ స్త్రీ మూర్తి కొడుకు అప్పుడు ఇండియన్ రైల్వేస్ కేంద్ర కేబినెట్ మినిస్టర్. ఒక్క క్షణంలో స్టేషన్ మొత్తం దద్దరిల్లింది. వెంటనే సైరన్న్ కారు వచ్చింది. వృద్ధురాలు ఆశ్చర్యపోయింది. ఈ విషయం లాల్ బహదూర్ శాస్త్రికి ఏమీ తెలియకుండా భారతీయ రైల్వే అన్ని ఏర్పాట్లు చేసింది. ఆవిడ ఢిల్లీ లో తన కొడుకుని కలిసిన తర్వాత కొడుకుని ఈవిధంగా అడిగింది - *"అబ్బాయి, నీవు రేల్వే లో ఏం పని చేస్తావు..."*


ఇదే కదా సింప్లిసిటీ అంటే.

No comments:

Post a Comment

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE