NaReN

NaReN

Wednesday, August 28, 2024

ఒక పల్లెటూరు లో ఒక హోటల్

 ఒక పల్లెటూరు లో ఒక  హోటల్ ఉంది...

అక్కడకి ఒక సినిమా వాళ్ళు 40మంది

వచ్చారు . అంత మంది ఒకేసారి రావడంతో  ఆ హోటల్ లో జనం అంతా సినిమా వాళ్ళనే చూస్తున్నారు.

సినిమా వాళ్ళు ఎంతో గర్వం గా ఫీల్ అయి పోతూన్నారు... 


అందరు హోటల్ లో

కూర్చుని ఉన్నారు ఇంతలో అక్కడికి డెరెక్టర్

గారు వచ్చారు...


అందరూ భోజనం చేస్తున్నారు. ఇంతలో డెరెక్టర్

గారు అక్కడ వాళ్ళందరిని చూస్తున్న ఒక్క తాతని

చూసాడు... చూడగానే ఎందుకో ఆ తాత అలా

చూస్తున్నాడు అని తెలుసుకుందాం అని తాతా 

ఇటురా అని పిలిచాడు...


ఏం తాతా భోజనం చేసావా అని అడిగాడు... తాత

చేసానయ్య అని చెప్పాడు...


మరి ఎందుకు తాత ఇందాకటి నుంచి అక్కడ

కూర్చుని మా అందరిని చూస్తున్నావ్ సినిమా అంటే

నీకు ఇష్టమా అని అడిగాడు...??


అదేం లేదయ్యా అని కొంచెం దీనంగా

మొహం పెట్టి చెప్పాడు...


మరి ఏంటి ఏమైనా

డబ్బు లు కావాలా ఏమన్నా ఉంటే

చెప్పు నేను సహాయం చేస్తా అని అడిగాడు...


అదేం లేదయ్యా .. నేను ఒక్కటి అడగాలి

అనుకుంటున్నా .... అడగనా అన్నాడు ...??


సరే తాత అడుగు ఏంటో అని అన్నాడు...


మీరు ఇంత కష్టపడి సినిమా తీస్తారు కదా ఆ సినిమా

ఎవరైనా విడుదల అవ్వక ముందే పైరసీ చేస్తే

ఏం చేస్తారు ...?? అని అడిగాడు.


ఏముంది .... అలా చేసిన వాడిని జైల్లో పెడతాం.. ఇంకా లక్షలో జరిమానా వేస్తారు ఇవన్నీ నీకు ఎందుకు తాత అని అన్నాడు ...??


అప్పుడు ఆ తాత ...

మరి ఎందుకు బాబు మీరు ఇంత కష్టపడి

సినిమాలు తీస్తున్నారు అని అడిగాడు...??


అప్పుడు డైరెక్టర్ ప్రజల కళ్ళల్లో

ఆనందం చూడటానికి అని చెప్పాడు గర్వంగా ...


అపుడు తాత అడిగాడు ...... మీరు ఇంత మంది ఇక్కడ

భోజనం చేసారు కదా దాంట్లో అక్కడ చూడు చాల

మంది సగం అన్నంలో చేతులు కడిగేసారు. అందుకే నేను అలా చూస్తున్నా మిమల్ని అని అన్నాడు...


దానికి నీకు అంత బాధ ఎందుకు తాతా ..... ఆ డబ్బులు నువ్వు ఎం కట్టట్లేదుగా.. అవి మా నిర్మాత కడతాడు అని వేలాకోలంగా అన్నాడు...


అపుడు ఆ తాత అన్నాడు... మీ సినిమా ఎవరో దోపిడీ చేస్తే మీరు వాళ్ళని జైల్లో పెట్టిస్తారు జరిమానా

కట్టిస్తారు... 


కానీ మేము పండించే పంట దళారులు దోపిడీ చేస్తున్నా  మేము ఎంతో జాగ్రత్తగా పంటని అమ్మలా చూసుకుని

పండిస్తాం బాబు ఎందుకో తెలుసా అన్నాడు...??


డైరెక్టర్కి ఏం చెప్పాలో తెలియక ఎందుకు అని

అడిగాడు...??


ఆ తాత ఇలా చెప్పాడు ..... కోట్లు ఉన్న కోటీశ్వరుడు  అయినా, దిక్కు లేని వాడికి అయినా ఆకలి వేస్తుంది కోట్లు ఉన్న వాడు కొనుక్కు తింటాడు, దిక్కు లేని వాడు అడుక్కు తింటాడు... కానీ ప్రతి ఒక్కరు తిండి తినాలి.. ఆకలి తో ఉన్న వాడు ఏదో  ఒక్కసారి అయినా మమ్మల్ని  గుర్తు చేసుకోకపోయినా వారి కడుపు లోని పేగులు గుర్తు చేసుకుంటాయి  అని చెప్పాడు...


అందుకే బాబు .... ఇందాక మీరు సగం అన్నం లో

చేతులు కడుగుతూ ఉంటే నాకు బాధ కలిగి

చూసానే కానీ మీరు నాకు సహాయం చేస్తారు అని కాదు...


ఈ దేశం లో ప్రతి రోజు ఆత్మహత్య చేసుకుని చనిపోయే వారిలో ఎక్కువ శాతం రైతులు ఉంటారు కానీ సినిమా వాళ్ళు కాదు ...


మీరు మా చావుల్ని ఎలాగో అపలేరు కనీసం

భోజనం చేస్తున్నపుడు అయినా ఎంత కావాలో అంత తిని మిగతాది వృధా చేయకండి బాబు...


ఈ విషయం మీకు ఎందుకు చెపుతున్నా అంటే

మద్యపానం ఆరోగ్యానికి హానికరం...

ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని

సినిమాలో వేస్తారు.. అలాగే ఎక్కడో ఒక్క చోట

అన్నం వృదా చేయటం వల్ల ఒక్క మనిషి కి

అన్నం లేకుండా పోతుంది అని చెప్తారు అని

బాబు అంతే అని చెప్పి వెళ్ళిపోయాడు...

Tuesday, August 27, 2024

Power of Positive Thinking


Research is beginning to reveal that positive thinking is about much more than just being happy or displaying an upbeat attitude. Positive thoughts can actually create real value in your life and help you build skills that last much longer than a smile.



Friday, August 16, 2024

ఒకే జిల్లా కు ఆ IPS, IAS లు

 ఒకే జిల్లా కు ఆ IPS, IAS లు 



వీరిరువురూ భార్యా భర్తలు. ఒకరు ఐఏఎస్, ఒకరు ఐపీఎస్‌. ఇద్దరూ ఒకే చోట ఇంజనీరింగ్‌ చదివారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌  టెక్నాలజీలో (ఐఐటీ) ఖరగ్‌పూర్‌ అంటే తెలియని వారు ఉండరు.


ఒకరిది తెలంగాణ, మరొకరిది ఆంధ్రప్రదేశ్‌. ఒకరికి వడిస్సా కేడర్‌ రాగా మరొకరికి ఏపీ కేడర్‌ వచ్చింది. ఇరువురూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. గత సంవత్సరం చివర్లో వివాహం జరిగింది. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ అధికారులుగా పనిచేస్తున్నారు. వీరి ప్రత్యేకత ఏమిటి? ఎందుకు వీరి గురించి చెప్పాల్సి వస్తోంది.


కొమ్మిన ప్రతాప్‌ శివ కిశోర్‌ 2019 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. నెల్లూరు జిల్లా కలువాయ్ మండలం లోని మాదన్నగిరి పల్లె గ్రామానికి చెందిన వారు. చుంచులూరు నందు ఒకటి నుంచి 7వ తరగతి వరకు మరియు8 వ తరగతి St  Marys ఉన్నత పాఠశాల ఆత్మకూరు నందు చదువుకున్నారు. 


నెల్లూరు జిల్లా కృష్ణాపురంలోని జవహర్‌ నవోదయ స్కూళ్లో 9,10 తరగతులు చవివారు. నెల్లూరులోని నారాయణ కాలేజీలో iit campus నందు ఇంటర్‌ చదువు పూర్తిచేసి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజనీరింగ్‌ విద్యను పూర్తి చేశారు. 


(బయో టెక్నాలజీ, బయో కెమికల్‌ ఇంజనీరింగ్‌) ఇంజనీరింగ్‌ పూర్తి కాగానే సివిల్స్‌ రాశారు. రెండు సార్లు సివిల్స్‌ రాలేదు. మూడో సారి పట్టుదలతో సాధించారు. 153వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌ తీసుకున్నారు. ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన వెంటనే బెంగళూరులోని బోచ్‌ సెంటర్‌లో సీనియర్‌ సైంటిస్ట్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌లో 4 సంవత్సరాల 2నెలలు పనిచేశారు.


 రీసెర్చ్‌ కన్సల్‌టెంట్, స్టూడెంట్‌ అడ్వయిజర్‌గా పనిచేశారు. ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యారు. 2018లో హైదరాబాద్‌ సర్థార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అకాడమిలో శిక్షణ పూర్తిచేసుకుని కర్నూలు జిల్లాలో మొదట ఉద్యోగ ట్రైనింగ్‌ పూర్తి చేశారు.


 ఎమ్మిగనూరులోని పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఆయన ఐపీఎస్‌ ప్రస్థానం ప్రారంభమైంది. మొదట అక్కడే రికార్డుల పరిశీలన జరిగింది. తండ్రి కొమ్మి నారాయణ, తల్లి నిర్మల హృదయ్‌ ప్రశాంతి. తండ్రి ఉపాధ్యాయునిగా పనిచేశారు. తల్లి గృహిణి.పెద్దిటి ధాత్రిరెడ్డి. ఈమె మొదట ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. 


తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం గుండ్లబావి గ్రామంలో జన్మించారు. 2019లో ఐపీఎస్‌ సాధించి ఖమ్మం జిల్లాలో పనిచేశారు. ఆ తరువాత ఐఏఎస్‌ సాధించాలనే పట్టుదలతో మళ్లీ పరీక్ష రాసి సివిల్స్‌లో 46వ ర్యాంకు సాధించారు. 


2020 అక్టోబరులో సబ్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఒడిస్సా కేడర్‌కు ఎంపిక కాగా అక్కడి నుంచి 2023లో ఏపీ కేడర్‌కు బదిలీ అయ్యారు. మొదటి సారిగా పాడేరు సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.


 2001 నుంచి హైదరాబాద్‌లోని జోసఫ్‌ పబ్లిక్‌ స్కూలులో చదివారు. 2009 నుంచి 2011 వరకు ఎస్‌టీ ప్యాట్రిక్స్‌ జూనియర్‌ కాలేజీలో చదివారు. 2011 నుంచి 2015వరకు ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఇంజనీరింగ్‌ విద్యను పూర్తి చేశారు. 2021 జూన్‌ 19న తల్లి చనిపోయింది. 43 రోజుల పాటు కరొనా పోరాటం చేసి మృతి చెందారు. క్యాన్సర్‌ను జయించినప్పటికీ కరోనాను మాత్రం ఎదుర్కోలేక పోయింది. తల్లి పేరు పి సుశీల. తండ్రి కృష్ణారెడ్డి. తల్లి ఆదర్శాలైన దయ, సానుభూతితో తనలో ఉన్నట్లు పలు చోట్ల చెప్పారు.ఎందుకు వీరికి ఇంత క్రేజ్‌కెపిఎస్‌ కిశోర్, పి ధాత్రిరెడ్డిలు భార్యా భర్తలు, భర్త ఐపీఎస్, భార్య ఐఏఎస్‌. భార్య కూడా మొదట ఐపీఎస్‌ సాధించి ఆ తరువాత ఐఏఎస్‌ సాధించారు.


 ఇరువురూ మొదట ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లా అయిన పాడేరులో ధాత్రి సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. చింతపల్లి ఏఎస్‌పీగా కిశోర్‌ బాధ్యతలు స్వీకరించారు. గత ప్రభుత్వంలో వీరు ఏజెన్సీ ఏరియాలో గొప్పగా పనిచేశారనే పేరు సంపాదించారు. ఇరువురికి సేవ చేయాలనే ఆలోచన ఉంది. అప్పటికే వీరిరువురికీ వివాహమైంది. భార్యా భర్తలు కావడం వల్ల ఎక్కడికైనా వెళ్లేందుకు వెనుకాడే వారు కాదు.


 చింతపల్లి, పాడేరు రెండు పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలు. ఇక్కడ గిరిజనులు కేవలం అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తుంటారు. ఇక్కడి పిల్లలకు, ప్రతి ఒక్కరికి విద్య అందేలా వీరిద్దరు చర్యలు తీసుకున్నారు. పిల్లలను పాఠశాలలకు తప్పనిసరిగా పంపించే విధంగా తల్లిదండ్రులను ఒప్పించడంలో సక్సెస్‌ అయ్యారు. 


ప్రభుత్వ వైద్యం సకాలంలో అందుతుందా లేదా అనే దానిపై నిత్యం తెలుసుకునే వారు. వైద్య సిబ్బందిపై ఏ చిన్న ఇబ్బంది ఉన్నా దానిని సరిదిద్దే వారు. ధాత్రి చదువుకునే రోజుల్లోనే సేవా కార్యక్రమాలపై ఎక్కువుగా దృష్టి పెట్టే వారు. 2016లో ఆమె ఆధ్వర్యంలో ఫీడ్‌ ఇండియా అనే ఎన్‌జీవోను స్థాపించారు. హైదరాబాద్‌లోని హోటల్స్‌లో మిగిలి పోయిన ఆహారాన్ని సేకరించి ఆహారం అందని నిరుపేదలకు పంచి పెట్టేవారు.


 ఇలా స్వచ్ఛంద సంస్థల సహకారంతో కూడా ఏజెన్సీలోని గిరిజనుల బాగోగులు చూసే వారు. వీరిపై గిరిజనులు కూడా అంతేవిధంగా అభిమానం పెంచుకున్నారు. ఇద్దరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకున్నవారే. ఇద్దరూ గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన నేపథ్యం ఉంది. ఆ మూలాలు మరిచిపోలేదు. సివిల్‌ సర్వెంట్లుగా ఉన్నప్పటికీ ఎవరి వద్దకైన చొచ్చుకొని పోయే మనస్థత్వం ఉన్న వారు కావడం విశేషం. ఇద్దరిలో అహంకారం ఏ కోశాన కనించదు.


అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వీరిరువురిని టీడీపీ ప్రభుత్వం ఏలూరు జిల్లాకు బదిలీ చేసింది. ఏలూరు ఎస్పీగా కేపీఎస్‌ కిశోర్, ఏలూరు జాయింట్‌ కలెక్టరుగా పెద్దిటి ధాత్రిరెడ్డి ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. ఇరువురు కలిసి పలు ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు. పాఠశాలలు, గ్రామాల్లో అధికారులు తీసుకోవలసిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి, వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అనే విషయాలను కిషోర్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో వివిరంగా చెబుతూ పలువురి మన్ననలను పొందారు.


 ఇంజనీరింగ్‌ చదివినందు వల్ల ఇరువురికి కంప్యూటర్‌ నాలెడ్జిపై పూర్తి అవగాహన ఉంది. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ఇన్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ధాత్రి ప్రధానంగా తన స్నేహితులు, తాను మరిచిపోలేని సంఘటనలు, ప్రకృతిలో వైవిద్య భరితమైన ఫొటోలు ఎక్కువుగా షేర్‌ చేస్తూ అందుకు సంధించిన వివిరాలను పోస్టు చేస్తుంటారు. 


ఈ వివరాలు పరిశోధక విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఏమైనా ఇద్దరు అధికారులు ఏపీలో ఒకే జిల్లాలో పని చేయడం అందరి మన్ననలు పొందడం అభినందనీయము మరియు నేటి యువత కు వీరి జీవితం ఆదర్శం.


Wednesday, August 14, 2024

ALER Math Quiz Questions

 ALER Math Quiz Questions


1. Who is the Father of Mathematics?Answer: Archimedes


2. Who discovered Zero (0)?

Answer: Aryabhatta, 


3. What is the average of the first 50 natural numbers?

Answer: 25.5 


4. When is Pi Day celebrated around the world?

Answer: March 14


5. The value of Pi?Answer: 3.14159


6. Value of cos 360°?

Answer: 1


7. Angle greater than 180 degrees but less than 360 degrees are called?

Answer: Reflex Angles

8. Scientist who was born on Pi Day?

Answer: Albert Einstein


9. Who discovered Pythagoras Theorem?

Answer: Pythagoras of Samos


10.  Who discovered the Symbol Infinity “∞”?

Answer: John Wallis


11. Father of Algebra?Answer: Muhammad ibn Musa al-Khwarizmi (Persian Mathematician)

12. Who discovered Fibonacci Sequence?

Answer: Leonardo Pisano


13. Who discovered Logarithms and the Decimal point?

Answer: John Napier


14. Who invented the equals

Answer

Robert recorde

Tuesday, August 13, 2024

విద్యా మాఫియా

విద్యా మాఫియా


 *🔥"విద్యా మాఫియా" కబంధహస్తాలలో చిక్కుకున్న విద్యా విధానం నుండి ఇంతకన్నా ఏమి ఆశించగలం...*


*ఐఐటీ ల పేరుతో అబూత కల్పనాల సృష్టించి కేవలం "ఉద్యోగం కోసమే విద్య" అనే భ్రమలలోకి సమాజాన్ని నెట్టివేసి తల్లిదండ్రుల "ఆశల పల్లకిని" వ్యాపార తమ వ్యాపార సామ్రాజ్యం గా ఏర్పాటు చేసుకొని తమకబంద హస్తాలలో విద్యా విధానాన్ని పిసికి వేస్తున్న తరుణంలో భావి భారత పౌరుల భవిష్యత్తు అంధకారంలో విలవల్లాడుతుంది.. పొద్దున 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు బంధికానాల్లో బంధించి చెప్పే పాఠాల ఘోష "అంధకారమే" కానీ* *"అభ్యుదయం" కాదు అని తెలుసుకునే లోపు అంతా ఐపోతుంది...*


*ఈరోజు విద్యాలయాలు ఉంటే* 

*ఆటలు లేవు...*

*అల్లరి లేదు....*

*బ్రతుకు తెరువు భరొసా నిచ్చే నీతి పాఠాలు లేవు...*

*మాతృభూమి పట్ల మమకారం పెంచే చరిత్ర చెప్పుడు లేదు...*


*సమాజం గురించి ఆలోచింప చేసి మానవత్వం పెంచే కళాకృతులు లేవు...*

*గొంతెత్తి పాడగలిగే కొయిల పిల్లలు వున్న పాఠశాలలో వారి కళకు అవకాశం లేదు....*

*మన సంస్కృతేంటొ వాల్లకు తెలియజేసే తెలుగు పంతుల్ల కు విలువ లేదు..*

*అలిసిపొయేలా తమంత తాము ఆడుకునే సమయం లేదు... ఆడింతే మాస్టారు పొస్టే లేదు....*


*ఉన్నదల్లా ఒక్కటే MPC* *(Mani Priority Community)*

No priority per Motherland

No priority per Parents

No priority per Community

Saturday, August 3, 2024

1st ❤️ Love

 1st ❤️ Love


😀😀 1st లవ్ ని ఎవరు మర్చిపోరు, ప్రతి రోజు ఏదో ఒక టైంలో ఏదో ఒక నిమిషంలో గుర్తు వస్తూనే ఉంటుంది, తను ఎక్కడ ఉంది, ఎలా ఉంది ఇంకా ఎమ్ చేస్తుంది అని....?


ఓ సారి ఇంట్లో ఉండగా, నా మొబైల్ కి కాల్ వచ్చింది.., చూశా ఎవరో..... Unknown నెంబర్..

 

నేను ఫోన్ లిఫ్ట్ చేశా... అటు నుంచి మధురమైన Voice వినిపించింది., నేను మహేష్ తో మాట్లాడాలి... మహేష్ ఉన్నారా...?


Voice కొంచెం తెలిసిన వాయిస్ లా ఉందే.... నేను అన్నాను, హా చెప్పండి, నేను మహేష్ నే మాట్లాడుతున్నాను, మీరు ఎవరు...?


తను అంది.... Guess Me నా రోల్ నెంబర్ 18..


రోల్ నెంబర్ 18 అనగానే అమ్మాయి గుర్తుకు వచ్చింది..., ప్రియ.... గుర్తుకు వచ్చింది, స్కూల్ లో నాతో పాటు చదివేది.., చాలా try చేశా.., కాని నన్ను పట్టించుకొనేదే కాదు.


వెంటనే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసా... హార్ట్ బీట్ పెరిగింది.., శ్వాస తీసుకోవడం కొంచెం సేపు ఆపేశా, ఏం చేయాలో ఏమి అర్థం కాని అయోమయం స్థితి.., ఏం మాట్లాడాలో అని...


తను మాట్లాడింది.., నువ్వు ఎక్కడ ఉంటున్నావ్.., ఎన్ని సంవత్సరాలు అయ్యింది నిన్ను చూసి.., నా దగ్గర నీ నెంబర్ లేదు.., నిన్న రాజేష్ కలిసాడు.., తన దగ్గర నుండి నీ నెంబర్ తీసుకుని, ఫోన్ చేస్తున్నా.


వెంటనే తను ఓ బాంబ్ పేల్చింది., నేను నిన్ను కలవాలి అనుకుంటున్న., ఎపుడు ఫ్రీ గా వుంటావ్...?


నేను వెంటనే ఆన్సర్ ఇచ్చా....ఆదివారం ఫ్రీ... అపుడు కలుద్దాం...!!


తను అడిగింది ఎక్కడ కలుద్దం అని...?


తను సిటీ లోని the best రెస్టారెంట్ పేరు చెప్పింది.., ఇంకా ఆదివారం అక్కడ కలుద్దాం అని ప్లాన్ చెప్పింది.


ఆదివారానికి ఇంకా 3 రోజులు ఉంది.


నేను ఓ కొత్త suite, ఇంకా ఫేషియల్ కోసం సెలూన్ కి వెళ్ళా, హెయిర్ డ్రై చేయించా, ఓ సెంట్ కొన్న, ఇంకా లాస్ట్ తనని మీట్ అవడానికి వెళ్తున్నా...


ఇంతలో ఈ హడావడి చూసి ఏం అయ్యింది అండి.., ఇంతలా రెడి అవుతున్నారు, ఏంటి విషయం...???


ఆదివారం ఓ ఫారిన్ కస్టమర్ తో మీటింగ్ ఉంది అని అబద్ధం చెప్పేసా...


పాపం భార్య... అమాయకురాలు, నిజం అని నమ్మేసింది.


ఇంకా బ్లాక్ షూస్, బ్లాక్ eye glasses కూడా కొన్నా...


ఆదివారం రానే వచ్చింది.... ola టాక్సీ ఇంటి ముందు వచ్చి నిలబడింది., భార్య, పిల్లలకు అర్థం అయ్యింది., నేను చాలా పెద్ద మీటింగ్ కి attend అవుతున్నా అని.


టాక్సీ హోటల్ చేరుకుంది., గులాబి పువ్వులతో ఓ అమ్మాయి నుంచుని నా కోసం wait చేస్తుంది.


ఇద్దరం ఒకరినొకరం hug చేసుకుని, హోటల్ లోకి వెళ్ళాం...


చాలా costly dishes ఆర్డర్ ఇచ్చింది, చాలా విషయాలు మాట్లాడుకుంటు లంచ్ కంప్లీట్ చేసాం.


తర్వాత నా debit కార్డ్ తో బిల్ పే చేశాను., దాంతో నా బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయింది.


తను sudden గా అంది... నాకు నీతో ఓ పని ఉంది., నువ్వు No అనవు అని నేను అనుకుంటున్నా.


నేను అన్నాను.., నీకోసం ఏదైనా చేయడానికి నేను రెడిగా ఉన్నాను.


వెంటనే తను తన బ్యాగ్ open చేసి.. కొన్ని పేపర్లు తీసి నేను LIC ఏజెంట్ ని.. నాకు ఈ నెల టార్గెట్ పూర్తి చేయాలి., దయచేసి పాలసీ తీసుకోవా.. నేను భోజనం చేస్తున్నప్పుడే నీ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను., ఫారం తర్వాత నింపుకుంటాను., just ఇక్కడ "సంతకం" చెయ్..


నాకు signature చేయడం తప్ప ఇంకో మార్గం కనిపించలేదు.


చేసిన దానికి అనుభవించాలి.. తప్పదు, దీని వల్ల విపరీతమైన తలనొప్పి వస్తుంది..


ఎవరినైనా అకస్మాత్తుగా కలిసే ముందు., తను మిమ్మల్ని ఎందుకు కలవాలి అనుకుంటున్నారు తెలుసుకోవడం మర్చిపోకండే....???


♦️LIC - స్కూల్ నుంచి..

 స్కూల్ తర్వాత కూడా...!!

Friday, August 2, 2024

“పక్కింటోళ్ళ చలవ”

 “పక్కింటోళ్ళ చలవ”


కొన్ని కార్ల మీద, ఆటోలు, మోటర్ సైకిళ్ళు, స్కూటర్ల మీద ” Dad’s Gift”, లేక “Mother’s Gift”, “God’s Gift” ఇలా నానారకాలుగా వ్రాసి ఉండడం చూస్తూంటాం. కుటుంబసభ్యులు కొని ఇచ్చారనో, లేదా దేవుడు కరుణించి డబ్బులు వచ్చేలా చేసినందుకు ఈ వాహనం తనకు ఏర్పడిందని చెప్పుకోడం కోసం అలా వ్రాస్తారు అనేది సహజమైన ఆలోచన అనుకుంటాం. పాతిక ముప్పై ఏళ్ళు వచ్చిన తరువాత ఎవరో కొనిస్తే కానీ వీళ్ళు స్వంతంగా ఒక చిన్న వాహనం కొనుక్కోలేకపోయారు అని నేను వాళ్ళ అసమర్ధ చూసి జాలి పడతాను. మొన్న ఒక బట్టల దుకాణం దగ్గర “పక్కింటోళ్ళ చలవ” అని అచ్చ తెలుగులో రాసి కనపడిందో కారుమీద. ఇదేదో వింతగా అనిపించింది నాకు. దానర్ధం బోధ పడ్లేదు? ఎందుకంటే పక్కింటోడు  కారెందుకు కొనిస్తాడెవరికైనా? అనే ఆలోచనతో. ఇందులో మర్మమేమిటో తెలుసుకోవాలనిపించింది. దానర్ధం ఎంటో తెల్సుకోవాలని ఉత్సుకత పెరిగిపోడంతో ఆ బండి యజమాని వచ్చే వరకు అక్కడే తచ్చాడాను. కొన్ని సందేహాలు తీర్చుకోకపోతే నిద్రపట్టదు. ఒక అరగంట తర్వాత ఆ కారు యజమాని వచ్చి తలుపు తీయబోతుంటే  ఆయన్ని పలకరించాను.

“ఏం కావాలి” ఏదో నేను ఆయన నుంచి ఆశిస్తున్నట్టు  చూస్తూ అన్నాడు. ఆయన తప్పేంలేదు, ఎవరికైనా అదే అనుమానం వస్తుంది ఆ సమయంలో.

“ఏం లేద్సార్… చిన్న సందేహం! మీకు అభ్యంతరం లేకపోతే” అని కొద్దిగా నానుస్తూ మాటలు నమిలాను. నా వల్ల ఆయన కొచ్చే ఆర్ధిక ఇబ్బంది ఏమీ లేదని గ్రహించి, మొహం కొంచం తేట చేసుకొని ” ఏంటండీ మీ సందేహం?” అన్నాడు.

“ఏం లేద్సార్, మీ కారు వెనక పక్కింటోళ్ళ చలవ  అని వ్రాసి ఉందే దాని అర్ధం తెల్సుకోవాలని” బయట పెట్టాను అరగంటకి పైగా బుర్ర తొలిచేస్తున్న నా సందేహాన్ని.

“మా పక్కింటోళ్ళు కారు కొన్నప్పట్నుండి మా ఆవిడకి నిద్ర, ఆవిడ వల్ల నాకు మనశ్శాంతి కరువైనాయి. వాటన్నింటిని తిరిగి పొందడం కోసం అవసరం లేకపోయినా అప్పు చేసి మరీ కొన్నను ఈ కారు. చేసిన పాపం చెబితే పోతుందన్నారుగా! అందుకని అలా రాయించా” తాపీగా చెప్పారు ఆ కారు యజమాని.

చాలా రోజులకి ఓ సరదా మనిషి తారస పడ్డాడన్పించింది😀.

సింప్లిసిటీ

 సింప్లిసిటీ



ఆరోజు చివరి రైలు ఆ స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నుండి వెళ్ళిపోయింది. తదుపరి రైలు రేపు ఉదయం వరకు రాదనే విషయం తెలియక ఒక వృద్ధురాలు రైలు కొరకు ఎదురుచూస్తూ ప్లాట్‌ఫారమ్ పై  కూర్చొని ఉంది. అది గమనించిన ఒక కూలీ ఆ తల్లిని అడిగాడు. అమ్మా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అని. దానికి సమాధానం గా ఆ పెద్దావిడ నేను నా కొడుకు వద్దకు ఢిల్లీ వెళ్ళాలి అని చెప్పింది. జవాబుగా కూలీ ఈ రోజు ఇక రైలు లేదు అమ్మా అని చెప్పాడు. అందుకు ఆ స్త్రీ నిస్సహాయంగా చూసింది. అయితే ఆమెకు వెయిటింగ్ రూమ్‌లో ఆశ్రయం కల్పించాడు. అంతటితో ఆగకుండా ఆ కూలీ ఆమె కొడుకు గురించి అడగగా ఆమె తన కొడుకు రైల్వేలో పనిచేస్తున్నాడని తల్లి బదులిచ్చింది. పేరు చెప్పండి, సంప్రదించడానికి మేము ప్రయత్నిస్తాము అన్నాడు ఆ కూలి. మా అబ్బాయిని అందరూ *లాల్ బహదూర్ శాస్త్రి అని పిలుస్తారు* అని ఆ అమ్మ బదులిచ్చారు. ఆ స్త్రీ మూర్తి కొడుకు అప్పుడు ఇండియన్ రైల్వేస్ కేంద్ర కేబినెట్ మినిస్టర్. ఒక్క క్షణంలో స్టేషన్ మొత్తం దద్దరిల్లింది. వెంటనే సైరన్న్ కారు వచ్చింది. వృద్ధురాలు ఆశ్చర్యపోయింది. ఈ విషయం లాల్ బహదూర్ శాస్త్రికి ఏమీ తెలియకుండా భారతీయ రైల్వే అన్ని ఏర్పాట్లు చేసింది. ఆవిడ ఢిల్లీ లో తన కొడుకుని కలిసిన తర్వాత కొడుకుని ఈవిధంగా అడిగింది - *"అబ్బాయి, నీవు రేల్వే లో ఏం పని చేస్తావు..."*


ఇదే కదా సింప్లిసిటీ అంటే.

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE