NaReN

NaReN

Thursday, January 4, 2024

మీ గురించి మీరు తక్కువగా అంచనా వేసుకోవడమే

 మీ గురించి మీరు తక్కువగా అంచనా వేసుకోవడమే... మీ ఓటమికి మొదటి కారణం


 ఒక మనిషి ఏనుగులను ఉంచిన శిబిరం ముందు నుండి నడుచుకొని వెళ్తున్నాడు. అక్కడ ఏనుగుల కాళ్ళకి చిన్న తాడు కట్టి బంధించి ఉంచడం గమనించాడు. ఆ చిన్న తాడు ఏనుగులు తెంపుకొని వెళ్లడం పెద్ద కష్టమేమీ కాదు. అయినా సరే... అవి శిబిరం నుంచి తప్పించుకోకుండా, ఆ కాళ్లకు కట్టిన చిన్న తాడు ముక్కతోనే ఇటూ అటూ నడుస్తున్నాయి.

ఏనుగులు వైపే చూస్తున్న ఆ వ్యక్తి... ఆ తాడును తెంపుకునేందుకు ఏనుగులు తమ శక్తిని ఎందుకు ఉపయోగించడం లేదు? అని అయోమయానికి గురయ్యాడు. కనీసం అవి ప్రయత్నించకపోవడం కూడా అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దీనికి సమాధానం తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది. ఆ పక్కనే ఉన్న ఏనుగుల ట్రైనర్ దగ్గరికి వెళ్ళాడు. ఇదే విషయాన్ని చెప్పాడు. ‘నువ్వు వాటి కాలికి కట్టింది చాలా సన్నని తాడు మాత్రమే, అయినా కూడా అవి ఎందుకు తప్పించుకోవడం లేదు’ అని ప్రశ్నించాడు.


దానికి ట్రైనర్ ఇలా సమాధానమిచ్చాడు. ‘ఏనుగులు చాలా పెద్దదే కావచ్చు, బలమైనవే కావచ్చు... తాడు చాలా చిన్నదే, కానీ మేము అదే సైజు తాడును అవి చిన్న పిల్లలుగా ఉంటున్నప్పుడు నుంచి కడుతున్నాము. అవి తాము చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఆ తాడును తెంపలేమనే అభిప్రాయంలోనే ఉన్నాయి. అవి పెద్దవిగా పెరిగినా కూడా ఆ తాడును తెంపలేమనే నమ్మకంతోనే ఉన్నాయి. అందుకే అవి ఎప్పుడూ కూడా తాడును తెంపుకొని వెళ్లే ప్రయత్నం చేయలేదు. చిన్నప్పటి నుంచి ఆ పని తాము చేయలేమనే నమ్మకంతోనే ముందుకు సాగాయి కాబట్టి భవిష్యత్తులో కూడా ఆ ప్రయత్నం చేయవు’ అని చెప్పాడు.

అది విన్న మనిషికి ఒక విషయం అర్థమైంది. ముందు మనల్ని మనమే నమ్మకపోతే ప్రపంచం కూడా మనల్ని నమ్మదని. ఏనుగులు ఆ చిన్న తాడుని చూసి కూడా భయపడి ఉన్నాయి. అలాగే మనిషి కూడా తాను ప్రయత్నం చేయకుండా విజయాన్ని సాధించాలని కోరుకుంటాడు. దానివల్లే అపజయం పాలవుతున్నాడు. ప్రపంచం మిమ్మల్ని ఎంతగా అడ్డుకోవడానికి ప్రయత్నించినా... *మీరు అనుకున్నది సాధ్యమే అన్న నమ్మకం మీకు ఉండాలి.* *మీరు విజయం సాధించగలరనే నమ్మకం మీకు అణువణువుగా నిండిపోవాలి. ఇదే మీ విజయానికి మొదటి మెట్టు.* ఈ నమ్మకంతోనే ప్రయత్నాన్ని మొదలు పెట్టాలి. 

ఒకసారి కాకపోయినా 

రెండోసారి... 

మూడోసారి... 

చివరికి పదోసారైనా.. 

విజయం దక్కి తీరుతుంది.



No comments:

Post a Comment

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE