NaReN

NaReN

Wednesday, January 17, 2024

కుటుంబ వ్యవస్థ

 కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు...త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెపుతున్నాయి..

అందుకు గ‌ల కారణాలు





1. అతి తెలివి, అహంకారం,అసూయ,

2. చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం.

3. అందరూ సమానమే అనే భావం పెరగడం.

4. పిల్లలు, పెద్దలు కూర్చొని మాట్లాడుకోకపోవడం.

5. ఎక్కువ సమయం TV, ఫోన్లు, ఇతర Net programలలో మునిగిపోవడం. ( ఎక్కడో ఉన్న సినిమా హీరో, హీరోయిన్లు ఏం తిన్నరో, ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ, ఇంట్లో ఏం జరుగుతుందేమీ తెలియదు)

6. చిన్న విషయాలకు అలిగి, స్వంత వారితో కూడా దూరంగా ఉండటం.

7.ఎవరో ఒకరి నోటి దురుసుతనం వల్ల, కుటుంబంఅంతా చెదిరిపోవడం.

8. ఆర్థిక విషయాల లో స్వార్థం,స్వాతంత్య్రం పై శ్రద్ధ చూపడం.

9.తల్లి దండ్రుల కు పిల్లలకు అవగాహన లోపం. 

10. ఆర్థిక స్థితిగతులు, వ్యత్యాసాలు, పోలికలు,ఇలా అనేక విషయాలు కుటుంబ వ్వవస్థని ప్రభావితం చేస్తున్నాయి.

11. మనిషికి మరో మనిషంటే గిట్టనితనం.. జల్సాలు, జరుగుబాటుకోసం క్రూరత్వానికి వెనుకాడటం లేదు. ఒంటరితనం ఇష్టపడుతున్నారు.

12. మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు. ఎవరిష్టానికి వారున్నారు. చెప్పినా నచ్చటం లేదు.

13.కుటుంబ నిర్వహణకు lపిల్లలు సహకరించు ట లేదు, పెద్దలు అంటే గౌరవం,ప్రేమ  వుండుట లేదు.ఎక్కువ మందిలో.

14., విదేశాల లో ఉద్యోగాలు,చదువులు వలన ప్రత్యక్ష సంబంధాలు దూరం


15. Soclal media ప్రభావం. ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన message పెట్టేసి చేతులుదులుపుకుంటున్నారు.. 

    ఇదే పరిస్థితి కొనసాగితే, అతి త్వరలో కుటుంబ వ్యవస్థ కాదు, అసలు మానవ సంబంధాలే తెగిపోతాయి అనడం అతిశయోక్తి కాదు...

ఐక్యమత్యమే మహాబలం, కలిసి ఉంటే కలదు సుఖం

No comments:

Post a Comment

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE