NaReN

NaReN

Wednesday, November 22, 2023

తెలివి ఎవరి సొత్తు కాదు


       *తెలివి_ఎవరి సొత్తు కాదు*

                ➖➖➖


*'చదువుకొన్నవాడు' మాత్రమే మేధావా.....!!?    'చదువుకొననివాడు' మేధావి కాదా.........!!?*


           *దీనికి మీకు ఒక మంచి ఉదాహరణను అందిస్తాను, చదవండి.*

             

                *ఒక వ్యక్తి మెకానికల్ ఇంజనీరింగ్ చదివి, కృషి, పట్టుదలతో కష్టపడి బాగా డబ్బు సంపాదించి, జీవితంలో బాగా సెటిల్ అయ్యాడు.* *అతను ఒకసారి అర్జెంటు పని బడి సమయానికి డ్రైవర్ లేకపోవడం వల్ల తానే స్వయంగా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక ఉన్నట్టుండి ఒక టైర్ పంచర్ అయ్యింది. టైర్ మార్చడానికి డ్రైవర్ లేడు. అటు పక్కగా ఎక్కడా ఎవరి రాకపోకలు లేవు. ఇక తప్పని పరిస్థితిలో తానే ఎలాగోలా స్టెప్ని టైర్ మార్చడానికి తనే స్వయంగా  సిద్ధమయ్యాడు.*


         *డిక్కీ లోని టూల్స్, స్టెప్నీ టైర్ బయటకు తీసి, ఎంతో కష్టపడి వీల్ నట్లన్నీ తీసి టైర్ మారుస్తుండగా చెయ్యి జారీ టయర్ నట్ల పైపడి అవన్నీ పక్కనే ఉన్న మురికి కాలువలో పడిపోయాయి. సూటు బూటు లో ఉన్న తాను వాటిని తీయలేడు, మరి ఇప్పుడేం చేయాలా అని ఆలోచిస్తుండగా అటు పక్కగా ఒక వ్యక్తి అక్కడక్కడా చినిగి పోయిన, మురికి బట్టలు వేసుకున్న వ్యక్తి అటుగా వచ్చాడు. అతడు ఈయన్ని చూసి సార్ మీరు ఎవరు, మీ కారుకు ఏమైంది అని అడిగాడు. అప్పుడు ఆ ఇంజనీర్ తాను ఎవరో తన హోదా ఏమిటో వివరాలు చెప్పి, టైర్ మార్చబోయే సమయంలో జరిగిన విషయం అంతా చెప్పి నీవు ఆ కాలువలోకి దిగి ఆ కాలువలో నుండి అందులో పడిపోయిన నట్లను వెతికి బయటకు తీసిస్తే మీకు ఎంత డబ్బైనా ఇస్తానని అన్నాడు.*


           *అప్పుడు ఆ వ్యక్తి నవ్వుతూ....చూడండి సార్, కాలువలో దిగి నట్లను వెదికి బయటకు తీయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ అంతకంటే సులభమైన మార్గం ఒకటి మీకు చెబుతాను. అలా చేస్తే ఎవరూ మురికి కాలువలో దిగవలసిన అవసరం ఉండదు. అదేమంటే మీ కారుకున్న మిగతా మూడు వీల్స్ ల నుండి ఒక్కోక్క నట్టును తీసి ఈ వీల్ కు వేయండి. దానివల్ల కారును మీరు ఏ ఇబ్బందీ లేకుండా నడిపించవచ్చు.*


          *తరువాత మీరు వెళ్ళే దారిలో వచ్చే మెకానిక్ షాప్ లో మిగతా నాలుగు నట్లు కొని, వాటిని అన్ని వీల్స్ కు వేసుకుంటే సరిపోతుంది కదా. దానికోసం నేను మురికి కాలువలో దిగి మురికి, బురద అంటించుకోవడం, మీరు నాకు అడిగినంత డబ్బు ఇవ్వడం, ఇవన్నీ అవసరం లేదు కదా అన్నాడు. అంతే అది విన్న ఆ ఇంజనీరు ఇంత మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు, ఏమీ చదువుకోని ఈ వ్యక్తికి ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయి, ఆలోచిస్తూ.... సిగ్గుతో తలదించుకొని ఉండి పోయాడు.*


 *#నీతి :-   కాబట్టి మిత్రులారా! ఏ మనిషిని పైన చూసి తక్కువ అంచనా వేయకండి, అలాగే చిన్నచూపు చూడకండి. ఎవరి మైండ్ ఎంత పదునుగా ఉంటుందో బయటకు తెలియదు కదా! మీరు గమనిస్తే "ఇప్పుడున్న చదువులు విజ్ఞానాన్ని పెంచే విధంగా ఉన్నా, జ్ఞానాన్ని సూన్యం చేస్తున్నాయని " చెప్పవచ్చు. అన్ని తెలివితేటలు ఉన్నా మేధావులు తమ తెలివితేటలను ఏ సమయంలో ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో తెలియడం లేదు.*


        *మీరు గమనిస్తే "ప్రాణాలతో ఉన్న పక్షికి చీమలు ఆహరం, కానీ అదే పక్షి తాను చచ్చిన తర్వాత తాను తినే ఆ చీమలకే ఆహారం అవుతుంది ". పరిస్థితులు ఎలాగైనా మారొచ్చు కాబట్టి ఎవరిని తక్కువగా అంచనా వేసి చులకనగా చూడకండి, అలుసుగా మాట్లాడకండి.*✍️

          

No comments:

Post a Comment

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE