NaReN

NaReN

Wednesday, December 8, 2021

మనమే కదా కారణం

 మనమే కదా కారణం.....!!! 

................................................................... 


నడక రాగానే...

      చేర్చేస్తారు " నర్సరీ "  లో..... 

ఐదవ తరగతి పూర్తవ్వగానే... 

      వేసేస్తారు  " రెసిడెన్షియల్ "  లో..... 


అసలేమీ ఆలోచించరు..... 

       ఎంత వేదనుందో పిల్లవాడి  " హృదిలో ".....

ఏమీ పట్టదు మీకు... 

       ఏ లక్ష్యం ఉందో వాడి  " మదిలో "..... 

             

అంటారు సదా... 

      ఉన్నత చదువే  " లక్ష్యం "..... 

భావిస్తారు కదా... 

      పెద్ద హోదా ఉద్యోగమే  " జీవితం "..... 


తీరా వాడు వృద్ధాప్యంలో మిమ్మల్ని... 

" వృద్ధాశ్రమానికి "  పంపిస్తే రోదిస్తారా.....!? 


మీరు దూరం చేసారు బాల్యంలో... 

      బిడ్డలకు మీ  " ప్రేమాభిమానాలు "..... 

అందుకే దూరమయ్యాయి వృద్ధాప్యంలో... 

      మీ బిడ్డల  " ఆదరాభిమానాలు "..... 


ముందు మీరు  " మారండి "...

     అది చూసి మీ పిల్లలు 

           వారంతటవారే  " మారతారు "..... 


వారి బంగారు బాల్యాన్ని వారికి ఇచ్చేద్దాం.....!!! 


..... 😊😊😊

1 comment:

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE