Tuesday, June 10, 2025
బయట శత్రువులతో పోరాడినా, పెళ్లాంతో ఇంట్లో ఓడిపోయాడు!
వారంలో ఇది 3 సార్లు తింటే ముసలోళ్లు అయ్యే ఛాన్సే లేదంట..!
వారంలో ఇది 3 సార్లు తింటే ముసలోళ్లు అయ్యే ఛాన్సే లేదంట..!
మీల్ మేకర్.. వెజీటెరియన్ వాళ్లకు మాంసానికి ప్రత్యామ్నాయంగా దీనిని పిలుస్తారు. మీల్ మేకర్‌ను సోయా చంక్స్ అని కూడా పిలుస్తుంటారు. ఈ ఆరోగ్యకరమైన మీల్ మేకర్‌ను సోయాతో తయారు చేస్తారు. మీల్ మేకర్‌లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొవ్వు ఉండదు. ప్రొటీన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మీల్ మేకర్‌ను తరచుగా మన డైట్‌లో చేర్చుకుంటే.. లెక్కలేనన్నీ ఆరోగ్య లాభాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రోటీన్ .. అత్యధికంగా ఇచ్చే ఆహారాల్లో సోయా చంక్స్ ఒకటి. వెజిటేరియన్ మటన్ గా పిలిచే దీని వల్ల మసిల్స్ పెరిగేందుకు సహాయపడుతుంది. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రోటీన్ అందిస్తుంది. కాల్షియం, ఐరన్ అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది..డైబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్ అంటున్నారు నిపుణులు. మీర ముఖ్యంగా సోయా ఫుడ్స్‌తో అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను నిర్వహించడంతో పాటు వివిధ సీజనల్ సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మీల్ మేకర్ తినటం వల్ల మహిళల్లో ఎముకలకు బలాన్నిస్తుంది. ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది. ఈ పోషకమైన మీల్ మేకర్ అన్ని వయసుల వారికి సమానంగా ప్రయోజనాలను అందిస్తుంది. వీటిలో చికెన్, మటన్, గుడ్లు కంటే ఎక్కువ ప్రొటీన్ ఉంటుంది. వెజిటేరియన్స్ వీటిని మాంసానికి ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ప్రొటీన్ లోపంతో బాధపడేవారు.. మీల్ మేకర్ తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. రోజుకి ఒక కప్పు సోయా చంక్స్ ని ఉడికించి కూర లేదా సలాడ్ రూపంలో తినాలి. ఎక్కువగా తినకుండా పరిమితంగా తీసుకోవాలి.
ఉమ్మడి కుటుంబం
ఉమ్మడి కుటుంబం
ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే కుంటుబడి పోయాయో... అప్పటి నుండి కుటుంబ వ్యవస్థ చెడుదారిపట్టింది...!!
అప్పట్లో మంచి చెడు చెప్పడానికి ప్రతి కుటుంబంలో పెద్దలు ఉండేవారు...!!
ఆ పెద్దలు పిల్లలకు సమాజంలో చెడు నుండి దూరంగా బ్రతకడానికి కావలసిన నీతి, నైతికత నేర్పించేవారు...!!
అప్పట్లో డబ్బు కొంచెం సమస్యగా ఉన్నా కూడా ఉన్నదంతా పంచుకుంటూ, అందరూ కలిసి సంతోషంగా ఉండేవారు...!!
అమ్మమ్మ - తాతయ్య
నానమ్మ - తాతయ్య
పెద్దనాన్న - పెద్దమ్మ
చిన్నాన్న - చిన్నమ్మ
అత్త - మామ
అక్క - బావ
మరదలు - తమ్ముడు
వదిన - అన్నయ్య
చెల్లి - బావ గారు
మేనమామ - మేనత్త
మేనకోడలు - మేనల్లుడు
అని ఓ బంధాల అల్లికలు ఉండేవి...!!
పిల్లలు తప్పు చేస్తే కుటుంబమే వారిని సారీ చెప్పేంతగా, మారేంతగా తీసుకునేది...
పిల్లలకు ప్రతి ఒక్కరిలోనూ భయం, భక్తి, ప్రేమ, అభిమానం ఉండేవి...!!
కొత్తగా వచ్చే అల్లుడు కానీ, కోడలు కానీ
ఆ ఉమ్మడి కుటుంబంతో సరదాగా కలసి పోయేవారు...
అల్లుడికి తగిన మర్యాద
కోడలికి తగిన బాధ్యత
ఇలా ప్రతి దానికీ ఒక పద్ధతి ఉండేది...!!
ఆ కుటుంబంలో ఒకరితో ఒకరు బాధ్యతగా మెలగడం, ఆదరించడం...
అదే కారణంగా ఆ కుటుంబ పరువు మర్యాదలతో వర్ధిల్లేది...!!
అలాంటి ఉమ్మడి కుటుంబాలు పెద్దల చేత నడిచే ఒక గొప్ప రథాల్లా ఉండేవి...!!
ఇంటిని దేవాలయంలా చేస్తూ, పెద్దలు ఆలయ శిఖరాల్లా వెలిగేవారు...!!
ఇప్పుడు వాటిని పక్కన పెట్టేశారు...
పెద్దలను భారంగా భావిస్తూ దూరం చేస్తూ, వాళ్ళను ఒంటరిగా విడిచిపెడుతున్నారు...
వాళ్లకేమీ లేదు... హాయిగా దేవతామూర్తుల్లా కాలం వెళ్లదీస్తున్నారు...!!
ఈ నాడు స్వేచ్ఛగా బ్రతకాలని పల్లెటూర్ల నుంచి పట్టణాలకు వచ్చిన జంటలు...
వాళ్లు కట్టుకున్న ఇరుకుగదులే సుఖం అనుకుంటున్నారు...!!
కానీ...
డబ్బు కోసం పరుగులు తీయే భర్త
బాధ్యతలు మరిచిపోయిన భార్య
తల్లిదండ్రులను గౌరవించలేని పిల్లలు
బాగుపడితే ఒర్చుకోలేని అన్నదమ్ములు
దుమ్మెత్తి పొసే బంధువులు
సెల్ ఫోన్ లో పలకరించే దిక్కుమాలిన బతుకులు
ఇప్పుడు మంచి చెప్పేవారు లేరు, వినేవారు లేరు...!!
భయం లేదు
భక్తి లేదు
ప్రేమ ఒక నాటకం
అభిమానం ఒక భూటకం
నవ్వునీ నటిస్తూ బ్రతుకుతున్నారు...
అవసరంలేని బంధాలని పట్టుకుని,
అవసరమైన బంధాలని విడిచి,
బంధీలుగా బ్రతుకుతున్నారు...!!
ప్రతి రోజు వార్తల్లో కొన్ని సంఘటనలు చూస్తే బాధగానే ఉంటుంది...
చాలావరకు కుటుంబాలు రోడ్డున పడిపోవడానికి కారణం...
మంచి చెడు చెప్పే పెద్దలు మనతో లేకపోవడం...
బలమైన ఉమ్మడి కుటుంబాలను వదిలేసి,
మనమే మన పునాదుల్ని బలహీనపరచుకుంటున్నాం...!
ఉమ్మడి కుటుంబాలని తిరిగి స్వాగతిద్దాం
మన పెద్దలను గౌరవిద్దాం
తల్లిదండ్రులను ప్రేమిద్దాం
మన పిల్లలకు సంస్కారం నేర్పిద్దాం...
మీరు కూడా నమ్మితే అవును నిజమే అని కామెంట్ చేయండి
Sunday, June 8, 2025
పూలు పండ్లు-3
పూలు పండ్లు-3
శిల్ప, విక్రమ్ ఇచ్చిన గిఫ్ట్ ను చూస్తూ టెన్షన్తో చేతులు రెండు లాక్ చేస్తుంది.. శిల్ప టెన్షన్ చూసి విక్రమ్ హే జస్ట్ రిలాక్స్, ఇక్కడ ఉన్నది మనిద్దరమే.
భార్యాభర్తలు అంటే వేరు, వేరు కాదు ఒకటే అని మా గ్రానీ ఎప్పుడూ చెబుతూ ఉండేది.
మా ఇంటి ఆచార ప్రకారం ఈరోజు జరిగే కార్యం వరకు మనం ఒకరినొకరు చూసుకోకూడదు.
ప్రజెంట్ జనరేషన్ లో ఫోటో కూడా చూడకుండానే పెళ్లి చేసుకుంది మనమే అయి ఉంటాం. మన ఆచారాలు మనం పాటించాలి కదా! అని చెబుతూ ఉంటే ముసుగులో నుంచే శిల్ప విక్రమ్ చూస్తూ ఉంటుంది.
విక్రమ్, శిల్పతో బాక్స్ ఓపెన్ చేసి చూడవా నేను ఇచ్చినవి అంటే... శిల్ప కంగారుగా బాక్స్ ఓపెన్ చేస్తుంది.
ఆ గిఫ్ట్ ని పట్టుకుని చూస్తూ ఉంటుంది. ముసుగులో ఉన్న శిల్ప భావాలు అర్థం కాక... నచ్చిందా అని అడుగుతాడు.
శిల్ప నచ్చింది అని తల ఊపుతుంది. విక్రమ్ హ్యాపీగా ఫీల్ అయ్యి నేను పెట్టనా అని అడుగుతాడు.
ఆ బాక్స్ విక్రమ్ చేతికి ఇస్తుంది. బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న నల్లపూసలు, గ్రీన్ స్టోన్ రింగ్ ఆమెకు పెట్టి రింగ్ పెట్టిన చేతిని కిస్ చేస్తాడు.
శిల్ప చిన్నగా వణుకుతుంది. దానికి విక్రమ్ జస్ట్ రిలాక్స్ అని చెబుతూ ఉంటే... శిల్ప విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది.
శిల్ప ఎందుకో కంగారు పడుతుంది అని అర్థమయ్యి... నాతో ఏమైనా చెప్పాలా అని అడుగుతుంటే, డోర్ నాక్ చేసిన సౌండ్ వస్తుంది.
విక్రమ్ వెళ్లి డోర్ తీస్తాడు. అక్కడ నివి, భార్గవి ఉంటారు.
భార్గవి విక్రమ్ చూస్తూ.... అది అల్లుడుగారు కార్యం అయ్యేవరకు ఇద్దరు ఒకచోట ఉండకూడదని చెప్పి, శిల్ప ని తీసుకు వెళుతుంది. శిల్ప తన చీర కొంగుతో విక్రమ్ తొడిగిన రింగ్ చేతుని కవర్ చేస్తుంది.
అది చూసి విక్రమ్ నవ్వుకుంటాడు. పరవాలేదు.. తెలివైంది. ఎవరైనా చూస్తే టీస్ చేస్తారని బాగానే కవర్ చేసింది అనుకుంటాడు.
సాయంత్రం శిల్పా, విక్రమ్ ను తీసుకుని ధనుంజయ్ వాళ్ళ ఇంటికి వెళతారు.
విక్రమ్, శిల్ప ఒక కారులో వెళ్తారు. విక్రమ్ శిల్పతో నువ్వు నన్ను చూస్తున్నావు ముసుగులోనుంచి. కానీ..నిన్ను చూడడానికి మాత్రం నేను రాత్రి వరకు వెయిట్ చేయాలి అని చెబుతాడు.
దానికి శిల్ప తలవంచుకుంటుంది. శిల్ప సిగ్గు చూసి విక్రm❤️ చిన్నగా నవ్వుకుంటాడు.
పెళ్లి ఒక మ్యాజిక్ కదా! తెలియని ఇద్దరు మనుషుల్ని ఒకటి చేస్తుంది.
శిల్ప నువ్వు అస్సులు టెన్షన్ పడకు. మన ఇంట్లో అందరూ బాగా కలిసి పోతారు.
బిజినెస్ ఫీల్డ్ లోనే మేము సీరియస్ గా ఉంటాము. అది తప్పదు. బట్ ఇంట్లో అలా ఉండము.
అమ్మ, అత్తయ్య,, నివి నీతో బాగా కలిసి పోతారని చెబుతూ ఉంటే శిల్ప విక్రమ్ చేయి పట్టుకుంటుంది.
ఎందుకు కంగారుపడుతున్నావ్?? నేను ఎక్కడికి వెళ్ళను. నీతోనే ఉంటాను అని చెప్పి చేయి ప్రెస్ చేస్తాడు.
ఇంటి ముందు కారు ఆగుతుంది. విక్రమ్, శిల్ప కారు దిగి లోపలికి వెళతారు.
లోపల కు వెళ్లగానే ఇద్దరినీ సోఫాలో కూర్చోబెట్టి మర్యాదలు చేస్తారు. విక్రమ్ ను రెస్ట్ తీసుకోమని ఒక రూమ్ లోకి తీసుకువచ్చి వదులుతారు.
విక్రమ్ వెళ్లి మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుంటాడు. కళ్ళ ముందు మేలు ముసుగులో ఉన్న శిల్ప రూపం కనిపిస్తుంది.
శిల్ప రూమ్ లోనికి వెళ్లే ముందు వెనక్కి తిరిగి నన్ను ఎందుకు చూసింది. తన స్పర్శ నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు ఉంది అనుకుంటాడు .
రాత్రి గర్భధారణ పూజ సమయానికి విక్రమ్ ఫ్యామిలీ అందరూ వస్తారు. ఒక ఇందిర గారు తప్ప.
పూజారి ఇద్దరి చేత గర్భాదాన పూజ చేయించి, పెద్దలు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెబుతారు.
జంటగా అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత శిల్ప ను విక్రమ్ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెబుతారు. శిల్ప విక్రమ్ పాదాలు తాకి గట్టిగా పట్టుకుంటుంది. శిల్ప కన్నీటి చుక్క విక్రమ్ పాదాలపై పడుతుంది.
శిల్ప ప్రవర్తన అర్థం కాక విక్రమ్ చాలా డిస్టర్బ్ అవుతాడు. భార్గవి వచ్చి శిల్పను రెడీ చేసి తీసుకు వస్తానని రూములోకి తీసుకు వెళుతుంది.
లలిత గారు కూడా వస్తాను అంటే వద్దు వదినగారు, అమ్మాయి సిగ్గుపడుతుంది.
నేను రెడీ చేసి తల్లిగా నేను చెప్పవలసిన చెప్పి తీసుకో వస్తానని చెప్పి లోపలికి తీసుకు వెళుతుంది.
విక్రమ్ ని గదిలోకి పంపిస్తారు. శిల్ప ను అందంగా రెడీ చేసి ముసుగు వేసి తీసుకు వస్తుంది
సత్యవతి గారి పాల గ్లాసు ఇచ్చే జాగ్రత్తలు చెప్పి విక్రమ్ ఉన్న గదిలోకి పంపిస్తారు.
శిల్ప విక్రమ్ గదిలోకి వెళ్లిన తరువాత, విక్రమ్ ఫ్యామిలీ అంతా మాన్షన్ కి వెళ్ళిపోతారు.
ఆ గది మొత్తం సువాసన వెదజల్లే పూలతో అలంకరిస్తారు. ఫ్లోర్ మొత్తం గులాబీ రేకులతో నిండిపోతుంది. అరోమా క్యాండిల్స్ తో విక్రమ్ కి నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి.
విక్రమ్ శిల్పని చూసి ఎందుకు తలుపు దగ్గర నిలబడిపోయావు...ఎవరైనా పనిష్మెంట్ ఇచ్చారా అని అంటే... లేదు అని కంగారుగా తల ఊపుతుంది.
విక్రమ్ నవ్వుతూ ముందుకు వచ్చే శిల్ప చేయి పట్టుకుంటాడు.
ఆ టచ్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. నిన్నటి నుంచి టచ్ చేసినప్పుడు వచ్చిన ఫీల్ రావడం లేదు ఏంటిది అని ఆలోచిస్తూ... శిల్ప ను తీసుకోవచ్చి మంచం మీద కూర్చోబెడతాడు.
ముసుగు తియ్యనా అని శిల్ప ని అడుగుతాడు. దానికి సరే అని తల ఊపుతుంది.
మెల్లిగా శిల్ప మొఖంపై ఉన్న ముసుగు తీసి తన ముఖం చూస్తాడు. శిల్ప చాలా అందంగా ఉంటుంది. ఆ అందంతో ఎవరినైనా కట్టే పడేయచ్చు అన్నట్టుగా ఉంది.
బ్యూటిఫుల్ అంటాడు. దానికి శిల్ప నవ్వుతుంది. కానీ ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది విక్రమ్ కి.
శిల్ప చేయి పట్టుకోగానే నెగటివ్ వైప్స్ వచ్చినట్టు అనిపిస్తుంది.
శిల్ప మెడ వంక చూస్తాడు. తను ఇచ్చిన నల్లపూసలు ఉండవు.
డౌటుగా మాట్లాడుతూ, చేతులు పట్టుకొని తను పెట్టిన ఉంగరాన్ని చూస్తాడు. ఆ ఉంగరం ఉండదు. వేరే మోడల్ ఉంగరం ఉంటుంది.
శిల్ప చేతులను చూస్తాడు. సాయంత్రం వరకు అరచేతుల వరకు ఉన్న గోరింటాకు ఇప్పుడు మోచేతులు దాకా కనిపిస్తుంది.
కుడి చేతి మణికట్టుపై తన చూసిన పుట్టుమచ్చ కూడా లేదు. ఏదో తప్పు జరుగుతుంది అని విక్రమ్ కి అర్థమయ్యి శిల్ప వంక కోపంగా చూస్తూ.... రూమ్ లో నుంచి బయటికి వెళ్లిపోతాడు.
కోపంగా విక్రమ్ ఎక్కడికి వెళుతున్నాడు??
ఇప్పుడు శిల్ప పరిస్థితి ఏమిటి??
కథ కొనసాగుతుంది....
ఇంకా చదవాలని ఉంటే కింద క్లిక్ చేయండి.
పూలు పండ్లు -2
పూలు పండ్లు -2
గుమ్మం దగ్గర నిలబడిన నూతన దంపతులను ఆపి పేర్లు చెప్పి రమ్మంటారు.
దానికి వరుడు చిన్నగా నవ్వి, విక్రమ్ జై సింహ అనే నేను నా భార్య అయిన శిల్పతో వచ్చాను అని చెబుతాడు.
వధువు వంక చూసి ఇప్పుడు నువ్వు చెప్పు వదిన అనగానే, వధువు కంగారుగా విక్రమ్ చేయి పట్టుకుంటుంది.
దానికి విక్రమ్ చిన్నగా చేతిని ప్రెస్ చేసి రిలాక్స్ అని చెప్పి, విక్రమ్ వాళ్ళ అమ్మగారి వంక చూస్తాడు. లలితగారు నవ్వుకుంటు వచ్చి శిల్పా మౌనవ్రతంలో ఉంది లోపలికి రానివ్వండి అని చెబుతారు.
ఇందిరా దేవి గారు అక్కడికి వచ్చి అప్పుడే కోడల్ని వెనకేసుకొస్తున్నావా అని అడుగుతారు.
దానికి లలితగారు మీరు నాకు సపోర్ట్ ఇచ్చినట్టు శిల్ప కు నేను ఇస్తున్నాను అత్తయ్య గారు అని చెబుతుంది.
దానికి ఇందిరాగారి ముఖంలో గర్వంతో కూడిన చిరునవ్వు వస్తుంది. భార్య లౌక్యం చూసిన లలిత భర్త గారైన కళ్యాణ గారు ముసిముసగా నవ్వుకుంటారు.
విక్రమ్ శిల్ప కుడి కాలు లోపలికి పెట్టి వస్తారు. విక్రమ్ చెల్లి అయిన నివేదిత వాళ్ళ అమ్మ గారిని అడుగుతుంది. వదిన ఎప్పుడు ముసుగు తీయాలి అని...
దానికి శిల్ప టెన్షన్ తో ముసుగుని గట్టిగా పట్టుకుంటుంది. నీకెందుకే అంత తొందర అంటూ వినయ్ అక్కడికి వస్తాడు. చిన్నన్నయ్య అని గారంగా పిలుస్తుంది.
దానికి ఉన్నదే ఆ కంగారు కదా అని అంటూ భరత్ అక్కడికి వస్తాడు. బావా అంటూ గుర్రుగా చూస్తుంది.
శిల్పతో భరత్ హాయ్ చెల్లమ్మ నేను నీకు అన్నయ్యని అవుతాను. అలాగే నీ భర్తకి బావ అండ్ బెస్ట్ ఫ్రెండ్ ని అని పరిచయం చేసుకుంటాడు.
వినయ్ కూడా హాయ్ వదిన నేను నీకు బుల్లి గారాల మరిదిని అని పరిచయం చేసుకుంటాడు.
నివేదిత మళ్ళీ అడుగుతుంది మూసుకు ఎప్పుడు తీస్తారు అని...
రేపు ఉదయమే సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది. రేపు రాత్రికి కార్యం జరుగుతుంది.
ఎల్లుండి శిల్ప పూజ చేసిన తర్వాత ముసుకు తీస్తామని ఇందిరా గారు చెబుతారు.
అన్నయ్య ఎప్పుడు చూస్తాడు అంటే... నువ్వు చిన్నపిల్లవు ఇంకా ఎక్కువగా అడగకు అని చిరు కోపంగా చెప్పి, వదినని రూమ్ కి తీసుకెళ్లని ఇందిరా గారు చెబుతారు.
శిల్పా రూమ్ లోకి వెళ్ళగానే శిల్ప మేనమామ అయిన సునీల్, మేనత్త అయిన బిందు లోపలికి వస్తారు.
సునీల్ లోపలికి వస్తూనే క్షమించండి. కొంచెం ట్రాఫిక్ జామ్ అయి లేట్ అయ్యాము అని చెబుతారు.
ఎందుకు అంత కంగారు పడుతున్నారు? శిల్పా మా అమ్మాయి రూములో ఉంది అని చెప్పి...
సర్వెంట్ ని పిలిచి గెస్ట్ రూమ్ లోకి తీసుకెళ్లమంటారు బిందూకి వ్రతం వరకు శిల్పని కలవడం కుదరదు.
వ్రతానికి విక్రమ్, శిల్ప కూర్చుని పూజ చేస్తూ ఉంటారు. శిల్ప తల్లిదండ్రులైన ధనుంజయ్, భార్గవి, నానమ్మ, తాతయ్యలైన సత్యవతి, శేషగిరి గారు వస్తారు.
వ్రతం అంత ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. వ్రతం పూర్తయిన తర్వాత లలితగారు వంశపారపర్యంగా వస్తున్న నగలను శిల్పకు అందిస్తారు.
శిల్ప మొహమాటం పడుతుంటే, తీసుకో శిల్పా అవి ఇంటి కోడళ్ళకి చెందవలసినవి. నీకు ఇంకా వినయ్ కి వచ్చే భార్యకు మాత్రమే చెందుతాయి. అని చెప్పి శిల్పకు అందిస్తారు.
శిల్పా అవి తీసుకోగానే భార్గవి వచ్చి అవి శిల్ప చేతిలో నుంచి తీసుకుంటుంది. విక్రమ్ మేనత్త అయిన మాధవి గారు డైమండ్ సెట్ ప్రెసెంట్ చేస్తారు..
లలిత గారు అది చూసి ఇప్పుడు ఎందుకు వదిన అంటే,, నా కూతురికి మేము పెట్టుకుంటున్నాం అని మాధవి భర్త అయినా రమేష్ గారు చెబుతారు.
వ్రతం పూర్తిచేసి విక్రం కి శిల్ప కి రూమ్లో భోజనం ఏర్పాటు చేస్తారు. నివేదిత ఇద్దరికీ భోజనం వడ్డిస్తుంది. శిల్ప ముసుగు లోపలికి చేతిని తీసుకువెళ్లి భోజనం చేస్తూ ఉంటుంది.
భోజనం అయిన తర్వాత విక్రమ్ నివేదితను పిలిచి, నివి బయట 5 మినిట్స్ మేనేజ్ చెయ్ అని చెబుతాడు.
దానికి నివి ఓహో..... లెజెండ్ విక్రమ్ గారు రొమాంటిక్ పర్సన్ అయ్యారా..అని టీస్ చేస్తుంది.
ఒక నవ్వి నవ్వి విక్రమ్ చెల్లిని పంపిస్తాడు. విక్రమ్ శిల్ప దగ్గరికి వచ్చి నీకు ఒక స్మాల్ గిఫ్ట్ అని ఒక బాక్స్ ఇస్తాడు.
ఆ గిఫ్ట్ చూసిన శిల్ప రియాక్షన్ ఏమిటి??
కథ కొనసాగుతుంది....
ఇంకా చదవాలని ఉంటే కింద క్లిక్ చేయండి.
పూలు పండ్లు-1
పూలు పండ్లు
ఈ కథ పూర్తిగా కల్పితం..
కళ్యాణ మండపం...
ఈ సిటీ లోనే పెద్ద పెద్ద బడా బాబుల్ని భరించే అతిపెద్ద కళ్యాణ మండపం.
రాష్ట్రంలోనే రెండు పెద్ద బిజినెస్ కుటుంబాల మధ్య జరుగుతున్న వివాహ వేడుక ఇది.
అంగరంగ వైభవంగా అలంకరించి ఉంది ఎటు చూసినా రెండు కుటుంబాల వైభోగం కనబడుతుంది.
కళ్యాణ మండపం చుట్టూ ఫుల్ గా సెక్యూరిటీ ఉంది.
ప్రతి ఒక్కరినే బాగా చెక్ చేసి గాని లోపలికి పంపడం లేదు.
పెళ్ళికొడుకు మండపంలో కూర్చుని వర పూజ చేస్తున్నాడు. పెళ్ళికొడుకుని చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు.
ఆరడుగుల అందగాడు, చురకత్తుల లాంటి చూపులు, సమ్మోహనపరిచే చిరునవ్వు, సిల్కీ హెయిర్, చుక్కల్లో చంద్రుడు వలె మెరిసిపోతున్నాడు.
పెళ్లికి వచ్చిన బంధువు వర్గం అంతా ఈ సంబంధం మాకు ఎందుకు కుదరలేదు అని బాధపడుతూ, పెళ్లికూతురు తండ్రి అదృష్టానికి ఈర్షపడ్డారు .
పెళ్ళికాని అమ్మాయిలు అయితే తమ కలల రాకుమారుడు వేరొకరి సొంతం అవుతున్నందుకు తెగ బాధ పడిపోయారు.
ఇంతలో పూజారి గారు పెళ్ళికూతురుని తీసుకురండి అని చెబుతారు. పెళ్ళికూతురని ఆమె స్నేహితులు తీసుకు వస్తూ ఉంటారు. వారి ఆచారం ప్రకారం ముసుగు వేసుకుని ఉంటుంది.
పెళ్లి కూతుర్ని పీటల మీద కూర్చోబెడతారు.ఇద్దరి మధ్యన తెర అడ్డుగా ఉంటుంది. పూజారి గారు వధువుతో పూజ చేయిపిస్తూ మంత్రాలు చెప్పిస్తుంటే, వధువు తల్లి అయిన భార్గవి వచ్చి అమ్మాయి రెండు రోజులు మౌనవ్రతం లో ఉంది అండి.
పెళ్లి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలి అని అమ్మవారికి మొక్కుకుంది అని చెబుతుంది. అందరూ వధువు భక్తికి మురిసిపోతారు వధువు తండ్రి అయిన ధనుంజయ్ గారు కూతురిని చూసి పొంగిపోతారు.
ధనుంజయ కళ్ళు ఎవరినో వెతుకుతాయి కానీ అతనికి నిరాశ ఎదురవుతుంది.
కన్యాదాన పూజలో వధువు కుడి చేతి మణికట్టుపై ఉన్న పుట్టుమచ్చ చూసి వరుడికి రకరకాల ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి.
ఆ పుట్టుమచ్చ పెసరబద్ధంత పెద్దగా ఉంటుంది.
కన్యాదానం పూర్తయిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టేస్తారు.
తరువాత తాళి కట్టినప్పుడు వరుడు ఎంతో సంతోషంగా కడుతూ ఉంటే, వధువు కంటలో నుండి నీళ్లు జలజలా కారుతాయి..
ఒక కన్నీటి బొట్టు వచ్చే వరుడు పాదాలపై పడుతుంది.
వరుడు అర్థం కాక వధువు వంక అనుమానంగా చూస్తూ ఉంటే, భార్గవి వచ్చి మీతో వివాహానికి తను చాలా సంతోషంగా ఉంది అని వరుణ్ణి డైవర్ట్ చేస్తుంది.
తలంబ్రాల ఘట్టంలో కూడా వధువు వణుకుతూ ఉంటుంది. పెళ్లి ఘట్టాలు అన్నీ పూర్తి అయ్యాక అప్పగింతల అప్పుడు వధువు తన నానమ్మ అయిన సత్యవతి గారికి దగ్గరికి వెళుతూ ఉంటే భార్గవి వచ్చి వధువును హత్తుకుని భయపడకు మేమందరం నీ వెనకాల వస్తున్నాము అని చెప్పి సాగనంపుతుంది.
వధువు, వరుడు ఒక కారులో, మిగిలిన వాళ్ళందరూ ఎవరి కారులో వారు బయలుదేరతారు.
కార్ స్టార్ట్ అవ్వగానే వరుడు,, తమకు డ్రైవర్ కి మధ్య ఉన్న డోర్ వేసేస్తాడు. ఆ కారు చాలా లగ్జరీస్ కారు. అన్ని రకాల హంగులు ఉంటాయి.
వెంటనే వరుడు వధువు చేయి పెట్టకు పట్టుకుని నీకు ఈ పెళ్లి ఇష్టమే కదా!! ఎవరి బలవంతం మీద నువ్వు ఒప్పుకోలేదు కదా అని గంభీరంగా అడుగుతాడు.
అతని మాటలోనే గంభీరానికే భయపడుతుంది. వధువు భయం అర్థం అయ్యి కూల్ గా మాట్లాడతాడు భయపడకు నిజం చెప్పు అని...
దానికి వధువు ఇష్టమే అని తల ఊపుతుంది. మౌనవ్రతం ఎన్ని రోజులు అని అడుగుతాడు?? రెండు రోజులు అని తన వేళ్ళు చూపిస్తుంది.
వధువు చేతి వేళ్ళు చాలా చిన్నగా ఉంటాయి. వరుడు తన చేయి పక్కన వధువు చేయి పెట్టి చూసి చిన్నగా నవ్వుకుంటాడు.
ఇంతలో కార్ ఒక అందమైన మాన్షన్ ముందు ఆగుతుంది. అది జై సింహా మాన్షన్. పెళ్లి గురించి మాన్షన్ మొత్తం అందమైన పువ్వులతో అలంకరించబడి ఉంటుంది .
జై సింహా ఫ్యామిలీ తరతరాల నుంచి చెయ్యని బిజినెస్ అంటూ లేదు. స్కూల్స్ దగ్గర నుంచి హాస్పిటల్స్ వరకు, వ్యవసాయ ఉత్పత్తుల దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ వరకు అన్ని రకాల బిజినెస్ లు చేస్తున్నారు.
చారిటీస్ కూడా రన్ చేస్తున్నారు. కంపెనీ ప్రాఫిట్ లో 25% చారిటీస్కు ఉపయోగిస్తున్నారు.
ఇద్దరినీ గుమ్మం ముందు ఆపి పేర్లు చెప్పి లోపలికి రమ్మంటారు. వధువుకి చాలా టెన్షన్ గా ఉంటుంది.
వరుడు వధువు వంక చూసి చిన్నగా నవ్వుతాడు. వధువు ఆలోచిస్తుంది ఇప్పుడు ఎలా తను మాట్లాడేది అని...
కథ కొనసాగుతుంది.....
ఇంకా చదవాలని ఉంటే కింద క్లిక్ చేయండి.