NaReN

NaReN

Thursday, August 31, 2023

భార్య కోపం

 🌼 భార్య  కోపం వలన, భర్త అర్థరాత్రి ఇంటి నుండి బయటకు పోవలసి వచ్చింది... దానివలన ప్రపంచ మానవాళికి విప్లవాత్మకమైన గొప్ప ఆవిష్కరణ జరిగింది.

✌️✌️✌️✌️✌️


*👍ఈ సంఘటన 2004లో జరిగింది. ప్రస్తుతం, గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ ఆ సమయంలో అమెరికాలో కెరీర్‌ను పెంపొందించు కోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఒకసారి అతని పరిచయస్థుల్లో ఒకరు అతనిని తన ఇంటికి భోజనానికి పిలిచారు. సుందర్ తన భార్యతో కలిసి వెళ్లాల్సి రావడంతో భార్యతో కలిసి ప్లాన్ వేశాడు. తను  ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లి ఆఫీస్ అయ్యాక నేరుగా ఆహ్వానం పలికిన ఇంటికి భోజనానికి వెళతానని సుందర్ చెప్పాడు. ఇంటి నుంచి నేరుగా అక్కడికి చేరుకోవాలని భార్యను కోరాడు. భార్య ఇంటి నుండి నేరుగా డిన్నర్‌కి వెళ్లాలి మరియు సుందర్ పిచాయ్ ఆఫీసు నుండి నేరుగా భోజనానికి చేరుకోవాలి.*


*రాత్రి 8 గంటలకు విందు కార్యక్రమం. సుందర్ పిచాయ్ భార్య అంజలి తన కారులో రాత్రి సరిగ్గా ఎనిమిది గంటలకు భోజనానికి హోస్ట్ ఇంటికి చేరుకుంది. సుందర్ పిచాయ్ కూడా ఆఫీస్ నుండి బయల్దేరి  వెళ్లిపోయాడు, కానీ అతను మార్గమధ్యంలో దారి తప్పిపోయాడు. అతను  అక్కడికి చేరుకునేసరికి దాదాపు 10 గంటలైంది. అప్పటికే  పిచాయ్  భార్య అక్కడి నుంచి రాత్రి భోజనం చేసి వెళ్లిపోయింది. ఇప్పుడు పిచాయ్‌ సాహిబ్‌ పరిస్థితి విషమంగా మారింది. కారణం, అమెరికన్లు సమయపాలన పాటించడం వల్ల విందు ఆచారాలన్నీ పూర్తయ్యాయి. సుందర్ పరిస్థితి విషమంగా అయింది.  అయితే హోస్ట్ పిచాయ్ రాకకు ఘన స్వాగతం పలికి గుడ్ బై చెప్పారు*


*అక్కడి నుంచి ఏమీ తినకుండానే సుందర్ పిచాయ్ తన ఇంటికి వెళ్లాడు. అతను ఇంటికి చేరుకోగానే భార్య అంజలి చిరాకుపడి అతనితో గొడవ పెట్టుకుంది, కారణం, అతను సమయానికి విందుకు  చేరుకోలేదు మరియు అతని భార్య అవమానించబడింది. అంజలి  మానసిక స్థితిని చూసిన సుందర్ పిచాయ్ మళ్లీ ఆఫీసుకు తిరిగి వెళ్ళడం  సముచితం అనుకున్నాడు. (భార్య కోపంతో ఇంట్లోకి రానివ్వలేదని కొందరు అంటున్నారు)*


*ఏమైనా సరే, ఇప్పుడు సుందర్ తిరిగి ఆఫీసుకు చేరుకున్నాడు మరియు రాత్రంతా అక్కడే గడిపాడు. రాత్రంతా ఇలాగే ఆలోచిస్తూనే ఉన్నాడు - నాలాగే   రోజూ చాలా మంది దారి తప్పి పోయే అవకాశం ఉంది.  అదే విషయం రాత్రంతా ఆలోచిస్తూ, మ్యాప్ జేబులో పెట్టుకుని, దిక్కు కరెక్టుగా ఉంటే తను దారి తప్పేవాడిని కాదని అనుకున్నాడు.*


*మరుసటి రోజు ఉదయం సుందర్ పిచాయ్ తన టీమ్ మొత్తానికి ఫోన్ చేసి మ్యాప్ తయారు చేయాలనే ఆలోచనను అందరి ముందు ఉంచాడు. ఈ ఆలోచన విన్న టీమ్ చేతులు ఎత్తేసింది. టీమ్ అతని ఆలోచనను నమ్మలేదు, కానీ దాదాపు రెండు రోజుల పాటు టీమ్‌తో నిరంతరం సమావేశాలు నిర్వహించి, ప్రజలకు మార్గం చూపే ఉత్పత్తి(App)ని రూపొందించమని వారిని ఒప్పించాడు.*


*సుందర్ పిచాయ్ మరియు అతని బృందం కష్టపడి 2005లో గూగుల్ మ్యాప్‌ని తయారు చేసి అమెరికాలో ప్రారంభించారు. ఆ మరుసటి ఏడాదే 2006లో ఇంగ్లండ్‌లో, 2008లో భారత్‌లో లాంచ్‌ చేశారు.. ఇప్పుడు వారు రూపొందించిన మ్యాప్‌లు యావత్ ప్రపంచానికి సరైన మార్గాన్ని చూపే పని చేస్తున్నాయని ఇప్పటికే మీకు తెలుసు. ఒక స్టడీ  ప్రకారం, మొత్తం ప్రపంచంలోని ప్రతి ఏడవ వ్యక్తి Google Mapsని ఉపయోగిస్తున్నారు.*


*కథ పెద్దదిగా ఉంది కదా! కానీ, ఇది నిజంగా జరిగిన సంఘటన.* 


 *కాబట్టి కొన్నిసార్లు మీ భార్య మీపై కోపం తెచ్చుకోవచ్చు.  చింతించకండి. ఆ కోపంలో భవిష్యత్తులో ఏదో ఒక చారిత్రక ఆవిష్కరణ దాగి ఉందేమో ఎవరికి తెలుసు!!!*

👏👏👍👍🙏🙏💐💐

Wednesday, August 23, 2023

కాబోయే టీచ‌ర్లు

 

కాబోయే టీచ‌ర్లు




'గుడ్‌ మార్నింగ్‌ మేడమ్‌!'

రిజిస్టర్‌లో సంతకం చేసి తలెత్తి చూశాను. మా స్టూడెంట్‌. అంటే పాడేరు నుంచి వచ్చిన ట్రైబల్‌ స్టూడెంట్‌.

మా బిఎడ్‌ కాలేజీకి కొంత గిరిజనుల కోటా ఉంటుంది, అందులో వచ్చిన బ్యాచ్‌లో స్టూడెంట్‌ ఈ అబ్బాయి.

నా ఇంగ్లీష్‌ మెథడాలజీనే. వీరికి సరైన అవకాశాలు కల్పించి బి.ఎడ్‌ డిగ్రీ అందిస్తే.., ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. వారి గూడేలు బాగుపడతాయి. వారిని చూసి మరికొందరు చదివేందుకు ముందుకొస్తారు. ఇదొక్కటే నాతో ఎంత కష్టమనిపించినా వారి భాషను కూడా నేర్చుకునేలా చేసి వారికి దగ్గరిచేసింది. కొన్ని పోస్టులు సరైన క్యాండిడేట్లు దొరక్క మిగిలి ఉండిపోతాయి. అప్పుడు చివుక్కుమంటుంది. మిగతావాళ్లు మరికొంచెం బాధ్యత తీసుకుంటే ఈ పరిస్థితి ఉండదు. వీళ్లలో ఎక్కువమంది ఇంగ్లిష్‌ మెథడాలజీ తీసుకుంటారు. ఎక్కువ పోస్టులు ఉంటాయి. సింగిల్‌ టీచర్స్‌ స్కూళ్లలో ఈసారి బ్యాచ్‌లో పది మంది ఉన్నారు. అందులో ఏడుగురు ఇంగ్లిష్‌ తీసుకున్నారు. అయితే సోషల్‌, లేదా లెక్కలు మొదటి మెథడాలజీ, రెండవది ఇంగ్లిష్‌. తెలుగు తీసుకోవడానికి ఇష్టపడరు వీళ్లు. అలాగని ఇంగ్లిష్‌ వచ్చని కాదు అస్సలు రానిది. ఇంగ్లిష్‌ తీసుకుంటే ఉపయోగం అని తర్వాత ఇంకా అభివృద్ధి ఉంటుందని.

'ఏమిట్రా... పొద్దున్నే' విసుగ్గా అన్నా నవ్వుతూనే. స్టాఫ్‌రూమ్‌ వైపు నడుస్తుంటే నాతో బాటే నడిచి వస్తున్నాడు తాను కూడా.

'ఏమిటి సంగతి వెంటబడ్డావ్‌?' నవ్వుతూ అడిగా.

' మరే మరండీ మేడమ్‌ ....'

'ఏంట్రా నసుగుడు, వెళ్ళండి అందరూ ప్రాక్టికల్స్‌కి తయారు అవ్వండి. నిన్న లెసన్స్‌ ఎలాట్‌ చేశాను కదా..!

వాటికి నే చెప్పిన మోడెల్స్‌ని తయారు చేస్కోవాలి. ఎక్స్‌టర్నెల్స్‌ కన్నా ముందు నా దగ్గర చెప్పాలి అర్థమైందా? ఏరీ మీ మిగిలిన మీ కాబోయే టీచర్లూ' ఎప్పుడూ వాళ్ళని కాబోయే టీచర్లనే అంటాను. అలా వారి చదువు గొప్పదనం గుర్తుచేస్తుంటాను. కొండ దొరలు అని కూడా అంటూ ఉంటాను. అలా వారి పెద్ద మనసుని మెచ్చుకుంటాను. నేను అంటే మిగిలిన లెక్చరర్స్‌ కూడా అలాగే అనడం, చివరికి స్టూడెంట్స్‌ స్టాఫ్‌ అందరూ వాళ్ళని అలాగే పిలుస్తారు. వాళ్ళు మాత్రం ఏమీ అనుకోరు. అసలేమైనా అనుకోవాలని కూడా తెలియని పుట్ట తేనియ అంత స్వచ్ఛమైన మనసులు వాళ్లవి.

'అదే మేడమ్‌ మాకిచ్చిన లెసన్స్‌ అన్నిటికీ మోడల్స్‌ తయారు చేసేసాం, కానీ ...మరి ....'

'అయితే ఇంకేం తెచ్చేయండి ఈ రోజు ఓ సారి ప్రాక్టీస్‌ చేసేసుకుందాం. అసలే రేపు మనకి వచ్చే ఇంగ్లీష్‌ ఎక్స్‌టర్నెల్‌ చండశాసనుడు అంట' బ్యాగ్‌ సొరుగులో పెట్టి నా బీరువాలో బుక్స్‌ తీయడానికి తాళం తీస్తున్న కొండా... ఒక్కసారి ఏడుపు మొదలు పెట్టాడు. 'హే కొండా! ఎందుకలా ఏడుస్తున్నావు?' నాకు చాలా జాలి అనిపించింది.

'అది కాదు మేడమ్‌! లెసన్‌ ప్లాన్స్‌ అన్నీ రాసేశాం. కానీ, లెసన్‌ చెప్పాలంటే భయంగా ఉందమ్మా'

వాళ్ళందరూ క్లాస్‌ బయట నన్ను అమ్మా అంటారు. క్లాస్‌లోనే మేడమ్‌ అంటారు. వాళ్ళ పట్ల నేను చూపే ఆత్మీయత బహుశా నన్ను వాళ్లకి దగ్గర చేసింది. అందరు స్టూడెంట్స్‌ తోనూ ఆత్మీయంగా ఉండటం నా మనస్తత్వం. భుజానికి కళ్ళు తుడుచుకుంటూ తాను అలా చిన్న పిల్లాడిలా చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది.

ఇది ప్రతి బ్యాచ్‌లోనూ నేను ఫేస్‌ చేస్తాను. వీళ్ళే కాదు, ఇంకా అసలు ఇంగ్లీష్‌ రాని వాళ్ళు కూడా మంచి అవకాశం వస్తుంది డీఎస్సీలో అని ఇంగ్లీష్‌ తీసుకుంటారు. కానీ, పాఠాలు చెప్పేదగ్గరికి వచ్చేటప్పుడు ఇలాగే డీలా పడిపోయి ఏడుస్తారు. ఒక్కొక్కసారి బాగా జ్వరం పెట్టేసుకుంటారు. ఇవన్నీ ఎక్కువ ఇంగ్లీష్‌ వాళ్లకే ఎదురవుతాయి. మళ్ళీ లెక్కలు కానీ, సోషల్‌ కానీ, సైన్స్‌ కానీ ఎంత బాగా చెప్తారో..! తెలుగులో కదా..! ఈ కొండా చేతి రాత చూస్తే అసలు ఏ కాన్వెంట్‌లో చదువుకున్న వాడైనా పనికి రాడు, ముత్యాలు పేర్చినట్టు ఉంటుంది.

'కొండా, నువ్వు వరాలు, లచ్చుం నాయుడు, మీరంతా మొన్న నా దగ్గర బాగానే చెప్పారు కదా నాన్నా..! అలా భయపడితే ఎలా? నేనుంటాను కదా మీ పక్కనే' అనునయంగా అన్నాను.

'మే ఐ కమ్‌ ఇన్‌ మాడమ్‌' గుంపుగా పదిమంది ముగ్గురు ఆడపిల్లలు, ఆరుగురు మగ పిల్లలు అందరూ నా స్టూడెంట్సే గుమ్మం దగ్గర నిలబడ్డారు.

'యెస్‌ కమ్‌ ఇన్‌...! ఏంటర్రా అందరూ కట్ట కట్టుకుని వచ్చారు?'

'అదే మేడమ్‌ మీతో మాటాడాలి అని..' అందులో బాగా మాట్లాడేది ఎరికమ్మ. తాను సోషల్‌, ఇంగ్లీష్‌ అమ్మాయి. సోషల్‌ పాఠం ఆ అమ్మాయి చెప్తుంటే నిజంగా ఎంత బాగుంటుందో..! నేను నా పాఠాలు అయ్యాక సోషల్‌ పాఠాలు కూడా వింటుంటా. మంచి సామాజిక అవగాహన అన్వయంతో చెప్తారు పిల్లలు.

'ఏంట్రా మాటాడేది ఫైనల్‌ ప్రాక్టికల్స్‌లో మీ పాఠం నన్ను చెప్పమంటారా ఏంటి ?'

'అది కాదు మేడమ్‌ భయంగా ఉంది'

'ఓర్నీ భయమెందుకు నా దగ్గర చెప్పలేదూ, ఎలా సులువుగా చెప్పాలో మీకు నేర్పలేదూ నేను, మరి ఇప్పుడిలా భయపడితే ఎలా?'

'మీ దగ్గర చెప్పాలంటే ధైర్యంగా ఉంటుంది మేడమ్‌. కానీ, బయట వాళ్ల దగ్గర ....' నసిగింది దేవమ్మ. తాను లెక్కలు, ఇంగ్లీష్‌ స్టూడెంట్‌.

'భలే చెప్తున్నారు రా! మీరు.. ఎన్ని బ్యాచులు మీలాంటి వారిని పంపించాను. ఎన్ని సార్లు చెప్పాను. భయపడకూడదు అని'

'అవును మరి మీ దగ్గరైతే ధైర్యంగా చెపుతారు, మీరు ఉంటారు కనుక. మీకు ప్రతి బ్యాచ్‌కి ఈ ప్రహసనం అలవాటేగా' నవ్వుతూ అంది ఫిలాసఫీ లెక్చరర్‌. మమ్మల్ని అంటే బీ.ఎడ్‌ లెక్చరర్స్‌ని టీచర్‌ ఎడ్యుకేటర్స్‌ అంటారు.

'ఏం చేస్తాం మణీ! ఈ ఇంగ్లీష్‌ ఉందే ఇదొక మహమ్మారిలా భయపెడుతుంది.' నవ్వేను.

'కానీ, మీరు ఉండబట్టి ఎక్కువ మంది ఇంగ్లీష్‌ తీసుకుంటారు మరి. మీరు ఆ మహమ్మారికి భయపడకుండా చేస్తారుగా. అయినా మీరు ఉండగా వాళ్ళకు భయమెందుకు? ఓరు హలో! మీరు ముందు నా సబ్జెక్ట్‌ రికార్డ్‌ సబ్మిట్‌ చేయండి. లాస్ట్‌ డేట్‌ రేపే, మీకు తెలుసుగా రేపు గాని ఇవ్వక పోయారో ఎల్లుండి ఇచ్చినా చించేస్తాను.' బెదిరింపుగా అంది మణి. అనడం కాదు, ఆమె నిజంగానే చించేస్తుంది. ఆమె అంటే అందరికీ భయం కాలేజ్‌లో.

'మేము అందరం ఇచ్చేశాం మేడమ్‌' మమ్మల్ని ఎందుకు అంటావు అన్నట్లు ఉక్రోషంగా సమాధానం చెప్పింది సత్తమ్మ.

'ఊ సరే సరే పదండి నా క్లాస్‌ ఉంది' అంటూ నడిచింది మణి.

'వెళ్ళండి. మీరంతా క్లాస్‌కి కంగారు ఏమీ లేదు నేనున్నాగా చూసుకుంటా' అందరూ భయంగా నెమ్మదిగా క్లాస్‌కి వెళ్లేరు.


'ఏంటి మమ్మీ డల్‌గా ఉన్నావు స్ట్రెయిన్‌ ఎక్కువైందా కాలేజ్‌లో?' అడిగింది దివ్య.

'లేదురా, ప్రతి ఏడాది లాగానే మళ్ళీ ప్రాక్టికల్స్‌ రేపు. ఉదయం రోజూ కంటే చాలా

ముందరే బయల్దేరాలి. ఆరుగంటల బస్సుకే వెళ్తాను.'.

కాలేజ్‌కి రోజూ నలభై కిలోమీటర్లు ప్రయాణం చెయ్యాలి రోజూ, మేముండే సిటీకి

కాలేజ్‌ ఉండే చోటు సబర్బన్‌లో ఉంటుంది.

'ఓహౌ వచ్చేసిందా నీకు పరీక్ష రోజు! అబ్బా ఇప్పటికీ పదేళ్ల నుంచి చూస్తున్నాను.. వాళ్లకి పరీక్షలైతే నువ్వు కంగారు పడటం. ఆ మణి గారు, తెలుగు సార్‌, సోషల్‌ సార్‌, ఫిజిక్స్‌ ప్రసాద్‌ సార్‌ చూడు ఎంత హాయిగా ఉంటారో..! నువ్వు మాత్రం నా ఎగ్జామ్స్‌కి కూడా టెన్షన్‌ పడవు. కానీ, మీ కాలేజీ పిల్లల పరీక్షలంటే మాత్రం... అబ్బా లే మమ్మీ..! టీవీలో నీ ఫేవరెట్‌ సినిమా వస్తోంది. 'ముఘల్‌ ఏ ఆజమ్‌' చూద్దాం రా' చెయ్యి పట్టుకుని లాగింది పాప.

'ఏమి చేస్తాం రా! ప్రతి సారీ ఇదే ....' ఏదో చెప్పబోయాను.

'మాతా.. ధరణీ.. ఇంక మేము నీ సుత్తి భరించలేం గానీ లే..! సినిమా చూద్దాం' చెయ్యిపట్టుకుని లాగి నిలబెట్టింది పాప. నేను పడుతున్న బాధ తనకేం తెలుసు చిన్న పిల్ల. మౌనంగా హాల్‌లో టీవీ దగ్గరికి కదిలాను.


విద్య మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనది. విద్యా, ఆరోగ్యం ఈ రెంటినీ ప్రైవెటైజ్‌ చేయొద్దని మహామహులు చెప్పినా మన ప్రభుత్వాలు ఎల్పీజీ (లిబరలైజేషన్‌- ప్రైవేటైజేషన్‌-గ్లోబలైజేషన్‌) అంటూ చేయనే చేసింది. ఒక ఇంజినీరు మంచివాడు కాకుంటే ఒక బ్రిడ్జ్‌ కూలిపోతుందేమో..! కానీ, ఒక ఉపాధ్యాయుడు మంచివాడు కాకుంటే ఒక తరం పాడైపోతుంది. ఒక టీచర్‌ కనీసం 100 మందికి పాఠం చెప్తే ఆ పాఠాల్లో నాణ్యత లేకుంటే పిల్లలు ఏమి నేర్చుకుంటారు.. ఏమి చదువుతారు? ఇన్ని బి.ఎడ్‌ కళాశాలలు ఉండి కొందరు మంచి ఉపాధ్యాయులనైనా తయారు చేయగలుగుతున్నామా..! అన్నది నన్నెప్పుడూ వేధించే ప్రశ్న. బి.ఎడ్‌లో చాలా చిత్రమైన విద్యార్థులు వస్తారు. కొంతమంది డిగ్రీ నుంచి వస్తే.. మరి కొంతమంది పీజీ చదివి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇంక ఏజ్‌ లిమిట్‌ ఎక్కువ ఉంది కనుక, కొందరు ఎప్పుడో డిగ్రీలు చేసి వదిలేసినా ఇప్పుడు మళ్ళీ పిల్లలు కాస్త ఎదిగాక టీచర్లుగా ఉద్యోగాలు చేద్దామని చదవడానికి, పెళ్ళైన ఇల్లాళ్లు, పిల్లల తల్లులు వస్తారు. 'ఏంటి అమ్మా నీ కన్నా నీ స్టూడెంట్స్‌ పెద్దగా ఉన్నారు' అంటుంది పాప. ఇన్‌-సర్వీస్‌ హెచ్చార్స్‌ కూడా వస్తారు. అందరినీ స్టూడెంట్‌ టీచర్స్‌ అంటాం. మామూలుగా కాలేజ్‌ చదువు చెప్పినట్టు ఉండదు బి.ఎడ్‌. రకరకాల ఏజ్‌ గ్రూప్స్‌ కుటుంబ నేపథ్యాలు, ఇంకా కొందరు జీవితంలో నష్టపోయినవారు మళ్ళీ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి వస్తారు. 

విడాకులు పొందిన అమ్మాయిలు, భర్తలు పోయినవారు, రకరకాల మనస్తత్వాలు. అందరినీ డీల్‌ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. బాగా చదువుకునే మెరికల్లాంటి పిల్లలు కూడా ఉంటారు. అందరికీ డిగ్రీలోనో ఇంటర్మీడియట్‌లో చెప్పినట్టు ఒకే మూసలో చెప్పేయడం కుదరదు. కొందరు ఎంతో బాగా చదువుతారు, పాఠాలు చెప్తారు. నేను ఇంగ్లీష్‌ చెప్తాను, సైకాలజీ చెప్తాను. ఉపాధ్యాయులుగా వాళ్ళు పిల్లల మనస్తత్వాలను అర్థం చేస్కోవాలి. అందుకే, మనస్తత్వ శాస్త్రం. కానీ, అది నేర్పేటప్పుడు వీళ్ళ మనస్తత్వాలను అర్థం చేసుకుని నేర్పాలి. అందరి కంటే కాస్త వయసులో పెద్ద కనుక అందరినీ అర్థం చేసుకుంటాను కనుక, నన్ను మా స్టూడెంట్స్‌ అందరూ బాగా ఇష్టపడతారు. వాళ్ళని మంచి టీచర్లుగా తయారు చేయలేమా... అన్న ఛాలెంజ్‌ నాకు నేనే చేసుకున్నాను. అందుకే ఇంత ఆలోచన, శ్రమ.

ప్రతి బ్యాచ్‌ చివరి రోజు ఫేర్వెల్‌ నాడు.. ఒకటే చెప్తాను. 'డియర్‌ స్టూడెంట్స్‌ మీరందరిలోనూ మంచి టీచరు లక్షణాలు ఉన్నాయి. మీలో కొంతమంది డియస్సీ సాధించి ప్రభుత్వ టీచర్లు అవుతారు, కొందరు ప్రైవేట్‌ స్కూల్స్‌లో కార్పొరేట్‌ స్కూల్స్‌లో టీచర్స్‌ అవుతారు, వీళ్ళకి ఎలాగూ తప్పదు. బాగా చెప్పకపోతే తీసేస్తారు. కానీ, గవర్నమెంట్‌ టీచరు జాబ్‌ వచ్చిందా! మీరింక చదవరు.. నాకు తెలుసు, అయితే అందరికీ ఒకే మాట. మీరు గనుక టీచర్స్‌ అయితే దయచేసి అప్పుడప్పుడైనా సిన్సియర్‌గా పాఠాలు చెప్పండి ప్లీజ్‌. దేశ భవితవ్యం తరగతి గదుల్లో నిర్మింపబడుతుంది అని కొటేషన్‌ రాయడం కాదు, నిజంగా క్లాస్‌రూములు రాబోయే తరాలను తీర్చిదిద్దే ఆలయాలని గుర్తు పెట్టుకుని మసలుకోండి. ఇది నా సందేశం కాదు విన్నపం. ఇక్కడ మీరు ఏ పాఠాలు ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. దానికి ఇంకా మీ తెలివితేటలు కృషి జోడించితే మంచి ఉపాధ్యాయులు అవుతారు. జాతి నిర్మాతలవుతారు. నేనేదో ఉద్విగంగా మీకు ఇవన్నీ చెప్తున్నాను అనుకుంటున్నారు. కానీ, మీ జీవితంలో మీ టీచర్‌ వృత్తిలో మీరెప్పుడూ నిత్య విద్యార్థిగా ఉంటే మంచి విద్యార్థులను తయారు చేయగలుగుతారు. అమ్మ ప్రేమ, నాన్న శిక్షణ రెండు అందించే స్నేహితుడిలాంటి మంచివారు టీచర్లు. మీ అందరూ మంచి ఉపాధ్యాయులుగా దేశానికి మంచి పౌరులను అందించేవారిగా కొనసాగాలని నా ఆశ, ఆశీర్వాదం..'

నా మాటలు ఊరికేపోవు కొందరు మంచి పేరు తెచ్చుకుని వచ్చినవాళ్లున్నారు. నేను పంపిన నాలుగో బ్యాచ్‌ అనుకుంటా... వాసు అనే అబ్బాయికి బెస్ట్‌ టీచర్‌ అవార్డ్‌ వచ్చింది. ఇలా ఎక్కడెక్కడో మా స్టూడెంట్స్‌ గురించి ఎవరెవరి నుండో వింటుంటాం. అదే ఈ వృత్తిలో ఆనందం తృప్తీ. అయితే వాళ్ళని పరీక్షలు పాస్‌ చేసేటప్పుడు మాత్రం చాలా సంఘర్షణకు గురౌతాను. ప్రాక్టికల్స్‌, రికార్డ్స్‌ మార్కులు ఏడువందల మార్కులు మా చేతిలో ఉంటాయి. అందుకే బి.ఎడ్‌ లెక్చరర్లు అంటే స్టూడెంట్స్‌ చాలా విలువ ఇస్తూ భయంగా మసలుతారు.

స్టూడెంట్స్‌కి అందరికీ మళ్ళీ పర్సంటేజ్‌ బాగుండాలి. రాత పరీక్షలలో తగ్గినా ప్రాక్టికల్స్‌లో అందరికీ ఫస్ట్‌ క్లాస్‌ మార్కులు వేయాలి. పరీక్షల పేపర్లు కరెక్ట్‌ చేసేటపుడు కూడా ఇదే బాధ నాకు. ఎప్పుడూ ఒకటే ఆలోచన నన్ను వేధిస్తుంది. 'నాణ్యత లేని ఉపాధ్యాయులను తయారు చేసి దేశం మీదకి వదిలి ద్రోహం చేస్తున్నామా మేము.

(ఉపాధ్యాయులకే ఉపాధ్యాయులం కదా) లేక కేవలం ఈ డిగ్రీ ఉంటే జీవనోపాధి కల్పించుకుని బతకాలనుకునే వారికి సహాయం చేస్తున్నామా? ఇదే ఎప్పుడు నా మదిని వేధించే ట్రిల్లియన్‌ డాలర్‌ ప్రశ్న! విద్యా నాణ్యతా ప్రమాణాలు గురించి పట్టించుకోని ప్రభుత్వాలు, అందుకే కార్పొరేట్‌ స్కూల్స్‌లో తమ పిల్లలను కడుపుకట్టుకుని చదివిస్తోన్న తల్లితండ్రులు. అలాగని పోనీ, కార్పొరేట్‌ స్కూల్స్‌లో విద్యా ప్రమాణాలు బాగున్నాయా అంటే... అదొక నరకకూపం పిల్లలకి. నూరి రుబ్బి పిల్లల్ని బండ మెషీనుల్లాగా తయారు చేస్తున్న మన విద్యా సంస్థలు. ఏ దేశం, ఏ వ్యవస్థ బాగుపడాలన్నా అది విద్య మీద కదా ఆధారం. అలాంటి విద్యని నాణ్యంగా ఎందుకు అందించలేకపోతున్నాం అన్నదే నా వ్యధ!!!


ప్రాక్టికల్స్‌ రోజు వచ్చిన ఎక్స్‌టర్నెల్‌తో మాట్లాడుతూ పిల్లలతో పాఠాలు చెప్పించేస్తాను నేను. ముందు బాగా చెప్పే వాళ్ళని ముందు పెట్టి, తర్వాత కాస్త వీక్‌గా ఉన్న వాళ్ళు చెప్పేటప్పుడు అవతలి వాళ్ళని మాటల్లో పెట్టి సర్దేస్తుంటాను.

మేము ఎలా చెపితే అలా మార్కులు వేసేస్తారు.. సహజంగా వచ్చినవాళ్ళు. ఎందుకంటే, వాళ్ళ కాలేజీలకి మేము వెళ్ళినా అంతేగా మరి. ఇలా మా పాస్‌ పర్సెంటేజ్‌ మాత్రమే మాకు కావాలి అంతే..! మా కాలేజీలు నడవాలిగా మరి.

ఈ బ్యాచ్‌లో నాకు యాభై మంది స్టూడెంట్స్‌. నిజానికి నేను గమనించాను వాళ్ళలో చాలా ప్రజ్ఞ, తపన ఉంటాయి కానీ, భయపడతారు. ఆ భయాన్ని పోగొట్టేమా వాళ్ళంత గొప్ప వాళ్ళు ఉండరు. వాళ్ళలో చదువు పట్ల గౌరవం, ఈ చదువు తాము చదివేసుకుని తమ పిల్లలను తీర్చిదిద్దుకోవాలనే తపన మాత్రం అందరిలోనూ ఉంటుంది. ఇక్కడ పాఠాలు చెప్పలేకపోయినవాళ్ళు ఎందరో తర్వాత మంచి టీచర్లుగా ముఖ్యంగా ఇంగ్లీష్‌ టీచర్లుగా పేరు తెచ్చుకున్నారు.

'వావ్‌ ! ఏమి చెప్పిందండీ ఈ అమ్మాయి, నీ పేరేంటమ్మా?' వచ్చిన ఎక్స్‌టర్నెల్‌ పెద్దవారు.. సత్తమ్మ చెప్పిన టాగోర్‌ పద్యం ఎనిమిదో తరగతి పాఠం 'డే బై డే ఐ ఫ్లోట్‌ మై పేపర్‌ బోట్స్‌' విని చాలా సంతోష పడిపోయారు. 'ఇలా రామ్మా, అవునూ! సియులి ఫ్లవర్స్‌ అంటే పారిజాతాలు అని ఎలా తెలుసుకున్నావు?' వెంకట్రావు మాస్టారు చాలా సీనియర్‌ ఇంగ్లీష్‌ మాస్టారు ఆనాటి విలువలు ప్రమాణాలు పాటించేవారు. ఆయన అలా మురిసిపోతూ అడుగుతుంటే నాకు మనసు నిండిపోయింది. 'మా మేడమ్‌ చెప్పేరు సార్‌' సిగ్గుపడుతూ చెప్పింది సత్తమ్మ. 'సొ నైస్‌ ఆఫ్‌ యూ ధరణి గారూ ఇలా మీలా సిన్సియర్‌గా పాఠాలు చెప్పే వాళ్ళు ఇంకా ఎక్కడో అక్కడ ఉండబట్టే మన ఉపాధ్యాయ విద్యార్థులు నాణ్యంగా తయారువుతున్నారు. అందరూ మీలాగా సిన్సియర్‌గా చెప్తే మనం మంచి ఉపాధ్యాయులను అందించగలుగుతాం. 'ఐ కంగ్రాట్యులేట్‌ యూ' మనస్ఫూర్తిగా అన్నారు మాస్టారు. మా వెంకట్రావు మాస్టారు నుంచి అభినందన అంటే అవార్డ్‌గా భావిస్తాం మా టీచర్‌ ఎడ్యుకేటర్స్‌ అందరం. ఆ అమ్మాయి చెప్పిన పాఠం బట్టీ నన్ను అంచనా వేసి మెచ్చుకున్న మాస్టారిని చూస్తే నాకు ఆనందంతో మనసు నిండిపోయింది. మిగిలిన వారి పాఠాలను ఎలాగో గబ గబ చెప్పించేశాను అనుకోండి. మా సత్తమ్మ లాంటి వారి పాఠాలు విన్న మాస్టారు రిలాక్స్‌ అవుతుంటే కాస్త చెప్పలేని వాళ్ళు మా కొండ, ఇంకా మరి కొందరిచేత గబుక్కున పూర్తి చేసేసి హమ్మయ్య ఈ బ్యాచ్‌ దాటేసినట్టే అని ఊపిరి పీల్చుకున్నాను. నాకు వీళ్ల మీద నమ్మకం ఎక్కువ.. భవిష్యత్తులో మంచి టీచర్లు అవుతారని. ఒక్క అవకాశం ఇచ్చాం అంతే..! నా దేశాన్ని, భావితరాలను దిద్ది తీర్చే మంచి ఉపాధ్యాయులు, వారిని వారు దిద్దుకుని మంచి సంకల్పంతో.. వెనక్కి జారపడ్డాను కుర్చీలో.


Sunday, August 20, 2023

ఉపాధ్యాయుడు స్పందించాడు

ఉపాధ్యాయుడు స్పందించాడు,
ప్రాణాలు కాపాడాడు...
-----------------



పాఠశాల ప్రారంభమయ్యే సమయానికంటే అరగంట ముందే కంగారుగా వచ్చాడు తన తరగతి గది వద్దకు.....
ఎనిమిదవ తరగతి చదివే హరికృష్ణ...

కారణం...
ముందు రోజు తన బూట్లు అక్కడే గది బయట వదిలి మరచిపోయి ఇంటికి వెళ్లిపోయాడు.

ఆ బూట్లు పోతే ఇంకోజత కొనలేని నిరుపేద కుటుంబం తనది. అందుకే అంత ఆత్రంగా వచ్చాడు. అవి అక్కడే ఉండడంతో ఆనందంగా వేసుకోవాలని కాలు దానిలో పెట్టాడు.

అప్పటికే అందులో ఒక నాగుపాము దూరి బూటు లో పడుకొని ఉంది. కాలు తనమీద పడగానే దానికి పారిపోయే అవకాశం లేక ప్రాణభయంతో కసితీరా కాటేసింది. ఎంత కసితో వేసిందంటే పాదం మీద కండ బయటకు వచ్చేలా.. హరికృష్ణ ఆ నొప్పికి తట్టుకోలేక గట్టిగా అమ్మా అని అరిచి బూటు ను విదిల్చాడు.

సరిగ్గా అప్పుడే పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు బాషా గారు తన బైక్ లో పాఠశాల లోనికి ప్రవేశించాడు. హరికృష్ణ అరుపు విని బైక్ అక్కడే పడేసి పరుగున వచ్చాడు దగ్గరకు. నాగుపాము బూటు దగ్గరనుండి వెళ్ళడం గమనించి దానిని చంపేశాడు.. కాలు చూడగానే అర్థమైంది ఆయనకు పాము కాటేసింది అని. అందులోనూ విషపురుగు. ఆలస్యం చేస్తే ప్రాణం పోతుంది.

చుట్టూ చూశాడు..
ఇద్దరు విద్యార్థులు అప్పుడే లోపలకు వస్తున్నారు. వారిలో ఒకరిని రమ్మని తాను బైక్ స్టార్ట్ చేసి హరికృష్ణ ను కూర్చోమని ఆ తర్వాత ఇంకో పిల్లాడిని కూర్చోమన్నాడు. ఇంకో విద్యార్థికి హరికృష్ణ తల్లిదండ్రులకు విషయం తెలుపమని చెప్పాడు. 

క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇద్దరు విద్యార్థులను వెనకాల కూర్చొబెట్టుకొని బైకు ను ముందుకు దూకించాడు బాషా సర్.

పాఠశాల ఉన్నది చిన్న గ్రామమైన నగరూరు. హాస్పిటల్ ఉన్నది అక్కడకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడిపత్రి పట్టణంలో... అందులోనూ మూడు కిలోమీటర్లు రోడ్ సరిగాలేదు. నిమిషాల్లో హాస్పిటల్ కు చేరాలి. కాటు బాగా లోతుగా పడింది కాబట్టి విషప్రభావం వేగంగా ఉంటుందని అర్థమైంది. 

వెనక కూర్చున్న అబ్బాయికి తన మొబైల్ ఇచ్చి విద్యార్థులను కన్నబిడ్డలలా చూసుకునే  గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు Sana Sreenivasulu  గారికి కాల్ చేసి విషయం తెలుపమని చెప్పాడు. హరికృష్ణకు ధైర్యం చెపుతూనే బైక్ వంద కిలోమీటర్ల వేగంతో నడిపి పదిహేను నిమిషాల్లో తాడిపత్రి ఆసుపత్రికి చేరుకున్నాడు. అప్పటికే శ్రీనివాసులు సారు తెలిసిన వారిద్వారా హాస్పిటల్ సిబ్బందికి సమాచారం ఇవ్వడం వలన వారు అప్రమత్తమై విద్యార్థికి వైద్యం అందించి ప్రమాదం నుంచి కాపాడారు.

కొన్ని నిమిషాలు ఆలస్యమైనా ప్రాణం పోయేదని బాషా సర్ సమయస్ఫూర్తిని, సాహసాన్ని కొనియాడారు వైద్య సిబ్బంది. కొద్దిసేపటికి అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు, సహచర ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకుని బాషా సర్ ను అభినందించారు.

15.08.2023 స్వతంత్ర దినోత్సవ సందర్భంగా పాఠశాల సిబ్బంది నన్ను అతిథిగా పిలవడంతో నాకు విషయం తెలిసింది. వెంటనే  శ్రీనివాసులు సర్ సహకారంతో బాషా సర్ ను సన్మానించడం జరిగింది. ధైర్యానికి ప్రతీక అయిన స్వామి వివేకానంద చిత్రపటాన్ని బహూకరించాము.

స్వాతంత్ర్యాన్ని తెచ్చిన వీరులను మనం చూడలేదు కానీ చరిత్ర ద్వారా తెలుసుకొని అభినందిస్తున్నాము.సమయస్ఫూర్తి తో  విద్యార్థికి ప్రాణం పోసిన బాషా సర్ కూడా వీరుడే అని విద్యార్థులకు వివరించాను.

ఉపాధ్యాయుడు...విద్య మాత్రమే కాదు, విలువలు కూడా నేర్పాలి అని ప్రాక్టికల్ గా చూపించారు.

బాషా సర్.... 🙏

ఉపాధ్యాయుల గురించి నీచంగా, నిర్లక్ష్యంగా ఊహించుకుంటున్న ఈ సమయంలో ఇలాంటి వారు కూడా ఉన్నారని తెలియజేయాలనే తలంపుతో ఈ పోస్ట్ పెట్టాను. 
షేర్ చేసి పదిమందికి తెలుపగలరు. 

✍️....

👍👍👍👏👏👏👏

Tuesday, August 15, 2023

ఇలాంటి అధికారులు ఎంతమంది ఉన్నారు?

 #ఇలాంటి #అధికారులు ఎంతమంది ఉన్నారు?



తిరుపతి లోని *స్విమ్స్* ఆసుపత్రి  మెడికల్ సూపరింటెండెంట్ ఛాంబర్ లోకి మీరు వెళ్తే టేబుల్ మీద కనిపించే దృశ్యం ఇది...

కానీ చాలామంది అధికారులు లెక్కకు మించి

అహంకారం చూపిస్తుంటారు..


వయస్సు 40 ఏళ్ళ లోపే ఉన్న చాలామంది

Ias, ips,irs అధికారులు ఇంకా బ్రిటిష్ కాలపు

నాటి బుద్ధులు పోనిచ్చుకోవడం లేదు..

మీరు ప్రజాలకోసమే పనిచెయ్యాలి అంతేగాని

మీ దర్పం అహంకారం మీ ఇంట్లో చుపించుకోండి

కనీసం వయస్సులో పెద్దవారినైనా కూర్చోపెట్టి

మాట్లాడే సంస్కారం నేర్చుకోండి


" *మీరు* *కూర్చున్నందుకు* *ధన్యవాదాలు* ... *ఇది* *మీ* *హక్కు* " అని ఇంగ్లీషులో టేబుల్ పై ఓ బోర్డు మనకు కనిపిస్తుంది... #కూర్చున్నందుకు ధన్యవాదాలు ఇది మీ #హక్కు అని ఎంత మంది అధికారులు చెప్పగలరు... చాలా కార్యాలయాల్లో 20 30 కుర్చీలు ఉన్నా కూర్చోమనడానికి అధికారులకు మనసొప్పదు... పేదవాళ్ళని నిలబెట్టి మాట్లాడటం... మహిళలను నిలబెట్టి మాట్లాడటం... తన కిందిస్థాయి వారిని నిలబెట్టి మాట్లాడటం ... తన హక్కులాగా భావిస్తూ ఉంటారు చాలామంది... వీటికతీతంగా డాక్టర్ రామ్ గారు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ మనకు కనిపిస్తారు ... అన్ని కార్యాలయాల్లో ఇలాంటి వాతావరణం రావడానికి అధికారులు ప్రయత్నించాలి...

Saturday, August 12, 2023

జండా ప్రవరతనా నియమావళి-2002

 భారత జాతీయ జండా ప్రవరతనా నియమావళి - 2002 (Flag Code of India) 

ముఖ్య లక్షణాలు

 భారత జాతీయ జండా భారత దేశ ప్రజల ఆశలను, ఆక ంక్షలను సూచిసుత ంది. ఇది 

మన జాతీయ ఆతమగౌరవ నికి ప్రతీక. స రవజనీన అభిమానం, గౌరవం మరియు

విధేయత కలిగిఉంది. ఇది భారత ప్రజల మనసుులలో భావోదేవగ లతో కూడిన ఒక 

ప్రతేయక స ా నానిి ఆకరమంచి ఉంది.

 జాతీయ గౌరవభంగ నిరోధక చట్టం-1971 మరియు భారత జాతీయ జండా ప్రవరతనా 

నియమావళికి లోబడి భారత జాతీయ జండాను ఎగురవేయుట్, ఉప్యోగించుట్ 

మరియు ప్రదరిశంచుట్ జరుగుత ంది. భారత జాతీయ జండా ప్రవరతనా నియమావళి

జనవరి 26, 2002 నుండి అమలులోకి వచిచంది. స మానయ ప్రజల అవగ హన కొరకు 

భారత జాతీయ జండా ప్రవరతనా నియమావళి- 2002 యొకక ముఖ్య లక్షణాలు కిరంది 

విధంగ ఇవవబడాా యి.

 భారత జాతీయ జండా ప్రవరతనా నియమావళి- 2002 ని డిస ంబర్-30, 2021 

నాట్ి ఆదేశ ల ప్రక రం సవరించడం జరిగింది మరియు ప లిసటర్ లేదా మషన్ తో 

తయారు చేయబడా జండా అనుమతంచబడింది. జాతీయ జండాను చేతతో వడకిన 

లేదా చేతతో నేసిన లేదా మెషినుతో ప్తత/ప లిసటర్/ఉనిి/సిల్కక/ఖ్ాదీ తో 

తయారు చేయాలి.

 ప్బ్లి క్ లేదా ప్రయివేట్ు సంసా లేదా విదాయ సంసాల సభుయడు జాతీయ జండా 

గౌరవ నికి భంగం కలుగకుండా అనిి రోజులు, అనిి సందర ాలలోనూ 

ఎగురవేయవచుచను.

 భారత జాతీయ జండా ప్రవరతనా నియమావళి లోని ప ర్ట-II, పేర 2.2 యొకక (ix) 

నిబంధననిబంధనను జూల ై-19, 2022 ఆదేశ ల ప్రక రం భారత జాతీయ జండా 

ప్రవరతనా నియమావళి- 2002 ని కిరంది విధంగ సవరించడం జరిగింది.

(ix) ప్రజలు తమ ఇంట్ిప ై గ నీ ఆరుబయట్ గ నీ జండాను 

ప్రదరిశంచునప్ుడు ర డిర మరియు ప్గట్ిప్ూట్ ఎగురవేయవచుచను.

 భారత జాతీయ జండా ప్రవరతనా నియమావళి లోని పేర 1.3 మరియు 1.4 ప్రక రం 

జాతీయ జండా దీరఘ చత రస ర క రంలో ఉండాలి మరియు ఏ ప్రిమాణంలోన ైనా 

ఉండవచుచ క నీ పొ డవు వ డలుులు 3:2 నిషుతతలో ఉండాలి.

 జాతీయ జండాను బహిరంగ ప్రదేశ లలో వ తావరణ ప్రిసిాత లతో సంబంధం 

లేకుండా వీలయినంతవరకు సూరోయదయం నుండి సూర యసతమయం వరకు 

మాతరమే ఎగురవేయాలి.

 జాతీయ జండాను ప్రదరిశంచినప్ుడ అది ఎప్ుుడూ గౌరవ స ా నంలో(ఎత్తతన)

ఉండాలి విసుషటంగ ఉండాలి.

 నలిగిన లేదా చిరిగిన జండాను ఎగురవేయర దు, ప్రదరిశంచర దు


జాతీయ జండాను ఏ ఇతర జండా లేదా జండాలతో కలిపి ఏక క లంలో ఒకే వేదిక 

మీద ఎగురవేయర దు.

 భారత జాతీయ జండా ప్రవరతనా నియమావళి లోని ప ర్ట-III, స క్షన్ IX లో పేరకకని 

విధంగ జాతీయ జండాను భారత ర షటరప్త, ఉప్ ర షటరప్త, ప్రధానమంతర, గవరిర్ 

మొదల ైన ప్రముఖ్ులు తప్ు మరే ఇతర వ హనాలప ై జాతీయ జండాను 

ఎగురవేయర దు.

 జాతీయ ప్తాకం కంట్ే ఎత త గ లేదా ప ైన లేదా ప్కకప్కకన మరే ఇతర జండాల 

వేదికలు ఉండర దు.

 జాతీయ జండాను తలకిందులుగ అంట్ే క ష యరంగు కిందికి వచేచ విధంగ 

ఎగురవేయర దు. ఎవర ైనా వయకిత లేదా వసుత వుకు స లూయట్ చేసూత అవనతం 

చేయర దు. ఎదురవేయబడిన జాతీయ జండాప ై ప్ూలు, ప్ూలదండలు ఉంచర దు.

 జాతీయ జండాను తోరణం లాగ , ప్ూలదండ లాగ లేదా అలంకరణ వసుత వు లాగ 

ఇతర ఏ ప్దదతలోనూ ఉప్యోగించర దు. జాతీయ జండాను నేలప ైలేదా క లిబాట్ 

ప ై ప్రచర దు.

 జాతీయ జండాను పో డియంను లేదా వేదికను కప్ుడానికి వీలులేదు, ఎవవరూ 

కూడా నడుము కింది భాగప్ు దుసుత లుగ ఉప్యోగించర దు. కుషనుి, చేత 

రుమాళ్ళు, నేప్ కినుి, లో దుసుత లు మరియు డేరస్ మెట్ీరియల్క ప ై ముదిరంచర దు, 

ఎంబార యిడరీ చేయర దు.

 జాతీయ జండాను ప్రయివేట్ వయకుత ల అంతయకిరయలలో ఉప్యోగించర దు, జాతీయ 

జండాప ై అక్షర లు ముదిరంచర దు. వసుత వులను చుట్టడానికి, సవవకరించడానికి, 

ప్ంపిణీకి ఉప్యోగించర దు. వ హనాలప ై కప్ుర దు.

 జాతీయ జండాను అడాంగ ఎగురవేయునప్ుడు క ష యరంగు ప ై భాగంలో 

ఉండాలి. నిలువుగ ఎగురవేయునప్ుడు క ష యరంగు ఎగురవేసే వయకితకి ఎడమ 

వ ైప్ున ఉండాలి. జండాను ఎగురవేయునప్ుడు చురుకుగ ప ైకి లేపి దింప్ునప్ుడు 

న మమదిగ దింప లి.

 భారత ప్రభుతవం సూచించినప్ుడు తప్ు జాతీయ జండాను జండా సతంభం సగం 

ఎత త లో ఉంచర దు ఎలిప్ుడూ జండాను సతంభం ప ై భాగంలోనే ఉంచాలి.

 భారత జాతీయ జండా ప్రవరతనా నియమావళి2002 లోని పేర 3.44 ప్రక రం కిరంద 

కనప్రచిన ప్రతేయక వయకుత లకు మాతరమే తమ క రిప ై జాతీయ జండాను ఎగురవేసే 

ప్రతేయక హకుకను ప్రిమతం చేయబడింది. ర షటరప్త, ఉప్ర షటరప్త, గవరిరుి, 

ల ఫ్ిటన ంట్ గవరిరుి, ప్రధానమంతర, కేందరకేబ్లన ట్ మంత ర లు, సహాయమంత ర లు, 

ర షటర లేదా కేందరప లిత ప ర ంతాల ముఖ్యమంత ర లు, కేబ్లన ట్ మంత ర లు, లోక్ సభ,


 జయసభ, ర ష టర ల శ సనసభ, విధానసభల సవుకరుి, డిప్ూయట్ి సవుకరుి, ర షటర 

మరియు కేందరప లిత ప ర ంతాలోి ని ఎమెమలేయలు, సుపవరం కోరుట, హ ైకోరుట ప్రధాన 

నాయయమూరుత లు, నాయయమూరుత లు తమ క రిప ై జాతీయ జండావు 

ఉంచుకోవచుచ.

 భారత జాతీయ జండా ప్రవరతనా నియమావళి2002 లోని పేర 3.32 ప్రక రం 

జాతీయ జండాను ఇతర దేశ ల జాతీయ జండాలతో కలిపి ఎగురవేసే 

సందర్భాలలో, మిగిలిన జండాలను ఆంగి వరణమాల లోని అక్షర కరమంలో ఉంచాలి 

భారత జాతీయ జండాను వరుసలో కుడివైపున ఉంచాలి. జండాల వేదికలు సమాన ఎత్తు లో ఉండాలి.

 భారత జాతీయ జండా ప్రవర్తనా నియమావళి-2002 లోని పేర 2.22 ప్రకారం

జండా ప తబడి ప డ్ైపో యి ఉంట్ే జాతీయ జండా గౌరవ నికి భంగం కలగని  విధంగా దానిని తగులబెట్టడం కానీ, మరేదైనా ప్దదతిలో పూర్తిగా నాశనం చేయాలి.

సామాన్య ప్రజలకోసం తయారు చేయబడ్డ కాగితపు జండాలను ఎక్కడపడితే అక్కడ పడవేయకుండా ఓ ప్దదతి ప్రకారం పూర్తిగా నాశనం చేసేయాలి.

రాత్రి పడుకునే ముందు 2 లవంగాలు తింటే

 రాత్రి పడుకునే ముందు 2 లవంగాలు తింటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా ?


వంగాలను మనం రెగ్యులర్ గా ఉపయోగిస్తూ ఉంటాం. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలకు పరిష్కారంగా సహాయపడతాయి. మనలో చాలా మంది ఇంటి చిట్కాలలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. లవంగాలను మసాలా దినుసులలో రారాజు గా పిలుస్తారు.

మసాలా వంటలకు లవంగాలను వాడుతూ ఉంటాం. అయితే మనలో చాలామందికి లవంగాలలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియదు. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. లవంగాలలో విటమిన్ సి, ఫైబర్, మాంగనీస్, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి.

లవంగాల నీటిని తీసుకోవచ్చు లేదా రెండు లవంగాలను బుగ్గన పెట్టుకుని నమిలి రసాన్ని మింగవచ్చు. లవంగాల నీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లవంగాలను వేయించి పొడి చేసుకొని నిలువ చేసుకోవాలి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు పొడి కలిపి తాగాలి.రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలను నమలాలి.

లేదంటే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో రెండు లవంగాలు నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగాలి. లవంగాలను ఎలా తీసుకున్నా సరే వాటిలో ఉన్న ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. ముఖ్యంగా చలికాలంలో లవంగం తీసుకోవటం వలన జీర్ణక్రియను మెరుగు పరచుటమే కాకుండా అధిక బరువు సమస్య తగ్గటానికి సహాయపడుతుంది.

జీవక్రియను వేగవంతం చేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దంత సమస్యలను తగ్గిస్తుంది. దంత సమస్యలు ఉన్నప్పుడూ పంటి కింద లవంగం మొగ్గను పెట్టుకుంటే సరిపోతుంది. డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి వాపులు తగ్గించడంలో సహాయపడుతుంది.

గోర్లను ఈ రోజులలో మాత్రమే కత్తిరించడం

 గోర్లను ఈ రోజులలో మాత్రమే కత్తిరించడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయా.

వైద్యశాస్త్రం ప్రకారం గొర్లు మరణించిన కణాలతో తయారవుతాయి. కానీ అవి మన చేతులు మరియు కాళ్ల అందాన్ని పెంచుతాయి. అదే సమయంలో మత గ్రంధాలలో గోర్లు మరియు జుట్టు గురించి చాలా ముఖ్యమైన విషయాలు వెల్లడించారు.

గోర్లు కత్తిరించే విషయంలో చాలా నియమాలు ఉన్నాయి. ఈ నియమాలను పాటించడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ రోజు జ్యోతిష్యం ప్రకారం గోర్లు కత్తిరించడానికి సంబంధించిన ఆ నియమాల గురించి తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జుట్టు మరియు గోర్లు శనికి సంబంధించినవి గోర్లు మరియు వెంట్రుకలు శుభ్రంగా ఉంచుకోకపోతే శని దేవుడికి కోపం వచ్చి ఆ శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు.

దీనివల్ల జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే గోర్లు పరిశుభ్రత, గోర్లు కత్తిరించే రోజు, సమయం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.లేదంటే ఆ వ్యక్తి పేదరికంలో పడవలసి ఉంటుంది.గోర్లు కత్తిరించే విషయంలో మంగళ, గురు, శనివారాల్లో ఎప్పుడూ గోర్లను కత్తిరించకూడదని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది. ఇలా చేయడం వల్ల కుజుడు, గురు, శని గ్రహాలు అశుభ ఫలితాలను ఇవ్వడం మొదలుపెడతాయి. బలహీనమైన కుజుడు వివాహం, సంపద మరియు ధైర్యం లేకపోవడం వంటి సమస్యలను కలిగిస్తాడు.

మరొకవైపు గురువారం గోర్లు కత్తిరించుకోవడం దురదృష్టాన్ని ఆహ్వానం పలికినట్లే అవుతుంది. శనివారం రోజు గోర్లు కత్తిరించడం వల్ల శని గ్రహానికి కోపం వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ధన నష్టం కలిగి పేదరికం వస్తుంది. అంతేకాకుండా అమావాస్య తిథిలలో గోర్లను కత్తిరించడం నిషేధించారు. చతుర్దశి మరియు అమావాస్య రోజున గోర్లు లేదా జుట్టు కత్తిరించడం వలన అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. సూర్యాస్తమయం తర్వాత గోర్లు కత్తిరించడం వలన మనిషి పేదవాడు అవుతాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమ, బుధ,శుక్ర, ఆదివారాలలో గోర్లను కత్తిరించుకోవడం మంచిది. ఇంకా చెప్పాలంటే గోర్లను ఎప్పటికీ పగటిపూట మాత్రమే కత్తిరించుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల పేదరికం దూరమైపోయి ఆ వ్యక్తికి ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు.



Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE