NaReN

NaReN

Saturday, August 12, 2023

గోర్లను ఈ రోజులలో మాత్రమే కత్తిరించడం

 గోర్లను ఈ రోజులలో మాత్రమే కత్తిరించడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయా.

వైద్యశాస్త్రం ప్రకారం గొర్లు మరణించిన కణాలతో తయారవుతాయి. కానీ అవి మన చేతులు మరియు కాళ్ల అందాన్ని పెంచుతాయి. అదే సమయంలో మత గ్రంధాలలో గోర్లు మరియు జుట్టు గురించి చాలా ముఖ్యమైన విషయాలు వెల్లడించారు.

గోర్లు కత్తిరించే విషయంలో చాలా నియమాలు ఉన్నాయి. ఈ నియమాలను పాటించడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ రోజు జ్యోతిష్యం ప్రకారం గోర్లు కత్తిరించడానికి సంబంధించిన ఆ నియమాల గురించి తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జుట్టు మరియు గోర్లు శనికి సంబంధించినవి గోర్లు మరియు వెంట్రుకలు శుభ్రంగా ఉంచుకోకపోతే శని దేవుడికి కోపం వచ్చి ఆ శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు.

దీనివల్ల జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే గోర్లు పరిశుభ్రత, గోర్లు కత్తిరించే రోజు, సమయం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.లేదంటే ఆ వ్యక్తి పేదరికంలో పడవలసి ఉంటుంది.గోర్లు కత్తిరించే విషయంలో మంగళ, గురు, శనివారాల్లో ఎప్పుడూ గోర్లను కత్తిరించకూడదని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది. ఇలా చేయడం వల్ల కుజుడు, గురు, శని గ్రహాలు అశుభ ఫలితాలను ఇవ్వడం మొదలుపెడతాయి. బలహీనమైన కుజుడు వివాహం, సంపద మరియు ధైర్యం లేకపోవడం వంటి సమస్యలను కలిగిస్తాడు.

మరొకవైపు గురువారం గోర్లు కత్తిరించుకోవడం దురదృష్టాన్ని ఆహ్వానం పలికినట్లే అవుతుంది. శనివారం రోజు గోర్లు కత్తిరించడం వల్ల శని గ్రహానికి కోపం వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ధన నష్టం కలిగి పేదరికం వస్తుంది. అంతేకాకుండా అమావాస్య తిథిలలో గోర్లను కత్తిరించడం నిషేధించారు. చతుర్దశి మరియు అమావాస్య రోజున గోర్లు లేదా జుట్టు కత్తిరించడం వలన అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. సూర్యాస్తమయం తర్వాత గోర్లు కత్తిరించడం వలన మనిషి పేదవాడు అవుతాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమ, బుధ,శుక్ర, ఆదివారాలలో గోర్లను కత్తిరించుకోవడం మంచిది. ఇంకా చెప్పాలంటే గోర్లను ఎప్పటికీ పగటిపూట మాత్రమే కత్తిరించుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల పేదరికం దూరమైపోయి ఆ వ్యక్తికి ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు.



No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE