NaReN

NaReN

Monday, June 3, 2024

పిల్లల్ని ప్రేమించలేనివారిని టీచర్లని ఎలా అంటాం..?

 *_పిల్లల్ని ప్రేమించలేనివారిని టీచర్లని ఎలా అంటాం..?_*

_(వివక్షతను మించిన విషం ఉంటుందా!!?)_

*=================*

_|మనసును కదిలించే కథ... చదవండి! 🙏|_



*కరీంనగర్ దగ్గరలోని ఓ కుగ్రామంలోని స్కూల్ లో గవర్నమెంట్ టీచర్ గా నాకు పోస్టింగ్ రావడం నాకిష్టం లేదు. అయినా తప్పదు కాబట్టి ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. ఇదే కాకుండా, పక్కనే ఉన్న ఇటుకబట్టీల్లో పనిచేసే వాళ్ళ పిల్లల్ని కూడా మా school కే పంపడం. ఇంకా ఇంకా నాకస్సలు నచ్చేది కాదు. అసలే నాకు ఈ ఊళ్లంటేనే పడదు. అలాంటిది మళ్లీ ఈ ఊరమాస్ పిల్లలకు చదువు చెప్పాలి.  "దేవుడా ! ఏంటీ పరీక్ష" అని రోజూ చిరాకుతో కూడిన చిర్రబుర్రులతోనే బడికి వెళ్లేదాన్ని.* 


*అందులో ఒక్కణ్ణి చూస్తే నాకు అస్సలు నచ్చేది కాదు. నాకెప్పుడు వాణ్ని చూసినా కోపంగా అనిపించేది. వాడి పేరు సాంబడు. 9 ఏళ్ళుంటాయి. వాడు మూడో తరగతి చదువుతున్నాడు. సరైన బట్టలు వేసుకోడు. ఎప్పుడు చూసినా చిరిగిన చొక్కాలు వేసుకొనేవాడు. ఆరాతీస్తే, వీడి తల్లిదండ్రులు ఇటుకల బట్టీల్లో పని చేస్తారని తెలిసింది. మొదట మధ్యాహ్నం అన్నం కోసం బడికి పంపించేవారు. ఇప్పుడు వాడు బాగా చదువుకుంటాడని,  పంపిస్తూన్నా రనిపించింది.*


*నా దృష్టిలో అయితే వాడు చాలా poor student. ఏమీ గుర్తుండవు. సరిగ్గా ఎక్కాలు అప్ప చెప్పమన్నా కూడా వాడికి 5 కి మించి రావు. పైగా వాడి నలుపు రూపు చూస్తేనే అసహ్యంగా అనిపించి అస్సలు వాడి వైపు చూడ్డం  కానీ, మాట్లాడటం కానీ అస్సలు చేసేదాన్ని కాదు.* 


*అలాంటోడు కొన్ని రోజులుగా school  ki రావడమే మానేశాడు.  ఇలాంటి places లో school  ki రావడం, మానేయడం వీళ్ళకు మామూలే కదా! అని నేను కూడా అంతగా పట్టించుకోలేదు...* 


*ఒకరోజు హెడ్మాస్టర్ గారు రమ్మంటే ఆయన రూమ్ కి వెళ్లాను. ఆయన రూమ్ లో ఆయనకెదురుగా ముప్పై ఏళ్ళున్న ఒక labour  ఆవిడ చేతులు కట్టుకుని నిల్చుని ఉంది.* 


*ఆవిణ్ణి నాకు పరిచయం చేస్తూ.. _"ఈవిడ మన సాంబడి తల్లి. దురదృష్టవశాత్తు సాంబడు పదిరోజుల కిందటే విషజ్వరంతో చనిపోయాడంట. వాళ్ళమ్మ మీతో మాట్లాడాలని వచ్చింది madam ఒక్కసారి మాట్లాడండీ"_ అన్నారు హెడ్మాస్టర్.*


*వాళ్ళమ్మ నా వైపు తిరిగి కళ్లెంబడి నీళ్లతో కుప్పకూలి, మేడమ్..! వాడు పోయే ముందు ఎప్పుడూ... _"నళిని  మేడమ్ తో ఒక్కసారన్నా good  అనిపించుకోవాలి అమ్మా"_ అని నాతో రోజూ చెప్పేవాడు.* 


*వాడు చనిపోయే ముందురోజు కూడా మీ గురించే మాట్లాడాడమ్మా...! వాడు తనకు తానే _" సాంబడు good"_  అని పుస్తకంలో రాసుకొని మీ లాగే సంతకం చేసుకున్నాడు,"  అని తాను తెచ్చుకున్న సంచిలోనుండి పుస్తకం తెరిచి వాడి చిన్ని చిన్ని రాతలతో నా పేరు చూపించింది వాళ్ళ మ్మ... నాకళ్ళ నుండి ఒక్కొక్కటిగా రాలుతున్న నీటిబొట్లతో వాడు పెట్టిన నా.. నా.. సంతకం తడిసి, పేజీ ముద్దగా అవుతోంది. నాకు దుఃఖం ఆగడంలేదు.*


 *వాడు బతికుండగా ఒక్కసారి కూడా వాణ్ని మెచ్చుకోలుగా చూడలేదు. అసలు మనిషిగా కూడా చూళ్ళేదు వాణ్ని.* 

*పాపం పిల్లాడు ఎంతగా ఆరాటపడ్డాడో!  _"తండ్రీ ఎక్కడున్నా నన్ను క్షమించు... జాతి, వర్ణ, ఆర్ధిక బేధాలతో.. వివక్షలతో  చిన్నారులను చిన్న చూపు చూసే నాతో పాటు నాలాంటి ఎందరో బుద్ధిలేని పెద్దమనుషులను కూడా క్షమించరా"😌_ అని మనసులోనే వెక్కి వెక్కి ఏడుస్తూ...* 

*_“సాంబడు  is Very Good”  నాలాంటి ఎందరో కళ్లు  తెరిపించావు తండ్రీ!_ అని అదే బుక్ లో రాసి ఆ గదిలోనే ఉన్న bench మీద కూర్చుని హెడ్మాస్టర్  గారి వెనుక ఉన్న అంబేద్కర్ గారి ఫోటోని చూసి _"తప్పు  చేశాను సార్!  🙏ఇక మీదట ఇలా జరగదు"_ అని నాకు నేను మనస్సులోనే ప్రమాణం చేసుకున్నాను.*  😌

*_దయచేసి పిల్లలని ప్రేమించండి.🙏_* 

_మీ...._ 

_—టీచర్_—

*:-:-:

ఈ కథ మీ మనసును కదిలిస్తుంది.. కళ్ళు చెమ్మగిల్లడం కాయం. 

అందరూ చదవాల్సింన కథ.. 

ముఖ్యంగా టీచర్లు చదవాల్సిన కథ

అందరికీ షేర్ చేయండి

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE