NaReN

NaReN

Sunday, June 30, 2024

హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే ముందు

 😭🙏::_*జాగ్రత్త. జాగ్రత్త. జాగ్రత్త.*_


*హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే ముందు పది సార్లు ఆలోచించండి.*


మిత్రులారా, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆశిస్తూ ఆరోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్ లో అడ్మిట్ కావద్దు.


ఔట్ పేషెంట్ గా బయట క్లినిక్స్ లో ఇద్దరు,ముగ్గురు డాక్టర్స్ ఒపీనియన్ తీసుకోండి. తప్పులేదు. అంతే గానీ ఎట్టిపరిస్థితుల్లో తొందర పడి, వైద్యులు పెట్టె భయాలకు లొంగీ ICU, IP గా జాయిన్ కావద్దు.


👤చాలా మంది  కమర్షియల్ అయిపోయారు. హాస్పిటల్స్ లో జరిగే విషయాలు చాలా భయంకరంగా ఉంటాయి. పైన ఉన్నంత అందమైనది కాదు.


 మేనేజ్మెంట్ పెట్టె టార్గెట్స్ రీచ్ కావడానికి నానా అబద్ధాలు అడాల్సి వస్తుంది అందులో పని చేసే డాక్టర్స్.


డాక్టర్స్ అంటే మనందరికీ దేవుళ్ళు అనే అభిప్రాయం ఉంటుంది.అది డెబ్బై శాతం అబద్దం. ముప్పై శాతమే నిజం.


SP బాల సుబ్రహ్మణ్యం చనిపోవడానికి ప్రధాన కారణం హాస్పిటల్లో రెండు నెలలు ICU లో ఉండటమే.


😌ఆయన తనకు వచ్చిన కరోనా ఇంట్లో వారికి ఎక్కడ వస్తుందో అనీ ముందు జాగ్రత్త గా టైం పాస్ కు ఎంజీఎం హాస్పిటల్ లోకి పోయాడు. అదేదో హోటల్ అనుకున్నాడు. అటు నుండి అటే అనే తెలుసుకోలేక పోయాడు.రెండు కోట్లు  బిల్లు వసూలు చేశారు. శవాన్ని ఇచ్చారు.


దాసరి నారాయణ రావు, జయలలిత....ఇలా చాలా మంది చావుకు   రోగం కారణం కాదు. నెలల తరబడి ఓకే మంచం మీద పడుకోబెట్టి,టీవీ పెట్టీ, ఏసీ పెట్టీ, భయంకరమైన ఆంటీ బయోటిక్స్ ఇచ్చి, అది చేసి ఇదీ చేసి శరీరాన్ని సర్వ నాశనం చేస్తారు.


 తమను బాగా చూసుకుంటారని, ఏమీ కాదని, ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత చక్కటి వైద్యులు ఉన్నారు కదా అని అనుకుంటారు పేరు,డబ్బు ఉన్నవారు. వైద్యమును చాలా మిస్టరీ గా చేశారు అందరూ కలిసి. ఎంత డబ్బు పెడితే అంత బాగా అయిపోతామని జనాలకు నమ్మకం. అది తప్పు.


అసలు అన్నీ రోజులు హాస్పిటల్ మంచానికే అంటుకొని పోయి  కదలక మెదలక బాడీ ఉంటే ఏమవుతుంది? 


ఉన్న రోగం చిన్నది. రోజుల తరబడి ఉండడం వల్ల కొత్త రోగాలు పుట్టుకొచ్చి బాడీ పూర్తిగా క్షీణించి పోదా??


అదే జరిగింది మహానుభావుడు మన ఎస్పీ బాలు విషయంలో. ఇంకో పది ఏండ్లు బ్రతికే అవకాశం ఉన్న మనిషి ఆయన.


అందుకే మిత్రులారా హాస్పిటల్... అది ఎలాంటి దైనా ఔట్ పేషెంట్ గా సేవలు పొందండి. సెకండ్ opinion తీసుకోండి. ఊరకే జొరబడ వద్దు. *సహజంగా మన శరీరంలో వైద్య పరంగా ఓ..యంత్రాంగం వుంటుంది. నిద్రావస్తలో వున్నప్పుడు మన శరీరంలో వున్న అనారోగ్యాలను పోగొట్టి తనకు తాను సరిచేసుకుంటుంది. అందుకే మన పెద్దవాళ్ళు సమయానికి ఆహారం నిద్ర వుండాలంటారు*. ప్రతీ చిన్న విషయానికి హాస్పిటల్ చుట్టూ ప్రదక్షిణలు చేయడం..పది రూపాయల ఖర్చుతో పోయే రోగం పదిలక్షల వరకూ లాగే ప్రక్రియ మూడువంతులు జరుగుతోంది.  


పూర్వ కాలంలో వున్న ఉన్నత మైన వైద్య విధానం ఇప్పుడు కనబడటం లేదు. అత్యంత మోసపూరిత వ్యాపార విధానం అయింది. ఈ రోజు వైద్యం..! కారణం ఫ్యామిలీ డాక్టర్స్ పద్దతి పోయింది. ప్రతీ దానికీ కార్పొరేట్ హాస్పిటల్ లోకి పోవడం కరె క్టు కాదు.

కనీసం మీరైనా ఈ విషయాలను మనస్సులో పెట్టుకోండి. ఇంట్లో ఉంటే వంద ఏండ్లు బ్రతుకుతారు. హాస్పిటల్ కు పోతే రేపే ....


*జాగ్రత్త. జాగ్రత్త. జాగ్రత్త.*


*అందరికీ మంచి జరుగాలనీ కోరుకుంటూ.*

________________________________

💯% Correct ఎన్ని గ్రూప్ లకైనా షేర్ చేయొచ్చు ఇది సగటు భారతీయుని మనస్సు లోని మాట, ఆవేదన, నగ్నసత్యం మన ప్రియతమ గౌరవ రాష్ట్రపతి మరియు ప్రధాని గార్లకు చేరేవరకు భారతఫౌరుని బాధ్యత గా బావించి  షేర్ చేద్దాం మిత్రులారా.......

బయట తినేప్పుడు జాగ్రత్త

 బయట తినేప్పుడు జాగ్రత్త 

మనం ఎప్పుడూ ఒకరు తిని వదిలేసిన ఆహారాన్ని లేదా కుళ్ళిన ఆహారాన్ని తినము.!!! కానీ భారతదేశంలో ఇప్పుడు ఈ పరిస్థితే దాపురించింది!!! కొంచెం ఆలోచించండి.


కొద్ది రోజుల క్రితం మా పరిచయస్తులు మమ్మల్ని ఒక ప్రసిద్ధ రెస్టారెంట్‌కు తీసుకెళ్ళారు. నాకు సాధారణంగా బయట తినే అలవాటు లేదు, కానీ కొన్ని సార్లు సామాజిక ఒత్తిడితో అనివార్యం అవుతుంది.


ఈ రోజుల్లో పనీర్ పదార్థాలు తినడం విలాసానికి గుర్తుగా భావించబడుతోంది, కాబట్టి వారు పనీర్‌తో కొన్ని వంటకాలు ఆర్డర్ చేశారు. ప్లేట్‌లోని పనీర్ ముక్కల విభిన్న పరిమాణాలు మరియు రంగులను చూసి నాకు ఏదో తేడాగా అనిపించింది. ఆ ముక్కలు ఉద్దేశపూర్వకంగా కత్తిరించి వండినట్లు అనిపించింది. నేను వెయిటర్‌ను పిలిచి, ఆ హోటల్లో వంట వండినవాణ్ణి తీసుకురావాలని కోరాను. అతడు వచ్చినప్పుడు, నేను అడిగాను, "పనీర్ ముక్కలు ఎందుకు విభిన్న పరిమాణాలు మరియు రంగుల్లో ఉన్నాయి?" అప్పడు అతను అన్నాడు, "ఇది మా ప్రత్యేక వంటకం."


దానిపై నేను అతనికి చెప్పాను, "నేను ఇదే వంటకం మరొక ప్లేట్ ప్యాక్ చేసి ఇంటికి తీసుకెళ్ళడానికి ఆలోచిస్తున్నాను. కానీ మీ ప్రత్యేక వంటకం నా ముందే వండండి." రెస్టారెంట్ మొత్తం నా పెరిగిన స్వరంతో వణికిపోయింది... చాలామంది తమ భోజనాన్ని ఆపేసి నా వైపు చూడటం మొదలుపెట్టారు.


హోటల్ సిబ్బంది వివిధ కారణాలు చెప్పడం ప్రారంభించారు. చివరకు పోలీసుల భయంతో, వెయిటర్ అసలు కారణాన్ని తెలియజేసి తప్పును అంగీకరించాడు. కస్టమర్లు  చాలా సార్లు తమ ప్లేట్‌లలో అన్నం, కూరగాయలు, సలాడ్‌లు మరియు చపాతీలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. హోటల్ సిబ్బంది వాటిని అన్నీ పడేయడం లేదు. పెద్ద పనీర్ ముక్కలను మరియు కూరగాయలను తిరిగి మరొక వంటకంలో కలిపి వినియోగదారులకు ఇవ్వడం జరుగుతుంది.


ప్లేట్‌లలో మిగిలిన సలాడ్ కొత్త ఆర్డర్ కోసం ఉపయోగించబడుతుంది. ప్లేట్‌లలో పడేయబడిన ఎండిన చికెన్ మరియు మాంస ముక్కలను తిరిగి కర్రీలో వేసి, పైపైన అలంకరించి, వినియోగదారులకు తిరిగి వడ్డించబడుతుంది.


ఇది పెద్ద పెద్ద హోటల్‌లలో జరిగే వాస్తవం. ఇక మీదట, ఎప్పుడు హోటల్‌లో భోజనం చేయడానికి వెళ్తే, మిగిలిన భోజనం ఒక ప్లాస్టిక్ సంచిలో వేసుకుని, బయటకు వెళ్లి జంతువులకు ఆహారంగా ఇవ్వండి లేదా ఆ సంచి చెత్తబుట్టలో మీరే స్వయంగా వేయండి, లేదంటే, మీ ప్లేట్‌లోని భోజనం మరొకరి ప్లేట్లో నుంచి వచ్చిన ఎంగిలి ఆహారమై ఉండొచ్చు లేదా మీరు తినగా మిగిలిన భోజనం మరొకరికి ఆహారం కావచ్చు. జాగ్రత్త!!

----


మరో సంఘటన శ్రీకృష్ణుని జన్మస్థానం అయిన బృందావనంలో జరిగింది. బృందావనం చేరుకున్న తర్వాత, నేను నేను బృందావనాన్ని ఎంతో పవిత్రమైన భూమిగా చూస్తున్నాను. ఢిల్లీ నుండి సుదూర ప్రయాణం చేసిన తర్వాత మేము అందరమూ ఎంతో ఆకలితో ఉన్నాము. అందుకే ఒక శుభ్రంగా కనిపించే భోజనశాలలో ప్రవేశించాము. ఆర్డర్‌కు ఆలస్యం కాకుండా ఉండటానికి డిష్‌ల కంటే రెడీమేడ్ భోజన థాళిలను ఆర్డర్ చేసాము.

ఒక శుభ్రమైన ట్రే ద్వారా దాల్, కూరగాయలఅన్నం, రైతా మరియు ఒక బుట్టలో చపాతీలు తీసుకువచ్చారు.


మొదటి కొద్దిముక్కల తిన్నప్పుడు గుర్తించలేదు, కానీ తర్వాత ఏదో తేడాగా అనిపించింది. చపాతీ పుల్లగా ఉండగా, కూరగాయల రంగు విభిన్నంగా ఉంది. అన్నం రుచి కూడా అసహజంగా ఉంది. అందరం భోజనం అలాగే వదిలేసి, కౌంటర్ వద్దకి బిల్లు ఎంత అని అడిగాము, 650 రూపాయల బిల్లు ఇచ్చారు.


నేను చెప్పాను, "బాబు, నేను చెల్లిస్తాను, కానీ ఒకసారి మీ కిచెన్ చూపించండి." అతను ఉలిక్కిపడుతూ, "ఏమైంది?" అని అడిగాడు. నేను చెప్పాను, " ఒక కస్టమర్ గా, నేను భోజనం ఎలా తయారవుతున్నదో చూడటం నా హక్కు." అతను సమాధానం చెప్పే ముందే నేను కిచెన్‌లో ప్రవేశించాను.


లోపల, ఎటువంటి వంట జరగడం లేదు. కొన్ని చపాతీలు ఒక బుట్టలో ఉన్నాయి. ఫ్రిజ్ తెరిచి చూశాను, లోపల వేరే వేరే రకాలుగా వండిన కూరగాయలు ఉన్నాయ్, చాలా రకాల వండిన కూరగాయలు మూతలు లేని పాత్రలలో ఉన్నాయి మరికొన్నింటి నుంచి కుళ్ళిన వాసన వస్తుంది ఫ్రిజ్ మొత్తం దుర్వాసన కొడుతోంది, వంట చేసేవాడిని నాలుగు తిట్టిన తర్వాత అతడు అసలు నిజం చెప్పాడు. ఈ కూరగాయలు వారం రోజులుగా ఉన్నాయి. 


అతను మరొక విషయం కూడా చెప్పాడు, వండేటప్పుడు పాత కూరగాయలను, కుళ్ళిన కూరగాయలను మళ్లీ నూనెతో వేడి చేసి కొత్తిమీర టమాటాలతో అలంకరించి మళ్ళీ కొత్త వంటకం లాగ వేరే కస్టమర్లకు వడ్డిస్తాం.


చపాతి పిండిని కూడా రెండు రోజులకు ఒకసారి తయారు చేస్తాము. కరెంటు కోత కారణంగా ఫ్రిజ్ లోని ఆహార పదార్థాలు చెడిపోతాయి. ఆ చెడిన వాసనను తెలియనివ్వకుండా మరిన్ని మసాలాలు, కారము కలిపి వంట చేసి సర్వ్ చేస్తాము. పులిసిపోయిన చపాతి పిండిని నాన్ తయారీకి ఉపయోగిస్తాము.


నేను రెస్టారెంట్ యజమానితో చెప్పాను, "మీరు కూడా ఎప్పుడైనా యాత్రలు చేస్తారు, మీరు యాత్రలో ఆకలితో ఉండగా మీకు కూడా మీరు మీ కస్టమర్లకు ఇచ్చినటువంటి భోజనమే రావాలి." నా మాటలతో అతని ముఖం నల్లగా మారింది....


ఈ రోజు మనకు జరిగే ఇటువంటి ప్రమాదాలు మరియు మోసాల నుండి కేవలం మన అప్రమత్తత మాత్రమే రక్షిస్తుంది. ఎందుకంటే దేవుడు కూడా చెడ్డవారి వలయములో చిక్కుకుని ఉన్నాడు.


భారతదేశంలో సత్యం మరియు అసత్యం మధ్య తేడా క్షీణిస్తోంది. ప్రతి దుకాణం లేదా సంస్థలో ఒక మూలలో దేవాలయం ఉంటుంది. వ్యాపారి ఉదయం వచ్చినప్పుడు దేవుని విగ్రహం ముందు ధూపం, దీపం వెలిగిస్తాడు, కౌంటర్‌ని నమస్కరించి, ఆ తర్వాత తన ఆత్మను విక్రయించడం ప్రారంభిస్తాడు!!!


దేవుని వద్ద భక్తులు అడిగేటప్పుడు, వారు ప్రపంచానికి ఏమి ఇస్తున్నారో ఆలోచించరు!!!


జాగ్రత్తగా ఉండండి! అప్రమత్తంగా ఉండండి!! బయట తినడం నివారించండి. 🙏


ఇంటి ఆహారం అత్యుత్తమం.

Wednesday, June 26, 2024

చిరిగిన చొక్కా

 చిరిగిన చొక్కా


చిరిగిన పంచె చిరిగిన చొక్కా ధరించిన ఒక వ్యక్తి తన 15-16 సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్‌కు వచ్చాడు. ఇద్దరూ కుర్చీపై కూర్చోవడం చూసి, ఒక వెయిటర్ రెండు గ్లాసుల  చల్లటి నీటిని వారి ముందు పెట్టి అడిగాడు మీ కోసం ఏమి తీసుకురావాలి అని?.


ఆ వ్యక్తి ఇలా అన్నాడు....

       జిల్లాలో పదవ తరగతిలో మొదటి స్థానంలో వస్తే, నగరంలోని అతిపెద్ద హోటల్‌ దోశ తినిపిస్తాను అని  మా అమ్మాయికి వాగ్దానం చేశాను.


                   'మా అమ్మాయి అయితే తన వాగ్దానాన్ని నెరవేర్చింది. కనుక దయచేసి తన కోసం ఒక దోశ తీసుకురండి' అని అతను అడగడం జరిగింది . 'మీ అమ్మాయికైతే ఒక దోశ చెప్పారు.... మరి మీకేమి కావాలి అని అతన్ని వెయిటర్ అడిగాడు ? అతను కొంచం బాధాతత్వ హృదయంతో ఇలా అన్నాడు, ' నా దగ్గర ఒక దోశకి సరిపడే డబ్బే మాత్రమే ఉంది. కాబట్టి ఇంక నాకేమి వద్దు'! 

        విషయం విన్న తర్వాత వెయిటర్ బాధపడి #యజమాని వద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు ..."నేను వీళ్ళ ఇద్దరికీ కడుపు నిండా పూర్తి భోజనం చేయించాలి అని అనుకుంటున్నాను . ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కాబట్టి మీరు వారి బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసుకోండి" అని వెయిటర్ అనగా....అప్పుడు అది విన్న యజమాని  వెయిటర్ ని  అభినందిస్తూ ఇలా అనడం జరిగింది .... "ఈ రోజు మనం మన హోటల్ తరపున తను ఫస్ట్ వచ్చినందుకు వీళ్ళకి పార్టీ ఇద్దాం". అన్నాడు, ఇది విని వెయిటర్ చాలా ఆనందపడ్డాడు 


                  హోటల్ వాళ్ళు ఒక టేబుల్‌ను చక్కగా అలంకరించారు. ఎవరైతే హోటల్లో ఉన్నారో వారందరితో  పేద అమ్మాయి విజయాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నారు. ఆ యజమాని వాళ్లకి మూడు దోశలు పెట్టడంతో పాటు పొరుగువారికి కూడా స్వీట్స్ పంచమని  పెద్ద సంచిలో ప్యాక్ చేసి ఇచ్చాడు. తమను చాలా గౌరవించి ,సత్కరించిన హటల్ యజమానికి, వెయిటర్ కి  కన్నీళ్లతో కృతజ్ఞతను తెలిపి అక్కడ నుంచి నిష్క్రమించారు ఆ తండ్రి ,కూతురు.


          సమయం గడిచిపోయింది (కొన్ని సంవత్సరాల పిమ్మట)...

          ఒక రోజు ఆ అమ్మాయే I.A.S. పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ నగరానికే #కలెక్టర్‌గా వచ్చింది. ఆమె ముందు తన సర్వెంట్ ని అదే హోటల్‌కు పంపించి కలెక్టర్ గారు అల్పాహారం తీసుకోవడానికి వస్తానని చెప్పమన్నారు అనగా. హోటల్ యజమాని వెంటనే ఒక టేబుల్‌ను బాగా అలంకరించాడు. ఈ వార్త వినగానే హోటల్ మొత్తం కస్టమర్లతో నిండిపోయింది కలెక్టర్ గారిని చూడటానికి.


       అదే అమ్మాయి కలెక్టర్ అయి తన తల్లిదండ్రులతో కలసి నవ్వుతూ హోటల్ వద్దకు వచ్చింది. అందరూ ఆమెను చూసి గౌరవార్థం గా నిలబడ్డారు. హోటల్ యజమాని ఆమెకు ఒక పూల గుత్తిని సమర్పించగా .., వెయిటర్ టిఫిన్ ఆర్డర్ కోసం అభ్యర్థించారు. కలెక్టర్ గా ఆ హోటల్ కి వచ్చిన ఆమె ఇలా చెప్పింది- "మీరిద్దరూ నన్ను గుర్తించలేకపోవచ్చు. ఒకప్పుడు నేను ,మాతండ్రితో కలసి మీ హోటల్ కి వచ్చినప్పుడు నేను చదువులో మెుదటి ర్యాంకు తెచ్చికొన్న విషయం మీకు తెలిసి.. మా వద్ద తగినంత ధనం లేకున్నా కూడా మీరు  సంతోషంతో మాకు అన్ని వడ్డించడమే కాక మా వద్ద నుండి ఒక్క పైసా కూడ అడగక పోవడమే కాక మమల్ని మీరు ఘనంగా సత్కరిృచడం జరిగింది .                                                ఆనాడు మీరిద్దరూ #మానవత్వానికి నిజమైన ఉదాహరణగా నిలిచారు, నేను పాస్ అయినందుకు ఒక అద్భుతమైన పార్టీని ఇచ్చి, మాకే కాకుండా మా పొరుగువారికి కూడా ఇవ్వమని స్వీట్లు ప్యాక్ చేసి ఇచ్చారు.


       ఈ రోజు నేను మీ ఇద్దరి ఆశీస్సుల వల్ల కలెక్టర్ అయ్యాను. మీ ఇద్దరినీ నేను ఎప్పుడూ నా జన్మంతా గుర్తుంచుకుంటాను. ఈ రోజు ఈ పార్టీ నా తరుపున, ఇక్కడ ఉన్న కస్టమర్లందరికీ మరియు మొత్తం హోటల్ సిబ్బందికి బిల్ నేను కడతాను.  అలా అని అందరి ముందు హోటల్ యజమనితో పాటు వెయిటర్ని కూడా సత్కరించడం జరిగింది.


నీతి: పేదరికాన్ని ఎగతాళి చేయకుండా, వాళ్ళలో ఉన్న #


ప్రతిభను గుర్తించి గౌరవించండి.... వాళ్ళను ప్రోత్సహించండి 💐🙏💐

నీతో నీవు పోరాడు

 మనం ఎక్కడైతే అంతా ఐపోయింది ఏం లేదు అని నిరాశ చెందుతామో,,



అక్కడే మొదలవుతుంది,

ఎలా మొదలవుతుంది అంటే  నిన్ను పడగొట్టినవారు   కళ్ళు చేదరెలా నిలబడతావు,,

 స్థానం అదే,,

నీవు పతనం ఐపోయావు అని చూసినా వాళ్లకి,,

 నీ ఎదుగుదల అసలు ఊహకే రాదు,,

అలసిపోయి ఆగిపోకు,,

ప్రాణం ఉన్నంతవరకు పోరాడు,,

ఎవరితోనూ పోరాడకు నీతో నీవు పోరాడు,,

నిన్ను నీవు గెలుచుకుని నిలబడినప్పుడే,

ప్రపంచాన్ని జయించగలవు....


Sunday, June 23, 2024

ఓ కుర్రాడు కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు

 ఓ కుర్రాడు కోపంతో ఇల్లు వదిలి వచ్చేశాడు



ఎంత కోపంతో వచ్చాడంటే.. తను చూసుకోలేదు తనకాళ్లకు వాళ్ల నాన్న బూట్లు వేసుకు వచ్చేశాడని.


కొడుక్కి ఒక మోటార్ సైకిల్  కొనలేని వాడు కొడుకు ఇంజనీర్ కావాలని కలలు కనడం ఎందుకో..

అంటూ తండ్రిని తిట్టుకుంటూ మరీ ఇంటినుండి బయటికి వచ్చేశాడు.


చాలా పెద్దవాడినయ్యాక గాని ఇంటికి తిరిగి వెళ్ళను అని గట్టిగా నిశ్చయించుకున్నాడు. 

ఇంటి నుండి వచ్చేప్పుడు కోపం కొద్దీ… ఎప్పుడూ ముట్టుకోనివ్వని వాళ్ల నాన్న పర్సు

కొట్టుకోచ్చేశాడు 


అమ్మకి కూడా తెలియకుండా  రాసే లెక్కలన్నీ దాంట్లోనే

ఉంటాయని వాడి నమ్మకం.


నడుస్తుంటే బూట్లలో ఏదో తగులుతోంది . కరుస్తూ ఉన్నట్టు ఉంది . బూటు లోపల సాఫ్ట్ గా లేదు .

వాడి మడమ నొప్పెడుతోంది .


అయినా అతని కోపం దానిని లెక్కచెయ్యనివ్వలేదు .లోపల తడి తడి గా అనిపించింది .

కాలు ఎత్తి చూశాడు....బూటు అడుగున చిన్న కన్నం..కుంటుతూనే బస్ స్టాండ్ వచ్చాడు ఎటైనా వెళ్లిపోదామని..!! 


బస్ స్టాండ్ విచారణ కౌంటర్లో వాకబు చేస్తే తెలిసింది...ఇంకో గంట దాకా బస్ ఏదీ లేదని 


సరే ఏంచేస్తాం. అప్పటి దాకా …నాన్న పర్సు లో ఏం ఉందో చూద్దామని  పర్సు తెరిచాడు ఈ కుర్రాడు .


ఆఫీసు లో 40,000 అప్పు తీసుకున్న లోన్ రశీదు ,


కొడుకు కోసం కొన్న లాప్ టాప్ బిల్లు,


ఆఫీసుకు వచ్చేటప్పుడు శుభ్రమైన బూట్లుతో రమ్మని మేనేజర్ ఇచ్చిన  మెమో


పాత స్కూటర్ తెండి – కొత్త మోటార్ సైకిల్ తో వెళ్ళండి . గొప్ప ఎక్చేంజ్ మేలా అని రాసి ఉన్న కరపత్రం..


ఇవి కనబడ్డాయి కుర్రాడికి తండ్రి పర్సులో…

వాటిని చూసాక ఈ కుర్రాడి కళ్ళు చెమర్చాయ్


వెంటనే ఇంటికి పరుగు పెట్టాడు .

సోల్ లేని ఆ బూట్లు ఈసారి నొప్పి కలిగించలేదు . 

ఇళ్లంతా వెతికాడు, కానీ ఇంట్లో

నాన్న లేడు. స్కూటరూ లేదు .

అతడికి తెలిసిపోయింది.....


నాన్న తన స్కూటర్ తీసుకొని

ఎక్స్చేంజ్ మేలా కు వెళ్లాడని..

అతి ప్రేమగా చూసుకుంటున్న 

తన స్కూటర్ ను అక్కడిచ్చి..

తన కోసం బైక్ తేడానికే ఖచ్చితంగా వెళ్లాడని…

ఆ కుర్రాడి కళ్ళు చెమరుస్తున్నాయి.

పరుగు పరుగున ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్న చోటికి వెళ్ళాడు . 


వాళ్ల నాన్న అక్కడే ఉన్నాడు,

ఎక్స్చేంజ్ షాపు కుర్రాడితో బేరం ఆడుతున్నాడు. 


ప్రస్తుతం యూత్ కి బాగా ఇష్టమైన

మోడల్ బైక్ ఏదో చూపించు..

దాని మీద నా కొడుకు హీరో లా

ఉండాలి అని చెబుతున్నాడు..

వెనకాలే నిల్చుని తండ్రి మాటలు వింటూ ఏడుస్తున్న ఆ కొడుకు కన్నీరు తండ్రి భుజాల మీద పడసాగింది. 

అప్పుడు తండ్రి వెనక్కి తిరిగి చూసాడు. 

అప్పుడు ఆ అబ్బాయి నాన్నని కౌగిలించుకొని

”వద్దు నాన్నా ! వద్దు నాన్నా !

నాకు మోటార్ సైకిల్ వద్దు నాన్నా.."

అంటూ ఏడవసాగాడు !


ఇంటికి వెళుతూ వెళుతూ… 

తండ్రి కోసం  కొత్త షూస్ కొని తీసుకువెళ్ళారు 

ఆ తండ్రీకొడుకులిద్దరూ….!


మీకోసం 

తన జీతాన్నే కాదు...

జీవితాన్నీ దారపోసి....

సర్వస్వాన్నీ సమర్పించిన

ఆయన 

త్యాగాన్ని గుర్తించండి !

బంధాన్ని గౌరవించండి !!

మనసారా ప్రేమించండి !!!


మన పిల్లలకు మన ఆస్తులు కాదు...విలువలతో కూడిన ధర్మాలు ఇవ్వండి....మన సంస్కృతీ 

సాంప్రదాయాల గొప్పదనం చెప్పండి.


🌿🌼🙏🙏తండ్రి  ప్రేమని అర్థంచేసుకున్న  ప్రతి ఒక్క కొడుకుకి అంకితం🙏🌼🌿

Wednesday, June 19, 2024

ఆత్మ విశ్వాసం

ఆత్మ విశ్వాసం


*_జీవితంలో సక్సెస్ అనేది ఊరికేరాదు,కన్నీళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది,కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది,మనసుకి గాయాలు అవుతాయి,బాధలు తట్టుకోవాల్సి వస్తుంది,_*


*_కొన్నిసార్లు కొందరి మాటల వల్ల బంధాల్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది,గుండె ముక్కలవుతుంది..అయినాసరే సంకల్పంతో నువ్వు అనుకున్న లక్ష్యం కోసం ఎదురు దెబ్బలు తిను..సహనంతో మెలుగు,గుణపాఠాలు నేర్చుకో..అనుభవ పాఠాలు దిద్దుకో...ప్రతిక్షణం నీతో నీవు యుద్ధం చేయి నీ గమ్యం చేరుకునేదాక._*


*_ప్రయత్నం,అవకాశాలు వాటికవే రావు,నీవే వాటిని సృష్టించు కోవాలి..వేసే ప్రతి అడుగు..గడిపే ప్రతి ఘడియ..పలికే ప్రతి పలుకు..చేసే ప్రతి చర్య..ఆలోచన అనే ఆయుధంతో,నీ శ్రమను నమ్ముకుని సంకల్పంతో ముందుకు వెళ్ళు..._*


*_జీవితం నేర్పింది ఒక్కటే..దేనికి ఎదురు చూడవద్దని...ఎవరి మీద ఆధారపడవద్దని...నీకు నువ్వే తోడని...ఆత్మవిశ్వాసంతో నువ్వు వేసే ప్రతి అడుగు నీ విజయానికి తొలిమెట్టు కావాలి..._*


*_కాబట్టి,నిన్ను నువ్వు నమ్ముకుని ఆత్మవిశ్వాసంతో ముందడగు వేయి నీకు విజయం తధ్యం.☝🏾_*

*సదా మీ శ్రేయోభిలాషి*

Sunday, June 16, 2024

మా నాన్నే నాకు గొప్ప అమ్మ


      మా నాన్నే నాకు గొప్ప అమ్మ

                ➖➖➖✍️


”గంగాధరం ! నిన్ను ప్రిన్సిపాల్ మేడం పిలుస్తున్నారు !”


ఆయా వచ్చి చెప్పిన మాటలకు ఎండలో మొక్కలకు పాదులు చేస్తున్న గంగాధరం అదిరిపడ్డాడు.


“దేనికి ?” అడిగాడు ఆయాను.


“ఏమో ! నాకేం తెలుసు ?” అంటూ వెళ్లిపోయింది ఆయా.


చేతులకు ఉన్న మట్టిని గబగబా.. కడిగేసుకుని, తలపాగా విప్పి చెమటలు కారుతున్న ముఖాన్ని తుడుచుకున్నాడు.


వడి వడిగా అడుగులు వేస్తూ కారిడార్ చివరన ఉన్న ప్రిన్సిపాల్ రూమ్ వైపు వెడుతున్నాడు.. 


అతని మనసులో ఆందోళన. “ఏమి జరిగింది?  మొక్కల గురించా? ఎక్కడైనా పొరపాటు చేశానా? లేక తన పిల్ల ఏమైనా తప్పు చేసిందా? ఎవరినయినా కొట్టిందా?  అలా చెయ్యదే! ఏమి జరిగింది? ఇన్ని రోజులుగా ఒక్కసారీ.. ఎప్పుడూ తనను పిలవని ప్రిన్సిపాల్ మేడం ఎందుకు పిలిచారు?” 


తడబడుతున్న అడుగులతో.. గుమ్మం దగ్గరకి వెళ్ళాడు.


చిన్నగా స్ప్రింగ్ డోర్ మీద శబ్దం చేశాడు.


“అమ్మగారండీ !”   లో గొంతుకతో పిలిచాడు.


“లోపలికి రా !”  ప్రిన్సిపాల్ గొంతు అధికారికంగా వినిపించింది. అతనిలో ఆందోళన పెరిగిపోయింది.


కళ్ళజోడు పెట్టుకుని, తెల్లని జుట్టుతో కాటన్ చీర కట్టుకుని హుందాగా వున్న   ప్రిన్సిపాల్ మేడమ్ ని చూడగానే వంగి నమస్కరించాడు.


ఆమె టేబుల్ మీద ఉన్న ఒక కాగితం తీసి అతనికి ఇస్తూ..    “చదువు” అంది.


వణికిపోయాడు గంగాధరం.


“మేడం నేను చదువుకోలేదు. నాకు ఇంగ్లీష్ రాదు. తెలుగు కూడా రాదు. ఏదైనా పొరపాటు చేస్తే మన్నిచండమ్మా! తప్పు చేస్తే ఇంకొక్క అవకాశం ఇవ్వండమ్మా..!”

దీనంగా అన్నాడు గంగాధరం.


అతడి కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు.


“మీ దయవలన నేను నా కూతురిని ఇక్కడ చదివించుకుంటున్నానమ్మా.. పొమ్మని మాత్రం అనకండమ్మా… దాన్ని ఇలాంటి స్కూల్ లో      నా జన్మలో చేర్చలేను! పొమ్మని అనకండమ్మా” వణికిపోతున్నాడు.


“అరెరే ! ఏదేదో ఊహించేసుకోకు! మేము నీ పిల్లకి సీటు ఇచ్చింది ఆమె తెలివి తేటలు చూసి, నువ్వు మా సిన్సియర్ వర్కర్ వి కూడా కాబట్టి. ఈ కాగితం నీకు చదివి పెట్టడానికి టీచర్ గారిని పిలుస్తా..వుండు! ఇది నీ కూతురు రాసిందే ! నీకు చదివి వినిపించాలని అనిపించి నిన్ను పిలిపించాను. ఇది నువ్వు వినాలి.”


ప్రిన్సిపాల్ గారి పిలుపు విని సరోజ టీచర్ అక్కడకి వచ్చింది. ఆమె ఆ పేపర్ తీసుకుని చదవడం మొదలు పెట్టింది…


“ఈ రోజు మా క్లాసులో మాతృదినోత్సవం గురించి వ్యాసం రాయమన్నారు . .”


“నేను ఒక పల్లెటూరిలో పుట్టాను. అక్కడ ఇప్పటికీ విద్య, వైద్యం అనేవి రెండూ ప్రజలకు సమీపంలో ఎక్కడాలేవు.  పిల్లలను కనడం అంటే అక్కడి ఆడవాళ్ళకు మళ్ళీ పుట్టడమే..   పిల్లలను కనలేక పురిటిలోనే చనిపోయే తల్లులు ఎక్కువ మా ఊరిలో.


అలాగే మా అమ్మ నన్ను కంటూ తను కన్ను మూసింది.


నన్ను తన చేతుల్లోకి తీసుకోకుండానే., తన దగ్గర పాల రుచిని నేను గుర్తు పెట్టు కోకుండానే పురిటిలోనే కన్నుమూసింది.


నన్ను తన చేతులలోకి తీసుకున్నది అప్పటికీ ఇప్పటికీ మా నాన్న ఒక్కడే !

‘తల్లిని చంపి పుట్టాను’ అన్నారు. ‘శనిగొట్టుదానిని’ అన్నారు. ఎవ్వరూ నన్ను కనీసం ఎత్తుకునేవారు కారు.


నాన్నను మళ్ళీ పెళ్లి చేసుకోమని అమ్మమ్మ, నాన్నమ్మ , తాతలూ అందరూ బలవంతం చేశారు, కొడుకును కనమని.


ఎందరు ఎన్ని రకాలుగా చెప్పినా నాన్న వినలేదు.


ఆ ఊళ్ళో ఉంటే వాళ్లందరూ అలాగే బలవంతం చేస్తారని.,       ఉన్న ఇంటినీ., పొలాలనూ., అన్నిటినీ.. వదిలి.. రోజుల పిల్లనైన నన్ను ఎత్తుకుని.. నాకు అన్నీ తానే కావాలని, తనకు అక్కడ ఉన్న అన్ని సౌకర్యాలనూ వదిలిపెట్టి.. 

వట్టి చేతులతో.., నా దురదృష్టం మీద బాధతో., నా మీద ప్రేమతో., నన్ను పెంచాలి అనే కసితో ఈ పట్టణం వచ్చేశాడు.


చిన్నప్పుడు నాకోసం ఎన్నెన్ని కష్టాలు పడివుంటాడో !


ఇప్పుడు తలచుకుంటుంటే అనిపిస్తుంది...


ఒక్కటే రొట్టె ఉంటే.. ‘తనకు రొట్టెలు ఇష్టం ఉండవు’ అనేవాడు.

నాకు ఇప్పుడు తెలుస్తోంది

నా ఆకలి తీరితే తన ఆకలి తీరిపోయినట్లు.. తను పస్తులు ఉంటూ నాకు తినిపించేవాడు నాన్న ..

అవన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి.


తన శక్తికి మించి నాకు ఎన్నో సదుపాయాలు కల్పించాడు నాన్న .


నన్ను ఈ స్కూల్ లో చదివించడం కోసం ఇక్కడ తోటమాలిగా చేరాడు.


ప్రేమ ఆప్యాయత అనేవి అమ్మకు మారుపేర్లు అయితే అవి నేను పొందుతున్నది నాన్న నుండి.


త్యాగం అమ్మకు ప్రతిరూపం అయితే.. మా నాన్న త్యాగానికి నిర్వచనం.


మా నాన్నే నాకు గొప్ప అమ్మ..!


ఈ మాతృదినోత్సవం సందర్భంగా నేను నాన్న గురించి కాకుండా ఇంకేం రాసినా నాకు సంతృప్తి అనిపించదు.

ఇంకా ఈ స్కూల్ లోనే ఉన్న తోటమాలి నాతండ్రి అని గర్వంగా చెప్పుకుంటా ..!

నాన్న నీళ్లు పోసే ఈ మొక్కల్లో నాన్న కోల్పోయిన మా అమ్మ నాకు కనిపిస్తుంది.


ఈ వ్యాస రచనలో నేను ఫెయిల్ కావచ్చు. నా టీచర్ కి ఇది నచ్చకపోవచ్చు.


కానీ నిస్వార్ధ ప్రేమకు ప్రతిరూపం అయిన నా తండ్రికి ఇది నేను అర్పించే కృతజ్ఞత!”


చదువుతున్న సరోజ టీచర్ గొంతులో కన్నీటి జీర !


వింటున్న ప్రిన్సిపాల్ చీర చెంగుతో కళ్ళను అద్దుకుంటోంది.


గంగాధరం వెక్కి వెక్కి ఏడుస్తూ.. ఏడుపు దిగమింగుకుంటున్నాడు.


ఆ ఎ.సి. గది నిశ్శబ్దంగా అతడి వెక్కిళ్ళ చప్పుడు వింటోంది.


ఆ పేపర్లను సరోజ టీచర్ నుండి.. వణుకుతున్న చేతులతో అందుకుని.. గుండెలకు హత్తుకున్నాడు.


నిలబడలేక పోతున్నాడు.


ప్రిన్సిపాల్ మేడం అతడికి దగ్గరగా వచ్చింది. కుర్చీ దగ్గరకి తీసుకు వెళ్ళింది . కూర్చో బెట్టింది తన టేబుల్ మీద ఉన్న గ్లాసులో నీళ్ళను అతడి చేతికి ఇచ్చింది.


ఆమె గొంతులో ఏదో తెలియని ఆర్ద్రతఁ !


“ గంగాధరం ! “..

మీ అమ్మాయి రాసిన ఈ వ్యాసానికి మేము 10/10 మార్కులు ఇచ్చాము. మాతృదినోత్సవం సందర్భంగా ఇంతకంటే గొప్ప వ్యాసం ఎవరూ రాయలేరు. ఎందుకంటే . .

ఇది ఒక కూతురు తన నాన్నలో అమ్మ ప్రేమని చూస్తున్న అనిర్వచనీయమైన అనుభూతికి అక్షరరూపం. మేము రేపు మన స్కూల్ లో మాతృదినోత్సవం జరపబోతున్నాము. దానికి ముఖ్య అతిధివి నువ్వే !


నిన్ను మించిన తల్లి ఇంతవరకూ మా స్కూల్ చరిత్రలో మాకు తెలీదు. అందుకే నీకు సత్కారం చెయ్యాలని నిర్ణయించుకున్నాం.

నీ అంగీకారం కోసమే నిన్ను పిలిపించాను .” అంటూ..


“మేము ఈ సత్కారం చెయ్యడానికి ముఖ్య కారణం పిల్లలను తల్లులే కాదు తండ్రులు కూడా అమితంగా ప్రేమిస్తారు.. పిల్లలకోసం త్యాగం చేస్తారు.. అనే విషయం అందరికీ తెలియాలని!


నిన్ను గౌరవించడం ద్వారా మీ అమ్మాయి తన తండ్రి ‘ప్రపంచం లోనే గొప్పతల్లి’ అన్న మాటలను నిజం చెయ్యాలీ అని., ఆ తండ్రి

మా స్కూల్ లోనే ఉన్నాడు అని పిల్లల తల్లిదండ్రులకు చెప్పాలని.


నువ్వు మనబడి తోటలో పూల చెట్లను కాపాడే తోటమాలివి మాత్రమే కాదు.


నువ్వు అంగీకరిస్తే రేపటి మన స్కూల్ మాతృదినోత్సవ సభలో సత్కారం అందుకునే గొప్ప అమ్మవి. మాకు ముఖ్య అతిథివి ! ”


గంగాధరం.. ప్రిన్సిపాల్ మేడమ్ ఔదార్యానికి కృతజ్ఞతతో నమస్కరిస్తూ. . . కూతురు వైపు చెమర్చిన కళ్లతో అడుగులు వేస్తున్నాడు . . .


తన కన్నబిడ్డ గుండెలోతుల్లో గూడుకట్టుకున్న మమకారం మనసుని ముద్ద చేస్తుంటే..

గుండెలనిండా హత్తుకుని . . కళ్లలో పెట్టుకుని కాపాడుకోవాలని . .”✍️

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భాద్కూయత కూడా నేర్పండి.*


                     ➖▪️➖


Tuesday, June 11, 2024

Success Story

Success Story


 *ఒకప్పుడు రూ. 5 కోసం .. ఇప్పుడు రూ. 125 కోట్ల కంపెనీకి యజమాని.. జ్యోతి రెడ్డి సక్సెస్ స్టోరీ..* 


కొన్ని విజయగాథలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తాయి. కష్టపడితే జీవితంలో పైకి రావచ్చనే దృఢ సంకల్పం పొందేలా చేస్తాయి. ఈమె సక్సెస్ స్టోరీ కూడా ఎంతో మందికి ప్రేరణ. ఒకప్పుడు ఇల్లు గడవక రూ. 5 కోసం కూలీ పనికి వెళ్లిన ఆమె, ఇప్పుడు ఏకంగా రూ. 125 కోట్ల కంపెనీకి యజమాని. వందల మంది ఈ కంపెనీ ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సీఈఓ స్థాయికి ఎదిగిన జ్యోతి రెడ్డి సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎలాగైనా తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవాలని జ్యోతి రెడ్డి నిశ్చయించుకుంది. ఉన్నత చదువులు చదవాలని డిసైడ్ అయింది. 1994లో డా. బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీ పట్టా అందుకుంది. ఆ తర్వాత 1997లో కాకతీయ యూనివర్సిటీ నుంచి పీజీ పట్టా పొందింది. ఉన్నత చదువు చదివినా కూడా నెల వారీ సంపాదన రూ. 398 గానే ఉండేది. ఆ డబ్బులు కుటుంబ అవసరాలకు సరిపోయేవి కాదు.


ఆ తర్వాత అమెరికాలో జ్యోతి రెడ్డి బంధువు ఒకరు అక్కడి అవకాశాల గురించి చెప్పారు. దీంతో ఆమె కంప్యూటర్ కోర్సు నేర్చుకున్నారు. ఆ తర్వాత అమెరికా వెళ్లారు. అమెరికాలో జీవనం సాగించడం కూడా చాలా కష్టమైంది. మొదట్లో పెట్రోల్ బంకులలో పని చేశారు. ఇతర కష్టమైన జాబ్స్ కూడా చేశారు. అయితే చివరకు ఆమెకు రిక్రూట్ మెంట్ ప్రొఫెషనల్ ఉద్యోగం లభించడంతో బాగా స్థిరపడ్డారు. 2021 నాటికి 40 వేల డాలర్లు సంపాదించారు. దీనితో సొంత వ్యాపారం ప్రారంభించారు.


అమెరికా సంపాదించిన డబ్బుతో జ్యోతి రెడ్డి కీ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ కంపెనీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కంపెనీ మంచి లాభాలను అందిస్తోంది. దీని విలువ రూ. 125 కోట్లు. ఒకప్పుడు 5 రూపాయల కోసం కూలీ పనికి వెళ్లిన జ్యోతి రెడ్డి ఇప్పుడు రూ. 125 కోట్లు విలువ చేసే కంపెనీ యజమాని కావడం నిజంగా ఎందరికో స్ఫూర్తిదాయకం.

Friday, June 7, 2024

వ్యక్తిత్వం

 వ్యక్తిత్వం

   🌈 స్థాయిని చూసే వారిని ఇంటికి *పిలవ* కూడదు 


⚡️నీకు *మర్యాద* ఇవ్వని వారి ఇంటికి కూడా *వెళ్ళకూడదు* 


⚡️గతంలో నిన్ను *బాధించిన* వాళ్లను *మరచిపో* కానీ వాళ్లు *నేర్పిన* పాఠాలు *జీవితాంతం* గుర్తుంచుకో 


 ⚡️గొడ్డలితో* గాయపడిన *చెట్టు* మళ్ళీ చిగురించవచ్చు కానీ *మాటలతో* గాయపడిన *మనసు* ఎప్పటికీ *ఇంతకు* ముందులా ఉండబోదు .


 ⚡️నీకు  *విలువ* ఇవ్వని చోట మాట్లాడకు *


⚡️గౌరవం* ఇవ్వని చోట నిలబడకు *


⚡️ప్రేమ* లేని చోట ఆశపడకు 


⚡️నీకు *నచ్చని ఇష్టం* లేని విషయాలకి క్షమాపణ చెప్పకు 


⚡️నువ్వు *మెచ్చని వాటికి* సంజాయ్సీలివ్వకు *


⚡️నిర్లక్ష్యం* ఉన్నచోట ఎదురు చూడకు *


⚡️ఆ లక్ష్యం* ఉన్నచోట అభిప్రాయం వ్యక్తపరచకు 


*⚡️వ్యక్తిత్వం* తాకట్టుపెట్టి ప్రాకులాడకు *


⚡️ఆత్మగౌరవం* పణంగా పెట్టి ప్రేమించకు *


⚡️చులకనగా* చూసే చోట చొరవ చూపకు *


⚡️జాలిపడి* ఇచ్చే పలకరింపులకు *ప్రేమకి* జోలె పట్టకు *


⚡️భారం* అనుకునే చోట భావాలు పంచుకోకు *.


⚡️దూరం నెట్టేసే* చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు 


*⚡️నిజాయితీని* గుర్తించని చోట నిమిషం కూడా వృధా చేయకు *


⚡️ఆత్మాభిమానాన్ని* మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉంటుందని *బ్రమ* పడకు


*⚡️ఎదురు* చూడని *ఇంటికి* పిలిచినా వెళ్ళకు *


⚡️నీది కానీ దేనిమీద నిన్ను తినేసేంత ప్రేమ అభిమానం* ఏదీ పెంచుకోకు 


👍ఇది అసలు వ్యక్తిత్వం👍

Wednesday, June 5, 2024

Monday, June 3, 2024

భార్యాభర్తల బంధంస్వర్గతుల్యం కావాలంటే

 భార్యాభర్తల బంధంస్వర్గతుల్యం కావాలంటే 🍑

*🍅భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం...!*



**నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా                           నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు.*


**తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ... తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే.*


**అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు.*

*అహంకారి భార్య దొరికితే అంబానీ అయినా సన్యాసంలో కలవాల్సిందే.*


**ప్రతి భర్త తన భార్యను... మరో తల్లి రూపంగా భావిస్తే..     ప్రతిభార్య తనభర్తను,   మొదటి బిడ్డగా పరిగణిస్తుంది. ఇదే మధురమైన బంధం... ఇప్పటికీ... ఎప్పటికీ...!*


**భార్యకు సేవ చేయడం అంటే.. బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం! బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.*


**సంసారం అంటే కలసి ఉండడమే కాదు. కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని కడవరకూ తోడు వీడకుండా ఉండడం.*


**ఒక మంచి భర్త   భార్య కన్నీరు తుడుస్తాడు ఏమో కానీ, అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని, మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు.*


**భార్యాభర్తల సంబంధం శాశ్వతం. కొంతమంది మధ్యలో వస్తారు. మధ్యలోనే పోతారు.*

*భార్యకి భర్త శాశ్వతం. భర్తకు భార్య శాశ్వతం.*


**ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణీ, గొప్పవిద్యావంతురాలి కిందే లెక్క...!*


**అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు. భార్య లేకుంటే ఆజన్మకు అర్థం లేదు.*


**మోజుతీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధం. ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది 'మాంగల్య బంధం'.*


*బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి. మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.*


**మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ, తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.*


**కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా... సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది.*


**నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే. నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే.*


**ప్రేమ అనేది చాలా విలువైనది. దాన్ని 'వివాహం' అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.*


*సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం - కుటుంబం.*


*గొడవ పడకుండా ఉండే బంధం కన్నా...ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం.*


**పెళ్లి అనేది అందమైన పూలవనం లాంటిది. ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పువ్వులనిస్తాయి.*


**వివాహ వార్షికోత్సవం అంటేప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పు ల సంగమాన్ని పండుగ చేసుకోవడమే.*


**నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు!!*


**సప్తపది ఏడు అడుగులు….                           మొదటి అడుగు - అన్న వృద్ధికి!                    రెండవ అడుగు - బలవృద్ధికి!              మూడవ అడుగు - ధన వృద్ధికి!            నాల్గవ అడుగు - సుఖవృద్ధికి!               ఐదవ అడుగు - ప్రజాపాలనకి!                  ఆరవ అడుగు - దాంపత్య జీవితానికి.         ఏడవ అడుగు - సంతాన సమృద్ధికి!*


**కోరుకున్న ఇంతి... నేడు నీ సతి!               నేడు పట్టుకున్న ఆమె చేయి...విడవకు ఎన్నటికీ!*


**వివాహాన్ని సుఖమయం చేసుకోవడానికి మీరెంత పొందికగా ఉన్నారనేది కాదు. పొందిక లేని విషయాలను మీరెలా సర్దుకుంటున్నారనేది ముఖ్యం.*


**కలిమి లేములతో...*

*కలసిన మనసులతో...*

*కలివిడిగా మసలుకో..*

*కలకాలం సుఖసంతోషాలు పంచుకో..!*


**బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒకపేజీ మాత్రమే. ఆఒక్కపొరపాటు జరిగితే సవరించాలి కానీ..మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు.*


**మగవాడు గాలి పటం*

*(అందని ఎత్తులకు ఎదగడం తెలుసు, కానీ తనను తాను నియంత్రించుకోవడం తెలీదు)*

*ఆడది దారం, అతడికి ఆధారం!*


*(ఆమెకు వెన్నంటి ప్రోత్సహించడం తెలుసు, కానీ ప్రతిభను పదిమందికి ప్రదర్శించడం తెలీదు)*

*విడివిడిగా దేనికీ విలువ లేదుఒకటైతే ఇద్దరికీ తిరుగులేదు.*


**భర్తకి భార్య బలం కావాలి!

*బలహీనత కాకూడదు!!*

*భార్యకి భర్త భరోసా కావాలి!*

*భారం కాకూడదు!!*

*భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి! 

*అయోమయం కాకూడదు.*


*మనసులోని ప్రేమని, బాధని కళ్లలో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు.*


**అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే!*


**పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా, కష్టం- సుఖం గురించి మాత్రమే కాదు. ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం.*


**ప్రతీ అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం. కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం అనుకుంటుంది భార్య

🙏🍅🍅🍅🍅🍅🍅🍅🕉️🕉️.

Event Management

 *Event Management :*

🤣🤣🤣


During dinner at wedding function, Bride's worried father rushed to Event Manager and whispered in his ear : All are taking Carrot Halwa only, nobody is taking Gulab Jamun. What will we do if Halwa gets finished and Jamun is so much surplus ? My prestige is at stake!!


"Don't worry at all, Sir. I will set it right." Said the Event Manager. 

Then he dialled a number and said, " Hello, Sanjay, listen carefully. Remove Monica 💃🏾 from Halwa desk and shift her to Jamun desk. In her place, ask Abdul Chacha 😈 to serve Halwa."


🤣🤣🤣🤣


*You can't be a successful event Manager just like that !"*

పిల్లల్ని ప్రేమించలేనివారిని టీచర్లని ఎలా అంటాం..?

 *_పిల్లల్ని ప్రేమించలేనివారిని టీచర్లని ఎలా అంటాం..?_*

_(వివక్షతను మించిన విషం ఉంటుందా!!?)_

*=================*

_|మనసును కదిలించే కథ... చదవండి! 🙏|_



*కరీంనగర్ దగ్గరలోని ఓ కుగ్రామంలోని స్కూల్ లో గవర్నమెంట్ టీచర్ గా నాకు పోస్టింగ్ రావడం నాకిష్టం లేదు. అయినా తప్పదు కాబట్టి ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. ఇదే కాకుండా, పక్కనే ఉన్న ఇటుకబట్టీల్లో పనిచేసే వాళ్ళ పిల్లల్ని కూడా మా school కే పంపడం. ఇంకా ఇంకా నాకస్సలు నచ్చేది కాదు. అసలే నాకు ఈ ఊళ్లంటేనే పడదు. అలాంటిది మళ్లీ ఈ ఊరమాస్ పిల్లలకు చదువు చెప్పాలి.  "దేవుడా ! ఏంటీ పరీక్ష" అని రోజూ చిరాకుతో కూడిన చిర్రబుర్రులతోనే బడికి వెళ్లేదాన్ని.* 


*అందులో ఒక్కణ్ణి చూస్తే నాకు అస్సలు నచ్చేది కాదు. నాకెప్పుడు వాణ్ని చూసినా కోపంగా అనిపించేది. వాడి పేరు సాంబడు. 9 ఏళ్ళుంటాయి. వాడు మూడో తరగతి చదువుతున్నాడు. సరైన బట్టలు వేసుకోడు. ఎప్పుడు చూసినా చిరిగిన చొక్కాలు వేసుకొనేవాడు. ఆరాతీస్తే, వీడి తల్లిదండ్రులు ఇటుకల బట్టీల్లో పని చేస్తారని తెలిసింది. మొదట మధ్యాహ్నం అన్నం కోసం బడికి పంపించేవారు. ఇప్పుడు వాడు బాగా చదువుకుంటాడని,  పంపిస్తూన్నా రనిపించింది.*


*నా దృష్టిలో అయితే వాడు చాలా poor student. ఏమీ గుర్తుండవు. సరిగ్గా ఎక్కాలు అప్ప చెప్పమన్నా కూడా వాడికి 5 కి మించి రావు. పైగా వాడి నలుపు రూపు చూస్తేనే అసహ్యంగా అనిపించి అస్సలు వాడి వైపు చూడ్డం  కానీ, మాట్లాడటం కానీ అస్సలు చేసేదాన్ని కాదు.* 


*అలాంటోడు కొన్ని రోజులుగా school  ki రావడమే మానేశాడు.  ఇలాంటి places లో school  ki రావడం, మానేయడం వీళ్ళకు మామూలే కదా! అని నేను కూడా అంతగా పట్టించుకోలేదు...* 


*ఒకరోజు హెడ్మాస్టర్ గారు రమ్మంటే ఆయన రూమ్ కి వెళ్లాను. ఆయన రూమ్ లో ఆయనకెదురుగా ముప్పై ఏళ్ళున్న ఒక labour  ఆవిడ చేతులు కట్టుకుని నిల్చుని ఉంది.* 


*ఆవిణ్ణి నాకు పరిచయం చేస్తూ.. _"ఈవిడ మన సాంబడి తల్లి. దురదృష్టవశాత్తు సాంబడు పదిరోజుల కిందటే విషజ్వరంతో చనిపోయాడంట. వాళ్ళమ్మ మీతో మాట్లాడాలని వచ్చింది madam ఒక్కసారి మాట్లాడండీ"_ అన్నారు హెడ్మాస్టర్.*


*వాళ్ళమ్మ నా వైపు తిరిగి కళ్లెంబడి నీళ్లతో కుప్పకూలి, మేడమ్..! వాడు పోయే ముందు ఎప్పుడూ... _"నళిని  మేడమ్ తో ఒక్కసారన్నా good  అనిపించుకోవాలి అమ్మా"_ అని నాతో రోజూ చెప్పేవాడు.* 


*వాడు చనిపోయే ముందురోజు కూడా మీ గురించే మాట్లాడాడమ్మా...! వాడు తనకు తానే _" సాంబడు good"_  అని పుస్తకంలో రాసుకొని మీ లాగే సంతకం చేసుకున్నాడు,"  అని తాను తెచ్చుకున్న సంచిలోనుండి పుస్తకం తెరిచి వాడి చిన్ని చిన్ని రాతలతో నా పేరు చూపించింది వాళ్ళ మ్మ... నాకళ్ళ నుండి ఒక్కొక్కటిగా రాలుతున్న నీటిబొట్లతో వాడు పెట్టిన నా.. నా.. సంతకం తడిసి, పేజీ ముద్దగా అవుతోంది. నాకు దుఃఖం ఆగడంలేదు.*


 *వాడు బతికుండగా ఒక్కసారి కూడా వాణ్ని మెచ్చుకోలుగా చూడలేదు. అసలు మనిషిగా కూడా చూళ్ళేదు వాణ్ని.* 

*పాపం పిల్లాడు ఎంతగా ఆరాటపడ్డాడో!  _"తండ్రీ ఎక్కడున్నా నన్ను క్షమించు... జాతి, వర్ణ, ఆర్ధిక బేధాలతో.. వివక్షలతో  చిన్నారులను చిన్న చూపు చూసే నాతో పాటు నాలాంటి ఎందరో బుద్ధిలేని పెద్దమనుషులను కూడా క్షమించరా"😌_ అని మనసులోనే వెక్కి వెక్కి ఏడుస్తూ...* 

*_“సాంబడు  is Very Good”  నాలాంటి ఎందరో కళ్లు  తెరిపించావు తండ్రీ!_ అని అదే బుక్ లో రాసి ఆ గదిలోనే ఉన్న bench మీద కూర్చుని హెడ్మాస్టర్  గారి వెనుక ఉన్న అంబేద్కర్ గారి ఫోటోని చూసి _"తప్పు  చేశాను సార్!  🙏ఇక మీదట ఇలా జరగదు"_ అని నాకు నేను మనస్సులోనే ప్రమాణం చేసుకున్నాను.*  😌

*_దయచేసి పిల్లలని ప్రేమించండి.🙏_* 

_మీ...._ 

_—టీచర్_—

*:-:-:

ఈ కథ మీ మనసును కదిలిస్తుంది.. కళ్ళు చెమ్మగిల్లడం కాయం. 

అందరూ చదవాల్సింన కథ.. 

ముఖ్యంగా టీచర్లు చదవాల్సిన కథ

అందరికీ షేర్ చేయండి

Saturday, June 1, 2024

ఆరోగ్య సూత్రాలు

 ఆరోగ్య సూత్రాలు :



🍐అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

🌿కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.

🍒నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

🍑గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.

🍇అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.

🍏జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.

🍷బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.

🍪సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.

🍋మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.

🍓దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.

🍲ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.

🍍అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.

🍈కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.

🍃మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.

🍒ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.

🍠బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.

🍉క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

🌽మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.

🍅ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.

🍑అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.

🍐పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.

🍊సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.

🍜దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.

🍲ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.

🐬🐟చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

🍊కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.

🍉క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.

🍎యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.

🍵వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.

🍏పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.

☕ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.

🍇ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.

🍒ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్..b కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.

🍏జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

🍎ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.

🍒నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.

🍑మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.

🌾మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.

యూజ్ ఫుల్ ఇన్ఫర్ మేషన్ కాబట్టి దీనిని మిగతావారికీ 

Share Pls...........

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE