NaReN

NaReN

Saturday, April 6, 2024

ఆరోగ్యం మన జన్మకు తప్పని హక్కు

 ఆరోగ్యం మన జన్మకు తప్పని హక్కు


నాలుగేళ్ల క్రితం కరోనా ప్రపంచాన్ని వణికించింది.భూతాపం పెరగడం వల్లే కరోనా వ్యాపించిందని పలువురు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన  అధికారిక ప్రపంచ ఆరోగ్య ప్రచారాలలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం, ప్రపంచ రోగనిరోధక వారోత్సవం, ప్రపంచ మలేరియా దినోత్సవం, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, ప్రపంచ రక్తదాత దినోత్సవం, ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంతో పాటు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని కూడా చేర్చారు.


ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ అందరకీ ఆరోగ్యం అనే నినాదానికి కట్టుబడి పని చేయాలి.అలాంటప్పుడే కోవిడ్ లాంటి వైరస్ వ్యాధులను  అడ్డుకట్ట వేయవచ్చు.గతంలో ఉన్న నివేదికలు చూసుకుంటే… కోవిడ్ మొదటి దశ, రెండవ దశలో ప్రజలు తీసుకున్న జాగ్రత్తల వల్ల అనేక రకాలైన రోగాలు  దరిచేరలేదు,


ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్య, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.  రోజువారీ ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉండే వాటిని తీసుకోవాలి. ఇది కాకుండా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, చక్కెర, శీతల పానీయాల వినియోగాన్ని తగ్గించడం మేలు.ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం మనందరికీ తెలుసు. దీనికి అలవాటు పడి ఉంటే, ఈరోజే దానిని మానేయాలి . ఎందుకంటే ఇది అనేక వ్యాధులకు కారణమవుతుంది.


మనుషులందరికీ ఆరోగ్యం ప్రాథమిక హక్కుగా లభించాలి. ఆర్థిక భారం కాకుండా అవసరమైనపుడు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలి. అనేవి లక్ష్యాలు కాగా ప్రపంచంలో దాదాపు 30 శాతం జనాభాకు ప్రాథమిక ఆరోగ్య సేవలు కూడా అందుబాటులో లేవు.


యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రజలను పేదరికం నుంచి బయటపడేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నమ్మకం.అందరికీ ఆరోగ్యం అనే మాటను నిజం చెయ్యడానికి ఇది అవసరం. నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించే నైపుణ్యం కలిగిన ఆరోగ్య కార్యకర్తలు, వైద్య నిపుణులతో పాటు ఆరోగ్యాన్ని అందించేందుకు పెట్టుబడి పెట్టగలిగే విధాన రూపకర్తలు కూడా యూనివర్సల్ హెల్త్ కవరేజి అవసరం.

ఏప్రిల్ 7-ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE