NaReN

NaReN

Wednesday, April 24, 2024

ఉజ్వల భవిష్యత్తుకు ఈ ఉగాది తోడ్పడాలి



*ఉజ్వల భవిష్యత్తుకు ఈ ఉగాది తోడ్పడాలి...*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️



 *అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాధి శుభాకాంక్ష‌లు*


ఈ ఉగాది పండుగ అంద‌రికీ స‌క‌ల శుభాల‌ను పంచాలి. జీవితాల్లో సుఖ శాంతులు తేవాల‌ని,  క‌ష్టాలు, నష్టాలు తొల‌గి ఆనంద‌మ‌య జీవితాల‌కు ఈ పండుగ నాంధి కావాలి.


 'షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఉగాది.. తెలుగు లోగిళ్లలో నూతన సంవత్సర శోభను తెస్తూ, కొత్త లక్ష్యాలకు, కొత్త ఆలోచనలకు, ప్రతి ఒక్కరి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని, తద్వారా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని కోరుకుంటున్నాను.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


మీ..

పసుపులేటి నరేంద్రస్వామి

Thursday, April 18, 2024

నాన్న వదిలేసి వెళ్ళిన ఆ చేతి ముద్రలు



  *నాన్న వదిలేసి వెళ్ళిన ఆ చేతి ముద్రలు:*

                 ➖➖➖✍️




*నాన్న వదిలేసి వెళ్ళిన ఆ చేతి ముద్రలు నన్ను వెంటాడుతూనే ఉన్నయ్…*

 

నాన్న వయస్సు పెరిగేకొద్దీ శరీరం కూడా బాగా బలహీనపడిపోయింది… 


గదిలోనే అటూఇటూ నడవడానికి గోడ ఆసరా అవసరమవుతోంది… 


తన చేతులు పడినచోట గోడ మీద ఆ ముద్రలు పడుతున్నాయి…


నా భార్యకు అది చిరాకు… తరచూ నాతో చెబుతోంది… గోడలు మురికిగా కనిపిస్తున్నాయనేది ఆమె కంప్లయింట్… 


ఓరోజు ఆయనకు బాగా తలనొప్పి ఉండటంతో తలకు కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నాడు… అవే చేతులతో గోడను పట్టుకుని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి గోడ మీద…


నా భార్య నామీద అరిచింది… 


నేనూ సహనం కోల్పోయి నాన్న మీద అరిచాను… నడిచేటప్పుడు అలా గోడను పట్టుకోకు అని గట్టిగా కేకలేశాను… 


గాయపడ్డట్టుగా తన కళ్లు… 

నావైపు అదోలా చూశాడు… 


నాకే సిగ్గనిపించింది… ఏం మాట్లాడాలో ఇక తెలియలేదు…


ఆ తరువాత గోడలను పట్టుకుని నడవగా చూడలేదు నేను… 


ఓరోజు బ్యాలెన్స్ తప్పి పడిపోయాడు… 


మంచం మీద పడిపోయాడు… తరువాత కొన్నాళ్లకే కన్నుమూశాడు… 


నాలో అదే దోషభావన… 


ఆరోజు తను నావైపు చూసిన చూపు నన్ను వెంటాడుతూనే ఉంది… 

నన్ను నేను క్షమించుకోలేకపోతున్నా…


కొన్నాళ్లకు మా ఇంటికి రంగులు వేయించాలని నిర్ణయించుకున్నాం… 


పెయింటర్స్ వచ్చారు… 


తాతను బాగా ప్రేమించే నా కొడుకు నాన్న వదిలేసి వెళ్లిన ఆ గోడ మీద మాత్రం కొత్త పెయింట్ వేయకుండా అడ్డుకున్నాడు… అరిచాడు…


ఆ పెయింటర్స్ సీనియర్లు, క్రియేటివ్ కూడా… 

“మీ తాత చేతిముద్రలు చెరిగిపోకుండా చూస్తాం, వాటి చుట్టూ సర్కిళ్లు గీసి, డిజైన్లు వేసి, ఓ ఫోటో ఫ్రేములా మార్చి ఇస్తాం”సరేనా అని సముదాయించారు…


అలాగే చేశారు… 


ఇప్పుడు ఆ చేతి ముద్రలు మా ఇంట్లో ఓ భాగం… 

ఆ డిజైన్ను మా ఇంటికొచ్చినవాళ్లు అభినందించేవాళ్లు… 

వాళ్లకు అసలు కథ తెలియదు… తెలిస్తే నన్ను ఎంత అసహ్యించుకునేవాళ్లో…!


కాలం ఆగదు కదా, వేగంగా తిరుగుతూనే ఉంది… 


నాకూ వయస్సు మీద పడింది… శరీరం నా అదుపులో ఉండటం లేదు కొన్నిసార్లు… 


నాకిప్పుడు అదే గోడ ఆసరా కావల్సి వస్తోంది… 


నాన్న పడిన బాధ ఏమిటో నాకిప్పుడు తెలిసొస్తోంది…


ఎందుకనిపించిందో తెలియదు, గోడ ఆసరా లేకుండానే నడవటానికి ప్రయత్నిస్తున్నాను… 


ఓరోజు అది చూసి మా అబ్బాయి పరుగున వచ్చాడు, నా భుజాలు పట్టుకున్నాడు… “నాన్నా! గోడ ఆసరా లేకుండా అస్సలు నడవొద్దు, పడిపోతవ్” అని మందలించాడు…


మనవరాలు వచ్చింది, “నీ చేయి నా భుజాల మీద వేసి నడువు తాతా”అంది ప్రేమగా… 


నాలో దుఖం పొంగుకొచ్చింది… అసలే తండ్రిని నేనే పోగొట్టుకున్నాననే ఫీలింగు, అలాంటి ధోరణి ఏమాత్రం చూపించని నా పిల్లలు… 


నేను ఆ రోజు నాన్న మీద అరవకపోతే ఇంకొన్నాళ్లు బతికేవాడు కదా అనే బాధ…

నా మనవరాలు మెల్లిగా నన్ను నడిపించుకు వెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది… తన డ్రాయింగ్ బుక్ తీసి చూపించింది… 


గదిలోని గోడ మీద నాన్న చేతిముద్రలనే ఆమె డ్రాయింగ్ బుక్లో గీసింది… 


టీచర్ బాగా అభినందించిందని చెప్పింది… ‘పిల్లలు పెద్దల్ని ఇలా గౌరవించడం మన సంస్కృతి’ అని రాసిందామె ఆ స్కెచ్ మీద…


నా గదిలోకి వచ్చి పడుకున్నాను… మౌనంగా రోదిస్తున్నాను… నన్ను వదిలి వెళ్లిపోయిన నాన్నను క్షమించమని పదే పదే ప్రార్థిస్తున్నాను… 


తరువాత మెల్లగా నిద్ర పట్టేసింది… ఏమో… తరువాత ఏమైందో నాకు తెలియదు… నా ఆత్మ నాన్న వైపే వేగంగా పయనిస్తున్నట్టే ఉంది… ✍️


A heart touching story


~Father's handprints ~ 

✋🏽 🖐🏽 🤚🏽


Father had grown old and would take support of the wall while walking. As a result the walls had discoloured, wherever he used to touch and his fingerprints got printed on the walls.


My wife detected this and would often complain about the dirty looking walls.


One day, he was having headache, so he massaged some oil onto his head. So, while walking oil stains were formed on the walls. 


My wife screamed at me seeing this.  And I in turn shouted at my father and spoke to him rudely, advising him not to touch the walls while walking.


He looked hurt. I also felt ashamed of my behaviour , but did not say anything to him.


Father stopped holding the wall while walking. And fell down one day. He became bedridden and left us shortly. I felt guilt in my heart and could never forget his expressions and forgive myself of his demise shortly thereafter. 


After sometime,  we wanted to get our house painted. When the painters came, my son, who adored his grandfather,  did not allow the painters to clean father's fingerprints, and paint those areas.

The painters were very good and innovative. They assured him that they will not remove my father's fingerprints/ handprints, rather would draw a beautiful circle around these marks and create a unique design.


This continued thereafter and those prints become part of our house. Every person visiting our home admired our unique design. 


With time, I also grew old.


Now I needed the support of wall to walk. One day while walking, I remembered 

my words to my father, and tried to walk without support. My son saw this and immediately came to me and asked me to take support of the walls while walking, expressing concern that I would have fallen without support, I realised that my son was holding me.


My grand daughter immediately came forward and affectionately,  asked me put my hand on her shoulder for support. I almost started crying silently. Had I done the same for my father, he would have lived longer.


My grand daughter took me along and made me sit on the sofa.


Then she took out her drawing book to show me.

Her teacher had admired her drawing and given her excellent remarks. 


The sketch was of my father's handprint on the walls. 


*Her  comment -  “wish every child loves elders in same way.”*


I came back to my room and started crying profusely, asking forgiveness from my father, who was no more.


*We also grow old with time.  Let's take care of our elders and teach the same to our children.*

***************


Tuesday, April 16, 2024

ఒంటరి ప్రయాణం

  *ఒంటరి ప్రయాణం*



ప్రతి సంవత్సరం ఒక పిల్లవాడ్ని తల్లిదండ్రులు వేసవి విరామం కోసం అతని అమ్మమ్మ ఇంటికి తీసుకువెళ్ళేవారు, మళ్లీ రెండు వారాల తరువాత అదే రైలులో ఇంటికి తిరిగి వచ్చేవారు.*


*అయితే ఒక రోజు అబ్బాయి తన తల్లిదండ్రులతో ఇలా చెబుతాడు:  “నేను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, ఈ సంవత్సరం ఒంటరిగా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తాను! ”*


*కొంచెం ఆలోచన తరువాత తల్లిదండ్రులు అంగీకరిస్తారు....*


*తర్వాత రోజు వారు రైల్వే స్టేషన్ కి వెళ్తారు, ట్రైన్ ప్లాట్ ఫాం మీద ఉంది, ఫ్లాట్ ఫాం మీద ఉండి కిటికీ ద్వారా అతనికి వీడ్కోలు చెప్తూ పదే పదే జాగ్రత్తలు చెబుతున్నారు.*


*"తెలుసు నాకు తెలుసు, మీరు ఇప్పటికే నాకు చాలాసార్లు చెప్పారు.! "అన్నాడు బాలుడు కొంచెం అసహనంతో.*


*రైలు బయలుదేరబోతోంది ఇంతలో తండ్రి అతని జేబులో ఏదో పెడుతూ గుసగుసలుగా: ”బాబూ, నీకు అకస్మాత్తుగా ఒంటరిగా లేదా భయం అనిపిస్తే, ఇది చూడు!”*


*ట్రైన్ బయలుదేరింది...*


*ఇప్పుడు బాలుడు ఒంటరిగా ఉన్నాడు, రైలులో కూర్చున్నాడు, తల్లిదండ్రులు లేకుండా, మొదటిసారి!*


*అతను కిటికీ గుండా వెళ్లే దృశ్యాన్ని చూస్తున్నాడు.*


*అతని చుట్టూ అపరిచితులు హల్‌చల్ చేస్తున్నారు, శబ్దం చేస్తున్నారు, కొంతమంది కంపార్ట్మెంట్‌లోకి ఎక్కుతున్నారు,కొంతమంది దిగుతున్నారు. అటూ ఇటూ చూస్తున్నాడు అన్నీ కొత్త మొహలే. తెలిసిన మొహం ఒక్కటీ లేదు. అతను ఒంటరిగా ఉన్నాడు అనే భావన అతనికి వచ్చింది. ఒక వ్యక్తి విచారకరమైన మొహంతో తననే చూస్తూన్నాడు.అది కుర్రాడికి మరింత అసౌకర్యంగా ఉంది.*


*ఇప్పుడు ఒక్క సారిగా భయం వేసింది. రైలు వేగానికి కుదుపులకి కడుపు నొప్పి మొదలైంది. మరియు రైలు వేగంతో సరిపోలడానికి ప్రయత్నిస్తున్నట్లుగా గుండె కొంచెం వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది.*


*సీట్లో మూలకి ముడుసుకుని కూర్చున్నాడు, ఒక్క సారిగా అతని కళ్ళల్లో నీళ్ళు.....*


*ఆ సమయంలో అతనికి తన తండ్రి తన జేబులో ఏదో ఉంచినట్లు గుర్తువచ్చింది.*


*వణుకుతున్న చేతితో అతను జేబులోంచి ఓకాగితాన్ని తీశాడు. అందులో ఇలా ఉంది:  "భయపడవద్దు, నేను నెక్స్ట్ కంపార్ట్మెంట్లో ఉన్నాను."*


*ఒక్కసారిగా కొండంత ఆత్మవిశ్వాసం మరియు దైర్యంతో మొహం మెరిసి పోయింది.  గుండెల నిండా దైర్యం... చిరునవ్వుతో తల పైకి ఎత్తుకొని కూర్చున్నాడు, గుండె వేగం తగ్గింది, కడుపు నొప్పి ఛాయలు లేవు!* *అపరిచితుల మధ్యలో చాలా సౌకర్యంగా ఉంది ఇప్పుడు.*


*నీతి*


*అందరి జీవితాల్లో కూడా ఇదే పరిస్థితి!*


*దేవుడు ఈ లోకంలో మనలను పంపినప్పుడు, మనందరి జేబులో కూడా ఒక నోట్ వుంచుతాడు: "నేను మీతో ప్రయాణిస్తున్నాను!" అని.*


*కాబట్టి భయపడవద్దు!*

*నిరాశ చెందకండి!*

*ఇది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది!*


*ప్రస్తుతం ప్రపంచంలో మనుగడ కోసం పోరాడుతున్న ఈ అనిశ్చిత సమయాల్లో, ఏవరో ఒకరు నీ కోసం మరొక కంపార్ట్మెంట్లో అలాగే వేరెవరో నీ సహాయం కోసం వేరే కంపార్ట్మెంట్లో ఉండవచ్చు.*


*భగవంతుని విశ్వసించండి, ఆయనపై నమ్మకం ఉంచండి, మన ప్రయాణమంతటా ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు భగవంతుడు*


మీకు కూడా ఇలాంటి అనుభవం ఉందా ...ఉంటే నాతో పంచుకోండి ఓ మంచి కథలా అందరికీ ఉపయోగపడేలా చేస్తా.... 

మీ పిల్లలను కూడా మీరు ధైర్యంతో ముందుకు నడిపించండి.


మీ 

పసుపులేటి నరేంద్రస్వామి

Sunday, April 7, 2024

ఇది ఒక యదార్థ కథ

ఇది ఒక యదార్థ కథ.

 కొందరికైనా స్ఫూర్తి దాయకంగా ఉంటుందని పోస్ట్ చేస్తున్నాను. చివరి వరకు చదవగలరు.🙏🙏


*..కొన్ని నెలల క్రితం, కొత్తగా ఒక పనిమనిషి చేరింది, నాకు పనిమనిషి అన్న పదం పలకడం ఇష్టం ఉండదు, మీకందరికి అర్థం కావటానికి ఇలా రాశా, ఇక ఈ వ్యాసం లో ఈ పదాన్ని ఊయోగించను. ఈవిడ పేరు గౌసియా. మూడు నాలుగు రోజుల తరువాత, అడిగా అక్కా ఎక్కడ మీ ఇల్లు, ఎంత మంది పిల్లలు, ముగ్గురు అమ్మాయిలు అండి, పెళ్లిళ్లు అయ్యాయా, లేదండి ఇంకా చదువుకుంటున్నారు. OK, ఏం చదువుకుంటున్నారు అని క్యాజుల్ గా అడిగా, పెద్ద అమ్మాయి MSC ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి డిగ్రీ కాలేజ్ లో కాంట్రాక్ట్ లెక్చరర్ గా చేస్తోంది, ఆ అంటూ నోరు తెరిచా, రెండో అమ్మాయి MSC computers మొదటి సంవత్సరo, మూడో అమ్మాయి ఎంబీబీస్ రెండో సంవత్సరం. ఆ అని నోరు వెళ్ల బెట్టా. నర్సింగా అన్నా, కాదు అన్నా mbbs ఏ అంది. నాకు అర్థం కావటం లేదు, ఈవిడ ఏమంటోంది, ఏం మాట్లాడుతోంది. ఈవిడకు ఏం మాట్లాడుతోందో అర్థం అవుతోందా? మళ్ళీ అడిగా, అవే సమాధానాలు, MBBS ఫ్రీ seat ఆ అని అడిగా, అవును అన్నా, ఫ్రీ సీట్ యే, అదేదో బిల్డింగ్ ఫీజ్ అంటా, దానికే తంటాలు పడుతున్నా కట్టడానికి. ఎక్కడ చదువుకున్నారు అమ్మ మీ పిల్లలు అని అడిగా, స్కూల్ గురుంచి, ఇక్కడే మన వీధి బడిలోనే. 10 తరగతి వరకు. లాంగ్ టర్మ్ గట్రా వెళ్లిందా ఎంబీబీస్ అమ్మాయి అని అడిగా, ఏం లేదయ్యా, మాములు కాలేజ్ యే, నాకు ఈ చదువుల గోల ఏం తెలీదయ్యా, ఇప్పుడు ఇప్పుడే కాస్త నోరు తిరుగుతోంది. ఏం చదువుకున్నావు అమ్మా నువ్వు అని అడిగా, అయ్యో మీరు అడగద్దoడి, రెండు లో మానేశా. నాకు కూడికలు, తీసివేతలు కూడా రావు. చాలా కష్టాలు పడ్డాను పిల్లలను ఈ స్థాయికి తీసుకురావటానికి. మీ ఆయన అన్నా, ఆయన అందరి లాగే, ఇంటి విషయాలు ఏo పట్టదు. ఆయన త్రాగుడు, 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇంట్లో ఇవ్వడం కూడా గగనం. ఇప్పుడు ఇప్పుడు కొంచం మారుతున్నడు, పాప డాక్టర్ కోర్స్ చేరిన తరువాత. అప్పుడు స్పృహలోకి వచ్చాడు తన పిల్లలు ఎదో సాధిస్తున్నారు అని. మా పెద్ద అమ్మాయిని ఏడో తరగతి లో చదువు మానిపించేసా, కానీ వాళ్ల టీచర్ ఇంటికి వచ్చి, నన్ను మందలించి, మంచి తెలివి గల అమ్మాయి, చక్కగా చదువుకొంటోంది అని చెప్పి బడికి తీసుకొని వెళ్ళింది. అప్పటికి అర్థం అయ్యింది నాకు, నా పిల్లలు తెలివి గల వాళ్ళు అని, నా పిల్లల చదువులు ఆగ కూడదు అని ఇంకో రెండు ఇల్లులు ఎక్కువ ఒప్పుకోవటం మొదలు పెట్టా. ఇంట్లో సరిగ్గా కరెంట్ కూడా ఉండేది కాదు, మూడు మూడు నెలలు బిల్ కట్టలేక పోయే దాన్ని, పిల్లలు ఆలాగే బుడ్డి దీపాల్లో చదువుకున్నారు. ఇప్పుడు కాస్త పర్వాలేదు, పెద్ద అమ్మాయి కాస్త సంపాదిస్తోంది. ఎలాగో కిందా మీదా పడుతున్నాను అంది. నాకు నోట మాట రాలేదు. ఒక మహిళ, భర్త త్రాగుబోతు, ఇంతగా కష్టపడి పిల్లలనుఁ ఇంతగా వృద్ధిలోకి తెచ్చిందా. లక్షలు, లక్షలు పోస్తుంటే పిల్లలు చడవట్లేదు, నా పిల్లలు వీళ్ళలా సగం చదువుకున్నా చాలు అనుకున్నా.* 


*అంతే నాకు అర్జంట్ గా వీళ్ళ ముగ్గురిని కలవాలి అనిపించింది. నాకు మీ ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడాలి, నాకు పరిచయం చేపియ్యాలి అని అడిగా, అలా మా పిల్లలను చూసినట్లు ఉంటుంది అన్నా. నేను ఆడిగినట్లే ముగ్గురిని తీసుకొని సాయంత్రం వచ్చింది గౌసియా అక్కా. ముగ్గురు వాళ్ళ అమ్మతో పాటు నేల పై కూర్చున్నారు. నా మనస్సు చివుక్కుమంది. ఎంత గానో బ్రతిమాలుకుంటే గాని, కుర్చీల పై కూర్చో లేదు. గౌసియా అక్క నేల పైనే. నాకు అలవాటే అన్నా, నా పిల్లలు నాలా మిగిలి పోకూడదు అనే నా శ్రమ అంతా. మీలాంటి గొప్ప వాళ్ళ తో పాటు సరిసమానంగా కూర్చున్నారు చూడండి ఇది చాలు, అంది కళ్ళ నీళ్లతో. నేను కాదు, వీళ్లు కాదు, నువ్వు గొప్ప దానివి అక్కా అన్నా.*


*మొదటి పది నిమిషాలు ముగ్గరు ముడుచుకు కూర్చున్నారు, తరువాత కొంచం కొంచం మాట్లాడ్డం మొదలు పెట్టారు. తాము పడిన కష్టాలు, పడుతున్న కష్టాలు, ఎలా సీట్లు తెచ్చుకొంది, ఎంతో కొంత స్కాలర్షిప్ లు రావటం, అవి సహాయపడ్డం. నిజంగా ఇలాంటి వారే పథకాలకు అర్హులు. కానీ 80 శాతం అనర్హులు నోట్లోకి పోతున్నాయి.*


*వీళ్లకు ఏదన్నా సహాయం చేద్దాం అని గట్టిగా మనసులో అనుకున్నా. అడిగా, ఎంత అనుకువ గా ఉన్నారో, అంత ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం మెండుగా ఉన్నాయి. ఏమి అడిగినా, ఆహా వద్దు అనే సమాధానం. నేను, నా అర్ధాంగి అడగంగా, అడగంగా, ఒక two వీలర్ తీపించండి, ముగ్గరo ఊయోగించుకుంటాం, మీకు నెల నెలా ఇస్తాం, మేము లోన్ లో తీసుకోలేము, అనవసరమైన వడ్డీ అన్నారు. Two వీలర్ ఉంటే, కాస్త సౌలభ్యoగా ఉంటుంది, సగం డబ్బులు ఆటో లకు అయిపోతున్నాయి, మా ఏరియా దగ్గర షేర్ ఆటోలు దొరకవు, దొరికే స్టాప్ వరకు నడచి అలిసిపోవటం, సమయం కూడా వ్యర్థo. Two వీలర్ ఉంటే అలిసిపోము, మిగిలిన సమయాన్ని చదువుకునేందుకు ఉపయోగించుకుంటాము అన్నారు.* 


*Two వీలర్ తీపించా మొత్తం డబ్బులు కట్టి, ఒక తొమ్మిది నెలల్లో నాకు ఒక పైసా వదలకుండా మొత్తం తీర్చేశారు, ఒక పది వేలు ఉంచుకోండి అన్నా వినకుండా. పెద్ద అమ్మాయి ఇద్దరిని డ్రాప్ చేసిన తరువాత తన కాలేజ్ కు వెళ్లి పోతుంది. మళ్ళీ ఇద్దరని పికప్.*


*పెద్ద అమ్మాయి JL పోస్టలకు సన్నద్ధం అవుతోంది. రెండో అమ్మాయి software ఫీల్డ్ వైపు వెళ్ళాలి అని.*


*చెప్పటం మరిచా ఇప్పుడు పెద్ద అమ్మాయి మా పిల్లలకు హోమ్ ట్యూటర్. ప్రతి రోజు రెండు గంటలు. ఒక రెండు నెలల నుంచి ఉభయులము మాట్లాడుకొని, కొరొనా వలన కాస్త బ్రేక్ తీసుకున్నాం.*


*వీళ్ళ స్టోరీ ఈనాడు, ఆంధ్రజ్యోతిల్లో వేపించాలని విలేఖరులతో మాట్లాడా, ఉద్యోగం వచ్చిన తరువాత ఇస్తాం, అప్పటి వరకు వద్దని పెద్ద అమ్మాయి సున్నిత తిరస్కారం.*

 

*ఏదో సినిమాలో అమ్మకంటే పెద్ద యోధురాలు ఎవరు ఉండరు అంటాడు హీరో, మనకు తెలియని గౌసియా అక్క లాంటి యోధురాళ్లు ఎందరో.......*


*ఒకసారి గౌసియా అక్కతో అన్నా, ఇంకో రెండు సంవత్సరాలు కష్టం మీకు, తరువాత పిల్లలు చూసుకుంటారు మిమ్మల్ని అని, ఏం అన్నా నన్ను పనిలో నుంచి తీసేయ్యాలి అనుకుంటున్నారా, నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నేను నా పని మానను.*


*గౌసియా అక్కను అడిగా, మీ ఆయన మీద కోపం లేదా అని, లేదు అన్నా, పిల్లలకు ఉంది, అయినా వీళ్ళు తమ చదువులు అయిపోయి, పెళ్లిళ్లు చేసుకొని వెళ్లి పోతే తను నేనే కదన్నా, కోపాలు, తాపాలు పెట్టుకుంటే అవుతుందా అని సమాధానం. చిన్న చిన్న వాటికి గొడవలు పడి విడి పోతున్న జంటలకు ఈమె పెద్ద సమాధానం.*


*ఒకసారి పెద్ద అమ్మాయి అంది, మా నాన్న తన స్నేహితుల ముందర మా గురుంచి గొప్పగా చెబుతుంటాడు, అక్కడే మొహం ముందరే చెబుతాం, ఇదంతా మా అమ్మ కష్టం అని, ఇంకో విషయం మా పిల్లలకు ముక్కు మీద కోపం.* 


*women empowerment గురుంచి రాయమన్నారు, నాకు రాయటానికి దీని కంటే మంచి సబ్జెక్ట్ ఇంకొకటి కనబడలేదు.*

✍️✍️✍️✍️

మజ్జిగ

 మజ్జిగ:


మజ్జిగకి సంస్కృతంలో మూడు పేర్లున్నాయి.


1. తక్రం

2. మధితం 

3. ఉదశ్విత్తు.


🔸 తక్రం

నాలుగోవంతు మాత్రం నీరుపోసి తయారు చేసేది తక్రం.


🔸 మధితం 

అసలే నీరు పోయకుండా చిలికినది #మధితం ఇది రుచిగా ఉంటుంది,

కానీ ఆరోగ్యానికి అంత ప్రశస్తం కాదు.


🔸 ఉదశ్విత్తు

సగం నీళ్లు పోసి తయారుచేసేది ఉదశ్విత్తు.


ఈ మూడింటిలోకి తక్రం ఆరోగ్యానికి చాలా ప్రశస్తం.


🔸 మజ్జిగ - మహా పానీయం


మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తగ్గి,

తిరిగి తలెత్తకుండా ఉంటాయనీ,

విషదోషాలు,

దుర్బలత్వం,

చర్మరోగాలు,

దీర్ఘకాలిక వ్యాధులు,

కొవ్వు,

అమిత వేడి తగ్గిపోతాయనీ,

శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందనీ,

యోగరత్నాకరంలో ఉన్నది.


దేవలోకంలో దేవతల కోసం అమృతాన్నీ,

ఇక్కడ మానవుల కోసం మజ్జిగనీ భగవంతుడు సృష్టించాడట..


వేసవి కాలంలో మనం మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి.


తోడుపెట్టినందు వలన పాలలో ఉండే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిలంగా ఉండటంతో పాటు,

అదనంగా లాక్టో బాసిల్లై అనే మంచి బాక్టీరియా మనకు దొరుకుతుంది.

పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉండదు. 


ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థకం అవుతుంది,

అందుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు. 


చిలికినందువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణం వస్తుంది అందుకని పెరుగుకన్నా మజ్జిగ మంచిది.


వయసు పెరుగు తున్నకొద్దీ మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి.


వేసవి కోసం ప్రత్యేకం కూర్చిక పానీయం..    


ఒక గ్లాసు పాలు తీసుకొని,

కాచి చల్లార్చి అందులో రెండుగ్లాసుల పుల్లని మజ్జిగ కలపండి ఈ పానీయాన్ని  కూర్చిక అంటారు.


ఇందులో పంచదార, ఉప్పు బదులుగా ఈ క్రింది  వాటిని కలపండి. 


ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ  100 గ్రాముల చొప్పున దేనికదే మెత్తగా దంచి...

మూడింటినీ కలిపి తగినంత ఉప్పు కూడా చేర్చి...

దాన్ని ఒక సీసాలో భద్రపరచుకోండి.


కూర్చికను తాగినప్పుడల్లా,

అందులో ఈ మిశ్రమాన్ని  ఒక చెంచా మోతాదులో కలిపి తాగండి,

వడదెబ్బ కొట్టదు,

పేగులకు బలాన్నిస్తుంది,

జీర్ణకోశ వ్యాధులన్నింటికీ ఇది మేలు చేస్తుంది, వేసవిలో కలిగే జలుబుని నివారిస్తుంది, వడదెబ్బ కొట్టని రసాల పానీయం ఇది.


ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకుండా చేస్తుంది కాబట్టి...

ఎండలో తిరిగి తిరిగి ఇంటికి వచ్చిన వారికి ఇచ్చే పానీయం ఇది. 


ఎండలోకి వెళ్లబోయే ముందు  మజ్జిగను ఇలా కూడా తయారు చేసుకొని తాగండి.


చక్కగా చిలికిన మజ్జిగ ఒక గ్లాసు నిండా తీసుకోండి. 

అందులో ఒక నిమ్మకాయ రసం,

తగినంత ఉప్పు (సైంధవ లవణం),

పంచదార,

చిటికెడంత తినేసోడా ఉప్పు కలిపి తాగి అప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్లండి వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది. 


మరీ ఎక్కువ ఎండ తగిలిందనుకొంటే తిరిగి వచ్చిన తరువాత ఇంకోసారి త్రాగండి. 


ఎండలో ప్రయాణాలు చేయవలసి వస్తే ...

ఒక సీసా నిండా దీన్ని తయారు చేసుకొని వెంట తిసుకెళ్లండి ...

మాటి మాటికీ తాగుతూ ఉంటే వడదెబ్బ కొట్టదు.


🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏

Saturday, April 6, 2024

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం*

 *💁🏻‍♂️ నేడు (7, ఏప్రియల్) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం*

〰〰〰〰〰〰〰〰

 *ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు.ఎంత సంపాదించినా ఆరోగ్యం సహకరించకుంటే అదంతా వేస్టే. ఆరోగ్యానికున్న ప్రాధాన్యత అలాంటిది.*

━━━━━━━━━━━━━━━━

*_ప్రజలు మెరుగైన ఆరోగ్యంతో జీవించాలనేది ఈ రోజు ముఖ్య ఉద్దేశం. అయితే, నిత్యం పనుల్లో బిజీగా గడిపేస్తున్న ప్రజలు తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది._*


*ఈ ఐదు అలవాట్లతో ఆరోగ్యంగా ఉండండి:*

1. *పౌష్టికాహారం, వేళకు భోజనం.*

2. *నిత్యం నీళ్లు తాగండి.*

3. *వ్యాయామం చేయండి.*

4. *తగిన నిద్ర అవసరం.*

5. *ఒత్తిడి దూరం చేసుకోండి.*

━━━━━━━━━━━━━━━━

  *ప్రతి రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులమయంతో కూడుకున్న ఈ జీవితంలో ఆరోగ్యం గురించి పట్టించుకునే తీరిక నేట ప్రజలకు కొరవడింది. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్యం కోసం ఇరవై సూత్రాలను తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.*


[ *''నో యాక్షన్ టు డే.... నో క్యూర్ టుమారో - నేటి అచేతనం ....రేపటి అస్వస్థత''*. ]


1. *ఉదయం నిద్ర లేవగానే పరకడుపున రెండు-మూడు గ్లాసుల నీటిని సేవించండి.*

2. *ప్రతి రోజు కనీసం పదిహేను నిమిషాలపాటు యోగాసనాలు లేదా వ్యాయామం చేయండి.*

3. *ఉసిరి లేదా త్రిఫలాతో కూడుకున్న నీటిని సేవించండి.*

4. *వారానికి ఓ రోజు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి. ఉపవాసం ఉన్న రోజులో కేవలం నీటిని లేదా పండ్లను మాత్రమే సేవించండి.*

5. *టీ, కాఫీ, పొగాకు, ధూమపానం, మద్యపానం, గుట్కా తదితరాలను సేవించకండి.*

6. *ఉదయాత్పూర్వమే నిద్ర లేచేందుకు ప్రయత్నించండి.*

7. *మీరు తీసుకునే భోజనంలో పులుపు, మిర్చి-మసాలాలు, చక్కెర, వేపుడు పదార్థాలను దూరంగా ఉంచండి.*

8. *భోజనం చేసే సమయంలో మౌనంగా భుజించండి.*

9. *భోజనంలో సలాడ్, రుతువులననుసరించి పండ్లు తప్పనిసరిగా తీసుకోండి.*

10. *మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పుదినుసులుండేలా చూసుకోండి.*

11. *మొలకెత్తిన గింజలు తరచూ తీసుకునేందుకు ప్రయత్నించండి.*

12. *ప్రతి రోజు క్రమం తప్పకుండా స్నానం చేయండి. దీంతో శరీరం శుభ్రమవ్వడమే కాకుండా ఆరోగ్యంగానూ ఉంటారు.*

13. *ఉదయం మీరు తీసుకునే అల్పాహారం తేలికపాటిదై ఉండాలి. త్వరగా జీర్ణమయ్యేదిగా ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.*

14. *నిద్రకు కృత్రిమమైన సాధనాలను ఉపయోగించకండి.*

15. *మిగిలిపోయిన లేదా పాచిపోయిన ఆహారాన్ని తీసుకోకండి, దీంతో ఆకలి తీరడం మాట అలావుంచితే అనారోగ్యంపాలవ్వడం ఖాయం.*

16. *పండ్లు తీసుకునేటప్పుడు అవి తాజాగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించి మరీ తీసుకుంటే మంచిది. ఎక్కువరోజులు నిల్వవుంచిన పండ్లను తీసుకోకూడదు.*

17 *ఉదయం-రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా దంతావధానం చేయాలి.*

18. *సమయానుసారం భోజనం చేయాలి, రాత్రి ఆలస్యంగా భోజనం చేయకండి.*

19. *అలాగే రాత్రి ఎక్కువసేపు మేలుకోకండి. దీంతో ఆరోగ్యం పాడవ్వడమే కాకుండా ఉదయం ఆలస్యంగా నిద్రలేసే అవకాశాలు ఎక్కువ. పైగా మరుసటిన రోజు చేయాల్సిన పనులు ఆలస్యంగానే ప్రారంభమౌతాయి.* 

20. *మానసికంగా ఒత్తిడి పెరిగితే పలు జబ్బులకు ఆహ్వానం పలికినట్లౌతుంది. దీంతో ఒత్తిడిగా అనిపించినప్పుడు మీకిష్టమైన సంగీతం లేదా పుస్తకపఠనం చేస్తే చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.*

━━━━━━━━━━━━━━━━

*వేసవిలో అతి త్వరగా స్పాయిల్ అయ్యే ఆహారాలేంటో తెలుసుకుందాం...*

1. పాలు:

2. బటర్:

3. రోటీస్:

4. దాల్ 

5. వాటర్ మెలోన్:

6. కోకనట్ కర్రీలు:

7. చట్నీలు:

8. నీటిశాతం ఎక్కువగా ఉండే కూరగాయలు: (టమోటో, గార్డ్స్, గుమ్మడి, ఆరెంజ్ వంటివి)

9. పెరుగు:

10. పాస్ట్రీస్: (క్రీమ్ అధికంగా ఉండటం వల్ల)

11. చికెన్:

12. *బంగారు, వెండి నాణేల కంటే ఆరోగ్యమే మనకు నిజమైన సంపద*

వివాహ ఖర్చు ఆడపిల్ల తండ్రే ఎందుకు పెట్టుకుంటాడు

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

వివాహ ఖర్చు ఆడపిల్ల తండ్రే ఎందుకు పెట్టుకుంటాడు ?

పెళ్ళిలో ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు? ఎవరైన సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే వారే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఆడపిల్ల కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక ఆయనది. కనుక ఆ వేదిక పై అధికారం ఆరోజు ఆయనదాని శాస్త్రం చెప్తుంది.

కన్యాదాత తండ్రి దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చినవాళ్ళు మగపిల్లాడు, అతని తల్లిదండ్రులు. మీ పిల్లవాడిని వంశోద్ధారకుడనే మీరు భావించవచ్చు. కానీ వంశాన్ని నిలబెట్టడానికి వాడు గర్భం దాల్చలేడు. మరి వాడు వంశోద్ధారకుడు లేదా వంశాన్ని నిలబెట్టేవాడు ఎలా అయ్యాడు? ఇలాంటి నిస్సహాయ స్థితి లో ఉన్న మీ కొడుకుకి ఆయన తన కుమార్తెనే దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మరి వరుని తల్లిదండ్రులు కన్యాదాత ఔదార్యానికి తలవంచాలిగా?


కాబట్టి ఇప్పుడు దానం పుచ్చుకోవడానికి వచ్చిన వారికి, కన్యాదాత మీద పడి అరవాడనికి, విసుక్కోవడానికి అధికారం ఎక్కడిది?దానం ఇస్తున్నవాడిని ఇంకా ఇంకా కట్నాలు, కానుకలు, లాంచనాలు అవీ ఇవీ అడగచ్చు అని ఎవరు చెఫ్ఫారు నీకు? దానం పుచ్చుకునేవాడికి అది కావాలి ఇది కావాలి అని అడిగే అధికారం ఉందా? కన్యాదాత ఏది ఇస్తే దానిని కళ్ళకు అద్దుకుని పుచ్చుకోవడమే. వరుని ఇంటికి ఇరవై ఏళ్ళ పాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న లక్ష్మిని పంపిస్తున్నారు. అంతకన్నా ఇంకేం కావాలి?


"సీతారాములలా ఉండండి!" అని వధూవరులను ఆశీర్వదించేయడం కాదు. నిజంగా సీతారామకళ్యాణ ఘట్టం చదివితే, మగ పెళ్ళివాళ్ళు ఎంత హద్దులలో ఉండి ప్రవర్తించాలో తెలుస్తుంది. జనక మహారాజు, దశరథ మహారాజుని అడుగుతారు "మీకు మా కుమార్తెని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం అంగీకారమేనా?" అని. అప్పుడు దశరథ మహారాజు ఏమంటారో తెలుసా? "అయ్యా! ఇచ్చేవాడు ఉంటేనే కదా పుచ్చుకునేవాడు ఉండేది" అని. దశరథుడు ఎన్నో యజ్ఞయాగాదులను జరిపించిన మహారాజు. తన కుమారుడైన రామచంద్ర ఎంతో పరాక్రమవంతుడు, ఎంతో గుణవంతుడు. అయినా దాత అయిన జనకునితో మాట్లాడేటప్పుడు తన మర్యాదలో, తన హద్దులో తాను ఉన్నాడు.


అసలు వివాహ నిశ్చితార్థంలో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక ఇరు వర్గాల వారూ కూర్చుని సీతారామకళ్యాణ సర్గ చదవాలి. ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు!


అసలు ఒక ఇంటి మర్యాద ఏమిటో వాళ్ళ ఇంట్లో పెళ్ళి చేసే రోజున తెలిసిపోతుంది.


తన కూతురి పెళ్ళి వైభవంగా జరిపించాలి అని కన్యాదాతకు తెలియదా? "పెళ్ళి బాగా గొప్పగా జరిపించండీ!" అని మగపెళ్ళివారు ప్రత్యేకంగా చెప్పాలా? కన్యాదాత తనకి ఉన్నదాంట్లో వేదికను ఏర్పాటు చేసి మీకు కన్యాదానం చేస్తాడు. దానం పుచ్చుకోవడానికి వచ్చినవానికి ఏర్పాట్లు ఎలా చెయ్యాలో చెప్పడానికి అధికారం ఉండదు.


కట్నాలు, ఎదురు కట్నాలు, పెళ్ళి వాళ్ళ అరుపులు, కేకలు, అత్తవారి చివాట్లు, ఆడపడుచుల దబాయింపులు - ఇలాంటివి సనాతన ధర్మానికి తెలియదు.👌అందరికి పంపించండి🙏


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి ఇక్కడ 25 మార్గాలు ఉన్నాయి

 *అందరికి ఉపయోగపడే విషయం పూర్తిగా చదవండి*

*మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి  ఇక్కడ 25 మార్గాలు ఉన్నాయి:* 

 1. పుష్కలంగా నీరు త్రాగడం ద్వారా హైడ్రేటెడ్ గా ఉండండి.

 2. సోడియం మరియు ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలు తక్కువగా ఉన్న సమతుల్య ఆహారాన్ని అనుసరించండి.

 3. కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు, కానీ మితంగా తీసుకోండి.

 4. విటమిన్ సి సప్లిమెంట్లను అధికంగా తీసుకోవడం మానుకోండి.

 5. ప్యూరిన్లు (ఎరుపు మాంసం మరియు షెల్ఫిష్ వంటివి) అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం పరిమితం చేయండి.

 6. చక్కెర పానీయాలు మరియు ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించండి.

 7. ఆహారం మరియు వ్యాయామం ద్వారా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించండి.

 8. నిమ్మకాయలు మరియు నారింజ వంటి సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకోండి.

 9. కెఫిన్ తీసుకోవడం పరిమితం చేయండి.

 10. బచ్చలికూర, గింజలు మరియు చాక్లెట్ వంటి అధిక-ఆక్సలేట్ ఆహారాలను నివారించండి.

 11. రక్తపోటు మరియు రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించండి మరియు నిర్వహించండి.

 12. కాల్షియం ఆధారిత రాళ్లను నివారించడానికి ఉప్పు తీసుకోవడం పరిమితం చేయండి.

 13. ఆకు కూరలు, గింజలు మరియు గింజలు వంటి మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.

 14. గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి మీ ఆహారంలో ప్రోబయోటిక్స్‌ని చేర్చండి.

 15. కిడ్నీలో రాళ్లను నివారించడానికి శారీరకంగా చురుకుగా ఉండండి.

 16. సడలింపు పద్ధతుల ద్వారా ఒత్తిడి స్థాయిలను నిర్వహించండి.

 17. మీరు వచ్చే అవకాశం ఉన్న కిడ్నీలో రాళ్ల రకాన్ని బట్టి ఆహార మార్పులను పరిగణించండి.

 18. పార్స్లీ లేదా డాండెలైన్ రూట్ నుండి తయారైన హెర్బల్ టీలు వంటి సహజ నివారణలను ఉపయోగించండి.

 19. అవసరమైతే, మీ వైద్యునితో మందులు లేదా సప్లిమెంట్ల గురించి చర్చించండి.

 20. జంతు ప్రోటీన్ల తీసుకోవడం పరిమితం చేయండి.

 21. జీర్ణక్రియ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.

 22. క్రాష్ డైట్‌లు లేదా వేగవంతమైన బరువు తగ్గించే కార్యక్రమాలను నివారించండి.

 23. మీరు ధూమపానం చేసే వారైతే ధూమపానం మానేయండి.

 24. మీ మూత్రం pH స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.

 25. వ్యక్తిగతీకరించిన సలహా మరియు చికిత్స ఎంపికల కోసం ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించండి.


ఆరోగ్యం మన జన్మకు తప్పని హక్కు

 ఆరోగ్యం మన జన్మకు తప్పని హక్కు


నాలుగేళ్ల క్రితం కరోనా ప్రపంచాన్ని వణికించింది.భూతాపం పెరగడం వల్లే కరోనా వ్యాపించిందని పలువురు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన  అధికారిక ప్రపంచ ఆరోగ్య ప్రచారాలలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం, ప్రపంచ రోగనిరోధక వారోత్సవం, ప్రపంచ మలేరియా దినోత్సవం, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, ప్రపంచ రక్తదాత దినోత్సవం, ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంతో పాటు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని కూడా చేర్చారు.


ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ అందరకీ ఆరోగ్యం అనే నినాదానికి కట్టుబడి పని చేయాలి.అలాంటప్పుడే కోవిడ్ లాంటి వైరస్ వ్యాధులను  అడ్డుకట్ట వేయవచ్చు.గతంలో ఉన్న నివేదికలు చూసుకుంటే… కోవిడ్ మొదటి దశ, రెండవ దశలో ప్రజలు తీసుకున్న జాగ్రత్తల వల్ల అనేక రకాలైన రోగాలు  దరిచేరలేదు,


ఆరోగ్యంగా ఉండటానికి సమతుల్య, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.  రోజువారీ ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉండే వాటిని తీసుకోవాలి. ఇది కాకుండా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, చక్కెర, శీతల పానీయాల వినియోగాన్ని తగ్గించడం మేలు.ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం మనందరికీ తెలుసు. దీనికి అలవాటు పడి ఉంటే, ఈరోజే దానిని మానేయాలి . ఎందుకంటే ఇది అనేక వ్యాధులకు కారణమవుతుంది.


మనుషులందరికీ ఆరోగ్యం ప్రాథమిక హక్కుగా లభించాలి. ఆర్థిక భారం కాకుండా అవసరమైనపుడు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలి. అనేవి లక్ష్యాలు కాగా ప్రపంచంలో దాదాపు 30 శాతం జనాభాకు ప్రాథమిక ఆరోగ్య సేవలు కూడా అందుబాటులో లేవు.


యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రజలను పేదరికం నుంచి బయటపడేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నమ్మకం.అందరికీ ఆరోగ్యం అనే మాటను నిజం చెయ్యడానికి ఇది అవసరం. నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించే నైపుణ్యం కలిగిన ఆరోగ్య కార్యకర్తలు, వైద్య నిపుణులతో పాటు ఆరోగ్యాన్ని అందించేందుకు పెట్టుబడి పెట్టగలిగే విధాన రూపకర్తలు కూడా యూనివర్సల్ హెల్త్ కవరేజి అవసరం.

ఏప్రిల్ 7-ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

PostMen

 *PostMen In The Mountains*       

         *పర్వతాలలో పోస్ట్ మాన్..!*

                  (చైనీస్ సినిమా.)

           

హూ వో జియాంకి దర్శకత్వం వహించిన ఈ సినిమా 1999 లో నిర్మింపబడి,గోల్డెన్ రూస్టర్ అవార్డ్ పొందింది.


పర్వత ప్రాంతాలలో తపాలా అందించే పోస్ట్ మన్ (టెంగ్ రుజుస్) వృద్దుడై పోయి నందున, ఆ పర్వత ప్రాంతాలలో మోకాళ్ళ నొప్పులతో నడవలేక పోతాడు. అతడు ఉద్యోగ విరమణ చేస్తాడు. ప్రభుత్వం అతని ఉద్యోగాన్ని అతని కొడుకు(లియు యే)కి ఇస్తుంది.


 వాళ్ళు ఎంతో ప్రేమగా పెంచుకునే బడ్డీ అనే జర్మన్ షెపర్డ్ కుక్క ప్రయాణ మార్గంలో, తండ్రికి తోడుగా వుంటుంది. 


ఈ సినిమా చైనా లోని దక్షిణ హునాన్ ప్రాంతంలోని దట్టమైన అడవులు, కొండలలో, ఆ కొండల్లో వుండే పల్లెల్లో చిత్రీకరించారు.


తండ్రి పోస్ట్ లో వచ్చిన ఉత్తరాలు, పార్శిల్స్, పత్రికలు అన్నీ వీపున మోసే ఒక పెద్ద బాగ్ లో సర్డుతాడు. ఆ పర్వతాలలో వెళ్లాల్సిన 112 కి. మీ. దారిని మాప్ లో కొడుకుకు చూపిస్తూ వివరిస్తాడు.


ఇన్నేళ్ల తన ప్రయాణంలో కుక్క తోడుగా వుందని, దానికి అన్ని మార్గాలు తెలుసునని దాన్ని తోడుగా తీసుకుని ఇక బయలు దేరమని చెప్తాడు.


తండ్రితో వెళ్ళటం అలవాటైన కుక్క, కొడుకుతో వెళ్ళటానికి మొరాయిస్తుంది. తండ్రి ఎంత బుజ్జగించే ప్రయత్నం చేసినా వినదు. ఇక తండ్రి తనే చివరి సారిగా కొడుకు వెంట వెళ్ళి, ఆ మార్గం, ఆ పల్లెలు, అక్కడి ప్రజల్ని పరిచయం చేయాలని బయలు దేరుతాడు.

       

దట్టమైన అడవిలో తండ్రి,  వీపున బరువైన బాగ్ తో కొడుకు, కుక్క బడ్డీ బయలుదేరుతారు.


ఈ ప్రయాణానికి మూడు రోజులు పడుతుంది. పోస్ట్ మాన్ ఉద్యోగం చేస్తూ, ఎప్పుడూ కుటుంబానికి దూరంగా ఈ పర్వత ప్రాంతాలలోనే గడిపిన తండ్రి, బాల్యంలో తన కొడుకు ముద్దు ముచ్చట్లను, అతని పెరుగుదలను చూసే అవకాశం కోల్పోతాడు.


కొడుకు ఇప్పటి వరకూ తండ్రి పట్ల కొంత ఉదాసీనంగానే వుంటాడు. ఈ ప్రయాణంలో తండ్రి, తన కొడుక్కి తన గురించి, కుటుంబం గురించి, తన మనో భావాల గురించి చెప్పే వీలు దొరుకుతుంది. 

కొడుక్కి కూడా తండ్రిని గురించి తెలుసుకునే అవకాశం దొరుకుతుంది.


ఎంతో కష్టపడి, అడవుల్లో ప్రయాణిస్తూ, కొండలెక్కి దిగితూ, తమ కోసం పోస్ట్ మోసుకుని వచ్చే ‘టేంగ్ రుజుస్’ పట్ల ఆ కొండ ప్రజలు ఎంతో ప్రేమను కనబరుస్తారు. తమ కష్టసుఖాలను అతనితో ముచ్చటిస్తూ వుంటారు. తమ ఇంట్లో మనిషి లాగా, ఒక స్నేహితుడు లాగా అతన్ని ఆదరిస్తారు. అక్కడి ప్రజలు పోస్ట్ మాన్ కోసం ఆహారం, ఆశ్రయం కల్పిస్తారు.


ఒక పల్లెలో గుడ్డిదైన ఒక ముసలమ్మ వీళ్ళ రాక కోసం ఎదురు చూస్తూ వుంటుంది. కొడుకు,కోడలు చనిపోతే ఆ అవ్వ మనవడిని ఎంతో కష్ట పడి పెంచి వున్నతోద్యోగిని చేస్తుంది. 


ఆ మనవడు ప్రతినెలా 20డాలర్స్ మనియార్దర్ పంపు తాడే గానీ, అవ్వ యోగ క్షేమాలు ఏమీ కనుక్కో డు. అవ్వ డబ్బు కన్నా, మనవడి వుత్తరం కోసం ఎక్కువ ఎదురు చూస్తుంది. 


పోస్ట్ మాన్ తెంగ్   ఆమె మనవడు రాసినట్లుగా చెబుతూ, తానే  రాసిన 

ఉత్తరం  చదువుతాడు. మనవడే స్వయంగా తనతో మాట్లాడినంత సంతోష పడుతుంది అవ్వ.


కొడుక్కి  ‘నువ్వు  గూడా ఇలానే చదివి ఆమెను సంతోషపెట్టు!’ అని చెప్తాడు.

         

మార్గ మధ్యంలో సేద తీరుతున్నపుడు వచ్చిన పెద్ద గాలికి, అప్పుడే విప్పిన సంచిలోని ఉ త్తరాలు ఎగిరి పోతుంటాయి. వాళ్ళు ఎంతో కష్టం మీద వాటిని ఎగిరి పోకుండా కాపాడుతారు. ఒకటి రెండు ఉ త్తరాలను కుక్క గాల్లోకి ఎగిరి పట్టుకుంటుంది.


ఇంకోసారి దారిలో వున్న పెద్ద ఏరును దాటుతున్నపుడు గూడ తపాలా సంచిని నెత్తి మీద పెట్టుకుని, భుజాల లోతు వున్న నీటిని జాగ్రత్తగా దాటుతారు. అప్పుడు తండ్రి, కొడుకుతో “మన ప్రాణాలు పోయినా సరే, తపాలా ను చాలా జాగ్రత్తగా కాపాడాలి. ఇది ఉద్యోగ ధర్మం!” అని చెబుతాడు.


నడక శ్రమ తెలియకుండా తండ్రి, కొడుకులు పాటలు పాడుకుంటూ, వెళ్తారు. తండ్రి ఆ పల్లెల ఆచారాలు, పండుగలు, సంప్రదాయాల గురించి వివరిస్తాడు.


ఈ పల్లెల్లో తనకు తారసపడిన ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నానని, ఆమె తన నమ్మకాన్ని వమ్ము చేయలేదని, తనని ఎంతగానో ప్రేమించినదని, కుటుంబాన్ని చక్కగా నిర్వహించినదని, ఉద్యోగ రీత్యా తాను దూరంగా వున్నా, కొడుకైన నిన్ను చక్కని పౌరునిగా తీర్చి దిద్దిందని చెబుతాడు.


కొడుకుతో నువ్వు గూడ   ఈ కొండ ప్రాంతం అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని తన కోరిక అని చెప్తాడు. 


ఇక్కడి అమ్మాయిలు అందగత్తెలు, నిజాయితీ పరులు, కష్టించి పని చేస్తారు అని వివరిస్తాడు..


దారిలోని   ఒక పల్లెలో   జరుగుతున్న జాతరలో పాల్గొంటారు. చైనీయుల లుషెంగ్ డాన్స్ ఇక్కడ మనం చూడొచ్చు.


మార్గమధ్యంలో అనేక విషయాలతో పాటు, చైనా తపాలా వ్యవస్థ తీరు, అధికారుల వైనం విడమరుస్తాడు. చేసే ఉద్యోగాన్ని ఇష్టంగా చేయాలని, ఉద్యోగాన్ని ప్రేమిస్తే   ఏదీ కష్టం అనిపించదు’ అని చెప్తాడు. దానికి నేనే ఉదాహరణ, ఈ ప్రజల ప్రేమే ఉదాహరణ అనిచెబుతాడు.


ఈ మూడు రోజుల ప్రయాణం ముగిసే లోపు కొడుకు, తండ్రిని గురించి అర్ధం చేసుకుంటాడు. పల్లె ప్రజలు తన తండ్రి పట్ల చూపించిన ప్రేమ, ఆదరణకు పొంగి పోతాడు.


మోకాళ్ళ నొప్పులతో బాధ పడుతూ, కూర్చున్న ప్రతి సారి కుక్క బడ్డీ వచ్చి, తేంగ్   మోకాళ్ళ కింద  దూరి నిలబడుతుంది. తేంగ్ దాన్ని నిమురుతూ, తన మోకాళ్ళను కాస్త రుద్దుకుంటూ  ఉపశమనం పొందుతాడు.


 మూడు రోజుల తర్వాత ముగ్గురూ ఇంటికి తిరిగి వస్తారు. ఆ పల్లెల్లో పోస్ట్ బాక్స్ లలో వేసిన వుత్త రాలతో సహా! 


ఉద్యోగ నిర్వహణలో భాగంగా తిరిగి పోస్ట్ తో బయలు దేరుతున్న కొడుకు వెంట, ఒకసారి చెప్పగానే సంతోషంగా కుక్క బడ్డీ అనుసరిస్తుంది.


ఈ సినిమాలో మూడు ప్రధాన పాత్ర లైన తండ్రి, కొడుకు, కుక్క అద్భుతంగా నటించారు.


ఒక్క ముక్కలో చెప్పాలంటే అందమైన హునాన్ అటవీ ప్రాంతంలో   తండ్రి, కొడుకు, కుక్క ఎలా ప్రయాణించారన్నదే ఈ సినిమా.


అద్భుతమైన ప్రకృతిని చూడాలనుకునే వారికి ఈ సినిమా ఒక వరం అని చెప్పొచ్చు.


యూ ట్యూబ్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో వుంది..సినిమా. 


చైనా దేశపు మాండరిన్ భాషలో నడుస్తుంది. సినిమా వ్యవధి  గంటన్నర!✍️

           

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE