NaReN

NaReN

Monday, January 29, 2024

మీకు ఎవరైనా ఆగర్భ శత్రువు ఉన్నాడా?

 మీకు ఎవరైనా ఆగర్భ శత్రువు ఉన్నాడా? వాడు రోజు కృషించి కుక్క చావు చావాలి అనుకుంటున్నారా? 


అయితే వాడికి రోజు కాగితం కప్పులో టి తాగించండి. చట్టానికి దొరక్కుడా కోల్డ్ మర్డర్ గా ఎవరినయినా చంపాలని అనుకుంటున్నారా? 


అయితే వాడికి రోజు కాగితం కప్పులో టి తాగించండి. వాడు క్యాన్సర్ తో కుక్క చావు చస్తాడు.


మేముకూడా రోజు కాగితం కప్పులోనే టి తాగుతున్నాము కదా అంటారా? అయితే మిమ్మల్ని క్యాన్సర్ తో చంపాలని చాయి బండి వాడు కుట్రపన్నుతున్నాడు. 


కాగితం కప్పులో టి తాగిగే డిగ్నిటీ అని అనుకుంటే మీరు 'కప్పులో కాలు వేసినట్లే.' గాజు గ్లాస్ లో టి తాగితే ఇతరులు ఎంగిలి అంటుకుంటుంది అనుకుంటే మీకు సైన్సు మీద సరైన అవగాహన లేనట్లే.


ఇవి నేను చెప్తున్న మాటలు కాదు. మొన్న లండన్లో జరిగిన అంతర్జాతీయ క్యాన్సర్ సెమినార్లో నూటికి నూరు మంది సైంటిస్ట్ లు చెప్పిన నిజమిది. 


ఇండియాలో చదువుకున్న వాళ్లు కూడా కాగితం కప్పులల్లో టీ లు, కూల్ డ్రింక్ లు తాగుతూ క్యాన్సర్ ని కొనుక్కుంటున్నారు, వాళ్ళను ఎడ్యుకేట్ చేసేందుకు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం దంలేదు అని బాధపడ్డారు. 


ఎయిడ్స్ నివారణ కోసం కండోమ్ లు పంచిన ప్రభుత్వం క్యాన్సర్ నివారణచేసేందుకు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడండం లేదు అని బాధపడ్డారు.


పింగాణి కప్పులు, గాజు గ్లాస్ లో టి ఇస్తే వాటిని కడగాలి. దానికోసం నీళ్ళు కావాలి. పని వాళ్లు కావాలి. కాబట్టి బండివాడు కాగితం కప్పులో టి ఇచ్చి క్యాన్సర్ ని మీకు పది రూపాయలకు అమ్ముతున్నాడు.


మీరు ఎప్పుడైనా కాగితం తయారు చేసే ఫ్యాక్టరీ కి వెళ్ళరా? ఒకసారి వెళ్లి చూడండి. జీవితంలో మీరు కాగితం కప్పులో టి తాగరు. 


కాగితం తయారు చేయడానికి మురికి కాలువలో ప్రవహించే నీళ్ళు వాడతారు. వాటర్ ట్యాంక్ నాచుతో కంపు వాసనతో ఉంటుంది. దాని నిండా పురుగులే. చనిపోయిన ఎలుకల ఎముకలు తేలుతాయి. రా మేటిరియల్ని కుల్లబెడతారు. కాళ్ళతో తొక్కి మెత్తగా చేస్తారు. దాదాపు 15 రకాల కెమికల్స్ వాడుతారు. అందులో ఆసిడ్ లాంటి విషపూరిత కేమికల్స్ ఎక్కువ. 


కాగితం కప్పు మెత్తబడుకుండ ప్లాస్టిక్ తో చేసిన ఫెవికాల్ లాంటి కెమికల్ గమ్ కూడా వాడతారు. 


ఆ కాగితంలో చేసిన కప్పులో వేడి వేడి టీ పోయగానే చాలా రకాల కేమికల్స్ బయటికి వచ్చి టీ లో కలుస్తాయి. మీరు గమనించండి. టి కప్పులో తాగే టి కంటే కాగితం కప్పులో తాగే టి కొంచం చేదుగా ఉంటుంది. అవే అడ్డమైన కెమికల్స్. 


సాటి మనిషి ఎంగిలి కప్పులో మనం కూడా టి తాగితే చిన్నా చితక రోగాలు రావచ్చుగాకా. కానీ ప్రాణాంతక మైన క్యాన్సర్ రాదు.


లివర్ చెడిపోయి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళితే ముందుగా "మీరు సిగరెట్లు కాలుస్తారా? మందు తాగుతారా?" అని అడుగుతాడు. 


అలాగే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్లు వెళ్ళగానే అడిగే మొదటి ప్రశ్న "మీరు కాగితం కప్పులో టి తాగే వారా?" అని.


*కాగితం కప్పులకు గుడ్ బై చెప్పి క్యాన్సర్ కి దూరంగా బ్రతుకుదాం*

తాగాలనుకుంటే ఒక స్టీల్ కప్పు దగ్గర ఉంచుకోండి

 మీ 

పసుపులేటి నరేంద్రస్వామి

Monday, January 22, 2024

Women Health

 Women Health

Health Information 

ప్రతి స్త్రీ తప్పనిసరిగా చేయించుకోవలసిన  5 ఆరోగ్య పరీక్షలు

5 health tests every woman should have


 

సాధారణం గా భారతీయ మహిళలు తమ సొంత అవసరాల కన్నా కుటుంబ జీవితానికి ప్రాధాన్యత ఇస్తారు. ఆధునిక సమయం లో వేగంగా మారుతున్న  జీవనశైలి వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ క్రింది ఐదు ఆరోగ్య పరీక్షలు చేయడం ద్వారా భారతీయ మహిళల్లో చాలావరకు  సాధారణ ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు లేదా సమర్థవంతంగా పరిష్కరించవచ్చు.


1. రక్తహీనత Anaemia

భారత దేశం లో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రక్తహీనత. ఇది అత్యంత సాధారణ రక్త రుగ్మత. శరీర కణజాలాలకు లేదా అవయవాలకు తగినంత ఆక్సిజన్‌ను తీసుకువెళ్ళడానికి ఒక వ్యక్తి వద్ద  తగినంత ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు లేని పరిస్థితి. మహిళలు ముఖ్యంగా ఐరన్/ ఇనుము లోపం వలన రక్తహీనతకు గురవుతారు. ఎందుకంటే వారు పిరియడ్స్ సమయం లో రక్తం కోల్పోతారు. భారతదేశపు  మహిళలలో రక్తహీనతఎక్కువ. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం, 2016 లో 58.6% మంది పిల్లలు, 53.2% గర్భిణీ కాని  స్త్రీలు మరియు భారతదేశంలో 50.4% గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో ఉన్నట్లు గుర్తించారు.


మహిళలకు సాధారణ హిమోగ్లోబిన్ స్థాయి డెసిలిట్రేకు 12 గ్రాములు (గ్రా / డిఎల్ఎల్ decilitre (g/dlL).)ఉండాలి.  మహిళలందరూ కనీసం సంవత్సరానికి ఒకసారి రక్తహీనతకు పరీక్షలు చేయించుకోవాలి. పరీక్షలో  ఎర్ర రక్త కణాలు, హేమాటోక్రిట్, హిమోగ్లోబిన్ మరియు ఫెర్రిటిన్ స్థాయిల పరిమాణం మరియు రంగు తెలుస్తుంది..


2.విటమిన్ డి లోపంVitamin D Deficiency

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పిసిఒఎస్ PCOS) ఉన్న మహిళల్లో ఎముక ఆరోగ్యం మరియు నిరాశకు గురయ్యే ప్రమాదాన్ని  పరిశోధకులు విటమిన్ డి లోపo తో  అనుసంధానించారు. ఎముక నొప్పి, కండరాల బలహీనత మరియు అలసట లక్షణాలు విటమిన్ డి లోపo ను తెలియ జేస్తవి.  మహిళలు తరచూ వారి ఆహారం నుండి తగినంత విటమిన్ డి పొందలేరు లేదా సూర్యరశ్మికి ఎక్ష్పొజ్expose కావుట లేదు తద్వారా వారిలో విటమిన్-డి లోపం ఏర్పడుతుంది. విటమిన్ డి తగిన స్థాయిని కలిగి ఉండటం మొత్తం ఆరోగ్యం మరియు ఒక వ్యక్తి యొక్క శ్రేయస్సు కు చాలా ముఖ్యం.


మీ శరీరంలో విటమిన్ డి ఎంత ఉందో కొలవడానికి అత్యంత ఖచ్చితమైన మార్గం 25-హైడ్రాక్సీ విటమిన్ డి రక్త పరీక్ష. ఆరోగ్యకరమైన వ్యక్తులకు 20 నానోగ్రాములు / మిల్లీలీటర్ నుండి 50 ఎన్జి / ఎంఎల్ స్థాయి సరిపోతుంది. 12 ng / mL కన్నా తక్కువ స్థాయి విటమిన్ డి లోపాన్ని సూచిస్తుంది.


2. కాల్షియం లోపం Calcium Deficiency

వయస్సు పెరిగే కొద్ది మహిళలు  బోలు ఎముకల వ్యాధి (osteoporosis) కి గురవుతారు (ఎముక యొక్క సాంద్రత మరియు నాణ్యత తగ్గుతుంది). మన శరీరానికి అవసరమైన కాల్షియం అందించడానికి మంచి ఆరోగ్యకరమైన ఆహారం సరిపోతుంది. అయినప్పటికీ, మహిళలు ఎముక క్షీణత లేదా పగులుకు గురయ్యే వరకు తమకు తక్కువ కాల్షియం స్థాయిలు ఉన్నాయని గుర్తించరు.


కాల్షియం, అల్బుమిన్ మరియు అయోనైజ్డ్ లేదా ఉచిత కాల్షియం స్థాయిలను తనిఖీ చేయడానికి మహిళలు సంవత్సరానికి ఒకసారి రక్త పరీక్ష చేయించుకోవాలి. 8.8 mg / dL కన్నా తక్కువ కాల్షియం స్థాయిలు కాల్షియం లోపం వ్యాధి (హైపోకాల్సెమియా) నిర్ధారణను నిర్ధారించవచ్చు.


 3.పాప్ స్మెర్ మరియు పెల్విక్ పరీక్షలుPap Smears and Pelvic Exams

21 సంవత్సరాల వయస్సు నుండి మహిళలు ప్రతి సంవత్సరం ఈ పరీక్షలు చేయించుకోవాలి. గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఇది చాలా ముఖ్యం, క్యాన్సర్ మహిళల్లో మరణానికి రెండవ ప్రధాన కారణం. రెగ్యులర్ స్క్రీనింగ్ ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ను పూర్తిగా నివారించవచ్చు.


పెల్విక్  పరీక్షలో చికాకు, ఎరుపు, పుండ్లు, వాపు లేదా ఇతర అసాధారణతలను తనిఖీ చేయడానికి బాహ్య దృశ్య పరీక్ష ఉంటుంది, తరువాత అంతర్గత దృశ్య పరీక్ష ఉంటుంది. గర్భాశయ కణాలను పరిశీలించడానికి మరియు గర్భాశయం మరియు గర్భాశయంలో ఏదైనా అసాధారణ పెరుగుదలను తనిఖీ చేయడానికి పాప్ స్మెర్ పరీక్ష నిర్వహిస్తారు.


ఏవైనా సమస్యలను మినహాయించి, 30 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలకు వరుసగా మూడు సాధారణ పరీక్షలు మరియు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పాప్ స్మెర్ అవసరం.


ఈ పరిక్షలను ఎంపికైన  ప్రభుత్వ హాస్పిటల్ లో ఉచితంగా చేస్తారు.

 

4.మామోగ్రామ్స్ మరియు రొమ్ము పరీక్షలుMammograms and Breast Exams 


 మహిళల్లో అన్ని నివారణ పరీక్షలు ప్రారంభంలోనే(early) ప్రారంభమవుతాయి మరియు పరీక్షలో రొమ్ము క్యాన్సర్‌ను తనిఖీ చేయడం జరుగుతుంది. ముద్దలు మరియు అసాధారణతలను డాక్టర్ పరీక్షించే మాన్యువల్ పరీక్ష 20 సంవత్సరాల వయస్సు నుండి 40 సంవత్సరాల వరకు సిఫార్సు చేయబడింది.


మామోగ్రామ్ అనేది రొమ్ము క్యాన్సర్‌కు స్క్రీనింగ్ పరీక్ష మరియు రొమ్ములకు మితమైన కుదింపును వర్తింపజేయడం ద్వారా ఎక్స్‌ రే చిత్రాలను తీసుకొంటారు.అమెరికన్ క్యాన్సర్ సొసైటీ సిఫారసు చేసినట్లు 40 సంవత్సరాల వయస్సు నుండి ప్రతి ఒకటి లేదా రెండు సంవత్సరాలకు మామోగ్రామ్‌లు చేస్తారు.

ఎవరి కొరకు ?

 ఎవరి కొరకు ఎవరు సంపాదిస్తున్నారు ?

ఎవరి కొరకు ఎవరు బ్రతుకుతున్నారు ?

ఎవరి కొరకు ఎవరు చస్తున్నారు ?



NT రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాడు తర్వాత ఎవరికి దక్కింది ?


స్వాతంత్రం కొరకు ఎంతోమంది బలయ్యారు కానీ స్వాతంత్రం పేరు ఎవరికి దక్కింది.ప్రత్యేక ఆంధ్ర కోసం ఎంతో మంది అమరులయ్యారు.ఎవరు అమృతం తాగేరు 


తెలంగాణను ఎంతో కష్టపడి సాధించారు 

అ పేరు ఎవరికి దక్కింది 


ఒక వ్యక్తి బాగా డబ్బు సంపాదించి కూడబెట్టి సంతానం మగ పిల్లలు లేకపోవడంతో ఆడబిడ్డలు ఉంటే ఇల్లరికం తెచ్చుకుంటే ఆ ఆస్తి అంతా ఎవరు అనుభవిస్తారు ?


కష్టపడి రూపాయి రూపాయి జమ చేసుకొని బంగారం కొనుక్కొని బంగారం ఒంటినిండా పెట్టుకోని పెళ్లికి వెళ్లి వచ్చేటప్పుడు ఏ దొంగనో ఎత్తుకొని వెళ్తాడు


తేనెటీగలు ఎంతో కష్టపడి తేనెను పోగుచేస్తాయి అది ఎవరో దొంగిలిస్తారు


ఒక వ్యక్తి ఎంతో కష్టపడే జ్ఞానాన్ని సంపాదిస్తాడు 

అ జ్ఞానం తన సంతానానికి దక్కుతుందన్న గ్యారెంటీ లేదు దానికి ఎవరు అర్హులో వారే జ్ఞానాన్ని పొందుతారు


ఎవరు ఎలా సంపాదించిన ఎవరికి దక్కాలో అది వారికే దక్కుతుంది తాను అనుభవించొచ్చు అనుభవించకపోవచ్చు 


ఎవరికి ప్రాప్తం ఉందో వారే అనుభవిస్తారు.

.

ఒక బడా వ్యాపారవేత్త, 

ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ఒక ఆమెను 


కొంతకాలం తర్వాత ముచ్చటపడి

తన భార్యకు 100 కోట్ల ఆస్తిని బదిలి చేసిన తర్వాత అంతలోనే అకస్మాత్తుగా చనిపోయాడు. 


తన భర్త కింద పనిచేస్తున్న యువకుడిని పెళ్లి చేసుకుంది. 

ఈమె ఎంతో ఇష్టపడి


అ యువకుడు ఇన్నాళ్లు నేను నా బాస్ కింద పని చేస్తున్నానని అనుకున్నాను, కానీ

నా బాసే నాకోసం పనిచేసి ఇంత సంపద కూడబెట్టాడు. అని అనుకున్నాడు. 


చూశారా 


ఈ చిన్న చిన్న విషయాలు ఎంతో నేర్పిస్తుంది 

అర్థం చేసుకుంటే


'ఎంత సంపాదించామన్న దానికన్నా ఎంత ఎక్కువ కాలం ఆరోగ్యంగా, సంతృప్తిగా జీవించాం' అన్నది ముఖ్యం.


1. ఆరోగ్యమైన జీవితం కోసం శ్రమించండి.


2. ఎంత ఖరీదైన సెల్ ఫోన్ లోనైనా, 75% యాప్స్ వృధా.


3. ఖరీదైన కారులో కూడా, 75% వేగం ఉపయోగం లేనిది.


4. ఖరీదైన, విలాసవంతమైన భవనంలో కూడా 75% వృధాగా, ఖాళీగా ఉంటుంది.


5. ప్రతి వ్యక్తిలో 75% TALENT నిరుపయోగంగా ఉంటుంది. మిగిలిన 25% ప్రతిభను సమర్థవంతంగా వాడడం ముఖ్యం.


6. మీ బట్టల్లో 75% చాలా తక్కువగా ఉపయోగిస్తారు.


7. మన సంపాదనలో 75% తరవాతి తరాలకోసం వాడ్తాం. 


8. దాహం వేయక పోయినా, తరచూ మంచినీళ్ళు త్రాగండి.


9. అహం ప్రదర్శించ వలసి వచ్చినా, అదుపులో పెట్టుకోండి.


10. మీరే కరెక్ట్ అని తెలిసినా తగ్గి ఉండడంలో తప్పులేదు. 


11. మీరెంత శక్తివంతులైనా వినయంగా ఉంటే తప్పులేదు.


12. ఉన్న దాంతో తృప్తిగా ఉండడం నేర్చుకోండి.


13. ప్రతి రోజూ కనీసం ఒక గంట నడవండి.


అద్భుతమైన జీవితం అందుకోండి, అనుభవించండి.


మళ్లీ మానవ జన్మ వస్తుందన్న గ్యారెంటీ లేదు


వచ్చినా ఇంత ఆరోగ్యంగా 

అవయవాలతో ఇంత చురుగ్గా ఉంటారన్న గ్యారంటీ లేదు

.

అందుకే ఈ జన్మలో మీరు ఎవరో తెలుసుకోండి.

Wednesday, January 17, 2024

కుటుంబ వ్యవస్థ

 కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు...త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెపుతున్నాయి..

అందుకు గ‌ల కారణాలు





1. అతి తెలివి, అహంకారం,అసూయ,

2. చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం.

3. అందరూ సమానమే అనే భావం పెరగడం.

4. పిల్లలు, పెద్దలు కూర్చొని మాట్లాడుకోకపోవడం.

5. ఎక్కువ సమయం TV, ఫోన్లు, ఇతర Net programలలో మునిగిపోవడం. ( ఎక్కడో ఉన్న సినిమా హీరో, హీరోయిన్లు ఏం తిన్నరో, ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ, ఇంట్లో ఏం జరుగుతుందేమీ తెలియదు)

6. చిన్న విషయాలకు అలిగి, స్వంత వారితో కూడా దూరంగా ఉండటం.

7.ఎవరో ఒకరి నోటి దురుసుతనం వల్ల, కుటుంబంఅంతా చెదిరిపోవడం.

8. ఆర్థిక విషయాల లో స్వార్థం,స్వాతంత్య్రం పై శ్రద్ధ చూపడం.

9.తల్లి దండ్రుల కు పిల్లలకు అవగాహన లోపం. 

10. ఆర్థిక స్థితిగతులు, వ్యత్యాసాలు, పోలికలు,ఇలా అనేక విషయాలు కుటుంబ వ్వవస్థని ప్రభావితం చేస్తున్నాయి.

11. మనిషికి మరో మనిషంటే గిట్టనితనం.. జల్సాలు, జరుగుబాటుకోసం క్రూరత్వానికి వెనుకాడటం లేదు. ఒంటరితనం ఇష్టపడుతున్నారు.

12. మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు. ఎవరిష్టానికి వారున్నారు. చెప్పినా నచ్చటం లేదు.

13.కుటుంబ నిర్వహణకు lపిల్లలు సహకరించు ట లేదు, పెద్దలు అంటే గౌరవం,ప్రేమ  వుండుట లేదు.ఎక్కువ మందిలో.

14., విదేశాల లో ఉద్యోగాలు,చదువులు వలన ప్రత్యక్ష సంబంధాలు దూరం


15. Soclal media ప్రభావం. ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన message పెట్టేసి చేతులుదులుపుకుంటున్నారు.. 

    ఇదే పరిస్థితి కొనసాగితే, అతి త్వరలో కుటుంబ వ్యవస్థ కాదు, అసలు మానవ సంబంధాలే తెగిపోతాయి అనడం అతిశయోక్తి కాదు...

ఐక్యమత్యమే మహాబలం, కలిసి ఉంటే కలదు సుఖం

Saturday, January 13, 2024

40 ఏళ్ళు దాటుతున్నాయి

 చాలా కాలం తరువాత నా మిత్రుడు కలిస్తే ఎరా 40 ఏళ్ళు దాాటుతున్నాాయి మనకి. వయస్సుతో పాటు ఏమైనా ఆలోచనలో కూడా మార్పు వచ్చిందా అని క్యాజువల్ గా అడిగాను. అప్పుడు  తను అన్నాడు


*అవును నేను మారుతున్నాను* !!


తల్లిదండ్రులను బంధువులను భార్యను పిల్లలను స్నేహితులను ఇన్నాళ్లు ప్రేమించాను

ఇప్పుడిప్పుడే నన్ను నేను ప్రేమించుకోవడం మొదలు పెట్టాను


*అవును నేను మారుతున్నాను* !!


నేనేమీ ప్రపంచ పటాన్ని కాదు

ప్రపంచాన్నంతా నేనే ఉద్ధరించాలని అనుకోవడం లేదు


*అవును నేను మారుతున్నాను* !!


కూరగాయల వాళ్లతో పండ్ల కొట్ల వాళ్ళతో బేరాలు ఆడటం మానేశాను వాళ్లకు

నాలుగు రూపాయలు ఎక్కు విచ్చినంత మాత్రాన నేను పెద్దగా నష్టపోయేది ఏమీ లేదని తెలుసుకున్నాను

 ఆ డబ్బులు వాళ్ల పిల్లల స్కూల్ ఫీజు కన్నా పనికి వస్తాయి


*అవును నేను మారుతున్నాను* !!


టాక్సీ డ్రైవర్ దగ్గర చిల్లర కోసం తగాదా పడటం లేదు

ఆ కాస్త చిల్లర అతని మొహంలో నవ్వులు పూయించడం నాకు ఆనందంగా ఉంది

ఏదేమైనా జీవిక కోసం నాకన్నా ఎంతో కష్ట పడుతున్నాడు అతను


*అవును నేను మారుతున్నాను* !!


చెప్పిందే ఎందుకు చెబుతున్నావ్ అని పెద్దవాళ్ళను అడగడం మానేశాను

వాళ్లు గతాన్ని నెమరు వేసుకోవడానికి అది పనికి వస్తుందని గ్రహించాను


*అవును నేను మారుతున్నాను* !!


తోటివారిలో తప్పు ఉంది అని తెలిసినా వారిని సరిదిద్దే ప్రయత్నం మానుకున్నాను

అందరినీ సరైన దారిలో పెట్టే బాధ్యత నా ఒక్కడి భుజాల మీద లేదు అని తెలుసుకున్నాను

సమగ్రత కన్నా ప్రశాంతత ముఖ్యం


*అవును నేను మారుతున్నాను* !!


ఉచితంగా ఉదారంగా అభినందనలు అందరిపై కురిపిస్తున్నాను

అది వారితో పాటు నాకు ఆనందాన్నిస్తోంది


*అవును నేను మారుతున్నాను* !!


చొక్కా పై పడ్డ మరకలు చూసి బెంబేలు పడటం మానేశాను

ఆకారం కన్నా వ్యక్తిత్వంముఖ్యం అని తెలుసుకున్నాను


*అవును నేను మారుతున్నాను* !!


నాకు విలువనివ్వని వారికి దూరం గా జరగడం నేర్చుకున్నాను

వారికి నా విలువ ఏమిటో తెలిసి ఉండకపోవచ్చు కానీ నా విలువ ఎంతో నాకు తెలుసు


*అవును నేను మారుతున్నాను* !!


ఎవరైనా నన్ను తీవ్రమైన పోటీ లోకి లాగాలని చూసినప్పుడు ప్రశాంతంగా ఉండటం నేర్చుకున్నాను

నాకు ఎవరితో పోలిక పోటీ అవసరం లేదు


*అవును నేను మారుతున్నాను* !!


నా భావావేశాలు నన్ను కలవర పెట్టకుండా చూసుకుంటున్నాను

ఎందుకంటే నన్ను నన్నుగా మనిషిగా నిలబెట్టేవి అవే

ఒక బాంధవ్యాన్ని ఒక సంబంధాన్ని తుం చుకోవడం కన్నా అహంకారాన్ని చంపుకోవడం మంచిదని గ్రహించాను

ఎందుకంటే నా అహంకారం నన్ను ఒంటరి గా నిలబెడుతుంది

సంబంధ బాంధవ్యాలు కొనసాగితే నేను ఎప్పుడూ ఒంటరిని కాదు కదా


*అవును నేను మారుతున్నాను* !!


*ప్రతిరోజు అదే చివరి రోజు అన్నట్టుగా బతకడం నేర్చుకున్నాను నిజానికి ఈరోజే చివరి రోజు కావచ్చు ఏమో*


*అవును నేను మారుతున్నాను* !!


నాకేది సంతోషాన్ని ఇస్తుందో అదే చేస్తున్నాను


*నా సుఖసంతోషాలకు నేనే...నేను మాత్రమే బాధ్యుడిని.*!!!!!


చాలా బాగా అనిపించింది


తను నా గురించి అదే విషయం అడిగాడు

వయస్సుతో పాటు ఏమైనా ఆలోచనలో కూడా మార్పు వచ్చిందా అని.....(కావాలని)


నేను మారలేదు అని నా సమాధానం తో ఆ విషయం పూర్తయ్యింది.



Thursday, January 4, 2024

ఆరోగ్యం ఆనందం

 ఆరోగ్యం ఆనందం సంపద

🏃‍♀️🩺😁💰💎🛵🚘

*Mind your mind!* ----------------------

     🇮🇳🇮🇳🇮🇳

,*🔥"ఇది చదవండి... కాదు, కాదు... ఆచరించండి ! మీ జీవితంలో మార్పుకోసం*

    👍👍👍

*"👍కొద్దిగా నీరసంగా ఉంది..*


*👍కొద్దిగా బద్దకంగా ఉంది...*


*👍కాసేపు పడుకోవాలని పిస్తోంది.*


*_👍కాసేపాగి పని చేసుకో వచ్చులే..._*


*👍ఇప్పటికిప్పుడు* *కొంపలేం మునిగిపోవట్లేదు కదా.."*


*_👍నీకు నువ్వుఇచ్చుకునే ఈ "auto suggestions " ని నువ్వు ఎప్పుడైనా గమనించావా?_*

      🇮🇳🇮🇳🇮🇳

*~ హ్యూమన్ బ్రెయిన్ చాలా గొప్ప "executor".*


_మీరు అనుకున్న వన్నీ,,,,,, తు..చ .. తప్పకుండా అమలు చేస్తుంది._*

     🇮🇳🇮🇳🇮🇳

*నిద్ర వస్తోందిఅనుకోండి¡...*


*అప్పటి నుండే ఆవలింతలు మొదలవు తాయి!.*


*ఇవ్వాళ రిలాక్స్ అయి రేపు పని చేద్దాంలే అనుకోండి.. వెంటనే "సాకులు వెదికిపెట్టి" , మనం కంఫర్టబుల్‌గా రిలాక్స్ అయ్యేలా చేస్తుంది!.*


*"బ్రెయిన్ ప్రోగ్రామింగ్" .. ఓ గొప్ప సబ్జెక్ట్.*


*🔥"ప్రతీ క్షణం మన "థాట్ ప్రాసెస్‌". ని* *గమనించుకుంటూ*

*మన బ్రెయిన్‌ని "సిస్ట  మాటిక్‌" గా పెట్టుకుంటూ* *"output" ని సమీక్షించు కుంటూ చేయాల్సిన పని!*


*ఒక్క క్షణం "కమిట్" అవ్వు.. "నేను ఏది ఏమైనా ఈ పని చేస్తానని"!* 


*"Next మినిట్"  నీ చావు రాసిపెట్టి ఉన్నా...మొదట నువ్వు అనుకున్న పని చేశాకే చచ్చిపోతావు!. ఇది నిజం.*


🙏అది మన గొప్పదనం కాదు, మన" బ్రెయిన్" గొప్పదనం.


👍నువ్వు ఏదనుకుంటే? అది చేసి చూపెడుతుంది.


👍అందుకే ఎప్పుడూ...


👍గొప్పగా ఆలోచించు....    


👍నువ్వు ఇప్పటికిప్పుడు కష్టపడతానంటే....

   

🔥నీ ఆవలింతలను,,,,,,,

🔥నీ నిద్రనీ,,,,,,, 

🔥నీ బద్ధకాన్నీ,,,,,,

👍నీ జలుబునీ,,,,,,,, 

🔥నీ జ్వరాన్నీ,,,,,,


నీ చుట్టూ ఉండే అన్నీ,,,,, అన్నీ,,,,,

       😭😭😭

*" డిజప్పాయింట్‌మెంట్ల" నీ పక్కన పడేసి,*

*నీ బ్రెయిన్....నీ పని మీద "ఫోకస్" చెయ్యడం*

*మొదలుపెడుతుంది.*

    ♨️♨️♨️

🩸గుర్తుంచుకో,  నీ బ్రెయిన్‌కి... feed ఇవ్వాల్సింది,,,,.......

.............నువ్వే!

      ☂️☂️☂️

*నీ లైఫ్..నీ గమ్యం కోసం*

*నీ బ్రెయిన్‌ని సిద్ధపరుచుకో !*

    🌻

*"చుట్టూ చెత్త ఉంటే....*

*నేను "ఫోకస్" చెయ్యలేక పోతున్నాను" అనకు.*


*"బురదలో నుండి పద్మం పుట్టుకొస్తే!దాని విలువ మాటల్లో చెప్పలేం.!*

     🔥🔥🔥

*అంతా క్లీన్‌గా పాజిటివ్ గా ఉంటే...నువ్వేంటి.... ప్రతీ ఒక్కరూ సాధించ గలరు.*

     🍇🍇🍇

*నీ చుట్టూ ఉండే* *బలహీనతలనుదాటుకుని,*

*నువ్వెలా ఎదిగావన్నదే నీ గొప్పదనం.*

     🌹🌹🌹

*ఇంకొక (మనందరి) చిన్న అనుభవం.* 

       

*ఏదైనా ముఖ్యమైన పని కోసం మనం అలారం పెట్టుకుంటే.....*


*అలారం కొట్టక ముందే*

*రెండు మూడు సార్లు మనలని నిద్రలేపుతుంది. * నిద్రావస్థలో ఉన్న మన మెదడు*

     👍👍👍

*అంటే... తాను....24×7*

*అంత "అలర్ట్ " గా* *ఉంటుంది, మనల్ని ఉంచుతుంది*


*✌️ఎటొచ్ఛీ... మనమే దాన్ని జోకొట్టేస్తుంటాం !*


*ఇంకొక ఆశ్చర్య కరమైన విషయం విన్నాను.*


*🔥"ఒక మనిషికి రోడ్డు ప్రమాదంలో తల పగిలి,*

*మెదడు బయటకి వచ్చి ఉన్న స్థితిలో....హాస్పిటల్ లో ఆపరేషన్ జరిగే లోపు...*


*అతని మెదడుకి డాక్టర్లు*

*"నీకేమీ కాదు, నువ్వు బాగుంటావు,* *బాగుంటావు"*


*అని" positive" suggestions " ఇస్తూనే ఉన్నారట.*


*ఆ మెదడు "ఆ positive suggestions"  వల్లనే కోలుకుని, operation success అయి, అతను ఇప్పటికీ బాగానే ఉన్నాడట  !!!*


*"ప్రమాదం జరిగిన మెదడే కొలుకోగా లేనిది....*

*చాలామంది నా "బిజినెస్"  జరగడం లేదు సరిగా "కస్టమర్స్" రావట్లేదు అని చెబుతుంటారు*


*👍మరికొందరు... వాళ్ళ బిజినెస్ బాగా జరుగుతున్నా ఎవరైనా మిత్రులు అడిగినప్పుడు సరిగా జరగడం లేదు. తక్కువ జరుగుతుందని తక్కువచేసి చూపిస్తారు... ఎలా వాళ్ల ఆలోచనలు అలా తక్కువ చూపిస్తే "ఆటోమేటిగ్గా" కొద్ది రోజులకు వాళ్ళ బిజినెస్ అనేది డౌన్ అయిపోతుంది... వాళ్ల సమస్యలు వాళ్ళే సృష్టించు కొంటున్నారు.*


*👍"మరికొందరు అప్పులు ఎక్కువైనాయని అప్పుల గురించి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు దాని గురించే పదేపదే ఆలోచిస్తూ ఉంటారు*


*ఈనాడు ప్రతి మనిషికి ఏదో ఎక్కువ, తక్కువ అప్పులనేది ఉంటాది. సహజం... కానీ దాన్ని ఎక్కువ ఊహించుకొని కంగారుపడి పదేపదే ఆ పదాలు పలకడం వలన... మరియు కొందరు ఎలా చెప్తారు అంటే...*

*ఐదు లక్షల అప్పు ఉంటే నాకు 10 లక్షలు అప్పు ఉంది అని ఎక్కువ రెట్టింపు చెప్పు కుంటారు వాళ్ళ అప్పులు వాళ్ళని సృష్టించుకుంటున్నారు అది రెట్టింపు- రెట్టింపు అయి మనశ్శాంతి లేకుండా చేస్తది..*


*👍చాలామంది తమకు తెలియకుండానే పదాలను నెగిటివ్గా చెప్పుకుంటూ కష్టాలను కొనితెచ్చు కుంటున్నారు తమ సమస్యలను వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు... దయచేసి సమస్యలను మీకు మీరు క్రియేట్ చేసుకోకండి... మీరేం ఆలోచిస్తారో అది మీ యొక్క సబ్కాన్సెస్ మైండ్ నిజం చేస్తాది ఆ విషయం నిజం చేస్తుంది...*


🙏ఈ నెగిటివ్ థాట్సపో వాలంటే ప్రతిరోజు రాత్రి ఉదయం మెడిటేషన్ చేయండి !మీ ఆలోచనలు మార్పు వస్తుంది...

       💐💐💐

*మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం మీ స్నేహితులు బట్టి కూడా మనకు "నెగటివ్ థాట్స్"& "పాజిటివ్ థాట్స్" కూడా వస్తాయి కాబట్టి మంచి వాళ్ళతో స్నేహం మీరు చేయండి*


*_ఆరోగ్యంగా ఉన్న మన మెదళ్ళు..._*


*రోజూ మనం "positive suggestions" ఇస్తుంటే...*


*_బ్రహ్మాన్డంగా పనిచేయవా?_*


👍"బుర్ర" పెట్టి ఆలోచిద్దాం....


*👍"యద్భావం...తద్భవతి"*


*🙏అనే సూక్తి* 

*🙏🙏🙏🙏🙏*

మీ గురించి మీరు తక్కువగా అంచనా వేసుకోవడమే

 మీ గురించి మీరు తక్కువగా అంచనా వేసుకోవడమే... మీ ఓటమికి మొదటి కారణం


 ఒక మనిషి ఏనుగులను ఉంచిన శిబిరం ముందు నుండి నడుచుకొని వెళ్తున్నాడు. అక్కడ ఏనుగుల కాళ్ళకి చిన్న తాడు కట్టి బంధించి ఉంచడం గమనించాడు. ఆ చిన్న తాడు ఏనుగులు తెంపుకొని వెళ్లడం పెద్ద కష్టమేమీ కాదు. అయినా సరే... అవి శిబిరం నుంచి తప్పించుకోకుండా, ఆ కాళ్లకు కట్టిన చిన్న తాడు ముక్కతోనే ఇటూ అటూ నడుస్తున్నాయి.

ఏనుగులు వైపే చూస్తున్న ఆ వ్యక్తి... ఆ తాడును తెంపుకునేందుకు ఏనుగులు తమ శక్తిని ఎందుకు ఉపయోగించడం లేదు? అని అయోమయానికి గురయ్యాడు. కనీసం అవి ప్రయత్నించకపోవడం కూడా అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దీనికి సమాధానం తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది. ఆ పక్కనే ఉన్న ఏనుగుల ట్రైనర్ దగ్గరికి వెళ్ళాడు. ఇదే విషయాన్ని చెప్పాడు. ‘నువ్వు వాటి కాలికి కట్టింది చాలా సన్నని తాడు మాత్రమే, అయినా కూడా అవి ఎందుకు తప్పించుకోవడం లేదు’ అని ప్రశ్నించాడు.


దానికి ట్రైనర్ ఇలా సమాధానమిచ్చాడు. ‘ఏనుగులు చాలా పెద్దదే కావచ్చు, బలమైనవే కావచ్చు... తాడు చాలా చిన్నదే, కానీ మేము అదే సైజు తాడును అవి చిన్న పిల్లలుగా ఉంటున్నప్పుడు నుంచి కడుతున్నాము. అవి తాము చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఆ తాడును తెంపలేమనే అభిప్రాయంలోనే ఉన్నాయి. అవి పెద్దవిగా పెరిగినా కూడా ఆ తాడును తెంపలేమనే నమ్మకంతోనే ఉన్నాయి. అందుకే అవి ఎప్పుడూ కూడా తాడును తెంపుకొని వెళ్లే ప్రయత్నం చేయలేదు. చిన్నప్పటి నుంచి ఆ పని తాము చేయలేమనే నమ్మకంతోనే ముందుకు సాగాయి కాబట్టి భవిష్యత్తులో కూడా ఆ ప్రయత్నం చేయవు’ అని చెప్పాడు.

అది విన్న మనిషికి ఒక విషయం అర్థమైంది. ముందు మనల్ని మనమే నమ్మకపోతే ప్రపంచం కూడా మనల్ని నమ్మదని. ఏనుగులు ఆ చిన్న తాడుని చూసి కూడా భయపడి ఉన్నాయి. అలాగే మనిషి కూడా తాను ప్రయత్నం చేయకుండా విజయాన్ని సాధించాలని కోరుకుంటాడు. దానివల్లే అపజయం పాలవుతున్నాడు. ప్రపంచం మిమ్మల్ని ఎంతగా అడ్డుకోవడానికి ప్రయత్నించినా... *మీరు అనుకున్నది సాధ్యమే అన్న నమ్మకం మీకు ఉండాలి.* *మీరు విజయం సాధించగలరనే నమ్మకం మీకు అణువణువుగా నిండిపోవాలి. ఇదే మీ విజయానికి మొదటి మెట్టు.* ఈ నమ్మకంతోనే ప్రయత్నాన్ని మొదలు పెట్టాలి. 

ఒకసారి కాకపోయినా 

రెండోసారి... 

మూడోసారి... 

చివరికి పదోసారైనా.. 

విజయం దక్కి తీరుతుంది.



Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE