NaReN

NaReN

Saturday, January 22, 2022

ఉపాధ్యాయుడి బాధ

 *ప్రపంచంలో అందరూ స్వార్ధపరులే రైతుతో సహా.....*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

ఒకడు 500 కు ఓటు అమ్ముకుంటాడు 

లేకుంటే మందు సీసాకు 

లేకుంటే రైతు బంధుకు

రైతు భీమాకు 

ఫ్రీగా కరెంటుకు 

ఫ్రీగా వ్రుద్యాప్య పెన్షన్

ఫ్రీగా రకరకాల  పెన్షన్ లు

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్

ఇంకా చెప్పుకుంటూ పోతే ప్లేసు సరిపోనన్ని...........

మాకు ఉచితం వద్దు మద్దతు ధర కావాలన్న వారన్నారా....


ఎమ్మెల్యేల జీతాల పెంచినపుడు ఇలా కామెంట్లు చేశారా....


ఉద్యోగుల జీతాలకు ఎమ్మెల్యే జీతాలలా కాకపోయినా రూల్ ప్రకారం జరుగకనే కదా ....

రోడ్లమీదకు రావాల్సిన పరిస్థితి


ఆరు నెలల్లో రావాల్సిన DA 3 ఏండ్లు

2018 లో రావాల్సిన PRC 3 ఏండ్లు

5ఏండ్లలో రావాల్సిన ప్రమోషన్ 20ఏండ్లు దాటినా రాదు


కమీషన్లు తిని అవసరం లేకుండా ప్రాజెక్టులు మళ్లీ వాటి అంచనాలు పెంచితే మాట్లాడరు 


స్కాంలు చేసి వేల కోట్లు సంపాదించే నాయకుల మీద మాట్లాడరు 


జీవితం మొత్తం కలిపి పిల్లల చదువు , ఇల్లు కు లోను కట్టి శేష జీవితంలో ఆరోగ్య ఖర్చులకే

30 ఏండ్లు కష్టపడి చదివి 30 ఏండ్లు పనిచేసి మరో పదేండ్లు గడిపే ఉద్యోగి జీవితం అంతా కష్టపడ్డా .......ఇలాంటి కామెంట్స్ పడాల్సి రావడం మీ స్వార్థమే కదా.....

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

పసుపులేటి నరేంద్ర స్వామి

ఉపాధ్యాయుడు

No comments:

Post a Comment

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE