NaReN

NaReN

Friday, January 14, 2022

ఒక్క క్షణం ఆలోచించండి

 *ఒక్క క్షణం ఆలోచించండి*

*మన నైజాన్ని మార్చుకుందామా !!*

క్రింది విధంగా లేని వాళ్లకు మాత్రమే


*🍃మనిషికి తొందరపాటు ఎక్కువ. అనుకున్నది వెంటనే చేసేయాలనుకుంటాడు.*


*🍃 మనిషికి భయం ఎక్కువ. ఆపద కలగగానే డీలా పడిపోతాడు*


*🍃మనిషికి ఆవేశం ఎక్కువ. ఇతరులపై కోపం కలగగానే అక్కసు వెళ్లగక్కుతాడు.*


 *🍃మనిషికి నిరాశ ఎక్కువ. బాధ కలగగానే కుమిలిపోతాడు.*


 *🍃మనిషికి దురాశ ఎక్కువ గుడికి వెళ్ళి ఒక్క సెకనుసెకను దణ్ణం పెడతాడు. తరతరాలు కూర్చుని తింటే తరగని సంపదని కోరతాడు.*


*🍃మనిషికి సహనం తక్కవ ఒక్క రోజు ధ్యానం చేస్తాడు నేను బుద్ధుడు ను కావాలి అంటాడు.*


*🍃ఒక్కరోజు ధ్యానం చేస్తాడు నాకు ఆరోగ్యం కావాలి అంటాడు.*


*🍃ఆరోగ్యం రాకపోతే ఫోటోలు మారుస్తాడు గుళ్ళు మారుస్తాడు. మతాలు మారుస్తాడు. దేవుళ్ళను మారుస్తాడు.*


*🍃దేనికీ కుాడా సహనం ఉండదు మానవునకు.*


*🍃మనకు ఏదైతే కావాలో దానికోసం సాధన ఎంతైనా అవసరం.*


*🍃అయితే...సాధనతో పాటు కాస్తంత ‘సహనం’తో నిరీక్షిస్తే అంతిమంగా ‘విజయం’ సాధించవచ్చు.*


*🍃సహనం ఒక నిగ్రహశక్తి, ఒక మానసిక పరిపక్వత గల స్థితి.*


*🍃సహనమనేది నీగమ్యాని కి నిన్ను చేర్చే మార్గం*


*🍃ముఖ్యంగా కష్టసమయాల్లో ఏదైనా ఉద్వేగాన్ని దాటవేయాలన్నా, వాయిదా వేయాలన్నా సహనం తప్పనిసరి.*


 *🍃ఎదుటి మనిషి నుంచి మనకు దేని కారణంగా ఒత్తిడి కలుగుతుందో, అందులోకి మనం కలసిపోవడం.*


 *🍃అంటే ఎదుటివారిలోని ఏ గుణం మనకు కోపాన్ని తెప్పించి, సహనాన్ని పోగొడుతుందో దానిని మనలోకి ఆవహింపచేసుకోవడమే సహనం.*


*🍃మరి దీని కోసం ధ్యాన సాధన అవరం.*


*🍃మరి మనమందరమూ సహనంతో ధ్యాన సాధనచేద్దాం. మన గమ్యాన్ని మన చేరుదాం*


*🍃ఆనందంగా ఉన్నప్పుడు ఆలోచించి మాట్లాడుతాం*

*ఆ మాటల్లో అబద్దాలు, అర్ధ సత్యాలు, సత్యాలు ఉంటాయి*

*కానీ..*

*ఆవేదనలో.. ఆవేశంలో.. ఉన్నప్పుడు...*

*అన్నీ నిజాలు మాట్లాడుతాం..*

*అసత్యాలకు... అర్ధ సత్యాలకు..*

*తావుండదు.!!*


*🍃🌺ఆనందం కోసమే జీవితం.. దాన్ని వదలొద్దండి.. ఆనందంగా గడిపిన ప్రతిక్షణం అమృతమే అన్న సత్యాన్ని గుర్తించండి..*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

పసుపులేటి నరేంద్రస్వామి

1 comment:

Followers

About Me

My photo
Catch me on IHDHFIFIEE