NaReN

NaReN

Thursday, October 21, 2021

స్నేహం కోసం

  

స్నేహం కోసం

ఒక మంచి ఆలోచన అందరూ చదవండి.


 ఒక ముసలాయన  చాలా రోజుల తరువాత తన మనవడిని పాఠశాలలో దింపడానికి వెళ్ళాడు. మనవడిప్పుడు పదో తరగతి చదువుతున్నాడు. ముసలాయనకు ఆ పాఠశాల ఆవరణలో రంగురంగుల బెంచ్ ఒకటి కనిపించింది.


ముసలాయన తన మనవడిని అడిగాను నవ్వుతూ "ఎరా , మీ స్కూల్లో కూర్చోవడానికి  ఇదొక్కేటే బెంచి ఉందా "


"కాదు తాతగారు, ఆ బెంచి 'స్నేహితుల బెంచి' అన్నాడు తన మనవడు.


తను ఆశ్చర్యంగా "అంటే ఏమిట్రా ? " అని అడిగాడు.


తన  మనవడు చిరునవ్వుతో అన్నాడు "తాత గారు, పిల్లలు కొత్తగా చేరినప్పుడు లేదా ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు లేకపోతే ఆడుకోవడానికి ఎవరూ లేనప్పుడు ఆ బెంచి మీద కూర్చుంటారు. అలా ఒంటరిగా ఉన్న అబ్బాయిని చూసి , వాళ్ళతో జతకట్టడానికి , స్నేహం చెయ్యడానికి, ఆడుకోవడానికి , ఎవరో ఒకరు వచ్చి కూర్చుని స్నేహం చేస్తారు" అన్నాడు.


తను మనసులో ఎంత అద్భుతమైన ఆలోచన  ఎవరిదో కానీ అనుకుని , మనవడిని అడిగాడు "ఒరే, నువ్వెప్పుడన్నా ఆ బెంచి మీద కూర్చున్నావా?"


"కూర్చున్నాను తాతగారు, నేను ఈ స్కూల్లో కొత్తగా చేరినప్పుడు, నాకు ఎవరూ పరిచయం లేనప్పుడు" అన్నాడు నెమ్మదిగా, ఎదో గుర్తు చేసుకుంటున్నట్టు.

"నేను ఆ బెంచి మీద కూర్చున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి పరిచయం చేసుకుని నాతో అడుకున్నాడు. మేమిద్దరం అప్పటినుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని, నాకెప్పుడైనా ఎవరైనా ఆ బెంచి మీద కూర్చుని ఒంటరిగా కనిపిస్తే నేను వెళ్లి వాళ్ళతో కబుర్లు చెప్పి, వాళ్ళతో అడుకుంటాను తాతగారు అన్నాడు .


తరువాత మనవడు తన క్లాస్ రూంలోకి వెళ్ళిపోయాడు. ముసలాయనకెందుకో కొద్దిసేపు ఆ బెంచి మీద కూర్చోవాలి అనిపించి వెళ్లి కూర్చున్నాడు. తన మనసు చిన్ననాటి రోజుల్లో తను మొదటిసారి స్కూల్ కు వెళ్లడం గుర్తుకువచ్చింది. తను స్కూల్లో చేరినప్పుడు తనకు స్నేహితులు ఎవరూ లేరు, ఎలా పరిచయాలు చేసుకోవాలో అన్న బిడియం ఒకటి. 


తను చేరిన కొత్తలో తన టీచర్ పిల్లందరిని క్లాస్ లో ఉన్న ఎవరో ఒకరికి ఒక బొమ్మ గీసి ఇమ్మంది. అందరూ ఎదో ఒకటి గీసి వాళ్ళ వాళ్ళ స్నేహితులకిచ్చుకున్నారు. తనకు ఎవరూ ఇవ్వలేదు తనూ ఎవరికి ఇవ్వలేదు. ఆ రోజు తనకు ఎంత ఏకాంతంగా అనిపించిందో తనకు బాగా గుర్తు.


ఆ రంగుల బెంచి మీద కూర్చుంటే తనకెంతో ఆనందమేసింది. ఎవరి ఆలోచనో కానీ కొత్తగా చేరిన పిల్లలు ఆడుకోవడానికి , జీవితాంతం చక్కటి స్నేహితులని సంపాదించుకోవడానికి చక్కటి దారి అనిపించింది.


నెమ్మదిగా ఆ బెంచి మీద నుంచి లేచి బయటకు నడుస్తూ అనుకున్నాడు. తను రోజూ ఉదయాన్నే నడిచే పార్కులో నలుగురు పెద్దవాళ్ళు కూర్చోవడానికి సరిపడే సిమెంట్ బెంచ్ చేయించాలి. ఆ బెంచిమీద స్నేహితుల బెంచి అని రాయించాలి, జీవిత చరమాంకంలో కొత్త స్నేహితులను సంపాదించుకోవాలి కష్టసుఖాలు చెప్పుకోవడానికి అనుకుంటూ ఇంటి దారి పెట్టాడు. తన చిన్ననాటి స్నేహితులు ఎక్కడెక్కడో స్థిరడ్డారు మరి. దగ్గరలో ఎవరూ లేరు, ఉన్నవారితో స్నేహం చేస్తే ఎంత బాగుంటుందో...


మీరూ ప్రయత్నించండి.

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE