NaReN

NaReN

Tuesday, October 26, 2021

అల్లుడి సొమ్ముపై అత్తకూ హక్కు ఉంటుంది

 అల్లుడి సొమ్ముపై అత్తకూ హక్కు ఉంటుంది

సుప్రీం కోర్టు సంచలన తీర్పు 

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

పితృస్వామ్య భావజాలం బలంగా ఉన్న భారత్ లో అత్తా అల్లుళ్ల వ్యవహారం చాలాసార్లు చర్చకు వస్తుంది. ఆస్తుల విషయానికొస్తే, అత్తసొమ్ముకు ఆశపడని అల్లుడు ఉండడనే సామెత ప్రాచుర్యంలో ఉంది.


అనుకోడానికి, మాట్లాడుకోడానికి ఎన్నో ఉన్నా, నిజంగా అత్త - అల్లుళ్ళ వ్యవహారం చట్టబద్దంగా ఎలా ఉంటుంది? ఒకరి సొమ్ముకు మరొకరు బాధ్యులు అవుతారా అనే అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది..


కూతురుతో కలిసి అల్లుడి ఇంట్లో నివసిస్తున్న అత్త ఆయనకు చట్టబద్ధ ప్రతినిధి అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మోటారు వాహనాల చట్టం కింద అతనికి లభించే పరిహారం పొందడానికి ఆమె ముమ్మాటికీ అర్హురాలేనని పేర్కొంది. జస్టిస్‌ ఎస్ఏ నజీర్, జస్టిస్‌ కృష్ణ మురారిలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పునిచ్చింది.


కూతురు-అల్లుడితో కలిసి అత్తలు జీవిస్తుండటం భారత సమాజంలో సహజమేనని, కొద్ది మంది ముసలితనంలో పోషణ నిమిత్తం అల్లుడిపైనే ఆధారపడుతుంటారని, అంతమాత్రాన అల్లునికి అత్త చట్టబద్ధమైన వారసురాలు కాబోదన్న కోర్టు.. ప్రత్యేక సందర్భాల్లో మాత్రం అత్తగారు కచ్చితంగా అల్లుడికి చట్టబద్ధ ప్రతినిధి అవుతారని, ముఖ్యంగా అల్లుడు మరణించిన సందర్భంలో ఆమె బీమా పొందేందుకు అర్హురాలు అవుతుందని, మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌ 166 ప్రకారం అత్తగారు అల్లుడికి చట్టబద్ధమైన ప్రతినిధి అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. చనిపోయిన అల్లుడి బీమా డబ్బులు పొందే హక్కు అత్తకు లేదంటూ గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సైతం సుప్రీంకోర్టు కొట్టివేసింది.


అత్తా అల్లుళ్ల వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పిన ఈ కేసు వివరాల్లోకి వెళితే... కేరళకు చెందిన ఎన్ వేణుగోపాలన్ నాయర్ అనే ప్రొఫెసర్ 2011లో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆయనకు భార్య ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. దీంతో ఆయన కుటుంబానికి రూ. 74,50,971 పరిహారం చెల్లించాలని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ బీమా కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు ఆ పరిహారాన్ని రూ. 48,39,728కి తగ్గించింది. అత్తను చట్టబద్ధ ప్రతినిధిగా పరిగణించలేమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో మృతుడి భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ నెలకు రూ. 83,831 వేతనం తీసుకుంటున్న విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అతడు 52 ఏళ్లకే మరణించడంతో కుటుంబం తీవ్రంగా నష్టపోయిందని..కాబట్టి రూ. 85,81,815 పరిహారంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Monday, October 25, 2021

చేసిన సాయం వృధా కాదు !*

 చేసిన సాయం వృధా కాదు !


ఒక అడవిలో పొగరుబోతు ఎలుగుబంటి ఉండేది. ఎవ్వరితోను సరిగా కలిసేది కాదు. మాట్లాడేది కాదు. తన పిల్లలే లోకంగా బ్రతికేది.  అవసరమొచ్చి  ఎవరైనా సాయం అడిగినా  కసిరేది తప్ప  చేసేది కాదు. 


ఒకసారి పిల్లల్ని ఇంటి దగ్గరుంచి  ఆహారం కోసం వెళ్ళింది pసుకుంటూ అది వెళ్తుంటే దానికి రక్షించమని ఎవరో వేసిన కేకలు వినబడ్డాయి. 


కేకల్ని విననట్టే  వెళ్ళబోయింది ఎలుగుబంటి. 


మళ్ళీ రక్షించమన్న కేకలు పెద్దగా వినబడ్డాయి. “ ఎవరు పిలిస్తే నాకేంటి? అరిస్తే నాకేంటి? అవతల పిల్లల ఆకలి తీర్చాలి. వెళ్ళిపోతా” అనుకుని ముందుకే అడుగేసింది  ఎలుగుబంటి.  


ఈసారి మరింత దీనంగా కేకలు వినబడ్డాయి.

ఎలుగుబంటికి ఆగక తప్పలేదు. కేకలెవరివో చూసి వెళ్ళిపోదామనుకుంది. శబ్దం వచ్చిన వైపు వెళ్ళింది. 


అక్కడ ఊబిలో కూరుకుపోయిన ఒక  జింక కనబడింది . ప్రయత్నిస్తున్నా సరే బయటపడలేక చావు భయంతో అరుస్తోంది.  

 ఎలుగుబంటిని చూడగానే చిన్న ఆశ కలిగింది జింకకి. అంతలోనే  అదెవరికీ సాయం చెయ్యదని గుర్తొచ్చి ఆశ వదులుకుంది. కానీ బతుకుమీదున్న తీపితో సాయం చెయ్యమని ఎలుగుబంటిని అడిగింది జింక. 


“అవతల నా పిల్లలకి తిండి ఆలస్యమౌతోంది. తొందరగా వెళ్ళాలి” అని బయల్దేరబోయింది ఎలుగు. 


“నా పిల్లలు కూడా  చూస్తుంటాయి నాకోసం. ఏమీ తెలియని వయసు వాటిది. తల్లిలేని పిల్లల బతుకెంత   కష్టమో తెలియంది కాదు నీకు. నేను బయట పడేలా  సాయం  చెయ్యు” అని బ్రతిమాలింది జింక.  


ఎలుగుబంటి చిరాకు పడుతూ  “ఊబి ఉందో లేదో సరిగా చూసుకోవద్దా? నిన్ను రక్షించడం తప్ప  పనేమీ లేదనుకున్నావా?” అని కసురుకుంది. మళ్లీమళ్లీ జింక బ్రతిమాలేసరికి మూట క్రింద పెట్టి చుట్టూ చూసింది ఎలుగు.  కొంచెం  దూరంలో తాడు కనబడితే అక్కడకి వెళ్ళింది. గట్టు మీదున్న  రైతు పనిముట్లలోని బలమైన తాడుని  అందుకుంది. ఆ  తాడుతో ఊబిలోని జింకను బయట పడేలా చేసింది.  బయటకు వచ్చిన జింక ఎలుగుబంటికి ఎన్నో విధాలుగా ధన్యవాదాలు చెప్పింది. 


‘సర్లే. నీ పొగడ్తలు ఆపు. అవతల నా పిల్లలకు తిండి ఆలస్యమవుతోంది” అని విసుక్కుంటూ వెళ్ళిపోయింది ఎలుగుబంటి.  


ఇంటికి వెళ్లేసరికి దొడ్లో కుందేలు, కోతి, గాడిద , ఏనుగు మొదలైన  జంతువులు కనబడ్డాయి ఎలుగుబంటికి.  


“ చెరకు గడలు తెస్తున్నట్టు వీటికి  తెలిసిందేమో. ఒక్కటి కూడా ఇవ్వను. ఇవన్నీ నా పిల్లలకే” అనుకుంది ఎలుగుబంటి. 


దారిలో ఉన్న జంతువుల్ని  ప్రక్కకు తప్పుకోమని కసురుకుంటూ గడప దగ్గరకి  వెళ్ళింది ఎలుగు. 


అక్కడ క్రింద పడి ఉంది దాని పిల్ల. దాని కాలికి  ఏదో పసరు రాస్తోంది కొంగ. అది  చూసి కంగారు పడిన ఎలుగు బంటి  “నా పిల్లకి ఏమైంది? పసరు ఎందుకు రాస్తున్నావు?” అని అడిగింది. 


“ఇది బయట ఆడుతుంటే పాము కాటేసింది. అది చూసిన  కోతి మామ మాతో  చెప్పాడు. సమయానికి  నువ్వు ఇంట్లో లేవు  కదా. వదిలేస్తే ప్రాణానికే ప్రమాదం.  అందుకే మేమంతా వచ్చాము. కొంగబావకు వైద్యం తెలుసని కుందేలు చెప్పడంతో చిలుక వెళ్లి పిలుచుకు వచ్చింది.  విషానికి విరుగుడు ఆకులు వెతికింది బాతు. ఆకుల్ని నూరి  పసరు రాస్తోంది కొంగ. ఇంతలో నువ్వొచ్చావు” అని జరిగిందంతా చెప్పింది ఏనుగు. 


“అయ్యో!  నా పిల్లని మీరు కాపాడారా? మీరే  లేకపోతే అది బ్రతికేది కాదు. మీకెప్పుడూ ఏమీ  చేయకపోయినా , మీతో మంచిగా ఉండకపోయినా కూడా మనసులో పెట్టుకోకుండా కాపాడారు” అంది ఎలుగుబంటి. 


అప్పుడే అక్కడకు వచ్చిన జింక “నువ్వేమీ సాయం చేయకపోవడమేమిటి?  ఇప్పుడే నన్ను ఊబిలో నుండి కాపాడావు ... నువ్వక్కడ నన్ను  కాపాడితే ఇక్కడ నీ పిల్లను వీళ్ళు కాపాడారు. అంతే” అంది. 


మిగతా జంతువులు ఎలుగుబంటి చుట్టూ చేరి జింకను కాపాడినందుకు  అభినందించాయి. 


“నీలోనూ మార్పు వచ్చింది. సాయం చెయ్యడానికి ముందుకు రాని నువ్వు ఈరోజు జింకని కాపాడావు. తెలిసో తెలియకో మనమెవరికైనా సాయం చేస్తే ఇంకో రూపంలో మనకు తిరిగి దొరుకుతుందని అమ్మ చెప్పేది. ఇప్పుడు రుజువయింది “ అంది చిలుక. 


“నిజమే. నేను విసుక్కుంటూనే జింకని రక్షించాను. కానీ చేసిన సాయం వూరికే పోలేదు. మీ రూపంలో నా పిల్లని రక్షించింది” అంది ఎలుగుబంటి.  


“అడవిలో ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఆపదలు వస్తుంటాయి. ఒకరికొకరు సాయం చేసుకుంటూ మనల్ని మనమే కాపాడుకోవాలి. అవసరంలో ఉన్నవారికి సాయపడమని పిల్లలకు కూడా చెప్పాలి” అంది ఏనుగు. అవును అన్నాయి జంతువులన్నీ. 

 

---***----

Saturday, October 23, 2021

గమ్యం లేని ప్రయాణం

 *గమ్యం లేని ప్రయాణం*


**************************

అది ఒక మధ్య తరగతి కుటుంబం.ఆ ఇంటి కోడలు లక్ష్మీ పరమ గయ్యాళి చుట్టాలతో కాని

ఇరుగుపొరుగు వారితో కాని మంచితనం లేని మనిషి

భర్తకు కనీసం అన్నం కూడా వండి పెట్టదు అత్తగారిని అయితే ఎన్నడూ అత్తయ్య అని పిలిచి ఎరుగదు

ఇదిగో అదిగో అనే పిలుపు తప్ప తను వచ్చి ఇరవై సంవత్సరాలు అయినా ఆమె నుండి చెడ్డ పేరు తప్ప ఆ కుటుంబానికి ఒరిగింది ఏమీ లేదు


అనుకోకుండా ఆ ఇంటి పెద్దాయన లక్ష్మీ మామ గారు కాలం చేశారు


ఇదే అదునుగా భావించిన లక్ష్మీ.అత్తగారిని వేధించడం మొదలు పెట్టింది తను మనిషిని అన్న సంగతి మరచి అత్తగారి మీద చెయ్యి చేసుకోవడం మొదలు పెట్టింది 


అత్తగారి మెతకతనం చూసి అందరూ అమ్మో మీ కోడలు లాంటిది ఇంటికొకరు ఉంటే చాలు ఆ ఇల్లు గుల్లే అని అనేవాళ్ళు


అన్నం కూడా సరిగ్గా పెట్టేది కాదు అత్తగారికి

ఎలాగైనా అత్తగారిని వదిలించుకోవాలి అని తలచి కూతురి దగ్గరకు పంపింది అత్తగారిని


ఇదిగో రెండు రోజులు నీ కూతురి దగ్గర ఉండి రా అని చెప్పింది లక్ష్మీ


కోడలు ఆమాట చెప్పగానే సంతోషంతో సరే లక్ష్మీ

మీ మామయ్య పోయి ఏడాది దాటింది..పిల్లను చూసి వస్తా అని చెప్పి బయలుదేరింది అత్తగారు


రెండు రోజుల తరువాత కూతురు దగ్గర నుండి ఇంటికి వచ్చింది ఆ పెద్దావిడ ఇంటికి గొళ్ళెం పెట్టి ఉంది మెల్లిగా తలుపు తెరిచి చూసింది ఇల్లంతా ఖాళీగా ఉంది ఓ గోడ మీద ఆ ఇంటి పెద్దాయన ఫోటో ఎండిపోయిన పూలమాలతో వేలాడుతూ ఉంది


ఆ ఫోటోలో ఉన్న పెద్దాయన నవ్వుతూ ఇంకా ఏం మిగిలింది నీకు ఇక్కడ!వచ్చేయ్ ఆశ పడ్డావో

ముందు ముందు ఇంకా నరకం చూస్తావు

ఏంటోయ్ నీ రాక ఎప్పుడూ అని ఆడిగినట్లుగా

అనిపించింది పెద్దావిడకు


కంట్లో నీళ్లు తుడుచుకుంటూ ఇల్లంతా  గమనిస్తుంది పెరటిలో ఉన్న పెద్ద రోలు కనిపించలేదు నలుగురు కూడా మోయలేని అంత పెద్ద రోలు ఎలా తీసుకుని పోయిందో కోడలు అని మనసులో అనుకుంటూ ఉండగా


పక్క పోర్షన్ లో ఉండే ఆవిడ వచ్చింది ఆంటీ మీ

కోడలు వాళ్ళ అమ్మగారి ఊరికి సామాన్లు మినీ ఆటోలో తరలించిందిగా చీకటితో నాలుగు గంటలకే మొదలు పెట్టారు సామాన్లు సర్దుకోవడం పాపం అన్నయ్య ముఖంలో నెత్తుటి చుక్క లేదు అన్నయ్యకు ఇష్టం లేదు అనుకుంటా ఆంటీ అలా వెళ్లడం అన్నయ్య ఎంత సైలెంట్ గా ఉన్న కూడా ఆటో కదిలే వరకు తిడుతూనే ఉంది

మీ కోడలు అన్నయ్యని పాపం అంటూ గోడ వైపు చూసింది అంకుల్ ఫోటో ఆవిడకు బరువై పోయిందా!ఇలా వదిలేసి పోయింది అసలు ఆ రోలు నలుగురికి కూడా పైకి లెగవలేదు మా వారిని కూడా హెల్ప్ అడిగారు అంతేలే రాతికి ఉన్న విలువ మనుషులకు లేదు హ్మ్మ్ అనింది నిట్టూర్పుగా


అయ్యో లేదమ్మా మర్చిపోయి ఉంటుంది అంటూ గోడకు ఉన్న ఫోటో తీసి కొడలిపై మాట పడకుండా సమర్ధిస్తూ ఆ ఫోటోకి ఉన్న ఎండిన పూలమాల తీసేసింది ఫోటోని పవిట కొంగుతో తుడిచి పవిటలో ఫోటో చుట్టుకుని సరే మా ఉంటాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరి ప్రతిరోజు అన్నదానం జరిగే గుడి వైపుగా నడిచింది గమ్యం తెలియని ఆ పెద్దావిడ


వెన్నలాంటి మెత్తని మనసున్న మంచి మనుషులకు

రాతి బంధాలు దొరికితే!జీవితాలకు గమ్యం లేని ప్రయాణాలే చివరి మజిలీ వరకు.

*సమాప్తం*

**********************************************

Friday, October 22, 2021

అతిగా ఆలోచిస్తున్నారా ?

 అతిగా ఆలోచిస్తున్నారా ?

అయ్యయ్యో వద్దమ్మా బుజ్జి లైఫ్ ఇది.. ఇలా బతికేయండి.

▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️


ఎక్కువగా ఆలోచిస్తున్నారా? 

ఏవో పిచ్చిపిచ్చి ఆలోచనలు మైండ్‌ను వదిలి పోనంటున్నాాయా? 

ఎంత వదిలేద్దామనుకున్నా అవడం లేదా? 

ఎక్కువగా ఆలోచించకండి..


ఎందుకంటే దీని వల్ల మనఃశాంతి, చేసే పని మాత్రమే దెబ్బతినవు. ఇలా తరుచుగా ఆలోచించడం వల్ల నిరాశలో కూరుకుపోయి మానసిక రోగాలు కూడా వచ్చే అవకాశం ఉందని ఇటీవల చేసిన ఓ అధ్యయనంలో తేలింది.

మెదడుకు భారం..

ఎక్కువగా ఆలోచించడం ద్వారా మన మెదడుపై తీవ్రమైన ఒత్తిడి పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అక్కర్లేని ఆలోచనలు, మనుషులు, పరిస్థితుల గురించి ఎక్కువగా ఆలోచించడం, మన గురించి మనమే నెగెటివ్‌గా అనుకోవడం అసలు మంచిది కాదంటున్నారు. ఇలా ఎక్కువగా ఆలోచించడం పెద్ద రోగం ఏం కాకపోయినా భవిష్యత్తులో అది మానసిక రోగాలకు దారితీసే అవకాశం ఉందని ప్రముఖ సైకాలజిస్ట్ గరిమా జునేజా హెచ్చరిస్తున్నారు.

నిరాశ, వ్యాకులత..

చాలా సమయం మనం పాత విషయాలను గుర్తుచేసుకుంటాం. అందులోనూ సంతోషకర విషయాలకంటే బాధించిన ఘటనలే గుర్తుపెట్టుకుంటాం. పాత విషయాలపై బాధపడటం, ప్రస్తుతం విషయాల గురించి విసుగు చెందటం, భవిష్యత్తు గురించి భయపడటం అనే చాలా నెగిటివ్ ఫీలింగ్స్ అని నిపుణులు అంటున్నారు. ఇది ఇలానే కొనసాగితే తీవ్ర నిరాశలోకి కూరుకుపోయి జీవితంపై ఆశే చచ్చిపోతుందని హెచ్చరిస్తున్నారు.

మనుషులకు దూరంగా..

అయితే ఇలాంటి లక్షణాలున్నవారు తమను అవతలి వాళ్లు ఎలా చూస్తున్నారనే విషయంపై కూడా బాధపడుతుంటారు. తరువాత మనుషులకు దూరంగా, ఒంటరిగా బతకడాన్ని అలవాటు చేసుకుంటారు.

రోజువారి జీవితంపై..

ఇలా ఎక్కువగా ఆలోచించడం వల్ల మన రోజువారి జీవితంపై ఈ ప్రభావం పడుతుంది. మనం చేసే పనులు కూడా సమర్థవంతంగా చేయలేం. ఎవరైనా ఏమైనా అడిగినా ప్రతిస్పందించే సమయం కూడా చాలా ఆలస్యమవుతుంది. దీని ద్వారా ఉద్యోగం, సంబంధాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది.

సమయం వృథా..

ఎక్కువగా ఆలోచించడం వల్ల మన సమయం కూడా వృథా అవుతుంది. మన మూడ్ కూడా దెబ్బతింటుంది. అయితే ఇందులోంచి బయటకు రావొచ్చని నిపుణులు అంటున్నారు. దానికి కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. అవేంటో చూడండి.


మనం దేని గురించి ఆలోచిస్తున్నామో ముందుగా గుర్తించి.. ఎప్పటికప్పుడు ఆలోచించింది చాలు.. జరిగిందేదో జరిగిపోయిందని మన మైండ్‌కి చెప్పాలి.


మన పంచేంద్రియాలపై దృష్టిపెట్టాలి. ఇలా చేయడం వల్ల ఎక్కడికో వెళ్లిపోయిన ఆలోచనను తిరిగి ప్రస్తుతంలోకి తీసుకురావొచ్చు.


దీర్ఘమైన శ్వాస తీసుకోవడం ద్వారా కూడా ఎక్కడికో వెళ్లిపోయిన మనస్సును మన దగ్గరికి తిరిగి తెస్తుంది.


యోగా వంటి సాధన ద్వారా కూడా ఈ నిరాశ నుంచి బయటపడొచ్చు.


దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నామో వాటి గురించి డైరీలో రాయడం.. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మొదట్లోనే వాటిని ఆపేయాలి.


ఎప్పుడైనా సరే ప్రస్తుతంలో బతకడం ద్వారా మాత్రమే ఈ ఆలోచనలకు బ్రేకులు పడతాయి. అప్పుడే మన ఆలోచనలు పాజిటివ్ వైపు మళ్లుతాయి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు అంటున్నారు.


▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️

Thursday, October 21, 2021

కలిసి నడుద్దాం!!!

 కలిసి నడుద్దాం!!!

          

*మహా అయితే ఇంకో పదీ.. పదిహేను, ఇరవై... సంవత్సరాలు బ్రతుకుతాం.*


*కావున కుటుంబంలో ఎవరు తప్పుచేసినా క్షమిద్దాం, ఆనందంగా భరిద్దాం, ప్రేమిద్దాం!*


*పోయాక ఫోటోను ప్రేమించే కన్నా, ఉన్నప్పుడు మనిషిని ప్రేమించడం మిన్న. బంధుత్వాలు తెంచుకోవడం నిముషం పడుతుంది.  అదే నిలుపుకోవాలంటే?


*తాము గడిపిన భయంకర అవస్థలు తమ పిల్లలకు రాకూడదని, తమ పిల్లలు కూడా నలుగురిలో ఉన్నతంగా బ్రతకాలనే తాపత్రయంతో కన్నవాళ్ళు తాము సామాన్య జీవితాన్ని గడుపుతూ ఆస్థులు కూడబెట్టి తమపిల్లలకు ఇస్తే, తమ తల్లిదండ్రులు బ్రతికి ఉండగానే, కొందరు, తమ తల్లిదండ్రులు కాలం చేశాక, మరికొందరు వివిధ రకాల కారణాలతో రక్త సంబంధీకులందరూ ఒకరికొకరు శాశ్వతంగా దూరమవుతున్నారు. *


*బ్రతికి ఉండగా మాట్లాడుకోకుండా, కనీసం మొహాలుకూడా చూసుకోకుండా తమ జీవితాంతం వరకు ఒకరి నొకరు ద్వేషించుకుంటూ, ఆ ద్వేషాలు తమ వారసత్వంగా తమ పిల్లలకు కూడా బదిలీ చేస్తూ, తామూ అశాంతితో జీవిస్తూ తనవారిని కూడా అశాంతి పాలు చేస్తున్నారు.


*ఎవరి కోసం..?*

*ఎందుకోసం..??*

*దానివల్ల ఒరిగే ప్రయోజనం ఏమిటి..???*


*జీవితాంతం ఒకేరక్తం పంచుకున్న అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు, అన్నాచెల్లెళ్ళు పరస్పరం అశాంతితో ద్వేషించుకుంటూ ఒకరినొకరు చూడకుండా జీవిస్తూ శాశ్వతంగా దూరమై, ఇంటిలోని ఆనందాన్ని పంచుకోకుండా, వివాహాలకు కూడా పిల్చుకోకుండా, హాజరుకాకుండా, చివరకు ఎవరో ఒకరు కాలం చేశాక తట్టుకోలేని శోకతప్తులై గుండెలు బాదుకొని కుమిలి కుమిలి ఏడిస్తే ఆ చనిపోయిన వారిని తిరిగి పొందగలమా? ఆ ఖాళీ అయిన స్థానాన్ని ఎవరూ భర్తీచేయలేరు.


*కొంతమంది తమ తల్లిదండ్రులనుకూడా ఈ ఆస్థిపంపకాల విషయంలో అసంతృప్తితో దూరం చేసుకుంటున్నారు. అలా జరిగితే ఆ వయసులో కన్నవారు పడే వేదన వర్ణనాతీతం. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?


*పంతాలు, పౌరుషాలు ప్రక్కన పెట్టి అందరూ కూర్చుని సామరస్యంగా ఆవేశాలకు పోకుండా మాట్లాడుకుని పరిష్కరించుకుంటే అభిమానాలు కలకాలం పరిమళిస్తూ అనుబంధాలు పెంపొందే అవకాశం ఉంటుందేమోనని మా నమ్మకం.


*దీనికి కావల్సింది ప్రశాంతంగా ఆలోచించడం, విచక్షణ, పట్టుదలలు సడలించుకోవడం. ఈ విషయంలో పెద్దవారు చొరవ తీసుకోవాలి...*


*ఓడినవాడు కోర్టులోనే ఏడుస్తాడు, గెలిచినవాడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు. రెండిటికీ పెద్దగా తేడా ఏమీ ఉండదు.*


*ఈ జ్ఞాపకాలు ఈ ఒక్క జన్మకే? కాబట్టి ఆలోచించండి, అందర్నీ కలుపుకుని, ఉన్నంతకాలం ఆప్యాయత, అనురాగాలు, ఆనందాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం..*


      

స్నేహం కోసం

  

స్నేహం కోసం

ఒక మంచి ఆలోచన అందరూ చదవండి.


 ఒక ముసలాయన  చాలా రోజుల తరువాత తన మనవడిని పాఠశాలలో దింపడానికి వెళ్ళాడు. మనవడిప్పుడు పదో తరగతి చదువుతున్నాడు. ముసలాయనకు ఆ పాఠశాల ఆవరణలో రంగురంగుల బెంచ్ ఒకటి కనిపించింది.


ముసలాయన తన మనవడిని అడిగాను నవ్వుతూ "ఎరా , మీ స్కూల్లో కూర్చోవడానికి  ఇదొక్కేటే బెంచి ఉందా "


"కాదు తాతగారు, ఆ బెంచి 'స్నేహితుల బెంచి' అన్నాడు తన మనవడు.


తను ఆశ్చర్యంగా "అంటే ఏమిట్రా ? " అని అడిగాడు.


తన  మనవడు చిరునవ్వుతో అన్నాడు "తాత గారు, పిల్లలు కొత్తగా చేరినప్పుడు లేదా ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు లేకపోతే ఆడుకోవడానికి ఎవరూ లేనప్పుడు ఆ బెంచి మీద కూర్చుంటారు. అలా ఒంటరిగా ఉన్న అబ్బాయిని చూసి , వాళ్ళతో జతకట్టడానికి , స్నేహం చెయ్యడానికి, ఆడుకోవడానికి , ఎవరో ఒకరు వచ్చి కూర్చుని స్నేహం చేస్తారు" అన్నాడు.


తను మనసులో ఎంత అద్భుతమైన ఆలోచన  ఎవరిదో కానీ అనుకుని , మనవడిని అడిగాడు "ఒరే, నువ్వెప్పుడన్నా ఆ బెంచి మీద కూర్చున్నావా?"


"కూర్చున్నాను తాతగారు, నేను ఈ స్కూల్లో కొత్తగా చేరినప్పుడు, నాకు ఎవరూ పరిచయం లేనప్పుడు" అన్నాడు నెమ్మదిగా, ఎదో గుర్తు చేసుకుంటున్నట్టు.

"నేను ఆ బెంచి మీద కూర్చున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి పరిచయం చేసుకుని నాతో అడుకున్నాడు. మేమిద్దరం అప్పటినుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని, నాకెప్పుడైనా ఎవరైనా ఆ బెంచి మీద కూర్చుని ఒంటరిగా కనిపిస్తే నేను వెళ్లి వాళ్ళతో కబుర్లు చెప్పి, వాళ్ళతో అడుకుంటాను తాతగారు అన్నాడు .


తరువాత మనవడు తన క్లాస్ రూంలోకి వెళ్ళిపోయాడు. ముసలాయనకెందుకో కొద్దిసేపు ఆ బెంచి మీద కూర్చోవాలి అనిపించి వెళ్లి కూర్చున్నాడు. తన మనసు చిన్ననాటి రోజుల్లో తను మొదటిసారి స్కూల్ కు వెళ్లడం గుర్తుకువచ్చింది. తను స్కూల్లో చేరినప్పుడు తనకు స్నేహితులు ఎవరూ లేరు, ఎలా పరిచయాలు చేసుకోవాలో అన్న బిడియం ఒకటి. 


తను చేరిన కొత్తలో తన టీచర్ పిల్లందరిని క్లాస్ లో ఉన్న ఎవరో ఒకరికి ఒక బొమ్మ గీసి ఇమ్మంది. అందరూ ఎదో ఒకటి గీసి వాళ్ళ వాళ్ళ స్నేహితులకిచ్చుకున్నారు. తనకు ఎవరూ ఇవ్వలేదు తనూ ఎవరికి ఇవ్వలేదు. ఆ రోజు తనకు ఎంత ఏకాంతంగా అనిపించిందో తనకు బాగా గుర్తు.


ఆ రంగుల బెంచి మీద కూర్చుంటే తనకెంతో ఆనందమేసింది. ఎవరి ఆలోచనో కానీ కొత్తగా చేరిన పిల్లలు ఆడుకోవడానికి , జీవితాంతం చక్కటి స్నేహితులని సంపాదించుకోవడానికి చక్కటి దారి అనిపించింది.


నెమ్మదిగా ఆ బెంచి మీద నుంచి లేచి బయటకు నడుస్తూ అనుకున్నాడు. తను రోజూ ఉదయాన్నే నడిచే పార్కులో నలుగురు పెద్దవాళ్ళు కూర్చోవడానికి సరిపడే సిమెంట్ బెంచ్ చేయించాలి. ఆ బెంచిమీద స్నేహితుల బెంచి అని రాయించాలి, జీవిత చరమాంకంలో కొత్త స్నేహితులను సంపాదించుకోవాలి కష్టసుఖాలు చెప్పుకోవడానికి అనుకుంటూ ఇంటి దారి పెట్టాడు. తన చిన్ననాటి స్నేహితులు ఎక్కడెక్కడో స్థిరడ్డారు మరి. దగ్గరలో ఎవరూ లేరు, ఉన్నవారితో స్నేహం చేస్తే ఎంత బాగుంటుందో...


మీరూ ప్రయత్నించండి.

Tuesday, October 19, 2021

తెల్ల జుట్టుతో భాధ పడుతున్నారా ?

 *తెల్ల జుట్టుతో భాధ పడుతున్నారా ?*


శరీర అందాన్ని పెంచడంలో జుట్టు (Hair) కూడా ప్రధానమైనది. జుట్టు నల్లగా నిగనిగలాడలని అందరూ అనుకుంటారు. ఇప్పుడున్న కాలంలో పోషకాల లోపం వల్ల వయసు మీద పడ్డ వాళ్ళల్లోనే కాకుండా వయసున్న వాళ్ళల్లో కూడా తెల్లజుట్టు (White Hair) సమస్య ఎక్కువగా ఉంటుంది.


శరీర అందాన్ని పెంచడంలో జుట్టు (Hair) కూడా ప్రధానమైనది. జుట్టు నల్లగా నిగనిగలాడలని అందరూ అనుకుంటారు. ఇప్పుడున్న కాలంలో పోషకాల లోపం వల్ల వయసు మీద పడ్డ వాళ్ళల్లోనే కాకుండా వయసున్న వాళ్ళల్లో కూడా తెల్లజుట్టు (White Hair) సమస్య ఎక్కువగా ఉంటుంది.


జుట్టు కుదుళ్లలో మెలనోసైట్స్ (Melanocytes) ఉంటాయి. ఈ మెలనోసైట్స్ మెలనిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ మెలనిన్ అనే పదార్థం కెరటిన్ (Keratin) అనే ప్రోటీన్ పట్టినప్పుడు జుట్టు నల్లగా మారుతుంది. ఒత్తిడివల్ల లేదా వంశపార లక్షణాల వల్ల కూడా మెలనిన్ ఉత్పత్తి తగ్గడంతో జుట్టు తెల్లగా మారుతుంది.


దీంతో నల్ల జుట్టు కోసం మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ లను వాడుతుంటారు. వాటిని వాడటం వల్ల ఆరోగ్యానికి హానికరం. కానీ వాటిని ఉపయోగించకుండా ఉండలేరు. కాబట్టి కెమికల్స్ (Chemicals) ఉన్న పదార్థాల కంటే సహజ పదార్ధాలను (Natural Ingredients) వాడటం మంచిది. మరి అవేంటో తెలుసుకుందాం..


ఒక గిన్నెలో కొబ్బరి నూనె (Coconut Oil) తీసుకొని అందులో కొన్ని కరివేపాకు (Curry leaves) ఆకులను వేసి ఆకులు నల్లగా మారే వరకూ వేడి చేయాలి. ఇలా వేడి చేసి చల్లార్చిన నూనెను వడగట్టాలి. ఈ నూనెను జుట్టు కుదుళ్ళకు బాగా పట్టించి, 45 నిమిషాల తరువాత గాఢత లేని షాంపూతో తలస్నానం చేయాలి.


2 టేబుల్ స్పూన్ల హెన్న పౌడర్ (Henna Powder) లో ఒక టీస్పూన్ మెంతి పొడి, ఒక టీ స్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ కాఫీ పౌడర్, 2 టీ స్పూన్ ల మింట్ జ్యూస్, 2 టీ స్పూన్ ల తులసి రసం (Menthi, Curd, Tulasi) అన్నింటిని మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను తలకు పట్టించి 2 గంటల తర్వాత తలస్నానం చేసుకోవాలి. దీనివల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.


మందార (Hibiscus) పువ్వులను మిక్సీలో వేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి ఈ పేస్ట్ లో కొబ్బరి నూనె (Coconut oil) వేసి బాగా కలపాలి. కలుపుకున్న ఈ మిశ్రమాన్ని తలమాడుకు బాగా మర్ధన చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. దీని వల్ల జుట్టు నల్లగా మారుతుంది.


〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Sunday, October 17, 2021

Nine Personal Finance Rules we all must know

 *Nine Personal Finance Rules we all must know*


1) Rule of 72 (Double Your Money)

2) Rule of 70 (Inflation)

3) 4% Withdrawal Rule

4) 100 Minus Age Rule

5) 10, 5, 3 Rule

6) 50-30-20 Rule

7) 3X Emergency Rule

8) 40℅ EMI Rule

9) Life Insurance Rule


1) *Rule of 72*


No. of yrs required to double your money at a given rate, U just divide 72 by interest rate

Eg, if you want to know how long it will take to double your money at 8% interest, divide 72 by 8 and get 9 years.


At 6% rate, it will take 12 years

At 9% rate, it will take 8 years


2) *Rule of 70*


Divide 70 by current inflation rate to know how fast the value of your investment will get reduced to half its present value. 


Inflation rate of 7% will reduce the value of your money to half in 10 years.


3) *4% Rule for Financial Freedom*


Corpus Required = 25 times of your estimated Annual Expenses.


Eg- if your annual expense after 50 years of age is 500,000 and you wish to take VRS then corpus with you required is 1.25 crore.


Put 50% of this into fixed income & 50% into equity.


Withdraw 4% every year, i.e.5 lacs.


This rule works for 96% of time in 30 years period


4) *100 minus your age rule*


This rule is used for asset allocation. Subtract your age from 100 to find out, how much of your portfolio should be allocated to equities


Suppose your Age is 30 so (100 - 30 = 70)


Equity : 70%

Debt : 30%


But if your Age is 60 so (100 - 60 = 40)


Equity : 40%

Debt : 60%


5) *10-5-3 Rule*


One should have reasonable returns expectations


10℅ Rate of return - Equity / Mutual Funds

5℅ - Debts ( Fixed Deposits or Other Debt instruments) 

3℅ - Savings Account


6) *50-30-20 Rule - about allocation of income to expense*


Divide your income into

50℅ - Needs  (Groceries, rent, emi, etc)

30℅ - Wants / Desires (Entertainment, vacations, etc)

20℅ - Savings  (Equity, MFs, Debt, FD, etc)


At least try to save 20℅ of your income. You can definitely save more...


7) *3X Emergency Rule*


Always put atleast 3 times your monthly income in Emergency funds for emergencies such as Loss of employment, medical emergency, etc. 


3 X Monthly Income


In fact, one can have around 6 X Monthly Income in liquid or near liquid assets to be on a safer side.


8) *40℅ EMI Rule*


Never go beyond 40℅ of your income into EMIs. 


Say if you earn, ₹ 50,000 per month. Then you should not have EMIs more than ₹ 20,000 .


This Rule is generally used by Finance companies to provide loans. You can use it to manage your finances. 


9) *Life Insurance Rule*


Always have Sum Assured as 20 times of your Annual Income. 


20 X Annual Income


Say you earn ₹ 5 Lacs annually, yoy should atleast have 1 crore insurance by following this Rule.


*These rules are equally useful for young, youth and old. Hope you will find them simple, useful and handy.*

పదోన్నతిని ఎన్నిసార్లు* *వదులుకోవచ్చు?

 *💁‍♂️పదోన్నతిని ఎన్నిసార్లు*

*వదులుకోవచ్చు?*



```మొదటిసారి పదోన్నతిని

వదులుకున్న (relinquish)

ఉద్యోగి అదే ప్యానల్

సంవత్సరంలో

నిర్వహించు అదే

సబ్జెక్ట్ పదోన్నతులక.


ఒక సబ్జెక్టులో రెండుసార్లు

పదోన్నతిని వదులుకున్న

ఉద్యోగి సదరు సబ్జెక్ట్

నందు శాశ్వతంగా

పదోన్నతికి అనర్హుడు

అవుతాడు.


అయితే ఇతర సబ్జెక్ట్లలో

పొందు అర్హతను కలిగి

ఉంటాడు.```


🎯🎯🎯🎯🎯

Saturday, October 16, 2021

పదోన్నతుల జాబితా ఎలా తయారు చేస్తారు

 

పదోన్నతుల జాబితా ఎలా తయారు చేస్తారు?


*Roaster Points in Promotions Communal Roaster Points & Seniority in Promotions*

ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 5 (ఐ.ఇ.) తేది 14-2-2003 ప్రకారము పదోన్నతుల పోస్టుల యందు కూడ ప్రభుత్వములోని అన్ని శాఖలలోని, అన్ని కేటగిరి పోస్టులలో 15% ఎస్సిలకు,  6% ఎస్టిలకు రిజర్వేషన్ కల్పించబడినది. ఆ ఉత్తర్వును అమలు చేయుటకు మార్గదర్శక సూత్రాలు

 *GO.Ms.No.21, Dt.18.03.2003* 

ద్వారా విడుదలయిన

అదే విధముగ 3% వికలాంగులకు కూడ రిజర్వు  చేయ బడినవి. (GO.Ms.No.42 Dt. 19.10.2011) అంధ ఉద్యోగులకు పదోన్నతులకు అవసరమైన డిపార్ట్మెంట్ పరీక్షల నుండి 5 సంవత్సరములు మినహయింపు కలదు. (G0.Ms.No.748 GAD Dt:  29.12.2008).


     పదోన్నతులలో SC,ST & PHC కేటగిరీ లో అర్హులు దొరకనట్లయితే సంభందిత రోస్టర్ పాయింట్లు 2 సంవత్సరముల వరకు బ్యాక్ లాగ్ ఉంచాలి. రెండవ సంవత్సరం కూడా భర్తీ కానట్లయితే ఆ పోస్టులకు డీ - రిజర్వు చేసి తదుపరి సంవత్సరం మరల యధావిధంగా బ్యాక్ లాగ్ గా ఉంచాలి.


SC , ST కేటగిరి లలో మహిళలు లేనిచో పురుషులలో భర్తీ చేస్తారు. *(G.O.Ms.No.18 Dt:17.2.2005)*


*సీనియారిటీ, ప్రమోషన్సు రిజిస్టర్ల గురించి తెలుసుకుందాం.*


DSC లోని మెరిట్ ర్యాంకు, DOB ల సహాయంతోనూ, SC, ST,  PH, BC లకు కేటాయించిన రోష్టరు ప్రకారం తయారు చేసిన ప్రమోషన్ రిజిస్టర్నే *మెరిట్ కం రోష్టరు రిజిస్టర్* అంటారు.


గౌరవ కోర్టువారు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారమే సీనియారిటీ లిష్టు తయారు చేయాలని తీర్పులిస్తున్నారు. గౌరవ భారత సుప్రీం కోర్టు వారు మెరిట్కి,రోస్టర్ ర్యాంకుకు అన్యాయం జరగకుండా పదోన్నతులు ఇవ్వాలని తీర్పునిచ్చింది. APSSSR 1996 రూల్సు నందుకూడా 33 నుండి 37 వరకు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం సీనియారిటీ లిష్టులు ఎలా తయారు చేయవలసి ఉందో స్పష్టంగా ఉన్నది.


 సీనియారిటీ లిష్టులు మెరిట్  కమ్  రోస్టర్ ప్రకారం తయారు చేసి, దీని ఆధారంగా  ప్రమోషన్సు రిజిస్టర్ తయారు చేయాలి. ఈ ప్రమోషన్సు రిజిస్టర్లో ప్రమోషన్సులో రిజర్వేషన్లు ఉన్న SC, ST, PH  అభ్యర్థులను రోష్టర్లో పెట్టి ప్రమోషన్సు ఇవ్వాలి .


*సీనియారిటీ రిజిస్టర్ (లిష్టు):* 


ఒకే సారి(DSC) లో సెలక్టు కాబడిన వారందరూ డేట్ ఆఫ్ జాయినింగ్ తో సంభందం లేకుండా మెరిట్ కమ్ రోస్టర్( DSC Appointment) ర్యాంకు  ప్రకారం సీనియారిటీ లిష్టులు తయారు చేయాలి, ఈ రిజిస్టర్ ప్రకారం SC, ST, PH అభ్యర్థులు లిష్టులో చివరలో ఎక్కడ ఉన్నా మెరిట్ కమ్ రోష్టరు ప్రకారం ప్రమోషన్సు పొందుతారు.


3. ప్రమోషన్సు రిజిస్టర్: ప్రమోషన్సులో రిజర్వేషన్లు ఉన్న SC (15%) , ST(6%), PHC (3%)  లకు  రోష్టరు పాయింట్లు  అడక్వసీ నిబంధనలకు లోబడి  వర్తిస్తాయి.


SC :General : 7, 16, 27, 41, 52, 62, 72, 77, 91, 97 (మొత్తం : 10)    Women : 2,22,47,66,87 (మొత్తం : 5)


ST :General : 25, 33, 75, 83 (మొత్తం : 4)    Women : 8, 58 (మొత్తం : 2)


PHC :6 (అంధత్వం  లేదా తక్కువ చూపు ), 31 (చెవుటి లేక మూగ  ), 56 ( అంగవైకల్యం).


Total Roaster Points : 24


     మిగిలిన 76 పాయింట్లు అన్నీ ఓపెన్ కేటగిరీ క్రింద అందరికీ కలిపి (మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం) పదోన్నతులు ఇవ్వబడతాయి ఓపెన్ కేటగిరీలో OC, BC, SC, ST, PH అభ్యర్ధులు అందరూ మెరిట్  కమ్ రోస్టర్ ర్యాంకు (DSC Appointment Rank) ప్రకారం ప్రమోషన్సు పొందుతారు, SC, ST, PH లు నిర్ణీత కోటా మేరకు పదోన్నతి పొందితే వారి కోటాలో అడక్వసీ చేరుకున్నట్లు. అప్పుడు వారి యొక్క  రోష్టరు పాయింట్లు జనరల్ గామార్చబడుతాయి. ఇదంతా ప్రమోషన్సు రిజిస్టర్లో ఉంటుంది. 


*అడక్వసీ అంటే...*


"ఒక కేడర్ పోస్టులకు సంబందించి, ఆ కేడర్లో SC,ST ,PH అభ్యర్థులు తమకు కేటాయించిన పర్సంటేజి మేరకు ఇప్పటికే పనిచేస్తూ ఉంటే ,ఆ కేడర్ లో అడిక్వసీ చేరుకున్నట్లు". అడిక్వసీ చేరుకుంటే తదుపరి ప్రమోషన్లకు రిజర్వేషన్ వర్తించదు.అప్పుడు వారి పాయింట్లు అన్నీ జనరల్‌ క్రింద మారతాయి. అప్పుడు అందరినీ కలిపి కామన్ గా మెరిట్ కమ్ రోస్టర్ (DSC Appointment Rank) ర్యాంకు ప్రకారం సీనియారిటి లిస్ట్ తయారు చేసి పదోన్నతులు ఇస్తారు.


(G.O.Ms.No. 2 dt: 9.01.2004)


(G.O.Ms.No.18 dt: 17.02.2005)


వికలాంగ ఉద్యోగులకు పదోన్నతులలో 3% రిజర్వేషన్లు - విధివిధానాలు


భారత ప్రభుత్వ సూచనలు అనువర్తించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము 30 జులై 1991 నుండి ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 115 ద్వారా అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియమాకాల్లో అంగ వికలురైన నిరుద్యోగులకు 3% రిజర్వేషన్లు ప్రవేశ పెడుతూ 19 అక్టోబర్ 2011న ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 42ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 


ఉద్యోగుల సంఖ్య 5 కన్నా ఎక్కువ ఉన్న ప్రతి ప్రభుత్వ కేడర్లోను పదోన్నతులలో వికలాంగులకు రిజర్వేషన్లు  ఇవ్వాలి.


 పాయింట్ల పదోన్నతి రోస్టర్లో 6,31 మరియు 56 పాయింట్లను వికలాంగులకు కేటాయించాలి.


 ఈ రిజర్వేషన్లు, సదరు పోస్టుకు పూర్తిగా అర్హతలున్న వారికే ఇవ్వాలి. విద్యార్హతలలో కానీ, శాఖాపరమైన పరీక్షల కృతార్ధతలో కాని ఎటువంటి మినహయింపు ఉండదు.


 అంగ వికలురు పని చేయలేని కొన్ని పోస్టులకు తప్ప మిగిలిన అన్ని పోస్టులలో ఈ రిజర్వేషన్ విధానము అమలు పరచాలి. ఏ డిపార్ట్మెంట్ అయినా దానిలో కొన్ని కేడర్లకు ఈ రిజర్వేషన్లు అమలు పరచుట సాధ్యం కాకపోతే రోజుల్లో ఈ ఉత్తర్వులు ఇవ్వని శాఖనుండి మినహయింపు (Exemption) కు అనుమతి పొందాలి.


పదోన్నతులలో వికలాంగుల 6, 31, 56 రోస్టర్ పాయింట్లలో అభ్యర్థులు దొరకపోతే సీనియారిటీలో అట్టడుగున ఉన్న వికలాంగ అభ్యర్థిని సదరు పాయింట్స్లో ఉంచి పదోన్నతి కల్పించాలి. సీనియారిటీ జాబితాలో పైన ఉన్న అభ్యర్థి క్రింది రోస్టర్ పాయింట్ కు తీసుకురాకూడదు. అతడు/ఆమె కు అతని సీనియారిటీ ప్రాతిపదికనే పదోన్నతిగా ఇవ్వాలి.


 ఈ పద్ధతిలో పదోన్నతులు ప్రతి కేడర్లో 3% వికలాంగ అభ్యర్థులు కోటా సంతృప్తి పడేవరకు కొనసాగాలి. అట్లు పూర్తయిన వెంటనే పదోన్నతులలో వికలాంగులకు రిజర్వేషన్లు సంబంధిత కేడర్లో నిలిపి వేయాలి.


పదోన్నతులలో వివిధ రకాల రిజర్వేషన్ అమలు పరుచు విధము:


 (G.O.Ms.No.23 WCDE&DE Dt.26-5-2011) నియామకాలలో అనుసరించినట్లే వికలాంగులకు నిర్దేశించిన 3% రిజర్వేషన్లో గుడ్డివారికి 1%, చెవుడు/మూగవారికి 1%, చలనాంగాల వైకల్యత లేక మస్తిష్య పక్షవాతము ఉన్నవారికి 1% చొప్పున రిజర్వేషన్లు అమలు పరచాలి. వరుసగా 3 సైకిల్స్ లో వికలాంగులలో స్త్రీ లతో  సహా పై మూడు రకాల అంగవైకల్యము కలవారికి  పదోన్నతులలో రోస్టర్ పాయింట్లు కేటాయించాలి. 


ఎస్.సి, ఎస్.టి.లకు పదోన్నతులలో రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగు తున్నది. కావున ఈ వికలాంగ రిజర్వేషన్ కొరకు ప్రస్తుతం అమలులో ఉన్న రోస్టర్ జాబితానే కొనసాగించ వచ్చును. కొత్తగా రోస్టర్ జాబితాను 1వ పాయింట్తో ప్రారంభించ నవసరం లేదు. 


పై పాయింట్లలో 3 సైకిల్స్ పూర్తి అయిన తరువాత మరల 4వ సైకిల్ నుండి 6వ సైకిల్ వరకు ఆ పైన సైకిళ్లకు ఇదే విధానమును కొనసాగించు కోవాలి.


ఒక ప్యానల్ లేక పదోన్నతి సంవత్సరములో ఒక వికలాంగ విభాగమునకు చెందిన అర్హుడైన అభ్యర్థి దొరకపోతే, మరుసటి సంవత్సరమునకు (Next Succeding Year) అదే విభాగానికి, ఆ పోస్ట్ ను క్యారీ ఫార్వర్డ్ చేయాలి.  మరుసటి సంవత్సరం కూడా అర్హుడైన అభ్యర్థి దొరకకపోతే ఈ 3విభాగాలలో మరొక విభాగమునకు గ్రుడి, చెవిటి, OH వరుసలో ఉన్న అంతరమార్పు (Interchange) చేసుకోవచ్చును. స్త్రీ అభ్యర్థి దొరకకపోతే పురుష వికలాంగునకు ఇవ్వవచ్చును. 


పై మూడు విభాగములలో దేనిలోనూ అభ్యర్థులు దొరకకపోతే రెండవ సంవత్సరము వికలాంగత లేని అభ్యర్థిచే ఆ పోస్టును పదోన్నతి ద్వారా భర్తీ చేయవచ్చును. 


 ఉదాహరణకు 6వ పాయింట్ వద్ద అర్హుడైన గ్రుడ్డి స్త్రీ అభ్యర్థి దొరకపోతే ఆ ఖాళీని తదుపరి పదోన్నతి  సంవత్సరమునకు క్వారీఫ్వార్డ్ చేయాలి. ఆ తదుపరి సంవత్సరము కూడా సదరు అభ్యర్థి దొరకక పోతే పురుష గ్రుడ్డి అభ్యర్థికి అవ్వాలి. పురుష అభ్యర్థి దొరక పోతే చెవిటి, మూగవారికి, వారు కూడా దొరకపోతే OH అభ్యర్థిచే పదోన్నతి ద్వారా భర్తీ చేయ వచ్చును.


అదే విధముగా 31వ రోస్టర్ పాయింట్లో చెవిటి వారికి పదోన్నతి ఇవ్వవలసి యున్నది. మొదటి సారి ఆ అభ్యర్థి దొరకకపోతే తదుపరి సంవత్సరమునకు ఆఖాళీని క్యారీఫార్వర్డ్ చేయాలి. అప్పుడు కూడా అభ్యర్థి దొరకకపోతే మొదటగా OH అభ్యర్థికి అవకాశము ఇవ్వాలి. వారు కూడా దొరకకపోతే గ్రుడ్డివారికి అవకాశ మివ్వాలి. ఈ ఇద్దరూ దొరకకపోతే సీనియారిటీ ప్రకారం అంగ వైకల్యము లేని అభ్యర్థిచే ఆ పోస్టు భర్తీ చేయ వచ్చును. 


ఇదే విధంగా 56వ రోస్టర్ పాయింట్ వద్ద OH లేక మస్తిష్క పక్షవాతము ఉన్నవారికి పదోన్నతి ఇవ్వవలసి యున్ననూ, మొదటి సారి ఆ అభ్యర్థి దొరకక పోతే తదుపరి సంవత్సరమునకు ఆ ఖాళీను క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అప్పుడు కూడా అభ్యర్థి దొరకక పోతే మొదటగా గ్రుడ్డివారికి తరువాత చెవిటి, మూగవారికి అవకాశ మివ్వాలి. వారు కూడా దొరకక పోతే సీనియారిటీ ప్రకారము వైకల్యత లేని అభ్యర్థికి అవకాశ మివ్వాలి.


*Related GOs & Proc*


*G.O.Ms.No.5 dt:14.2.2003*

 Reservation in Promotions. 


*G.O.Ms.No. 2 dt: 09.01.2004*

 Policy of Provding Rule of Reservation in Promotions in favaour of SCs & STs.


*G.O.Ms.No. 21 dt: 18.03.2003*

 Policy of Providing Rules of Reservation in Promotions in favour of SCs & STs .


*G.O.Ms.No. 18 dt: 17.02.2005*

 In case there are no qualified women candidates available, for promotion to fill in the roster points earmarked for SC(Women) / ST (Women) the vacancies shall be filled by SC(Male) / ST (Male) candidates.


*G.O.Ms.No.16 dt: 17.02.2005*

 Policy of Providing Rules of Reservation in Promotions in favour of SCs & STs - Modification Orders.


*G.O.Ms.No. 42 dt: 19.10.2011*

 Providing Reservations in Promotions to the Differently Abled Employees.


*G.O.Ms.No. 23 dt: 26.05.2011*

 Providing Reservation in Promotions to the Differently Abled Employees in 3 Categories.


*G.O.Ms.No. 748 dt: 29.12.2008*

 Promotion to the higher posts - Visually Handicapped employees – Passing of Departmental Tests for promotion to next higher 


Categories – 5 years time allowed

Tuesday, October 5, 2021

ఓ మిత్రమా..ఆడుకో...

ఓ మిత్రమా..ఆడుకో...


 *చాలా కాలం క్రితం ఓ పెద్ద పండ్ల చెట్టు ఉండేది. ఓ చిన్న పిల్లవాడు చాలా ఇష్టంగా, ప్రేమగా దాని చుట్టూ ఆడుకునేవాడు.*  

 *ఓ రోజు చెట్టు పైకి ఎక్కాడు,పండ్లు కోసుకొని తిన్నాడు, ఆ చెట్టు నీడలో కాసేపు పడుకున్నాడు. ఆ అబ్బాయి ఆ చెట్టును ఎంతగానో ప్రేమించాడు, ఆ చెట్టు కూడా ఆ అబ్బాయి తన వద్ద ఆడుకోవడాన్ని చాలా ఇష్టపడింది, అతన్ని అమితంగా ప్రేమించింది.* 

 *కాలం గడిచింది, చిన్న పిల్లవాడు పెరిగి పెద్ద వాడైయ్యాడు. ఇప్పుడు ఎక్కువగా ఆ చెట్టు నీడలో ఆడుకోవడం లేదు* 

 *కొంత కాలం తర్వాత ఓ రోజు ఆ బాలుడు చెట్టు వద్దకు వెళ్లాడు,ఎందుకో విచారంగా ఉన్నాడు.* *"రా వచ్చి నా వద్ద ఆడుకో"  అని చెట్టు అడిగింది.** 

 *బాలుడు:- "నేనింకా చిన్న పిల్లాడిని కాను, చెట్ల చుట్టూ తిరుగుతూ ఆడుకునే వయసు కాదు నాది, నాకిప్పుడు ఆడుకోడానికి బొమ్మలు కావాలి, అవి కొనడానికి డబ్బులు కావాలి " అన్నాడు.* 

 *చెట్టు :- "నా దగ్గర డబ్బులు అయితే లేవు, కానీ నువ్వు ఓ పని చేయవచ్చు, నా పండ్లన్ని కోసుకుని వెళ్లి అమ్మివేయి, దానితో నీకు డబ్బులు వస్తాయి" అని అన్నది.* 

 *బాలుడు ఎంతోషంగా ఆ చెట్టు పండ్లన్ని కోసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు.. చెట్టు తనకోసం దిగులు పడుతూ, దుఃఖంతో ఉంది.* 

 *క్రమంగా ఆ బాలుడు పెద్దవాడై యువకుడిగా మారాడు, ఓ రోజు అతను రావడం చూసి చెట్టు చాలా *సంతోషిపడి "రా నా వద్దకు వచ్చి ఆడుకో" అని ఆహ్వానించింది* 

 *"నీతో ఆడుకునే సమయం లేదు నాకు, నా కుటుంబం కోసం పని చేయాలి. మేము* *ఉండటానికి ఓ మంచి ఇళ్ళు కట్టుకోవాలి, నువ్వేమైనా సహాయం చేయగలవా"? అని అడిగాడు.* 

 *నా వద్ద ఇల్లు లేదు, అయితే నా కొమ్మలు నీకు సహాయపడతాయి, వాటిని తీసుకో, నీ ఇళ్ళు కట్టుకో " అని చెట్టు అన్నది.*


 *అతను ఆ చెట్టు కొమ్మలన్ని నరికి సంతోషంగా తీసుకుపోయాడు.* 

 *అతను సంతోషంగా వెళ్లడం చూసి చెట్టు చాలా ఆనందపడింది, కాని అతను మళ్ళి తిరిగి రాలేదు, చెట్టు మరల విచారిస్తూ ఒంటరిగా ఉంది.* 

 *బాగా ఎండగా ఉన్న ఓ వేసవి కాలం రోజు అతను మళ్ళి వచ్చాడు, చెట్టుకు ఆనందంగా అనిపించింది. "రా వచ్చి నాతో ఆడుకో" అని అడిగింది, నేను ముసలివాన్ని అయ్యాను ఆడుకోలేను, ఈ ఎండల నుండి ఉపశమనం పొందటానికి నేను సముద్ర ప్రయాణం *చేయాలనుకుంటున్నా, దానికి నాకో పడవ కావాలి, నువ్వు ఇస్తావా అని అడిగాడు* 

 *నీ పడవ కోసం నా చెట్టు* *కాండము* *ఉపయోగపడుతుంది, నా కాండాన్ని నరికి తీసుకెళ్లు, దానితో మంచి పడవ చేసుకుని, హాయిగా ప్రయాణం చేయి, అని చెట్టు అన్నది.* 

 *అతను సంతోషంగా చెట్టు కాండాన్ని నరికి తీసుకపోయి, పడవ చేయించుకుని, హాయిగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు, చాలా కాలం చెట్టుకు అతను తిరిగి తన మొఖం చూపించలేదు.* 

 *చివరిగా, చాలా కాలానికి అతను మళ్లీ చెట్టు వద్దకు వచ్చాడు..* 

 *నాయనా.. నీకు ఇవ్వడానికి నా వద్ద ఏవి మిగలలేదు, పండ్లు కూడా లేవు అని చెట్టు అన్నది..* 

 *ఏమి ఇబ్బంది లేదు, నాకు* *తినడానికి పళ్ళు లేవులే అన్నాడు..* 

 *చెట్ట: నువ్వు ఎక్కడానికి నాకు కాండం కూడా లేదు.* 

 *ఎక్కడానికి నాకు బలమూ లేదు, ముసలి వాన్ని కదా అని అన్నాడు ..* 

 *నిజంగా నీకివ్వడానికి నావద్ద ఏమీ లేదు, చచ్చిపోతున్న నా వేర్లు తప్ప, అంటూ ఏడుస్తూ చెప్పింది చెట్టు.* 

 *నాక్కూడా ఇపుడు ఏది అవసరం లేదు, చాలా *అలసిపోయాను, విశ్రాంతి తీసుకోడానికి ఓ మంచి ఆసరా కావాలి అన్నాడు.* 

 *వృద్ధ చెట్టు వేర్లు ఒరిగి విశ్రాంతి తీసుకోడానికి మంచివి,* *అనుకూలంగా ఉంటాయి నాయనా, రా వచ్చి నా వేర్లపై* *ఒరిగి కాస్త విశ్రాంతి తీసుకో అన్నది చెట్టు, అతను* *కూర్చున్నాడు, సంతోషంతో *ఏడుస్తూ సేదతీర్చింది చెట్టు.* 

 *ఇది మనందరి కథ,* *ఆ* *చెట్టు మన తల్లిదండ్రులు లాంటిది. చిన్నప్పుడు అందరం తల్లిదండ్రుల వద్ద వారితో ఆడుకుంటాం.* 

 *కొంచెం పెద్దగయ్యాక వారిని వదిలి పెడ్తాం, మనకు అవసరమైనప్పుడు లేదా ఏదైన కష్టం వచ్చినప్పుడు మాత్రమే మన తల్లిదండ్రుల వద్దకు వెళతాం. వారు ఏ పరిస్థితిలో ఉన్నా సాధ్యమైనంతలో మీరు సంతోషంగా ఉండటానికి చేయాలసినదంతా చేస్తారు.* 

 *చెట్టు పట్ల ఆ బాలుడు చాలా నిర్దయగా ప్రవర్తించాడు అని మీకు అనిపించొచ్చు. కాని మన తల్లిదండ్రుల పట్ల మనం కూడా అదే చేస్తున్నాం.* 

 మనకు భరోసాగా వాళ్లను చూస్తాం, మనకు సర్వస్వం దార పోసినా కనీసం కృతజ్ఞత చూపం. కాని అప్పటికే సమయం మించి పోతుంది.


 మీ తల్లిదండ్రులని ప్రేమగా సంరక్షించండి. వారు కూర్చున్న ఖాళీ కుర్చీలని చూసినప్పుడు మీకు వారి విలువ, వారు లేని లోటు తెలియవస్తుంది.

 మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగా ప్రేమించారో తెలుసుకోలేం.

 మనమూ తల్లిదండ్రులుగా మారినపుడే అనుభవంలోకి వస్తుంది



Sunday, October 3, 2021

నీ గురించి నువ్వు తెలుసుకో...

      నీ గురించి నువ్వు తెలుసుకో...


         ఒకసారి, ఒక బిచ్చగాడు రైలులో భిక్షాటన చేస్తున్నప్పుడు, చక్కగా దుస్తులు ధరించిన వ్యాపారి సూట్ మరియు బూట్లు ధరించడం గమనించాడు. 

           ఈ వ్యక్తి చాలా ధనవంతుడని, అతను భావించాడు. కాబట్టి నేను అతనిని అడిగితే అతను ఖచ్చితంగా దానం చేస్తాడు అనుకోని, అతను దగ్గరకు వెళ్లి ఆ వ్యక్తిని భిక్ష కోసం అడిగాడు.


           ఆ వ్యక్తి బిచ్చగాడిని చూసి, "మీరు ఎల్లప్పుడూ అడుక్కుంటూ, ప్రజల నుంచి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా...., మరి మీరు ఎవరికైనా ఏదైనా తిరిగి ఇస్తున్నారా?" అని అడిగాడు ఆ వ్యక్తి.


        ఆ బిచ్చగాడు, "సార్, నేను బిచ్చగాడిని, నేను ప్రజలను డబ్బును మాత్రమే అడగగలను. కానీ నేను ఎవరికైనా,... ఏదైనా ఎలా ఇవ్వగలను చెప్పండి అన్నాడు.?"


            ఆ మాట విన్న ఆ వ్యక్తి ఇలా జవాబిచ్చాడు బిక్షగాడితో , "మీరు ఎవరికీ ఏమీ ఇవ్వలేనప్పుడు, అప్పుడు మీరు కూడా ఇతరులను అడిగే హక్కు లేదు కదా . నేను ఒక వ్యాపారవేత్తని అంతేకాక లావాదేవీలను మాత్రమే నమ్ముతాను.మీరు నాకు ఇవ్వడానికి ఏదైనా ఉంటే, నేను కూడా చేయగలను  మీకు ప్రతిఫలంగా ఏదైనా ఇవ్వండానికి" అనడం జరిగింది.


                  అప్పుడే, రైలు ఒక స్టేషన్‌కు రావడం జరిగింది. ఆ వ్యాపారవేత్త ట్రైన్ దిగి వెళ్లిపోయాడు.


            బిచ్చగాడు ఆ వ్యాపార వేర్త చెప్పిన దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు.  అతని మాటలు ఎలాగోలా బిచ్చగాడి హృదయాన్ని చేరుకున్నాయి.


                    ప్రతిఫలంగా నేను ఎవరికీ ఏమీ ఇవ్వలేనందున నేను భిక్షలో ఎక్కువ డబ్బు పొందలేను అని అనుకొంటూ... ఆలోచించడం మొదలుపెట్టాడు.  కానీ నేను బిచ్చగాడిని, ఎవరికైనా ఇవ్వడానికి ఏమీ నా దగ్గర  విలువైనది లేదు కదా.....!!.

          అయినా ఎంతసేపు నేను ఇతరులకు ఏమీ ఇవ్వకుండా..... ప్రజలను దానం అడుగుతూనే ఉండడం ఏమి బాగా లేదు . అని లోతుగా ఆలోచించిన తరువాత, భిక్షగాడు దానం అడిగే దాని కన్నా ముందు ఏదైనా తన వద్ద వుంటే,అప్పుడు ఆ దానం చేసిన వ్యక్తికి ప్రతిఫలంగా అది తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.


              కానీ ఇప్పుడు వున్న ప్రశ్న ఏమిటంటే, అతను భిక్షకు బదులుగా ఇతరులకు ఏమి ఇవ్వగలడు?  రోజంతా దీని గురించే ఆలోచిస్తూ గడిచింది. కానీ అతని ప్రశ్నకు సమాధానం దొరకలేదు.


            మరుసటి రోజు అతను స్టేషన్ దగ్గర కూర్చున్నప్పుడు, అతని కళ్ళు స్టేషన్ చుట్టూ ఉన్న మొక్కలపై వికసించిన కొన్ని అందమైన పువ్వుల మీద పడ్డాయి.  అతనికి ఒక ఆలోచన వచ్చి, వాళ్ళు చేసే దానానికి బదులుగా ప్రజలకు కొన్ని పువ్వులు ఎందుకు ఇవ్వకూడదు అని అనుకొన్నాడు.


              అతనికి ఈ ఆలోచన నచ్చి.....వెంటనే అక్కడ నుండి కొన్ని పువ్వులు తెచ్చుకున్నాడు. భిక్షాటన చేయడానికి రైలు ఎక్కడు.


            ఎవరైనా అతనికి భిక్ష ఇచ్చినప్పుడు, అతను వారికి ప్రతిగా కొన్ని పువ్వులు ఇచ్చేవాడు.  ప్రజలు ఆ పువ్వులను తమతో సంతోషంగా ఉంచుకునేవారు.


            ఇప్పుడు భిక్షగాడు ప్రతిరోజూ కొన్ని పువ్వులు తెచ్చుకుని, భిక్షకు ప్రతిఫలంగా ఆ పువ్వులను ప్రజలకు పంచుతూ ఉండేవాడు.


              కొద్ది రోజుల్లోనే అతను చాలా మంది తనకు భిక్ష పెట్టడం మొదలు పెట్టడాన్ని అతడు గ్రహించాడు.  అతను స్టేషన్ దగ్గర ఉన్న పూలన్నింటినీ తెంపేవాడు.  అతనికి పువ్వులు ఉన్నంత వరకు, చాలామంది అతనికి భిక్ష పెట్టేవారు.  కానీ అతనితో ఎక్కువ పువ్వులు లేనప్పుడు, అతనికి పెద్దగా భిక్ష వచ్చేది కాదు .  ఇలా ప్రతిరోజూ కొనసాగుతూ ఉండేది.


              ఒక రోజు అతను భిక్షాటన చేస్తున్నప్పుడు, అదే వ్యాపారవేత్త రైలులో కూర్చుని ఉండడం చూశాడు, అతని కారణంగా అతను పువ్వులు పంపిణీ చేయడానికి ప్రేరణ పొందాడు.


            భిక్షగాడు వెంటనే అతని దగ్గరకు వెళ్లి , "ఈ రోజు మీరు ఇచ్చే భిక్షకు బదులుగా కొన్ని పువ్వులు నా దగ్గర ఉన్నాయి అవి మీకు ఇస్తాను " అన్నాడు.


                 అప్పుడా వ్యాపారవేర్త  అతనికి కొంత డబ్బు ఇవ్వడంతో,ఆ బిచ్చగాడు అతనికి ప్రతిగా కొన్ని పువ్వులు ఇచ్చాడు.  ఆ వ్యాపారవేర్తకు బిక్షగాడి ఆలోచన బాగా నచ్చింది. మరియు బాగా ఆకట్టుకున్నాడు.


        అతను, "వావ్! ఈ రోజు మీరు కూడా నాలాగే వ్యాపారవేత్తగా మారారు అని అతన్ని అభినందించి."  బిచ్చగాడి నుండి పువ్వులు తీసుకొని, అతను ప్రక్క స్టేషన్‌లో దిగిపోయాడు.


           మళ్ళీ మరోసారి, ఆ వ్యాపారవేర్త మాటలు బిచ్చగాడి హృదయంలోకి చేరుకున్నాయి.  అతను ఆ వ్యక్తి చెప్పిన దాని గురించి పదే పదే ఆలోచిస్తూ సంతోషంగా ఉండటం ప్రారంభించాడు.


            అతని కళ్ళు ఇప్పుడు ప్రకాశించటం ప్రారంభించాయి, అతను ఇప్పుడు తన జీవితాన్ని మార్చుకోగల విజయానికి బాటని కనుకొన్నాను అని  అతను భావించాడు.


         అతను వెంటనే రైలు నుండి దిగి ఉత్సాహంగా ఆకాశం వైపు చూస్తూ.... చాలా బిగ్గర గొంతుతో ఇలా అన్నాడు, “నేను ఇకపై బిచ్చగాడిని కాదు, నేను ఇప్పుడు వ్యాపారిని, నేను కూడా ఆ పెద్దమనిషిలా పెద్ద వ్యాపారిగా మారగలను, నేను కూడా ధనవంతుడిని కాగలను"  అని అనడం జరిగింది.


           అక్కడున్న ప్రజలు అతడిని చూసి, బహుశా ఈ బిచ్చగాడు పిచ్చివాడై ఉంటాడని అనుకున్నారు.  మరుసటి రోజు నుండి ఆ బిచ్చగాడు మళ్లీ ఆ స్టేషన్‌లో కనిపించలేదు.


              నాలుగు సంవత్సరాల తరువాత, సూట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఒకే స్టేషన్ నుండి ప్రయాణిస్తున్నారు.  ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నప్పుడు, అందులో ఒక వ్యక్తి చేతులు జోడించి మరొకరికి నమస్కరించి,   "మీరు నన్ను గుర్తించారా?" అని అడిగాడు.


         మరొక వ్యక్తి "లేదు! బహుశా మనం మొదటిసారి కలుస్తున్నామేమో." అని అనడం జరిగింది.


          మొదటి వ్యక్తి మళ్లీ అన్నాడు, "సర్, నన్ను గుర్తు పట్టడానికి ప్రయత్నించండి, మనం మొదటిసారి కలుసుకోవడం కాదు...., ఇది మూడోసారి" అన్నాడు.


       రెండవ వ్యక్తి, " అవునా....సరే, నాకు గుర్తులేదు. మనం ఎప్పుడు కలుసుకున్నాము?" అని అడగడం జరిగింది. 


       అప్పుడా మొదటి వ్యక్తి నవ్వి, "మనం ఇంతకు ముందు ఒకే రైలులో రెండుసార్లు కలుసుకున్నాము. నేను జీవితంలో ఏమి చేయాలో మొదటి సమావేశంలో మీరు చెప్పిన అదే బిచ్చగాడిని, రెండవ సమావేశంలో 'నేను నిజంగా బిజినెస్ మ్యాన్' అని మీరు నన్ను మెచ్చు కొన్నారు అది కూడా నేనే"......!!


          "ఫలితంగా, ఈ రోజు నేను చాలా పెద్ద పూల వ్యాపారిని ఇప్పుడు.... అదే వ్యాపారానికి సంబంధించి నేను వేరే నగరానికి వెళ్తున్నాను."


           "మొదటి సమావేశంలో మీరు నాకు ప్రకృతి నియమాన్ని చెప్పారు ... దాని ప్రకారం "మనం ఏదైనా ఇచ్చినప్పుడు మాత్రమే మనకు ఏదైనా లభిస్తుంది" అని.

          ఈ లావాదేవీ నియమం నిజంగా పనిచేసింది. నేను దానిని బాగా అనుభూతి చెందాను, అంతకు మునుపు నేను ఎప్పుడూ.... నన్ను నేను బిచ్చగాడిగానే భావించుకొనే వాణ్ని , నేను దాని కంటే పైకి ఎదగాలని ఎప్పుడూ అనుకోలేదు.


                కానీ..... నేను మిమ్మల్ని రెండోసారి కలిసినప్పుడు, నేను... ఒక వ్యాపారవేత్త అయ్యానని మీరు నాకు తెలియపరిచారు .  మీకు ధన్యవాదాలు, ఆ రోజు నుండి, నా దృక్పథం మారిపోయింది. ఇప్పుడు నేను వ్యాపారవేత్తగా మారాను, నేను ఇకపై బిచ్చగాడిని కాదు. ”అని ఆ వ్యాపారవేర్తతో అనడం జరిగింది.


       బిచ్చగాడు తనను తాను బిచ్చగాడిగా భావించినంత కాలం, అతను బిచ్చగాడుగానే ఉండేవాడు.మరియు తనను తాను వ్యాపారవేత్తగా భావించినప్పుడు, అతను ఒక వాపారవేర్తగా  ఎదగడం జరిగింది. 

                    

    "కాబట్టి నీ గురించి నువ్వు తెలుసుకో.......

నీ కలలను సాకారం చేసుకో"....!!     🙏🙏    

Friday, October 1, 2021

ప్రోగ్రెస్ రిపోర్ట్

  ప్రోగ్రెస్ రిపోర్ట్

--------------------------------------i

ఆఫీసులో పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చి టీపాయ్ మీద కాళ్లు పెట్టుకుని రిలాక్స్ గా కూర్చున్నా..

నా భార్య గ్లాసుతో మంచినీళ్లు తెచ్చింది.. మా బాబు ప్రోగ్రెస్ రిపోర్ట్ తెచ్చి చేతిలో పెట్టాడు . 

English :40/100

Maths   :38/100

Science:39/100

Social    :35/100

Telugu   :48/100

Hindi      :35/100 

నాకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది.. 

వెథవా.. సన్నాసి.. నీకు ఎంత దైర్యముంటే ఇంత తక్కువ మార్కులు వచ్చాక కూడా సిగ్గు లేకుండా నాకు చూపిస్తావు . 

కొంచెం నా మాట వినండి అంటూ మధ్యలో దూరింది మా ఆవిడ ఎంతైనా కన్నతల్లి కదా.. 

'నువ్వు నోరు మూసుకో నీ వల్లే వాడిలా తయారయ్యాడు ఎప్పడు చూడు TV చూడటం లేదంటే సెల్ పోను' నాకోపం రెట్టింపయ్యింది . 

అంతలో వాడు *'కాదు నాన్నా అల్మరా సర్దుతుంటే దొరికింది "నీ"  చిన్నప్పటి ప్రోగ్రెస్ రిపోర్ట్'* అన్నాడు. 

ఒక్కసారిగా నా కాళ్ళకింద భూకంపం . 

అందుకే పెద్దలంటారు కోపం వచ్చినప్పుడు పది అంకెలు లెక్క పెట్టుకోమని...😉😉😉😉

కుక్కర్ ఎన్ని విజిల్స్ రావాలి?

 మా మిత్రుడు కుక్కర్ తో సెల్ఫీ తీసి, "మా ఆవిడ ఊరెళ్ళింది. టీ తాగాలి. కుక్కర్ ఎన్ని విజిల్స్ రావాలి?" అని పోస్ట్ చేశాడు. 


Friends కామెంట్స్ ఇలా ఉన్నాయి.


1.Frd : కుక్కర్ కి ఒక విజిల్ ఉందిగా మళ్ళీ విజిల్ ఎందుకూ నీ మొహం.


2. Frd: ఒరేయ్! కుక్కర్ లో టీ ఎవడు పెడతాడురా.... బాణలి పెట్టు.


3. Frd: రెండు మూడు గంటలు నానపెట్టి కుక్కర్ లో పెట్టు. 2_3 విజిల్స్ వస్తే సరిపోతుంది.


4. Frd: కిటికీ దగ్గరికి వెళ్ళివిజిల్ వేస్తే టీ బండి వాడు టీ ఇచ్చేస్తాడుగా. కుక్కర్ పెట్టడం ఎందుకూ....


5. Frd: (ఇది చదివి నాకు కళ్ళు తిరిగినంత పనైంది) వెధవా....వదిన ఊరెళితే టీ ఎవడైనా తాగుతాడా. మందు తాగు. మమ్మల్ని కూడా పిలిచావనుకో మేమే ఇంటికొచ్చి విజిల్ వేస్తాం.

...


ఏంటో.. వీళ్ళందరి అభిమానం చూస్తే 😢😢

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE