NaReN

NaReN

Wednesday, August 25, 2021

పాఠశాలకు పంపాలనుకునే తల్లిదండ్రులందరికీ

 గౌరవ తల్లిదండ్రులందరికీ,


సెప్టెంబర్ 1 నుంచి అన్ని రకాల పాఠశాలలు తెరవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.

కాబట్టి మన గ్రామంలో కూడా అన్ని పాఠశాలలు ప్రారంభం అవుతాయి.


అయితే కరోనా పూర్తిగా తొలగి పోలేదు. కాబట్టి ఎంత కాలం పాఠశాలలు నడుస్తాయి అనేది చెప్పలేము. *కాబట్టి ఇలాంటి సమయంలో ప్రైవేట్ పాఠశాలలలో పిల్లలను చేర్చి, ఆర్థికంగా నష్టపోవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి*


అంతేకాకుండా ప్రైవేట్ పాఠశాలల్లో కరోనా సమయంలో మరెన్నో ఇబ్బందులు


# చాలా ఇరుకు తరగతి గదులు.


# గాలి, వెలుతురు రావడానికి  వీలులేని పరిస్థితులు.


 #ఒకే తరగతి గదిలో 30, 40 లేదా 50 మంది విద్యార్థులు.


# ఫీజులే ముఖ్యంగా భావించి విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిశీలించకుండా అందర్నీ ఖచ్చితంగా ప్రతీ రోజూ బడికి రప్పించడం.


#సిలబస్ చెప్పడానికి సమయం సరిపోవడం లేదు అంటూ అనారోగ్య లక్షణాలు ఉన్న విద్యార్థులను గుర్తించక, ఒకరి సమస్యని అందరికీ వ్యాపింపజేసే నిర్లక్ష్యం...


ఇంకా వేరే ఊర్లో ని బడికి పంపించినప్పుడు,  ఆర్టీసీ బస్సులు లేదా స్కూల్ బస్సులలో మరింత వేగంగా పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం.


*ఇన్ని సమస్యలు ఉన్నాయి, కాబట్టి ఈ సంవత్సరం ఇంకా వీలైతే తర్వాత సంవత్సరం కూడా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకే పంపగలరని ప్రతి ఒక్క తల్లిదండ్రులకు విజ్ఞప్తి*


అదే ప్రభుత్వ పాఠశాలల్లో అయితే


 #విశాలమైన తరగతి గదులు


# ప్రతి తరగతికి 2/3 కిటికీలు 


# విశాలమైన ఆవరణ


#పిల్లల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ తరచుగా ANM లేదా ఆశా వర్కర్స్ చేత హెల్త్ చెకప్.


#అతి తక్కువ మంది విద్యార్థులతో తరగతుల నిర్వహణ.


# ఈ నెలలో వేలు/ లక్షలు ఫీజులు వసూలు చేసి, వచ్చే నెలలో పాఠశాల మూత వేసే పరిస్థితులు ప్రభుత్వ పాఠశాలలో ఎప్పుడూ ఉండవు.


ఇవన్నీ మీరు అర్థం చేసుకొని, మీ పిల్లలనే కాకుండా  మీ ఇంటి చుట్టుముట్టు ఉండే పిల్లల్ని కూడా వెంటనే ప్రభుత్వ పాఠశాలలో  చేర్పించి, మీ డబ్బుని మీ పిల్లల ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడుకోవాలని కోరుతున్నాము.


నోట్: ప్రస్తుతం విద్యార్థుల పేర్లు అన్ని ఆన్లైన్ లో ఉన్నాయి. కాబట్టి వెంటనే ప్రైవేట్ పాఠశాలలో TC తీసుకుని, ప్రభుత్వ పాఠశాలలో చేర్చగలరు. లేదంటే ఈ సంవత్సరం కూడా మీకు ఫీజుల భారం తప్పదు.

No comments:

Post a Comment

Followers

Blog Archive

About Me

My photo
Catch me on IHDHFIFIEE